ఆయుర్వేద ఔషధాలు కలిగినక సునాముఖి మొక్క

ఆయుర్వేద ఔషధాలు కలిగినక సునాముఖి మొక్క

మనం ప్రత్యేకించి నాటే పని లేకుండా కేవలం గాలికి పెరిగి మనకి ఉప యోగపడే పొదలాంటి మొక్కల్లో ఒకటి సునాముఖి. దీని శాస్త్రయనామం కాసియా అంగుష్టిఫోలియా. ఇది సిసల్పినియేసి కుటుంబానికి చెందిన మొక్క. దీని మూలస్ధానం మధ్య ఆఫ్రికా అటవీ ప్రాంతాలు, అరబ్‌ దేశాలు. కానీ సమశీతోష్ణ మండలాల్లో విస్తారంగా పెరుగుతుంది. మన దేశంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు సునాముఖికి పట్టుకొమ్మలని చెప్పవచ్చు.

 ప్రాంతీయతని బట్టి దీనిని ఇంగ్లీషులో ఇండియన్‌ సెన్నా, టిన్నెర్‌వెల్లీ సెన్నా అనీ, హిందీలో సనాయె, సనాకపట్‌ అనీ, కన్నడలో నెలవరికె, సోనాముఖి అనీ, మళయాళంలో సున్నముక్కి, కొన్నముక్కి అనీ, తమిళంలో నిలవిరారు, నెలవరకారు అనీ, తెలుగులో సునాముఖి, నేలతంగేడు అనీ, సంస్కృతంలో స్వర్ణపత్రి అనీ, గుజరాతీలో నట్‌ కి సానా అనీ వ్యవహరిస్తారు. 

ఇది చాలా చిన్నగా పొదలా పెరిగే మొక్క. దీని ఎత్తు సమారుగు 2 నుంచి 3 అడుగులుండి, సన్నని ఆకుపచ్చని కాండంతో ప్రతి పాయకీ 4-5 జతల ఆకులతో దట్టంగా రెమ్మలు విస్తరించినట్టు పెరుగుతుం ది. సునాముఖి పువ్వులు చిన్నవిగా ఉండి పసుపు రంగులో ఉంటాయి. పొడవుగా ఎదిగే కాడతో 6-7 విత్త నాలు ముదురు కాఫీ రంగులో ఉంటాయి. 

సునా ముఖి ఆకులు, కాయలు కూడా ఔషధ గుణాలు కలిగి ఎంతో ఉపయోగపడతాయి. దీని ఆకులు, కాయలు ఎండబెట్టి నూరడం ద్వారా సునాముఖి పొడిని తయారుచేస్తారు. ఇది అజీర్తి రోగాలకి, శరీరంలో యిన్‌ఫెక్షన్స్‌ని నిర్మూలించడానికి, ఊపిరితిత్తు ల్లోని ఏర్పడిన సూక్ష్మక్రిముల నిర్మూలనకీ, అలాగే ఊపిరి తిత్తులకు మంచి బలాన్ని చేకూర్చడానికీ, కీళ్ళనొపðలకీ, ఉబ్బసవ్యాధికి, ఆయు ర్వేద వైద్య విధానంలో ఔషధ తయారీలో అత్యంత ముఖ్యంగా వాడు తున్నారు.


ఆయుర్వేద ఔషధాలు కలిగినక సునాముఖి మొక్క

షట్షాకర చూర్ణం, అష్టయాది చూర్ణంగా లభ్యమవుతున్న ఈ ఔషధాలు ఆయుర్వేదపరం గా సునాముఖితో తయారుచేయబడు తున్నవే. అంతే కాక దీనికి ఒంట్లో వేడిని తగ్గించే గుణం విపరీతంగా ఉంది. శరీరానికి మంచి చలువ చేస్తుంది. కంటి సంబంధిత రోగా లని కూడా అరికడుతుంది. సునాముఖి వేరు నుండి తయారు చేయబ డిన ఔష ధం విరోచనాలను అరికట్టడంలోను, జీర్ణశక్తిని పెంపొందిం చడంలోను, ఉదరసంబంధ వ్యాధులు రాకుండా కాపాడటంలో, రక్త కణాల లోని సూక్ష్మక్రిములను అరికట్టడంలో, జ్వరానికీ ఎంతగానో ఉపయోగ పడుతుంది. 

ఇక దీనిని సాంధ్రవ్యవసాయ పద్దతిలో చాలా మంది రైతులు సాగుచేస్తున్నారు. ఇది సాధారణంగా ఎర్రమట్టి నేలల్లో, ఓండ్రుమట్టి నేలల్లో బాగా పెరుగుతుంది. పత్తి పండే నేలల్లో దీని దిగుబడి అధికంగా ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు. 

సునాముఖి ఆకుల్లో డయాన్‌త్రోన్‌ డైగ్లుకోసైడ్‌ అనబడే కొత్త గ్లైకో సైడ్‌ అలోవెూడిన్‌ కనుగొన్నారు. దీని కాయలలో రేయిన్‌, క్రైసోఫానిక యాసిడ్‌ల ఆంత్రాసిన్‌ గ్లైకోసైడ్‌, సైన్నోసైడ్‌ ఏ.బిలు లభ్య మవుతాయి. బీజదళాల్లో క్రిసోఫనోల్‌, పైసియాన్‌, అలో ఎవెూడిరియిన్‌, రీయామ్‌ ఎవెూడిన్‌లు, ఆకులు, విత్తనాలలో పెన్నోసైడ్‌ కాల్షియం, లభ్యమవుతు న్నట్టు శాస్త్రజ్ఞులు పరిశోధనలో కనుగొన్నారు. అయినప్పటికీ దీనిలో లభ్య మయ్యే ప్రధాన మూలకాలు సెన్నోసైడ్‌ ఎ,బిలు ఔషధ తయారీకి చాలా ఉపయోగపడుతున్నాయి. 

సునాముఖీ మొక్కల్ని గుజరాత్‌లో సముద్రతీర ప్రాంతంలో విస్తా రంగా పెంచుతున్నారు. ఇతర పంటలతో పాటు దీనిని కూడా పెంచుతూ కొందరు రైతులు ఆదాయాన్ని పొందుతు న్నారు. సునాముఖి ఆకులు గృహవైద్య చిట్కాల్లో కూడా విని యోగించడం ఆంధ్రప్రదేశ్‌లో చాలా మందికి పూర్వం నుండీ వాడుకగా ఉన్న విషయం అందరికీ తెలిసినదే. సునాముఖి ఆకు ల్ని కొబ్బరినూనెలో నిల్వచేసి నిత్యం తలకి రాసుకుంటూ వుంటే, కేశాలు ఒత్తుగా పెరిగి, దృఢంగా ఉంటాయి. జుట్టురాలకుండా, చుండ్రు పట్టకుండా కాపాడుతుంది. సౌందర్యసాధనాల్లో కూడా సునాముఖికి ప్రముఖస్థానం ఉందని చెప్పవచ్చు.


సునాముఖి – చాల రకాల మొండి వ్యాధులకు సరైన పరిస్కారం

సునాముఖి దీనినే స్వర్ణ పత్రి, నేల తంగేడు అని కూడా అంటారు. ఈ సునాముఖి ఆకులూ, కాయలు అనేక ఔషధ గుణాలు కలిగి ఆయుర్వేద వైద్యంలో వాడబడుతుంది. చాల రకాల మొండి వ్యాధులకు ఈ చూర్ణం ని ఔషదంగా సేవిస్తారు. ఆయుర్వేద పరిజ్ఞానం కల వారందరికీ సునాముఖి సుపరిచితమే. ఎందుకంటే ఈ సునాముఖి కలిగి ఉండే ఆయుర్వేద గుణాలు అలాంటివి.



ప్రయోజనాలు:


  • గ్యాస్ట్రబుల్ – రోజు 2 పూటలా ఉదయం, రాత్రి భోజనానికి ముందు 3 గ్రాముల సునాముఖి చూర్ణం ను పటిక బెల్లం పొడి తో కలిపి చల్లటి నీటితో చేర్చి తాగుతూ ఉంటే గ్యాస్ట్రబుల్ సమస్య తగ్గిపోతుంది.
  • శరీర పుష్టికి – పడుకునే ముందు 3 గ్రాముల సునాముఖి చూర్ణం నీటితో కలిపి తేనె చేర్చి ఒక సంవత్సరం తాగుతూ ఉంటే ఏనుగుతో సమానమైన బలం చేకూరుతుంది.

రక్తశుద్ధికి – 1/2 కప్పు పాలలో 1 స్పూన్ సునాముఖి చూర్ణం కలిపి సేవిస్తే రక్తశుద్ధి కలుగుతుంది.
ఉబ్బసం – 3 గ్రాముల సునాముఖి చూర్ణం 1 కప్పు దానిమ్మ రసం తో చేర్చి తాగడం వల్ల ఉబ్బసం తగ్గుతుంది, ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది.
మలబద్దకం – 1 గ్లాస్ నీటిలో 1 స్పూన్ సునాముఖి చూర్ణం కలిపి రాత్రి పడుకునేముందు తాగితే మలబద్దకం నివారించబడుతుంది. లేదా 100 గ్రాముల బెల్లం, 50 గ్రాముల సునాముఖి చూర్ణం కలిపి దంచి 5 గ్రాముల చొప్పున గోలీలలాగా తయారుచేసుకోవాలి, రోజుకో మాత్ర రాత్రి పడుకునే ముందు తీసుకుంటుంటే మలబద్దకం తగ్గిపోతుంది.
ఒంటి నొప్పులకు – 5 గ్రాముల సునాముఖి చూర్ణం ను 1 స్పూన్ ఆవునెయ్యితో కలిపి ఉదయం, రాత్రి 2 పూటల భోజనానికి ముందు తీసుకుంటుంటే ఈ సమస్య తగ్గుతుంది.
కిడ్నీలలో రాళ్లు కరగాలంటే – కూర దోస రసం లో 3 గ్రాముల సునాముఖి చూర్ణం కలిపి రోజుకి 2 పూటలా తాగాలి.
అధిక చెమట సమస్య – 1/2 కప్పు మజ్జిగలో 3-6 గ్రాముల సునాముఖి చూర్ణం కలిపి రోజుకి 2 పూటలా తీసుకుంటుంటే అధిక చెమట సమస్య తగ్గుతుంది.

