ముసాంబరం తో ఆరోగ్యం
ముసాంబరం అంటే చాలా మందికి తెలియదు. కలబంద మట్టల నుండి గుజ్జుని తీసి ఎండ బెడతారు. ఎండిన కలబంద గుజ్జుని ముసాంబరం అని కూడా అంటారు. ఇది అన్ని ఆయుర్వేదిక్ స్టోర్స్ లో కూడా దొరుకుతాయి. ఇది చూడటానికి నల్లగా ఉంటుంది. కలబంద పచ్చిగా ఉన్నపుడు కలిగి ఉండే అన్ని మెడిసినల్ వాల్యూస్ ని ముసాంబరం కలిగి ఉంటుంది.
ముసాంబరం పొడి, పసుపు వేడి నీళ్లలో వేసి మరిగించి బెల్లం కలిపి తాగడం వల్ల మలబద్దకం సమస్యని కూడా నివారించవచ్చును .
ముసాంబరం ని తీసుకుని కొద్దిగా నీరు చేర్చి దంచి ముద్దగా తయారుచేయాలి.
దీనిని చిన్న చిన్న ఉండలుగా సెనగ గింజల సైజు లో మాత్రలు చేసి నీడలో బాగా ఆరబెట్టాలి.
వీటిని రోజుకి 1 చొప్పున తీసుకుంటుంటే దగ్గు, జలుబు ఇంకా శ్వాస సంబంధిత సమస్యలకు బాగా చెక్ పెట్టవచ్చును .
ముసాంబరం చేదుగా ఉండటం వల్ల దీనిని పిల్లలు పాలు మాన్పించడంలో బాగా ఉపయోగిస్తారు. తల్లి యొక్క చను మొనలకి ముసాంబరాన్ని పూయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Post a Comment