మమోపచార దోషాలు పోవటానికి దర్శించాల్సిన క్షేత్రం అంకోల గణపతి ఆలయం

మమోపచార దోషాలు పోవటానికి దర్శించాల్సిన క్షేత్రం అంకోల గణపతి ఆలయం


 ఇది తమిళనాడులోని చెన్నై జిల్లాలోని పొన్నేరికి మూడు కి.మీ దూరంలో ఉంది. వేదకాలంలో ప్రతిష్ఠాపితమైన ఈ ఆలయం చతుర్వేదపురముగా ప్రసిద్దికాంచినది. స్వామి చతుర్వేదేశ్వరుడు. శివుని ఆజ్ఞమేరకు అగస్త్యమహాముని 108 రోజులు 108 సైకత శివలింగాలను ప్రతిష్టించగా చివరిరోజున లింగాలు అన్నీ ఏకమై 'గణపతి' రూపాన్ని ధరించాయి.

ఆశ్చర్యపోయిన అగస్త్యునకు మహేశ్వరుడు కన్పించి 'మహర్షీ! నీవు పూజ ప్రారంభించే ముందు
గణపతిని ప్రార్థించనందున స్వామికి ఆగ్రహం కలిగినందున ఇలా జరిగింది. కానీ ఈ గణపతి భక్తుల కోర్కెలను తీరుస్తూ కలియుగాంతం వరకూ నిలిచి ఉంటాడు' అని అనుగ్రహించాడు. దాంతో నెమ్మదించిన మహర్షి తెలసి చేసినా, తెలియక చేసినా తపు తప్పే కనుక చతుర్వేదేశ్వరస్వామి లింగానికి తోడుగా మరొక లింగాన్ని ప్రతిష్టించి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. నూట ఎనిమిది సైకత లింగాను అర్చించిన తర్వాత ప్రతిష్ఠించడం వల్ల ఆ లింగానికి శ్రీనూట్రేశ్వర స్వామి అన్న పేరు స్థిరపడింది. కావున తెలిసీ తెలియక చేసిన తప్పులు తొలగటానికి ఇక్కడి స్వామిని పూజించి వడమాలను అర్పిస్తే తప్పక ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం.
మమోపచార దోషాలు పోవటానికి దర్శించాల్సిన క్షేత్రం అంకోల గణపతి ఆలయం


0/Post a Comment/Comments

Previous Post Next Post