అసిడిటీ సమస్య-పరిష్కారాలు
జీర్ణాశయంలో అవసరానికి మించి ఎక్కువ ఆమ్లాలు ఉత్పత్తి అవడం వళ్ళ కడుపులో మంట ఏర్పడుతుంది దినిని అసిడిటీ అని అంటారు. అసిడిటీ మరియు గ్యాస్ట్రిక్ సమస్యలు పెద్ద వ్యాధులు ఏమి కావు . కానీ దినిని నిర్లక్ష్యం చేయడం వల్ల చాల పెద్ద సమస్యగా మారి ప్రాణాల మీదకు వచ్చే అవకాశం చాల ఎక్కువగా ఉంది. అసిడిటీ సమస్యకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తొందరగా అరికట్టవచ్చును .
అసిడిటీ రావడానికి గల కారణాలు:
ఆహారంపైన ఎక్కువగా అదుపులేకపోవడం.
సరైన ఆహార వేళలు పాటించకపోవడం.
మానసిక ఒత్తిడి మరియు ఆందోళన, నిద్రలేకపోవడం.
ధూమపానం మరియు మద్యపానం, పాన్, గుట్కా లాంటి అలవాట్లు.
ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ మరియు యాంటీ బయోటిక్స్ వాడకం.
ఫాస్ట్ ఫుడ్స్డీ మరియు ఫ్రై ఐటమ్స్, ఎక్కువగా పుల్లగా ఉండే ఆహార పదార్థాలు, మసాలా పదార్థాలు తినడం.
అసిడిటీ లక్షణాలు:
కడుపులో మంట, వికారం మరియు వాంతులు ఉంటాయి. వీరిలో అజీర్ణం, మలబద్దకం పెరిగి ఆకలి తగ్గుతుంది . .
అసిడిటీ కి ఆలోపతి మెడిసిన్ ప్రభావం:
అసిడిటీకి మందులు కొద్దిరోజులు వాడటం వల్ల ఫలితం బాగానే ఉంటుంది. కానీ ఈ మందులు ఎక్కువ రోజులు వాడటం వల్ల “బోన్ మినరల్ డెన్సిటీ” వస్తుంది. ఈ మందులు వాడకం వళ్ళ శరీరం ఐరన్, క్యాల్షియం గ్రహించలేకపోతుంది అని కొన్ని పరిశోధనల్లో తేలింది. దీని వల్ల కొందరిలో ఫ్రాక్చర్స్ అవడం మరియు కిడ్నీలలో రాళ్ళూ రావడం, పూర్తిగా కిడ్నీలు చెడిపోవడం లాంటివి జరుగుతుంటాయి.
అసిడిటీనీ తగ్గించే ఆహార మార్గాలు:
స్పూన్ నెయ్యిని 1 గ్లాస్ గోరువెచ్చని పాలలో కలిపి పరగడుపున తాగడం వల్ల మంచి ఫలితం వస్తుంది .
చల్లటి పాలు తాగడం వల్ల పొట్టలోని ఆసిడ్స్ ఎక్కువసేపు ఉత్పత్తి కాకుండా చేస్తుంది.
తియ్యటి మజ్జిగ తీసుకోవడం వల్ల వెంటనే ఫలితం కనిపించి . దీనిలోని లాక్టిక్ ఆసిడ్ పొట్టలోని అసిడిటినీ మల్లి సాధారణ స్థితికి కూడా తీసుకువస్తుంది.
కొబ్బరి నీళ్లకి ఈ ఆసిడ్స్ ప్రభావం నుండి పొట్టని రక్షించే శక్తి చాల ఉంది. అందుకే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల వెంటనే ఉపశమనం కూడా కలుగుతుంది.
5లేక 6 తులసి ఆకుల్ని తీసుకుని నీళ్లలో మరిగించి చల్లార్చి తాగడం వల్ల మంచి ఫలితం వస్తుంది. దీనిని తరుచు తీసుకోవడం వల్ల ఎసిడిటీ దాదాపుగా తగ్గుతుంది. ఇది ఉత్తమమైన మార్గం.
Post a Comment