పచ్చిబఠాణీ ఎంత గొప్ప పౌష్టికాహారమో తెలుసా?
బఠాణి జన్మస్థలం మధ్య ఆసియా, యూరప్ ప్రాంతాలు. పచ్చి బఠాణి కలిగి ఉండే పౌష్ఠిక విలువల ఆధారంగా ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. చలికాలంలో ఈ పచ్చి బఠాణి ఎక్కువగ లబిస్తుంది. ఇతర సీజన్ లలో ఎండు బఠాణి ని దీనికి బదులుగా వాడవచ్చును . దీనిలోని పోషక విలువలు గురించి తెలిస్తే వారానికి ఒకసారైనా తప్పకుండ తింటారు.
పోషకాలు: బఠాణీలలో విటమిన్ A, B1, B2, C, K లు కూడా ఉంటాయి. వీటితో పాటు కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇంఫలమేటరీ గుణాలు కలిగి ఉంటాయి. వీటిలో కాలరీలు చాల తక్కువ.
ప్రయోజనాలు:
పిల్లలకి మంచి పౌష్టికాహారం, జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది. ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది.
రక్తంలో షుగర్ లెవెల్స్ ని బాగా క్రమబద్దీకరిస్తాయి. రక్తంలో చక్కెరను తొందరగా చేరనివ్వదు. టైప్ 2 డయాబెటిస్ కి చాల మంచి ఫుడ్.
త్వరగా ఆకలి వేయదు. జీర్ణం కావడానికి చాల టైం తీసుకుంటుంది. మలబద్దకం బాగా నివారిస్తుంది.
అల్జీమర్స్, ఆర్థరైటిస్ లాంటి వ్యాధులకు మంచి బాగా ఆహరం.
కాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడే ఔషధ లక్షణాలున్నాయి.
రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది.
గుండె జబ్బులు రాకుండా కూడా నివారిస్తుంది.
చెడు కొలస్ట్రాల్ ని తగ్గిస్తుంది, మంచి కొలస్ట్రాల్ ని బాగా పెంచుతుంది.
యాంటీ ఏజింగ్ గా కూడా పనిచేస్తుంది.
వారానికి 2 సార్లు తీసుకుంటే మంచిది. ఎక్కువసార్లు తీసుకుంటే గ్యాస్ ప్రాబ్లెమ్ కూడా ఇబ్బంది పెడుతుంది.
Post a Comment