కార్తీకమాసంలో తప్పక దర్శించాల్సిన క్షేత్రం అరుణాచల దేవాలయం

కార్తీకమాసంలో తప్పక దర్శించాల్సిన క్షేత్రం అరుణాచల దేవాలయం


 ఇది తమిళనాడులోని తిరువళ్లామలై జిల్లాలో ఉన్నది. అన్నామలైయర్ అనబడే ఈ దేవాలయం అత్యంత ప్రసిద్ధమైనది. పంచభూత క్షేత్రాలలో అగ్నిని సూచించే ఈ ఆలయంలోని స్వామి అరుణాచలేశ్వరునికి తేజోలింగమని కూడా పేరు ఉంది. అమ్మవారు అరుణాచలేశ్వరి. పూర్వం బ్రహ్మ, విష్ణువులు తమ ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయం తేల్చుకోదల్చి గొడవపడుతున్నప్పుడు వారిమధ్య ఒక పెద్ద అగ్నిలింగం ఉద్భవించిందట. ఇంకా ఆకాశవాణి నుంచి వారిని గొడవపడవద్దని వాక్కు వినవచ్చింది. వారు గొడవ ఆపి తమ మధ్య ఉద్భవించిన అగ్నిలింగం ఆది, అంత్యాలు తెలుసుకోదల్చి బ్రహదేవుడు హంసరూపంలో పైవైపుకి, విష్ణుమూర్తి వరాహరూపంలో క్రిందికి బయలుదేరారు.

ఎంతదూరం వెళ్ళినా వారికి ఆద్యంతాలు కనపడకపోవుటతో తిరిగి వచ్చిన వారి ముందు పరమేశ్వరుడు ప్రత్యక్షమై వారి కోరికపై వారి  అజ్ఞానాన్ని మన్నించి ఒక కొండ రూపంలో వెలిశాడు.. ఆ కొండే అరుణాచలం. కార్తీకమాసంలో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమి నాడు కార్తీకదీపోత్సవం విశిష్ఠంగా జరపబడుతుంది. | కార్తీకమాసంలో తప్పక దర్శించవల్సిన క్షేత్రం.


కార్తీకమాసంలో తప్పక దర్శించాల్సిన క్షేత్రం అరుణాచల దేవాలయం

0/Post a Comment/Comments

Previous Post Next Post