పాము భయం వున్నవారు దర్శించాల్సిన క్షేత్రం

పాము భయం వున్నవారు దర్శించాల్సిన క్షేత్రంశ్రీ అనంతపద్మనాభస్వామి ఆలయం. ఈ క్షేత్రం కర్ణాటకలోని మంగుళూరుకు 10 కి.మీ దూరంలో ఉన్న కుడుపు అనే గ్రామంలో వుంది. కుడుపు అనగా తుళు భాషలో పాముతో ఉన్న బుట్ట అని అర్థం. ఆలయంలోని శ్రీ అనంతపద్మనాభుడు పాము ఆకృతిలో ఐదు తలలతో భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడి స్వామిని దర్శించి పూజిస్తే పాము వల్ల భయం ఉన్నవారికి ఉపశమనం చేకూరుతుంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఐదవ రోజు వచ్చే నాగపంచమి పండుగను ఘనంగా జరుపుకుంటారు. కుడుపు గ్రామంలోని మహిళలు ఆవుపేడ, ఆవుపాలు ఉపయోగించి ఇంటి గోడలపై పాముల చిత్రాలు గీస్తారు. ఆ విధంగా చేయటం  వల్ల పాములు వారిని కాటు వేయవని నమ్మకం.


పాము భయం వున్నవారు దర్శించాల్సిన క్షేత్రం

0/Post a Comment/Comments

Previous Post Next Post