సపోటాపండు లోని పోషకాలు మరియు ప్రయోజనాలు
పోషకాలు: సపోటా పండు లో విటమిన్ A, E లు కూడా ఉంటాయి. వీటితోపాటు పొటాషియం, కాపర్, ఐరన్ , గ్లూకోస్ ని కలిగిఉంటుంది. ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫలమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలని కలిగి ఉంటుంది.
ప్రయోజనాలు:
ఈ పండు తక్షణ శక్తినిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది.
సపోటా జీర్ణశక్తిని పెంచి, మలబద్దకాన్ని తగ్గిస్తుంది. శరీరంలోని టాక్సిన్స్ ని బయటకి పంపిస్తుంది.
ఈ పండు పొట్టలో అల్సర్లను, పుండ్లని నివారిస్తుంది. పేగులని క్లీన్ చేస్తుంది.
సపోటా చర్మ సంరక్షణకు మంచిది. ముడతలు, చర్మం పొడిబారే సమస్యను తగ్గిస్తుంది.
ఈ పండు మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది. కిడ్నీలలో రాళ్ళని కరిగిస్తుంది.
సపోటా జుట్టు కుదుళ్లను బలంగా చేసి జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.
ఈ పండు కొన్నిరకాల కాన్సర్ ల బారినుండి కాపాడుతుంది.
సపోటా కంటి సమస్యలను తగ్గించి, కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఈ పండుఎముకలకు బలాన్నిస్తుంది. దంతక్షయాన్ని నివారిస్తుంది.
సపోటా జలుబు, దగ్గుకి మంచి రెమెడీ.
గమనిక: సపోటా షుగర్ వ్యాధిగ్రస్థులు వీటిని తక్కువగా తీసుకుంటే చాలా మంచిది.
మరింత సమాచారం కోసం :-
మరింత సమాచారం కోసం :-
.....
Post a Comment