పుదీనా ఆకు - ఔషద గుణాల ఖజానా

పుదీనా ఆకు  - ఔషద గుణాల ఖజానా సంవత్సరమంతా దొరికే ఆకుకూర పుదీనా. పుదీనాను వంటలలో మాత్రమే వాడుతుంటారు. ఎన్నో రుగ్మతలను దూరం చేసే పుదీన మన పెరట్లోనే ఉండటం విశేషం. పుదీనా లోని విశేషాలు, ఔషధ గుణాలు తెలిస్తే ఖచ్చితంగా మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటారు. పుదీన గురించి పూర్తిగా తెలుసుకుని ఆరోగ్యాంగా వర్ధిల్లండి.


పోషకాలు: పుదీనాలో విటమిన్ A, B, B2 ఉంటాయి. వీటితో పాటు ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, కాల్షియం, కొవ్వుపదార్ధాలు, పాస్పరస్, ఐరన్ లను కలిగిఉంటుంది.


పుదీనా ఆకు  - ఔషద గుణాల ఖజానా


ప్రయోజనాలు:

అజీర్తి, గ్యాస్, ఉబ్బరం, కడుపునొప్పి, నులిపురుగులు లాంటి పొట్టకు సంబందించిన అన్ని సమస్యలకు పుదీనా మంచి పరిష్కారం. పుదీన రసంలో కాస్త తేనె , నిమ్మరసం కలిపి రోజు తీసుకుంటుంటే ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయి.
పుదీన ఆకుల్ని నమిలి తినడం వల్ల నోటి దుర్వాసన, పిప్పళ్లు, చిగుళ్ల నుండి రక్తం కారడం, దంతాలు కదలటం, టాన్సిల్స్ వంటి సమస్యలు దూరమవుతాయి.
బహిష్టు నొప్పి కి ఎండిన పుదీన పొడి 2స్పూన్లు 2 గ్లాసుల నీటిలో కలిపి 1/2 గ్లాస్ అయ్యేంతవరకు మరిగించి చల్లార్చి తాగాలి. ఇలా పీరియడ్స్ రావడానికి 4 రోజుల ముందు నుండి చేయడం వల్ల బహిష్టు నొప్పి తగ్గడమేకాక పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి.
ఎక్కిళ్ళు, దగ్గు, జలుబు, గొంతునొప్పి, నోటి దుర్వాసన వంటి సమస్యలకు పుదీన కాషాయం తీసుకోవడం, పుక్కిలి పట్టడం మంచి మెడిసిన్.
వడదెబ్బకి మజ్జిగలో పుదీన రసం కలుపుకుని తాగడం, ఒంట్లో వేడి తగ్గడానికి పుదీన రసాన్ని శరీరానికి అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చెమటపొక్కులు కూడా తగ్గిపోతాయి.
కీళ్ల నొప్పులకు 1స్పూన్ కోకోనట్ ఆయిల్ లో 2,3 చుక్కల మెంథాల్ ఆయిల్ కలిపి కీళ్లపై మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యూలేషన్ పెరిగి ఉపశమనం పొందుతారు.
1స్పూన్ షుగర్ లో 2,3 చుక్కల మెంథాల్ ఆయిల్ కలిపి తీసుకోవడం వల్ల అజీర్ణ వికారాలు తగ్గుతాయి.
పుదీన ఆకులను నలిపి వాసనా చూడటం వల్ల తల తిరగడం, తల నొప్పి వంటి సమస్యలు తగ్గిపోతాయి.
పిప్పి పన్ను నొప్పి ఉన్నపుడు మెంథాల్ ఆయిల్ లో లవంగం నూనె కలిపి నొప్పి ఉన్నచోట పూయడం వల్ల నోప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
1స్పూన్ కోకోనట్ ఆయిల్ లో 2,3 చుక్కల మెంథాల్ ఆయిల్, కొంచం నిమ్మరసం కలిపి శరీరానికి అప్లై చేయడం వల్ల దోమలు దరిచేరవు.


మరింత సమాచారం కోసం :-
అద్భుత ఔషదాల గణి అలోవెరా (కలబంద)రథసప్తమి రోజు జిల్లేడు ఆకుపై రేగిపండు పెట్టుకుని స్నానం చేసేదెందుకు?   
బ్లాక్ హెడ్స్ నివారణ మార్గాలుఆంధ్రప్రదేశ్ పనకాల లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ చరిత్ర పూర్తి వివరాలు
ప్రకృతి అందిచిన వరం సైంధవ లవణంఅందం ఆరోగ్యాన్నందించే కీరా
అసాధారణ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న రాజ్ మాఖర్జూరం వల్లనే కలిగే ప్రయోజనాలు
పాడైపోయిన ఊపిరితిత్తులని బాగుచేసే మార్గాలుమామిడి పళ్ళ వలన లాభాలు, నష్టాలు
అసాధారణ ప్రయోజనాలనందించే తాటి బెల్లంబ్లూ బెర్రీస్ గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు
ఇవి మీకు తెలుసా “వెఱ్ఱినువ్వులు Niger Seeds”మలబద్దకాన్ని తరిమికొట్టె సులువైన చిట్కాలు
విటమిన్ A ప్రాముఖ్యతతమలపాకులోని ఆరోగ్య రహస్యాలు
Home Made హెర్బల్ షాంపూలీచీ పండు ఎంతవరకు ఆరోగ్యకరం
అశ్వగంధ -అనేక ఔషధ గుణాలకు నిలయంఅవనిలో ఒక అరుదయిన మూలిక సదాపాకు
ఉత్తమ ఔషధ ఆహారం స్టీవియాకేశ సౌందర్యానికి భృంగరాజ్ (గుంటగలగర ఆకు)
భృంగరాజ్ తైలంభృంగరాజ్ హెయిర్ ప్యాక్
భృంగరాజ్ తో నాచురల్ హెయిర్ డైఅల్ బుకర పండు గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు
బిళ్ళ గన్నేరు అనేక ఔషధ గుణాలకు నిలయంఅవిసె గింజల ప్రయోజనాలు
నువ్వుల నూనె ప్రయోజనాలునువ్వుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలుటమాటో వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వంటింట్లోని దివ్య ఔషధం వెల్లుల్లిఎండు ద్రాక్ష ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
 పుట్టగొడుగులు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలుHealht tips

..... 

0/Post a Comment/Comments

Previous Post Next Post