Health Tips

మరింత సమాచారం కోసం :-
అసిడిటీ సమస్య-పరిష్కారాలువంకాయ రుచిలోనే కాదు ఆరోగ్యానికి అందించే మేలు తెలిస్తే ఆహా అంటారు
ఆయుర్వేద ఔషధాలు కలిగినక సునాముఖి మొక్కఆముదం చెట్టు -మానవుల పాలిట అమృత కలశం
కాలిన గాయాలకు వంటింటి వైద్యంముసాంబరం తో ఆరోగ్యం
వెల్లుల్లి తేనె కలిపి తింటుంటే కలిగే లాభాలుకాపర్ (రాగి లోహం) వాడకం వలన కలిగే ప్రయోజనాలు
అద్భుత ఆరోగ్య ప్రయోజనాలకు అవకాడో పండుసోంపు వలన కలిగే లాభాలెన్నో తెలుసా?
అటుకులతో ఆరోగ్యంఅంతులేని లాభాలనిచ్చే ఆపిల్ సైడర్ వెనిగర్
పులిపిరులు పోగొట్టడానికి సులువైన మార్గాలుకలోంజి గింజలలో దాగిఉన్న ఔషధ గుణాలు
కాప్సికమ్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?రక్తదానం చేయడం ఎంతవరకు శ్రేయస్కరం
పచ్చిబఠాణీ ఎంత గొప్ప పౌష్టికాహారమో తెలుసారక్తహీనత సమస్య – పరిష్కారాలు
సొయాబీన్స్ లోని పోషకాలుఅరటిపండు –అద్భుతమైన ఫలం
బాదం పప్పు ప్రపంచంలోనే అత్యధిక పోషకాలు కలిగిన ఆహార పదార్థందృష్టి లోపాలను సవరించి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారపదార్థాలు
కొబ్బరి బొండం ఒక అమృత కలశంఅందం ఆరోగ్యాలనందించే నారింజ పండు
మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేయవల్సినబ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కనిపించే ఆశ్చర్యకర లక్షణాలు
సపోటాపండు లోని పోషకాలు మరియు ప్రయోజనాలుఆపిల్ పండు లోని విశేషాలు
అనాసపండు (pineapple) అందించే ఆరోగ్యంఅమృతఫలం ఈ సీతాఫలం
త్రిఫల చూర్ణం వందలకు పైగా రోగాలను నయం చేస్తుందిఉసిరి జ్యూస్ ఆరోగ్య సిరి
బొప్పాయి పండు ఆరోగ్యానికి అమ్మ లాంటిదిపుదీనా ఆకు - ఔషద గుణాల ఖజానా
మెంతులు వలన కలిగే మేలుసబ్జా గింజలు వల్ల కలిగే ఆరోగ్యం
చుండ్రు నివారణ కోసం ఆయుర్వేద చిట్కాలుకర్పూరం ను ఇలా కూడా ఉపయోగించవచ్చు
ఉలవలు – ఆరోగ్య విలువలుఅద్భుత ప్రయోజనాలిచ్చే కరివేపాకు
విటమిన్ లు, పోషక విలువల ఖజానా – తోటకూరద్రాక్ష పండ్లతో ఆరోగ్యం ద్రాక్ష‌ను సూప‌ర్ ఫుడ్ అని ఎందుకంటాం?
తులసి ఆరోగ్య రహస్యాలుకిడ్నీలో రాళ్లున్నాయని డాక్టర్లు చెప్పారా?
మారేడు (బిల్వం) చెట్టు ప్రాముఖ్యత మీకు తెలుసా ఆయుర్వేద ఉపయోగాలు మాన్‌సూన్ డయాబెటిస్ డైట్: బెర్రీలతో చేసిన 4 వంటలను తినడం వల్ల రక్తంలో చక్కెర తగ్గుతుంది
.......

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd