భార్యభర్తల అన్యోన్యత కోసం దర్శించాల్సిన క్షేత్రం జంబుకేశ్వర ఆలయం

భార్యభర్తల అన్యోన్యత కోసం దర్శించాల్సిన క్షేత్రం జంబుకేశ్వర ఆలయం


 ఇది తమిళనాడు రాష్ట్రం చెన్నై నుంచి 330 కి.మీ దూరంలో ఉన్న తిరుచిరాపల్లికి 5 కి.మీ దూరంలో తిరువేనక్కావల్ అనే ఊరిలో ఉ ంది. సృష్టిలో పరమేశ్వరుడు పంచభూతములు అనబడే ధాతువుల రూపం ధరించి పలుచోట్ల స్వయంభువుగా వెలిశాడు. అందులోని రెండవదైన జలరూపం ధరించి వెలసిన క్షేత్రం ఈ జంబుకేశ్వరాలయం. 

ఒకానొకసమయంలో పరమేశ్వరుడిని ఎగతాళి మాట అనటంతో స్వామి మనసు కష్టించినది. దాంతో శివుడు పార్వతీదేవిని కైలాసం వదిలి భూలోకం వెళ్ళి ఉండమని ఆజాపించగా ఆమె కావేరీ నది ఒడ్డున వున్న ఈ జంబూకద్వీపంలో నివాసం ఏర్పరుచుకుని నదినీటితో ఒక లింగరూపం తయారు చేసి ఆ లింగాన్ని ఒక చెట్టు క్రింద ప్రతిష్ఠించి తపోదీక్షను చేపట్టింది. 

ఆ తర్వాత ఒకనాడు కావేరీ జలాన్ని చేతిలోకి తీసుకోగానే జలలింగంగా రూపుదాల్చింది. వెంటనే శివునిలో శక్తి ఐక్యమైంది. అన్యోన్యత కరువైన దంపతులు గానీ, వారి తరుపున ఎవరైనా గానీ ఈ క్షేత్రంలోని స్వామివారిని పూజిస్తే ఫలితం త్వరితంగా చేకూరుతుంది.

భార్యభర్తల అన్యోన్యత కోసం దర్శించాల్సిన క్షేత్రం జంబుకేశ్వర ఆలయం


0/Post a Comment/Comments

Previous Post Next Post