తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text Part 1

Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text | తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Part 1
       నువ్వేమిటి అన్నది ఎదుటి వారికి తెలియా లంటే సాయం చేసి చూడు ఒకరేమిటి అన్నది నీకు తెలియాలంటే సాయం అడిగి చూడు .

     మనకు చిరకాల శత్రువు కన్నా మన ముందు ఆసూయతో రగిలిపోయే మిత్రుడు చాలా ప్రమాదకరం

     ఆత్మయత పంచుకోవాలంటే రక్తసంబంధమే అయ్యుండనవసరంలేదు బాధలు కష్టాలు పంచుకోవాలంటే తోడపుట్టినవాళ్ళే కానక్కలేదు , నీడలా తోడుంటూ నవ్వుతూ నవ్విస్తూ అనుక్షణం మనతో ఉండే ఒక స్నేహితుడు ఉంటే చాలు .


తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text Part 1

నీవు సంతోషంగా ఉన్నావంటే నీకు సమస్యల్లేవని కాదు , వాటిని ఎదుర్కోగల శక్తి ధైర్యం నీకున్నయాని , మనకు అవసరం ఉన్నంతవరకే పరిచయాలు , బంధాలు ఆ తరువాత ఎవరికెవరు ఏమి కాదు , అసలు అన్ని అవసరాలు ప్రేమలే కానీ ! నిజమైన ప్రేమలు ఆప్యాయతలు ఎక్కడ లేవు

 భవష్యత్తులో మానవజాతి నశించి పోవడమంటూ జరిగితే అది అణుబాంబుల వల్లనో , అంటురోగాల వల్లనోకాదు , నైతిక విలువల పతనం వల్ల మాత్రమే ,

 నది నదిలా ప్రవహిస్తూ ఉన్నంతకాలం దానిని పవిత్రంగానే చూస్తాము ఎప్పుడయితే సముద్రంలో కలుస్తుందో అప్పుడు అది దాని అస్తిత్వాన్ని కోల్పోతుంది ,

అలాగే నువ్వు నువ్వులా ఉన్నంతకాలం సంతోషంగా నే ఉంటావు , ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకుని వారిలా ఉండాలనికొంటావో అప్పుడే నిన్ను నీవు కోల్పోతావు ..
************************
 నేటి సమాజానికి మేలు చేసే ఎన్నో మంచి విషయాలు తెలియజేప్పిన మీకు మా వందనాలు మనం చిలుకను పెంచాం అది కొద్ది రోజుల తర్వాత ఎగిరి పోతుంది, అదే విధంగా ఉడతను పెంచావు  అదీ కూడా పారిపోయింది కానీ మెక్కను పెంచు పై రెండూ వచ్చి చేరుతాయి మరియు మనకు మంచి వాతావరణం కూడా ఇస్తుంది,

     మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన మిత్రుల మనస్తత్వాలు, మనం పేదరికంలో ఉన్నప్పుడు మన బంధువుల మనస్తత్వాలు బయట పడుతాయి.

   మొహంలో బాధను కనిపించకుండా నవ్వే వాళ్ళు గొప్ప వాళ్ళు ఆప్తులు అవుతారు. ఆది చెప్పకుండా తెలుసుకునే వాళ్లు అంతకన్నా గొప్పవాళ్ళు అని సంతోషంగా బ్రతికి చూడండి మరి కొందరు మంచి మనసుంటే మార్గం ఉంటుంది నేస్తమా అలవాటుగా మారి ఆ మంచి పనిని నిలుపుకోవడానికి మీ కుటుంబ సభ్యులకు మనో విజ్ఞాన సంపద ఆరోగ్యం కోసం పాటు పడటం సంతృప్తిని ఇస్తుంది.

   మనం స్కూల్లో టీచర్ నేర్పిన పాఠాలు మర్చపోతామేమో కానీ కొందరు నిజ జీవితంలో నేర్పిన గుణపాఠాలను మాత్రం మర్చిపోలేము
***************************
జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందంగా ఇతరులతో కలిసి అనుభవించు ఎందుకంటే ఈ రోజు ఆనందంగా అనుభవించిన క్షణాలే రేపటి మధుర జ్ఞాపకాలు

  మంచి మనసున్న ఏ మనిషినీ హద్దు దాటి కష్టపెట్టకు .అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం మౌతుంది .

     సంపాదన పరుగు పందెంలో నిన్ను నువ్వు మరచిపోవద్దు . డబ్బులతో పాటు బి.పి.,షుగర్ కూడా నీ ఆకౌంట్లో జమ అయిపోతాయి . అనుభవించడానికి మిగిలేది చప్పిడి రొట్టే ముక్కలే అందుకే టైముకు తిన్ను ఆరోగ్యం జాగ్రత్త నేస్తమా.
*****************************
చికాకులన్ని ఎగిరిపోవ డానికి చిన్న చిరునవ్వు చాలు , కన్నీళ్ళు ఆగిపోవడానికి చల్లని చూపుచాలు , గుండెమంటను చల్లర్చడానికి తీయటి మాటలు చాలు ,

 నేనున్నానని భరోసా ఇవ్వటానికి చక్కటి నేస్తం చాలు , నీరు గాలి కల్తీ అయిపోయావని బాధపడుతున్నవా , వాటి కంటే ఎక్కువ మనుషులం కల్తీ అయిపోయాము ,

 మనుషులు కల్తీ అయిపోయాయి మనసుతో చేసే ఆలోచన ఒకటి , నాలుకతో మాట్లాడేది ఒకటి చేతల్లో చేసేది మరోకటి

సమస్యలో చిక్కుకుని ఎవరైనా మిమ్మన్ని సలహా అడిగినప్పుడు సలహాతో పాటు మీ హస్తాన్ని కూడా అందించండి ఎందుకంటే సలహా తప్పుతంది కావచ్చు , కానీ మీతోడు మాత్రం నిజమైనది..
**************************************
ప్రతి ఉదయం నీలో కొత్త ఆలోచన రేకెత్తించాలని మనం వేసే ప్రతి అడుగు ప్రగతి వైపు పయనించాలని అని వేళలా విజయం నిన్ను వరించలని మనసారా కోరుకుంటూ ,

 ప్రతి ఒక్కరూ ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించేది ఒక్కటే మనల్ని అర్థం చేసుకునే మనసున్న మనిషి ఒకరు తోడుంటే బాగున్ను ,

 నేను ఎవరిని అంత త్వరగా ఇష్టపడను కానీ ఒక్కసారి ఇష్టపడితే ప్రాణం పోయిన వదులుకోను , కాలానికి మనం ఇచ్చే విలువ మనవిలువను పెంచుతుంది , డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది ,

మనిషికి మనం ఇచ్చే విలువ మనసులో సుస్థిర స్థానాన్ని నిలుపుకుటుంది , మనషులు ఎప్పుడుఎలా ఉంటారో ఎవరికి తెలియదు , ఎప్పుడు దండలు వేస్తారో ఎప్పుడు నిందలు వేస్తారో తెలయదు , అందుకే పొగత్తలకు పొంగి పోకూడదు , నిందలకు కుంగి పోకూడదు .
***********************************
ఆనందానికి మించిన ఆస్తి లేదు , సంతోషానికి మించిన సంపద లేదు , అందుకే ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలి  కాలికి తగిలిన ముల్లు ఎలా నడవాలో నేర్పిస్తుంది

 మనసుకి తగిలిన గాయం హద్దుల్లో ఎలా ఉండాలో నేర్పిస్తుంది గుండెకు తగిలిన దెబ్బ బాధల్లో ఎలా ముందుకు వెళ్లాలో నేర్పిస్తుంది , నిన్ను చూసి నవ్వేవారు నవ్వుతూనే ఉంటారు ,

ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉంటారు , మన వెనకొల గోతులు తవ్వేవారు తవ్వుతూనే ఉంటారు కానీ ! నీవు విజయం సాదించిన్న రోజు నిన్ను పొగడటానికి వేళ్ళే ముందుంటారు
******************************
ఒక వ్యక్తి ఉన్నతికైనా , పతనానికైనా ఆ వ్యక్తే కారణం .

     ఎవరిని నిదించి లాభం లేదు , మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంటుంది .

    మోసం అందరు చేస్తారు కానీ ! నమ్మక ద్రోవం నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు .

    మనం రాసే అక్షరాలు తప్పయితే వాటిన్ని దిద్దొచ్చు కానీ జీవితమే తప్పయితే దాన్ని దిద్దడం చాలా కష్టం అందుకే మీ జీవితంలో వేసే ప్రతి అడుగు అచి తుచి వేయండి .

    ఇతరులను నిందించడం తేలిక ఆ నిందను భరించటం కష్టం
నీతులు వల్లించడం తేలిక వాటిని ఆచరించడం కష్టం
 మనం అబద్దం చెప్పడం తేలిక అదే నిజాన్ని దాచటం ఎంతో కష్టం
అన్ని తెలిసి మనం ఎటువైపు అడుగులు వేస్తున్నామో అర్థం అయేలోపు అన్ని రకాలుగా అన్యాయానికి గురి అవుతున్నాం నేస్తమా ...
*****************************************************
అందరం బాగుండాలి అందులో మీరు మరీను బాగుండాలి .

ఏ విషయంలోను ఎవరి మీద ఆధారపడకు ఒక్కసారి అడిగితే సాయం అదే సాయం పదే పదే అడిగితే చేతగాని తనం వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బతకడం నేర్చుకో అప్పుడు నీ మీద నీకు నమ్మకం నీ మీద
 ఇతరులకు గౌరవం పెరుగుతుంది .

   ఈ సమాజంలో  బ్రతకాలి అంటే మంచితనం మనుషుల మీద మొండితనం పరిస్థితుల మీద చూపించాలి ,
    మనం ఏం చేసినా ఏదో ఒక్కటి అంటారు , మనం ఏం చేయకపోయినా ఏదో ఒక్కటి అంటారు అలాంటిప్పుడు మనకు నచ్చింది మనం చేసుకుంటూ పోతే చాలు అనేవాళ్లు ఏదో విధంగా అంటూనే ఉంటారు .

     పోయిన కాలం
నీది కాదు వచ్చేకాలం నీ ఆధీనంలో ఉండదు ఉన్న ఈ సమయాన్నే ఏ మంచి చేయాలన్నా ఉపయోగించుకో మిత్రమా ! ...
****************************************
మీరు మీ కుటుంబసభ్యులు ప్రతి రోజు ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ...
         సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేతకాదు
     ప్రయత్నించి చూడు పోయేదేముంది,గేలిస్తే
సంతోషం వస్తుంది . ఓడితే అనుభవం
వస్తుంది .
    గాలి,ప్రేమ,నమ్మకం ఆనందం,అనురాగం అనేవి అంగట్లో అమ్మ కానికి దొరకవు .
   
గాలి ఆకాశంలో ప్రేమ మమకారంలో నమ్మకాన్ని మనస్సులలో పెంచుకోవాలి,
ఆనందాన్ని అనురాగాన్ని మనషులతో పంచుకోవాలి .
      మన ఇంటి కప్పు లోని రంధ్రం ఎండలో కనిపించక పోవచ్చు కానీ వానలో దాని బండారం బయటపడుతుంది . మనుషులు అంతే సరైన సమయంలో వారి నిజస్వరూపం బయటపడుతుంది...
****************************************   
 మనం ఇష్టం తో చేసే పనులకు విజయాలు ఎక్కువ ఎదుటివారి లో  మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ .

     నిర్మలమైన నీ మనసు నిస్వార్థ మైన నీ స్నేహం అంటే నాకు ఎంతో ఇష్టం   

        నీవు నా ఎదురుగా ఉన్న లేకున్న నాహృదయం  ఎప్పటికీ నీవు నిలిచి పోతావు

       బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుతారు .

      బలవంతులు మాత్రమే సహిస్తూమౌనంగాఉంటారు

    బుద్దిమంతులు మాత్రమే జరిగినవి మర్చిపోతారు ప్రశాంతంగా జీవిస్తారు .

      నవ్వడం , నవ్వించడం మనకు అలవాటైతే జీవితంలో ఎలాంటి ఒడుదుడుకులు ఏమి చేయలేవు . అందుకే నవ్వుతూ రోజును ప్రారంభించండి నేస్తమా ...
 
      మర్చి పోయేవన్ని గతలు కావు , గుర్తున్నవన్ని జ్ఞాపకాలు కాదు , మనం మర్చిపోకుండా చేసేవే జ్ఞాపకాలు , గుర్తుకు తెచ్చుకుందామని ప్రయత్నించినా గుర్తుకు రానిదే గతాలు ...
******************************************
నీ నిర్మలమైన మనసు నీ నిస్వార్థ మైన స్నేహం అంటే నాకు ఎంతో ఇష్టం నీవు నా ఎదురుగా ఉన్న లేకున్న నా హృదయంలో ఎప్పటికీ నీవు నిలిచిపోతావు మిత్రమా
   
           మనం మాట్లాడు మాటలు ఎదుటి వారికి ఆ మాట అనేది చావాలనుకునే వారిని కూడా బ్రతికించేలా ఉండాలి. కానీ ! బ్రతికున్న వారిని కూడా చంపేలా ఉండకూడదు .

      మనం భాధలో అయినా సంతోషంలో అయినా మన దగ్గర డబ్బున్నా లేకున్నా ఎవరున్నా లేకున్నా నీకు నేనున్నా నేస్తం అని తోడుండే వాళ్ళే నీ నిజమైన స్నేహితులు
 
      తప్పు చేసి కూడా నిజాయితీ పరులుగా చెలామణి అవుతున్న వారి కంటే ఏతప్పు చేయకపోయినా నిజాయితీ నిరూపించుకోలేక తప్పుడు మనుషులు గా ముద్రపడేవాళ్లే ఎక్కువ
**************************************
   జీవితంలో అర్థం చేసుకునే మనషులు మన దగ్గర ఉన్నప్పుడు కన్నీళ్ళు కూడ ఆనంద బాష్పాలుగా మారి పోతాయి.
   
         జీవితంలో ఎవ్వడిని నా అని నమ్మకు నిజాయితీగా బ్రతకడానికి ఇది మన తాతలు బ్రతికిన రాతియుగం కాదు.
     
         కల్తీ నా కొడుకులు బతుకుతున్న  కలియుగం
          మనం మన కోసం చేసేది మనతోనే అంతరించి పోతుంది 

          ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి వుంటుంది .

        జీవితంలో ఏవి నీ వెనుక రావు నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్పా మనం సంపాదించినది ఏది మనది కాదు.ఒక్క మంచితనం‌,పుణ్యం ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప ...


****************************************
  కరుగుతున్న క్షణానికి జరుగుతున్న కాలానికి అంతరించే వయసుకి మిగిలిపోయే జ్ఞాపకమే మంచితనం అదే మనకు ఆభరణం .

      చీకటి లేకుండా ఆకాశంలో చుక్కలు మెరవలేవు , కష్టాలు లేకుండా జీవితం గెలవలేము .
     
        ఈ ప్రపంచంలో మనం బ్రతకాలి అంటే మంచితనం , మొండితనం రెండూ ఉండాలి . మంచితనం మనుషుల మీద చూపించాలి , మొండితనం పరిస్థితుల మీద చూపించాలి .
 
      మనం ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు , ఎలాగైనా సంపాదించుకోవచ్చు , కానీ ! గడిచిపోయిన కాలాన్ని మాత్రం తిరిగి తీసుకురాలేము , అందుకే మీ సంతోషాలను వాయిదా వేయకండి ...
******************************************
   నీ మనసు బాధతో ఉన్నప్పుడు నవ్వడం తెలుసుకో , ఇతరుల మనసు బాధతో ఉన్నప్పుడు నవ్వించడం నేర్పుకో.

    జీవితంలో అందరికంటే పెద్ద గురువు సమయం ఎందుకంటే సమయం నేర్పిన పాఠాలు ఎవరూ నేర్పలేరు ఓపిక పట్టడం అలవర్చుకుంటే సరైన సమయంలో సరైన ప్రతిఫలం నీకు అంది తీరుతుంది నేస్తమా !

    జీవితమనేది మనం నడిచే దారి లాంటిది మనకు తోడుగా నడిచే వారుంటారు కానీ ! మనకు బదులుగా నడిచే వారుండరు మనమే నడవాలి ఎంత కష్టమైనా .


     ఉన్న వాటి విలువ అవి మనదగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు . ఒకసారి అవి చేజారిన తర్వాత అర్థమయినా ఏమీ చేయలేం అది కాల మయినా స్నేహితు
లయినా బంధువు లయినా చివరికి వస్తువు లయినా ...
**************************************
 కళ్ళల్లో వెలుగుతో పెదవులపై చిరునవ్వు తో గుండె నిండుగా నమ్మకంతో ప్రతి రోజుని ఆహ్వనించు నేస్తమా .

    మనం ఎలాంటి వారము అనేది ఈ లోకంలో ఇద్దరికే తెలుసు ఒకరు ఆ భగవంతుడు మరొకరు మన అంతరాత్మ అడుగుదాం అంటే ఇద్దరూ కనిపించరు

     నిజాయితీగా ఉండడం  కూడా ఒక యుద్దం లాంటిదే , యుద్దం లో ఒంటరిగా నిలవడం ఎంత కష్టామో సమాజం లో నిజాయితీగా ఉండడం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం .

      సముద్రం లో అలలు ఎన్నో అందులో తీరం చేరేవి కొన్నే  జీవితంలో స్నేహితులు ఎందరో కానీ! మనసులో ఉండేది కొందరే వారే నిజమైన స్నేహితులు .

      ఓపిక పట్టడం అలవర్చుకుంటే సరైన సమయంలో సరైన ప్రతిఫలం నీకు ఆంది తీరుతుంది ...
****************************************
    చావుకీి పుట్టుకకీ మధ్యలో ఓ చిన్ని జీవితాన్ని పెట్టి మోయలేనన్ని బాధ్యతలు ఇచ్చి మరచిపోలేనన్ని బంధల్నిచ్చి నిలకడలేని మనసును మనిషికి తోడుగా పెట్టి ఎన్నిఆటలు ఆడుతున్నాడో ఆ దేవుడు

       మనషు బయటకు కనిపించే ప్రతి చిరునవ్వు వెనుక ఎవరికి కనిపించని ఎంతో బాధ దాగివుంటుంది .

   నువ్వెవరినైనా మోసం చేయగలిగా వంటేదాని అర్థం మోసపోయినవారు చేతగాని వారని కాదు .   
      నీ స్థాయికి మించి నిన్నునమ్మారని అర్థం .

    మనం అడవిలో పులిని నమ్మవచ్చు , నీళ్ళలో మొసలిని నమ్మవచ్చు , కానీ ! నవ్వుతుమాటల్లో నమ్మించి మోసం చేసేవారిని మాత్రం నమ్మనే నమ్మకూడదు ... 

******************************************
    బాధను పంచుకుంటే ఆవేదన తగ్గుతుందేమో కానీ ! అర్హత లేనివారి దగ్గర పంచుకొంటే మాత్రం దానికి పదింతలు మనోవేదన తప్పదు జాగ్రత్త నేస్తమా .

      హక్కు లేని బంధం నిజాయితీ లేని ప్రేమ స్వార్థంతో కూడిన స్నేహం నమ్మకం లేని జీవితం ఎక్కువ కాలం ఉండదు .
        ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడు నీ పక్కన ఒకరు కూడా ఉండరు అబద్దాలు చెబుతూ లేనిది కల్పించి మాట్లాడి చూడు చుట్టూ ఓ పెద్ద గుంపే ఉంటుంది .

    దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది , కాని దెబ్బలు కొట్టిన సుత్తె ఎప్పటికీ సుత్తిలాగే ఉంటుంది ఎదురుదెబ్బలు తిన్నవాడు నొప్పి విలువ తెలుసుకొన్నవాడు మహానీయుడు అవుతాడు ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్నదగ్గరే ఉంటాడు ,

**************************************

Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text | తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Part 1

Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text | తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Part 1

Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text | తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Part 1

Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text | తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు  Part 1

0/Post a Comment/Comments

Previous Post Next Post