అతిపెద్ద నందిగల క్షేత్రం చిదంబరం

అతిపెద్ద నందిగల క్షేత్రం చిదంబరం


తమిళనాడు కడలూర్ జిల్లాలో | ఉన్నది. చెన్నై నుండి సుమారు 243 కి.మీ దూరంలో ఉంటుంది. ఆలయ నడిబొడ్డులో నటరాజస్వామి ఆలయం ఉంటుంది. శివుడు శివతాండవం చేస్తూ నటరాజుగా వెలసిన ఆలయం. మానవరూపంలో శివుడు ఉండే ఏకైక ఆలయం. పంచభూతాల కొరకు నిర్మించిన ఆలయాల్లో ఈ ఆలయం ఆకాశతత్యానికి నిర్మించబడినది. 

ఇంకా కంచి ఏకాంబరేశ్వర ఆలయం భూమితత్వానికీ, తిరువడ్డామలై అరుణాచలేశ్వర ఆలయం అగ్నితత్యానికీ, శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయం వాయుతత్యానికి మరియు జంబుకేశ్వర ఆలయం జలతత్యానికి నిర్మింపబడ్డాయి.

నటరాజస్వామి ఆలయంలో శ్రీనందీశ్వరుని విగ్రహం భారతదేశంలోని నందులలో కెల్లా | పెద్దదైందిగా ఉండి సజీవత్వం ఉట్టిపడుతుంటుంది. ఇక్కడ కోనేరు శివగంగను సువర్లకోనేరు అని పిలుస్తారు. ఇది ఆలయంలోని వేయి స్తంభముల | మండపానికి పడమట వైపున ఉన్నది.


అతిపెద్ద నందిగల క్షేత్రం చిదంబరం0/Post a Comment/Comments

Previous Post Next Post