అసాధారణ ప్రయోజనాలనందించే తాటి బెల్లం
తాటి బెల్లం ప్రస్తుత కాలంలో ఎక్కువ జనాదరణలోకి వచ్చిన పూర్వకాలపు ఆహారపదార్థం . దీనిలోని ఔషధగుణాలే. ఇది ప్రాచుర్యంలోకి రావడానికి గల ముఖ్యకారణం. దీనిని తమిళనాడులో ఎక్కువగా తయారు చేస్తారు.
తాటి బెల్లం తయారీ:
తాటిచెట్టు నుండి వచ్చిన తాటి నీరా నుండి తాటి బెల్లం తయారు చేస్తారు.తాటి నీరా అనేది మత్తును కలిగించని, ఆరోగ్యాన్నిచ్చే ఒక మంచి పానీయం. తాటి నీరాను బాగా వేడి చేసి తాటి బెల్లం ను తయారుచేస్తారు. ఇందులో ఎలాంటి రంగు, ఇతర పదార్థాలు కూడా కలుపరు. ఇది రుచికి పూర్తిగా బెల్లం లాగే ఉంటుంది. కానీ చెరుకు బెల్లంలో గ్లూకోజ్ ఉంటుంది. తాటి బెల్లం లో సుక్రోజ్ కూడా ఉంటుంది.
తాటి బెల్లం లోని పోషకాలు :
ఐరన్, కాల్షియమ్, మెగ్నీషియం, పొటాషియం మరియు పాస్పరస్, మాంగనీస్ కార్బోహైడ్రేట్స్ మరియు సుక్రోజ్ ఉంటాయి. తాటి బెల్లం లో విటమిన్స్ మరియు మినరల్స్ ఎక్కువ గా ఉంటాయి.
- ఇందులో తేమ – 8.61%,
- ఖనిజ లవణాలు – 3.15%,
- సుక్రోజ్ – 76.86%,
- కాల్షియం – 0.86%,
- మాంసకృత్తులు – 1.04% .
తాటి బెల్లం వలన ప్రయోజనాలు:
తాటి బెల్లం లో ఉండే పొటాషియం కొవ్వును కరిగించడంలో, అధిక బరువును తగ్గించడంలో మరియు బీపీ ని కంట్రోల్ చేయడంలో కూడా ఉపకరిస్తుంది.
గోరు వెచ్చని నీటిలో తాటి బెల్లం కలుపుకొని తాగడం వలన జలుబు మరియు దగ్గు నివారింపబడుతుంది.
దీనిని రోజు తీసుకోవడం వలన శరీర పుష్టి మరియు వీర్య వృద్ధి బాగా కలుగును.
శరీరంలో హానికర టాక్సిన్స్ ను బయటకి పంపి మలబద్దకం సమస్యను బాగా నివారిస్తుంది.
లివర్ కి స్నేహకారిగా ఉంటుంది. లివర్ ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది.
అనీమియా(రక్తహీనత)సమస్యను నివారిస్తుంది.రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.స్త్రీలలో బహిష్టు సమస్యలను కూడా అరికడుతుంది.
దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు బ్లడ్ ప్యూరిఫై చేసి శరీరంలో దెబ్బతిన్న కణజాలాన్ని బాగా పునరుద్ధరిస్తుంది.
జీర్ణాశయ ఎంజైమ్ ల పనితీరుని బాగా మెరుగుపరుస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచి శరీరంలో వేడిని బాగా తొలగిస్తుంది.
చిన్న ప్రేగులు,పెద్దప్రేగులలో ఉండే విషపదార్థాలను బయటికి పంపించి, ప్రేగు కాన్సర్ రాకుండా చేస్తుంది.
గమనిక:-
షుగర్ వ్యాధిగ్రస్తులు దీనిని తక్కువ మోతాదులో తీసుకోవచ్చును .
దీనిని రోజు 25-30 గ్రాముల వరకు తీసుకోవచ్చు.
Health Tips
మరింత సమాచారం కోసం :-
Post a Comment