చర్మ సంరక్షణకు సౌందర్యపోషణ

చర్మ సంరక్షణకు సౌందర్యపోషణ


చర్మ సంరక్షణకు సౌందర్యపోషణ

సౌందర్యపోషణ ఆరోగ్య సలహా 

చర్మ సంరక్షణకు


  • తాజా బొప్పాయిలో కొబ్బరిపాలు కలిపి, చర్మానికి రాసుకుంటే చర్మం మృదువుగా శాటిన్ లా మెత్తగా మారుతుంది.
  • మరీ వేడి నీటితో స్నానం చేయటం మంచి పద్దతి కాదు. ఇలా చెయటం వల్ల చర్మం మరింత పొడిగా మారుతుంది. వెల్లుల్లి రసం తెగిన, కాలిన గాయలను, మచ్చలను తగ్గిస్తుంది.
  • దోమలు కుడితే నిమ్మరసంకు కొంచెం నీరు కలిపి దూదితో దోమ కుట్టిన చోట రుద్దితే మంట తగ్గిపోతుంది.
  • కీరదోసకాయ రసంలో దూదిని ముంచి రోజుకి రెండుసార్లు రాసుకుంటే చర్మానికి మెరుపు వస్తుంది.
చర్మ సంరక్షణకు సౌందర్యపోషణ

  • పావుకప్పు ఓట్లు, పాలపొడి, చిక్కటి గంజి తీసుకోవాలి. వీటన్నిటినీ పేస్టులా కలుపుకోవాలి. స్నానానికి ఇరవై నిముషాలముందు శరీరమంతా పట్టించుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి.
  • మీ చర్మం ముడతలు, పగుళ్ళు గా ఉన్నట్లయితే మీరు మీ చర్మాన్ని సంరక్షించుకోవాలి.
  • మొదట ఒక మంచి చర్మ వ్యాధుల నిపుణుని కలవండి. 
  • మీకున్న సమస్య చిన్నదేనా లేదా ప్రమాదకరమైనదా అనేది నిర్ధారించుకోవాలి. క్రమం తప్పకుండా ఫేషియల్స్, క్లీనప్స్ చేయించుకుంటుంటే మంచిగా చర్మాన్ని సంరక్షించుకోవాలి.
  • వీలైనన్ని తాజా పళ్ళూ, కూరగాయలను ఆహారంలో తీసుకోండి. 
  • రోజులో వీలైనంత మంచినీరు తాగడానికి ప్రయత్నించండి.
  • స్నానానికి బాగా వేడిగా లేదా చల్లగా ఉన్న నీళ్ళను వాడటం దాదాపుగా ఆపేయాలి. గోరు వెచ్చని లేదా మామూలుగా చల్లగా ఉండే నీళ్ళను వాడటం క్షేమం.
  • మాయిశ్చరైజర్ ఉన్న సబ్బును వాడాలి. స్నానం చేసిన అనంతరం మాయిశ్చరైజ్ లోషన్‌ను పూసుకుంటే చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది.
  • పోషక విలువలున్న ఆహార పదార్ధాలతో సమతుల ఆహారం తీసుకుంటే అది చర్మానికి అందాన్ని ప్రసాదించడమే కాకుండా అనేక చర్మసంబంధిత వ్యాధులకు గురికాకుండా రక్షిస్తుంది.
  • చర్మం పై పొరను పరిశుభ్రపరచడానికి ఒక మెరుపులాంటి ఛాయను ఇవ్వడానికి మాయిశ్చరైజింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. 
  • ఎప్పుడో ఎవరో చెప్పినప్పుడు అని కాకుండా క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ చేసుకోవాలి.
  • శ్వాసక్రియకు సంబంధించిన వ్యాయామం చేయడం కూడా చర్మసౌందర్యానికి ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
  • క్లెన్సింగ్ కూడా చర్మ సంరక్షణలో ఒక ప్రధానమైన చర్య. క్లెన్సింగ్ అప్లై చేసి ఒక నిముషంపాటు వదిలేసి తరువాత శుభ్రపరచుకుంటే దుమ్ము, ధూళి అంతా పోయి చర్మం ఎలాంటి ముడుతలూ లేకుండా తాజా పండులా తయారవుతుంది. మేకప్‌కు కూడా ఎంతో సహకరిస్తుంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd