దర్శించి మొక్కుకుంటే ఎంతటి రోగాలనైనా నివృత్తి చేసే క్షేత్రం వైదీశ్వరన్ కోయిల్

దర్శించి మొక్కుకుంటే ఎంతటి రోగాలనైనా నివృత్తి చేసే క్షేత్రం వైదీశ్వరన్ కోయిల్

ఆలయం పేరే ఊరి పేరు కూడా. తమిళనాడులోని చెన్నై నుండి మైలాడుతురై వైపు వెళ్ళే మార్గంలో ఈ ఆలయం ఉన్నది. అతి పురాతనమైన, పవిత్రమైన ఆలయం. ఒక మహర్షి తనకి పెద్ద జబ్బు చేయటంతో పరమేశ్వరుని గూర్చి భక్తితో
తపస్సు చేయగా పరమేశ్వరుడే స్వయంగా వచ్చి ఆయన జబ్బు నయం చేశాడని స్థల పురాణం. ఈ
ప్రాంతంలోని వారు ఎవరైనా సరే ఎటువంటి జబ్బు వచ్చినా ఇక్కడకి వచ్చి మొక్కుకుంటారు. స్వామి వారు వైదీశ్వరన్, అమ్మవారు బాలాంబల్. అద్భుతమైన శిల్ప సౌందర్యంతో నిర్మితమైన ఈ ఆలయంలోని స్వామివారిని సేవిస్తే అమిత జ్ఞానం స్వంతమవు తుందని కూడా చెబుతారు. నవగ్రహమూర్తులైన బుధుడు, కేతువులకు ఇక్కడ విడివిడిగా ఆలయాలు
ఉండటం విశేషం.
దర్శించి మొక్కుకుంటే ఎంతటి రోగాలనైనా నివృత్తి చేసే క్షేత్రం వైదీశ్వరన్ కోయిల్

0/Post a Comment/Comments

Previous Post Next Post