వెల్లుల్లి రక్తాన్ని గడ్డ కట్టించకుండా కాపాడుతందా?

వెల్లుల్లి రక్తాన్ని గడ్డ కట్టించకుండా కాపాడుతందా?


శక్తివంతమైనది రక్షితమైనది వెల్లుల్లి.

ఇది రక్తాన్ని పలుచగా చేసి ధమనుల్లో రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది.

వీలయినంత ఎక్కువగా వెల్లుల్లి, నీరుల్లిపాయలను తీసుకోవడం గుండె కెంతో మంచిది.

వెల్లుల్లి రక్తాన్ని గడ్డ కట్టించకుండా కాపాడుతందా?


వెల్లుల్లి వలన లాభాలు 
నిత్యం వెల్లుల్లిని ఇలా తీసుకుంటే దాని వల్ల మనకు ఎంతో ఆరోగ్యం కలుగుతుందట. ప్రధానంగా అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనకు ఉన్న వివిధ రకాల అనారోగ్యాలను దూరం చేస్తాయట.

బీపీని తగ్గించడంలోనూ వెల్లుల్లి బాగానే పనిచేస్తుంది. పరగడుపున వెల్లుల్లి తింటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.
శరీరంలో ఉన్న వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి.
రక్తం గడ్డకట్టకుండా నిరోధించే గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. వెల్లుల్లిలోని ఔషధ కారకాలు రక్తాన్ని పలుచగా చేస్తాయి.
నరాల బలహీనతలతో బాధపడుతున్న వారికి వెల్లుల్లి మంచి ఔషధంగా పనిచేస్తుంది. అలాంటి ఏ అనారోగ్యాలు ఉన్నా వెల్లుల్లి ద్వారా తగ్గించుకోవచ్చు.
రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. ఇన్‌ఫెక్షన్లు దరి చేరవు. వైరస్‌లు, బాక్టీరియాలతో పోరాడే ఔషధ గుణాలు వెల్లుల్లిలో పుష్కలంగా ఉన్నాయి.
రక్తనాళ్లాల్లో కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
జీర్ణాశయ సంబంధ సమస్యలను, ప్రధానంగా డయేరియాను తగ్గించడంలో వెల్లుల్లి బాగా పనిచేస్తుంది.
రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుముఖం పడతాయి. ఇన్సులిన్ సెన్సిటీవిటీ పెరుగుతుంది.
పచ్చి వెల్లుల్లి రేకుల్ని బాగా నలిపి తింటే ఇంకా మంచిదట. దీని వల్ల వాటిలో ఉండే ఔషధ గుణాలు ఇంకా పెరుగుతాయట. అయితే గర్భిణీ స్త్రీలు మాత్రం దీన్ని తినకూడదట. ఇతరులెవరికైనా చర్మంపై దురదలు, శరీర ఉష్ణోగ్రత పెరగడం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వారు కూడా వెల్లుల్లిని తినడం ఆపి తక్షణమే వైద్యున్ని సంప్రదించాలట.

గర్భిణీలకు మంచిది...
వెల్లుల్లిలో ఉండే ఆరోగ్యకరమైన న్యూట్రియంట్లు గర్భిణీలకు ఎంతో మేలు చేస్తాయి. వెల్లుల్లిలోని రోగనిరోధక వక్తిని పెంచే గుణాల వల్ల ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. అంతేకాదు, గర్భస్థ సమయంలో పిల్లల బరువు పెంచడంతో ఎంతో సమర్ధంగా పని చేస్తుందని రుజువైంది. గర్భిణీలలో మూత్ర విసర్జనను పెంచి లోపల ఉన్న టాక్సిన్లు విడుదలయ్యేందుకు దోహదం చేస్తుంది. అయితే మంచి చేస్తుందని ఎక్కువగా తీసుకోవడమూ మంచిది కాదు. వెల్లుల్లిలో ఉన్న ఒకే ఒక్క దుర్గణం అది కలిగించే ఘాటైన వాసన. దీనివల్ల నోటి నుంచి, శరీరం నుంచి కూడా దుర్వాసన వెలువడుతుంది. అందుకే దీనిని తగ్గించేందుకు వెల్లుల్లిని పాలతో కలిపి తీసుకోవడం మంచిది. అలాగే పచ్చి వెల్లుల్లి కన్నా ఉడకబెట్టిన వెల్లుల్లి తక్కువ వాసనను కలిగి ఉంటుంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post