ఇవి మీకు తెలుసా “వెఱ్ఱినువ్వులు Niger Seeds”
వెఱ్ఱినువ్వులను వడిసెలు అని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్ లో నైజర్ సీడ్స్(Niger Seeds) అని అంటారు. పూర్వకాలంలో వెఱ్ఱినువ్వుల నూనెని విరివిగా వాడేవారు. ఇది ఆరోగ్యానికి చాల మంచిది.వెఱ్ఱినువ్వులను ముక్యంగా పక్షుల ఆహారంగా కూడా పరిగణిస్తారు. వీటిని ఆయిల్ ప్లాంట్స్ గ చెప్తారు. నూనెని ఉత్పత్తి చేసే గింజలని అర్ధం. వెఱ్ఱినువ్వుల నుంచి వచ్చే నూనెని ఆయుర్వేదంలో చాల రుగ్మతలకు మందుగా కూడా వాడుతారు. మన తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల మాత్రమే వీటిని పండిస్తారు. ఎందుకంటే ప్రస్తుతం ఇది వాడుకలో లేదు.అందుకనే వెఱ్ఱినువ్వులు అనే దివ్యాహారం మరుగునపడిపోయింది. తిరిగి ఇప్పుడే దీనిని గుర్తించడం మొదలుపెట్టారు.
పోషకాలు: వెఱ్ఱినువ్వులలో క్యాల్షియం, పొటాషియం, జింక్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, ఒమెగాఫ్యాటీయాసిడ్స్ మెగ్నీషియం ఎక్కువ మోతాదులో ఉంటాయి.
వెఱ్ఱినువ్వుల వలన కలిగే ప్రయోజనాలు :
ఈ నూనె బుద్ది మాంద్యంను కూడా తగ్గిస్తుంది.
వ్యాధినిరోధక శక్తిని బాగా పెంచుతుంది.
జీర్ణాశయానికి సంబందించిన దాదాపుగా అన్ని సమస్యలను బాగా నివారిస్తుంది.
వాత సమస్యలను కూడా నివారిస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని కూడా సంరక్షితుంది.
మానసిక సమస్యలను తొలగించడానికి దీనిని ముఖ్యంగా వాడుతారు.
ఫిట్స్, మతిమరుపుకు మంచి మెడిసిన్.
మంచి నిద్రను కూడా ఇస్తుంది.
మానసిక వికారాలను బాగా నయంచేస్తుంది.
బరువు పెరగకుండా చేస్తుంది.
Health Tips
మరింత సమాచారం కోసం :-
.......
Post a Comment