నువ్వుల నూనె ప్రయోజనాలు, ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు

నువ్వుల నూనె ప్రయోజనాలు, ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలుపురాతన నూనె గింజల పంటల్లో, నువ్వుల విత్తనాలు మరియు నువ్వుల నూనె ఇటీవల తమంతట తాముగా ఒక పేరు తెచ్చుకోవడం ప్రారంభించాయని భావించడం జరిగింది. చెఫ్ ల క్రొత్త ప్రయోగాత్మక తరం మరియు ఇటీవలి శాస్త్రీయ అధ్యయనాలు, ఈ నూనె యొక్క ఆరోగ్య ప్రయోజనాలకు ప్రాధాన్యత నివ్వడం ప్రారంభించడమే ఈ నూనె హఠాత్తు ప్రాచుర్యానికి కారణం. భారతీయులు, ఆఫ్రికన్లు, ఆగ్నేయ ఆసియన్లు మరియు మధ్య ప్రాచ్య దేశాల వారు అనేక సంవత్సరాలుగా వారి వంటకాలలో నువ్వుల నూనె ఉపయోగిస్తున్నారు. వంటలో మాత్రమే కాకుండా, సౌందర్య మరియు వైద్య ప్రయోజనాల కోసం కూడా దీనిని ఉపయోగిస్తున్నారు, మసాజ్ మరియు చికిత్సలలో కూడా ఉపయోగిస్తున్నారు.     

మధ్యధరా మరియు ఇతర సంస్కృతులలో శతాబ్దాలుగా నువ్వుల నూనె అత్యంత ఎక్కువగా గుర్తించబడింది మరియు ఆయుర్వేద చికిత్సలలో మర్దన నూనెగా విస్తృతంగా ఉపయోగించడం జరుగుతుంది. శరీరం పైన ఈ నూనె యొక్క వెచ్చని మరియు మృదుత్వ ప్రభావం కారణంగా దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.  

విభిన్న నూనె సేకరణ పద్ధతులు నువ్వుల నూనెకు విభిన్న రంగు మరియు రుచి ఇస్తాయి. పాశ్చాత్యుల ద్వారా అధికంగా ఉపయోగించేబడే అధిక ప్రెస్ విధానం లేత పసుపు రంగును నూనెను ఉత్పత్తి చేస్తుంది, అలాగే భారతీయ నువ్వుల నూనె మరింత బంగారు రంగు కలిగిఉంటుంది. నువ్వుల నూనెను వేయించిన విత్తనాల నుండి తయారుచేసినప్పుడు, ఒక ప్రత్యేకమైన గోధుమ ఛాయను కలిగిఉంటుంది మరియు దీనిని వంటలో ఉపయోగించేందుకు బదులుగా ఒక సువాసన ఏజెంటుగా ఉపయోగిస్తారు.

ఒక పాలీఅసంతృప్త కొవ్వుగా ఉండడం వల్ల, నువ్వుల నూనె ఖచ్చితంగా మీ ఆరోగ్యానికి మంచిది. ఇది ప్రత్యేకంగా విటమిన్ కె, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ డి, మరియు ఫాస్ఫరస్‌లను సమృద్ధిగా కలిగిఉంటుంది. నువ్వుల నూనెలో ఉండే కొన్ని ప్రొటీన్లు జుట్టుకు ప్రయోజకరమైనవి. సంప్రదాయ నూనెలు శుద్ధిచేసిన నూనెల స్థానాన్ని భర్తీ చేసినప్పటికీ, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్‌లలోని కొన్ని ప్రాంతాల వారు కూరలు మరియు పులుసులను చేసేందుకు ఇప్పటికీ నువ్వుల నూనెను ఉపయోగిస్తున్నారు. దీనిని ఇడ్లీలు మరియు దోశలతో వడ్డించే మసాలా పొడిలో కూడా ఉపయోగిస్తారు. తక్కువ గ్రేడ్ నూనెను కూడా సబ్బులు, రంగులు, కందెనలు మొదలైన వాటిలో ఉపయోగిస్తారు.    

ఆయుర్వేద ప్రకారం, వట  సమతుల్యంలో నువ్వుల నూనె అత్యంత ప్రభావమంతమైనది మరియు కఫా డోష కు కూడా ఉపయోగిస్తారు, మూడు డోషాలలో రెండు లేదా ప్రకృతి యొక్క బలాలను నియంత్రిస్తుంది. దీనిని ఆరోగ్యవంతమైన పళ్లు మరియు చిగుళ్ల కోసం, మరియు ప్రేగుల లూబ్రికేటింగ్ కోసం ఉపయోగిస్తారు.

నువ్వుల నూనె ప్రయోజనాలు, ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు
నువ్వుల నూనె గురించి ప్రాథమిక వాస్తవాలు:


నువ్వుల యొక్క వృక్ష శాస్త్రీయ నామం – సేసమమ్ ఇండింకం
జాతి – పెడలియాసేస్
వ్యవహారిక నామం – టిల్
సంస్కృత నామం – టిలా
జన్మించే ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ – నువ్వులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నప్పటికీ, మియన్మార్ నువ్వుల నూనె ఉత్పత్తిలో అగ్రగామి ఉత్పత్తిగా ఉంది, ప్రపంచంలోని మొత్తం నువ్వుల నూనె ఉత్పత్తిలో 18.3% శాతం ఉత్పత్తి చేస్తుంది. చైనా నువ్వుల నూనె ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా రెండవ ఉత్పత్తిదారుగా ఉంది, తరువాతి స్థానం‌లో భారతదేశం ఉంది.  

ఆసక్తికర అంశాలు -  ఆలీ  బాబా కథ “ వెయ్యిన్నొక రాత్రులు” లో నుండి చెప్పబడిన ప్రసిద్దమైన వాక్యం “ఓపెన్ సెసేం” నిజానికి నువ్వుల మొక్కను సూచిస్తుందని భావించబడింది. పరిణితి చెందినప్పుడు తెరుచుకునే పాడ్లలో నువ్వుల విత్తనాలు పెరుగుతాయి. “ఓపెన్ సెసేం” అన్నది నిధులను తెరవడాన్ని  సూచిస్తుందని నమ్ముతారు.


నువ్వుల నూనె పోషక విలువలు 

100 గ్రా. నువ్వుల నూనె 884 కి.కేలరీలు కలిగిఉంటుంది. ఇనుము వంటి ఖనిజాలు మరియు విటమిన్ ఇ మరియు కె వంటి విటమిన్లు ఈ నూనెను సురక్షితమైనదిగా మరియు ఆరోగ్యకరమైన ఎంపికలలో ఒకటిగా దీనిని తయారుచేసాయి. నువ్వుల నూనెలోని కొవ్వు ఆమ్ల కంటెంట్ గుండెను ఆరోగ్యంగా ఉంచడం‌లో మరియు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉంచడంలో సహాయం చేస్తుంది.   

యుఎస్‌డిఎ పోషక విలువల డేటాబేస్ ప్రకారం, 100 గ్రా. నువ్వుల నూనె క్రింద ఇవ్వబడిన పోషకాలను కలిగిఉంటుంది.

పోషకాలు విలువ  100 గ్రా.లలో 

శక్తి  - 884 కి.కేలరీలు

కొవ్వు-100 గ్రా.

ఖనిజాలు   

ఇనుము - 12.86 మి.గ్రా.

విటమిన్
విటమిన్ ఇ -  1.4 గ్రా.

విటమిన్ కె -  13.6 గా.

కొవ్వులు/ కొవ్వు ఆమ్లాలు


సంతృప్త కొవ్వు ఆమ్లాలు-14.29 గ్రా.

మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు-39.7 గ్రా.

పాలీ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు-41.7 గ్రా.


నువ్వుల నూనె యొక్క ఆరోగ్య ప్రయోజనాలు 

నువ్వుల నూనె యొక్క విస్తృత ఉపయోగం ఆయుర్వేదం మరియు ఇతర సంప్రదాయ మందులలో విస్తృతంగా ఉంది, ఈ నూనె యొక్క వైద్య ప్రయోజనాలను ఆధునిక పరిశోధకులు పరిశీలించేలా వారిని ప్రేరేపించాయి. నూనెలోని వివిధ పోషకాలు మంచి సమతుల్య మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రోత్సహిస్తాయి. ఎలాగో మనం చూద్దాము.   

జుట్టుకు పోషణను ఇస్తుంది: మీ యొక్క కపాలం మరియు జుట్టు పైన పోషణ ప్రభావాన్ని నువ్వుల నూనె కలిగిఉంటుంది. ఈ న్నునెతో మర్దనా చేయడం మీ జుట్టును యువి నష్టం నుండి రక్షించడం మాత్రమే కాకుండా జుట్టు నెరయడాన్ని నివారిస్తుంది మరియు మీ వెంట్రుక మూలాలను బలపరుస్తుంది.  

చర్మ సంరక్షణ కోసం: నువ్వుల నూనె చర్మ ఇన్‌ఫెక్షన్లను నివారిస్తుంది, సూర్యుని వేడి నుండి మీ చర్మాన్ని రక్షిస్తుంది మరియు  చర్మం పొడిబారకుండా తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక యాంటిఆక్సిడంట్‌గా, నువ్వుల నూనె చర్మ వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది.

ఎముకల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది: నువ్వుల నూనె జింకు మరియు క్యాల్షియం‌లకు మంచి వనరుగా ఉంది. ఈ ఖనిజాలు రెండూ ఎముక నిర్మాణ సంరక్షణలో సహాయం చేస్తాయి మరియు బోలు ఎముకల వ్యాధిని నిరోధిస్తుంది. ఈ నూనె అనేక జీవక్రియాత్మక పదార్థాలను కూడా  కలిగిఉంది, ఇవి ఆర్థరైటిస్ విషయం‌లో కీళ్ల నొప్పిని మరియు మంటను తగ్గిస్తాయి.

నువ్వుల నూనెతో ఆయిల్ ఫుల్లింగ్: నువ్వుల నూనె సహజ యాంటిబ్యాక్టీరియల్ సమ్మేళనాలను కలిగిఉంది, ఇది ఆయిల్ ఫుల్లింగ్ కోసం మరియు దంతక్షయాన్ని నిరోధించడంలో ఒక అద్భుతమైన ఎంపికగా దీనిని చేసింది. నువ్వుల నూనెతో ఆయిల్ ఫుల్లింగ్ అన్నది నోటి కుహరం‌లో 85% శాతం బ్యాక్టీరియా సంఖ్యను తగ్గిస్తుందని కనుగొనబడింది. 
  
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: ఇది ప్రధానంగా బహుళ అసంతృప్త కొవ్వులతో కూడి ఉంటుంది కాబట్టి నువ్వుల నూనె యొక్క క్రమమైన వినియోగం శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిల్ని మెరుగుపరుస్తుందని తెలియజేయబడింది. అధిక యాంటిఆక్సిడంట్ కంటెంట్‌ను కలిగిఉండడం వల్ల, నువ్వుల నూనె ఎథెరోస్క్లెరోసిస్‌ను నిరోధిస్తుంది మరియు ఆక్సీకరణ ఒత్తిడి యొక్క దిగజారుతున్న ప్రభావాల నుండి మీ గుండె‌ను రక్షిస్తుంది.  


జుట్టు కోసం నువ్వుల నూనె

నువ్వుల నూనె వివిధ రకాల పోషకాలను కలిగిఉంటుంది, ఈ పోషకాలు మీ జుట్టుకు ఖచ్చితమైన పోషక నూనెగా దీనిని తయారుచేసాయి. అయితే, నువ్వుల నూనెలో ఉండే క్రియాశీల భాగాలు మీ జుట్టుకు ఇతర ప్రయోజనాలను కూడా సమకూరుస్తాయి. మీ జూలు కోసం నువ్వుల నూనె మర్థన ఏమి చేస్తుందో మనం పరిశీలిద్దాము.    

పొడిదనం మరియు దురదను తొలగించి, మీ వెంట్రుకలు మరియు స్కాల్ప్ తేమగా ఉండేందుకు నువ్వుల నూనె సహాయం చేస్తుంది,
నువ్వుల నూనె యొక్క యాంటిబ్యాక్టీరియల్ మరియు యాంటిఫంగల్ లక్షణాలు ఇతర పదార్థాలు మరియు ఇతర వ్యాధికారకాల నుండి స్కాల్ప్‌ ను సంరక్షించడం‌లో సహాయం చేస్తుంది. ఇది జుట్టు యొక్క సహజ రంగును నిలబెట్టుకోవడం‌లో మరియు జుట్టు మూలాలను బలపరచడం‌లో ఉపయోగకరంగా ఉంటుందని కూడా కనుగొనబడింది.  
మీ జుట్టు ఉపరితలం‌పై రక్షణ పూతను ఏర్పాటుచేయడం ద్వారా యువి కిరణాల నష్టం నుండి మీ జుట్టును నువ్వుల నూనె రక్షిస్తుంది.
మీ సహజ నల్లని వెంట్రుకలతో మీరు మీ జుట్టును అలాగే ఉంచి, జుట్టు నెరయడాన్ని నిరోధిస్తుందని కూడా తెలియజేయబడింది. 


చర్మ సం‌రక్షణ కోసం నువ్వుల నూనె

జుట్టు ప్రయోజనాల వలెనే, చర్మ సంరక్షణ కోసం కూడా నువ్వుల నూనె చాలా ఉపయోగకరమైనది. ఆరోగ్యం కోసం మరియు మీ చర్మం బాగా ఉండటం కోసం నువ్వుల నూనె యొక్క ప్రయోజనాలను మనం ఒకసారి పరిశీలిద్దాము.  

నువ్వుల నూనె యాంటిఆక్సిడం‌ట్లను సమృద్ధిగా కలిగిఉంది. నల్లని మచ్చలు మరియు ముడుతలు వంటి ముందుగా వచ్చే వృద్ధాప్య గుర్తులను నిరోధించడంలో ఇది సహాయపడుతుంది మరియు మీ చర్మం యొక్క ఆకృతిని పెంచుతుంది. 
ఇది మీ చర్మం పైన ఒక మార్దవకర ప్రభావాన్ని కలిగిఉంటుంది. అనగా ఇది మీ చర్మ కణాలకు తేమను అందిస్తుంది మరియు చర్మ పొడిబారకుండా నిరోధిస్తుంది.
నువ్వుల నూనెను చర్మం పై రాయడం వల్ల, ఇది ఒక రక్షిత పూతను చర్మం పై ఏర్పరుస్తుంది, తద్వారా సూర్యుడి వేడికి గురికావడం వల్ల కలిగే నష్టాలను నివారిస్తుంది.  
ఒక యాంటిఫంగల్ ఏజెంట్‌గా, చర్మం పైన ఏర్పడే ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల చికిత్సకు కూడా ఉపయోగిస్తారు.  
నువ్వుల నూనెను సరియైన విధంగా పూయడం, గాయానికి సంబంధించిన మంట మరియు నొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.  
మధ్య-పశ్చిమ ఇథియోపియాలో నిర్వహించిన ఒక సర్వేలో, గాయాలు పైన పూయడం కోసం అక్మెల్లా ఆకులతో కలిసిన నువ్వుల నూనెను అక్కడి స్థానిక ప్రజలు ఉపయోగిస్తున్నారని కనుగొనబడింది. పురాతన నాగరికతల్లో వైద్యం కోసం కూడా నూనెను స్వయంగా ఉపయోగించేవారు. 

గుండె ఆరోగ్యం కోసం నువ్వుల నూనె  

నువ్వుల నూనె యొక్క ప్రధాన అంశాల్లో బహుళ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఒకటి. ఈ నూనెలు చెడు కొలెస్ట్రాల్‌ను తక్కువ స్థాయిలో(ఎల్‌డి‌ఎల్) నిర్వహించేందుకు మరియు మంచి కొలెస్ట్రాల్‌ స్థాయిని (హెచ్‌డి‌ఎల్) నిర్వహించేందుకు సహాయపడతాయి, ఇది క్రమంగా ఎథెరోస్క్లెరోసిస్‌ను నిరోధిస్తుంది మరియు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.    

సంతృప్త కొవ్వులను తక్కువగా కలిగిఉంటుంది, ఇవి హానికరమైన రకాలలో ఒకటిగా పరిగణించబడ్డాయి మరియు ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి కావు.

తర్వాత, నువ్వుల నూనె యొక్క యాంటిఆక్సిడంట్ ప్రొఫైల్ మీ గుండె కండరాలపై ఆక్సీకరణ ఒత్తిడిని ఉపశమనం చేస్తుంది, అవి సరిగా పనిచేసేలా చేస్తాయి. లిపిడ్ పెరాక్సిడేషన్ తొలగించడం ద్వారా ఎథెరోస్క్లెరోసిస్ నివారణలో కూడా ఇది ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.     


ఎముకల కోసం నువ్వుల నూనె 

క్యాల్షియం మరియు జింక్‌లను నువ్వుల నూనె సమృద్ధిగా కలిగిఉంది,  ఇవి ఎముకల పెరుగుదలకు మరియు ఎముకల ఆరోగ్యం నిర్వహణకు అవసరమైన ముఖ్యమైన ఖనిజాలు. నువ్వుల నూనెను క్రమంగా తీసుకోవడం ఎముక గాయం నుండి వేగంగా కోలుకొనేలా చేస్తుంది మరియు ఎముక పెరుగుదలలో సహాయం చేస్తుంది.  

ఇది బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది మరియు కీళ్ల వశ్యత నిర్వహణలో సహాయం చేయడ‌ం‌తో పాటు ఎముకల బలహీనతను కూడా నివారిస్తుంది.   

నువ్వుల నూనె ఒక శక్తివంతమైన యాంటి-ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్. రైస్ బ్రాన్ నూనెతో పాటు నువ్వుల నూనె యొక్క యాంటి-ఆర్థరైటిస్ ప్రభావాలను పరీక్షించేందుకు నిర్వహించిన ఒక అధ్యయనం‌లో, ఆర్థరైటిస్కు సంబంధించిన నొప్పి మరియు ఇన్‌ఫ్లమేటరీ ప్రభావాలను తగ్గించడం‌లో రెండూ కూడా సమాన సమర్థత కలిగిఉన్నాయని కనుగొనబడింది.  

కాబట్టి, మీ ఆహారంలో నువ్వుల నూనెను జోడించండి మరియు బలహీన ఎముకలకు వీడ్కోలు చెప్పండి. మీరు వంట అభిమాని కాకుంటే, కేవలం కాల్చిన నువ్వుల విత్తనాల నూనె కొనండి మరియు సలాడ్లలో కొన్ని చుక్కలు వేయండి.  


పళ్ల కోసం నువ్వుల నూనె ప్రయోజనాలు 

నువ్వుల నూనె దాని యాంటిబ్యాక్టీరియల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది, ఈ లక్షణాలు దీనిని ఆయిల్ ఫుల్లింగ్‌కు ఒక ఆదర్శ ఎంపికగా చేసాయి. ఆయిల్ పుల్లింగ్ అన్నది పుక్కిలించడం అనే ప్రక్రియను పోలి ఉంటుంది, ఈ ప్రక్రియలో ఆయిల్‌ను మీ నోటిలో ఉంచుకోవాలి, దానిని ఉమ్మివేయడానికి ముందు నోటి చుట్టూ కలియత్రిప్పాలి. ఆయిల్ ఫుల్లింగ్‌లో నువ్వుల నూనె యొక్క ఉపయోగం ఫలకం స్థాయిని తగ్గిస్తుంది, తెల్లటి పళ్లు పొందేందుకు సహాయపడుతుంది, మీ పళ్లు మరియు చిగుళ్లను అనేక బ్యాక్టీరియాల నుండి రక్షిస్తుంది. లోవాలో నిర్వహించిన ఒక ప్రయోగం‌లో, విద్యార్థులు నువ్వుల నూనెతో వారి నోరును పుక్కిలించారు మరియు బ్యాక్టీరియాలో 85% శాతం తగ్గుదలను కనుగొన్నారు.    


క్యా‌న్సర్ కోసం నువ్వుల నూనె

నువ్వుల నూనెలో ఉండే కొన్ని పోషకాలు వివిధ రకాల క్యా‌న్సర్‌ను ఎదుర్కోవడం‌లో సహాయపడతాయి. ఉదాహరణకు, అధిక స్థాయి మెగ్నీషియం కొలెరెక్టాల్ క్యా‌న్సర్ అవకాశాలను తగ్గిస్తుంది, అలాగే క్యాల్షియం కంటెంట్ పెద్ద ప్రేగు క్యా‌న్సర్ నివారించేందుకు సహాయపడుతుంది. నువ్వుల నూనె సిసమోల్ అని పిలువబడే ఫినాలిక్ యాంటిఆక్సిడంట్ సమ్మేళనాన్ని కలిగిఉంటుంది. ఈ సమ్మేళనం వివిధ రకాల  క్యా‌న్సర్ను నివారించడ‌ంలో సమర్థవంతమైనదిగా చెప్పబడింది.  


రక్తహీనత కోసం నువ్వుల నూనె 

నువ్వుల నూనెలో కాపర్ సమృద్ధిగా ఉంటుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కాపర్ చాలా అవసరం. నువ్వుల నూనెలో పుష్కలమైన కాపర్ ఉనికి కారణంగా, దాని యొక్క వినియోగం శరీరానికి సరియైన రక్త సరఫరాను ఇది హామీ ఇస్తుంది. అలాగే, నువ్వుల నూనెలోని ఇనుము యొక్క ఉనికి రక్తహీనతతో పోరాడటానికి సహాయపడుతుంది.  


డయాబెటిస్ కోసం నువ్వుల నూనె 

హైపోగ్లైసేమియా మరియు అధిక రక్తపోటు తరచుగా నిర్వహించడం కష్టం మరియు డయాబెటిక్స్ ఉన్నవారికి సాధారణంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని నిర్ణయించడం కష్టంగా ఉంటుంది. ఇది రక్త చక్కెర స్పైక్‌కి కారణం కాదు. ఒక హైపోగ్లైసేమిక్‌గా (రక్తంలో గ్లూకోజ్‌ తగ్గించడం), నువ్వుల నూనె డయాబెటిక్ ప్రజలకు సరైన వంటనూనె ఎంపిక కావచ్చు. నువ్వుల నూనె మరియు నువ్వుల వెన్న శరీరం‌లో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని ఒక అధ్యయనంలో కనుగొనబడింది. అయితే, నువ్వుల వెన్నయాంటిఆక్సిడేటివ్, యాంటిహైపర్‌గ్లైసేమిక్ మరియు లిపిడ్-తగ్గించే ప్రభావాలు చూపించాయి, నువ్వుల నూనె శరీర బరువు నిర్వహణలో సహాయపడుతుంది మరియు హైపర్‌గ్లైసేమియాకు వ్యతిరేకంగా పనిచేసే లక్షణాలను కలిగిఉంటుంది.    

ఇటీవలి అధ్యయనం‌లో, డయాబెటిస్ లక్షణాలు మరియు సమస్యలు తగ్గించడం కోసం తెలుపు నువ్వుల నూనె ఉపయోగకరమైనదిగా ప్రదర్శించబడింది. 

క్లినికల్ న్యూట్రిషన్, అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక క్లినికల్ అధ్యయనం ప్రకారం, నువ్వుల నూనె‌లో ఉండే సెసామిన్, డయాబెటిక్ నిరోధక ఔషధాలతో సమ్మిళితంగా పనిచేస్తుంది మరియు దీర్ఘకాలంగా ఉండే మధుమేహ నిర్వహణలో ఉపయోగించవచ్చు.   

నువ్వుల నూనె దుష్ప్రభావాలు 

ఆస్పిరిన్, హెపారిన్ వంటి యాంటికోయాగ్ల్యులంట్లను తీసుకునే వారికి నువ్వుల నూనె వినియోగం సూచించబడలేదు. నువ్వుల నూనె రక్తం పలుచబడేందుకు దారితీస్తుంది. అందువల్ల, రెండిటినీ ఒకే సమయం‌లో తీసుకోవడం హాని కలిగించవచ్చు.   
నువ్వుల నూనెను తీసుకునే ప్రజలలో అలెర్జీలు పెరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. నువ్వుల నూనెను తీసుకోవడం ద్వారా ఒకవేళ మీరు ఏవైనా అలెర్జీ లక్షణాలు కనుబరిస్తే, వెంటనే వైద్య సహాయం తీసుకొనండి.    

ఉపసంహారం
నువ్వుల నూనె యొక్క అనేక ఆరోగ్య ప్రయోజనాల కారణంగా మార్కెట్లో లభించే ఇతర నూనెలకు నువ్వుల్ నూనె ఒక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. ఆయిల్ ఆసియాలో ప్రజాదరణ పొందినప్పటికీ, ఇది అనేక వంట, ఔషధ మరియు పారిశ్రామిక ఉపయోగాలు కలిగిఉన్నాయి, ఈ నూనె యొక్క భారీ ఉత్పత్తి పరిమితమైనది. నువ్వుల నూనె యొక్క వెలికితీత ప్రక్రియ చాలా ఖరీదైనది. నువ్వుల నూనె యొక్క ఉపయోగాల పైన పరిశోధన కూడా చాలా పరిమితంగా ఉంది. ఈ నూనె యొక్క ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు పరిశోధన గుండా పరిపూర్ణమైన అర్హత పొందుతాయి. ఈ నూనె యొక్క పూర్తి ప్రయోజనాలు సాధించేందుకు ఈ నూనెను ఏ విధంగా ఉపయోగించవచ్చునో ఆ విషయం పైన ఒక లోతైన అవగాహన పొందడం‌లో ఈ పరిశోధన సహాయం చేస్తుంది.

Health Tips

మరింత సమాచారం కోసం :-
అసిడిటీ సమస్య-పరిష్కారాలువంకాయ రుచిలోనే కాదు ఆరోగ్యానికి అందించే మేలు తెలిస్తే ఆహా అంటారు
ఆయుర్వేద ఔషధాలు కలిగినక సునాముఖి మొక్కఆముదం చెట్టు -మానవుల పాలిట అమృత కలశం
కాలిన గాయాలకు వంటింటి వైద్యంముసాంబరం తో ఆరోగ్యం
వెల్లుల్లి తేనె కలిపి తింటుంటే కలిగే లాభాలుకాపర్ (రాగి లోహం) వాడకం వలన కలిగే ప్రయోజనాలు
అద్భుత ఆరోగ్య ప్రయోజనాలకు అవకాడో పండుసోంపు వలన కలిగే లాభాలెన్నో తెలుసా?
అటుకులతో ఆరోగ్యంఅంతులేని లాభాలనిచ్చే ఆపిల్ సైడర్ వెనిగర్
పులిపిరులు పోగొట్టడానికి సులువైన మార్గాలుకలోంజి గింజలలో దాగిఉన్న ఔషధ గుణాలు
కాప్సికమ్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?రక్తదానం చేయడం ఎంతవరకు శ్రేయస్కరం
పచ్చిబఠాణీ ఎంత గొప్ప పౌష్టికాహారమో తెలుసారక్తహీనత సమస్య – పరిష్కారాలు
సొయాబీన్స్ లోని పోషకాలుఅరటిపండు –అద్భుతమైన ఫలం
బాదం పప్పు ప్రపంచంలోనే అత్యధిక పోషకాలు కలిగిన ఆహార పదార్థందృష్టి లోపాలను సవరించి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారపదార్థాలు
కొబ్బరి బొండం ఒక అమృత కలశంఅందం ఆరోగ్యాలనందించే నారింజ పండు
మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేయవల్సినబ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కనిపించే ఆశ్చర్యకర లక్షణాలు
సపోటాపండు లోని పోషకాలు మరియు ప్రయోజనాలుఆపిల్ పండు లోని విశేషాలు
అనాసపండు (pineapple) అందించే ఆరోగ్యంఅమృతఫలం ఈ సీతాఫలం
త్రిఫల చూర్ణం వందలకు పైగా రోగాలను నయం చేస్తుందిఉసిరి జ్యూస్ ఆరోగ్య సిరి
బొప్పాయి పండు ఆరోగ్యానికి అమ్మ లాంటిదిపుదీనా ఆకు - ఔషద గుణాల ఖజానా
మెంతులు వలన కలిగే మేలుసబ్జా గింజలు వల్ల కలిగే ఆరోగ్యం
చుండ్రు నివారణ కోసం ఆయుర్వేద చిట్కాలుకర్పూరం ను ఇలా కూడా ఉపయోగించవచ్చు
ఉలవలు – ఆరోగ్య విలువలుఅద్భుత ప్రయోజనాలిచ్చే కరివేపాకు
విటమిన్ లు, పోషక విలువల ఖజానా – తోటకూరద్రాక్ష పండ్లతో ఆరోగ్యం ద్రాక్ష‌ను సూప‌ర్ ఫుడ్ అని ఎందుకంటాం?
తులసి ఆరోగ్య రహస్యాలుకిడ్నీలో రాళ్లున్నాయని డాక్టర్లు చెప్పారా?
మారేడు (బిల్వం) చెట్టు ప్రాముఖ్యత మీకు తెలుసా ఆయుర్వేద ఉపయోగాలు మాన్‌సూన్ డయాబెటిస్ డైట్: బెర్రీలతో చేసిన 4 వంటలను తినడం వల్ల రక్తంలో చక్కెర తగ్గుతుంది
....... 

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd