ఉత్తమ ఔషధ ఆహారం స్టీవియా – పంచదారకు సురక్షితమైన ప్రత్యేమ్నాయం
మెండుగా ఔషధ గుణాలు కలిగి తీపినందించే మొక్క స్టీవియా. దీని పూర్తిపేరు “స్టీవియా రిబేడియానా”. ఉత్తమ ఔషధ గుణాలు, పౌష్టిక విలువలు, ఎక్కువ తీపిదనం దీని సొంతం.1500 సంవత్సరాల ముందు నుండి పరాగ్వే లో ఉండే గిరిజనులు. దీనిని తీపిగాను, మందుగాను, గాయాలకు పై పూతగా కూడా వాడుతున్నారు. ఇది పరాగ్వేలో పుట్టి ద్దక్షిణ అమెరికాలో ప్రాచుర్యం పొందింది. పరాగ్వే, జపాన్, బ్రెజిల్, కొరియా, థాయిలాండ్, చైనా లో వినియోగం చాలా ఎక్కువ.
జపనీయులు 50 ఏళ్లకు పైగా చక్కరకు బదులు స్టీవియా ని కూడా వాడుతున్నారు. జపాన్ వాళ్ళు దీనిని అధిక మొత్తం లో సాగుచేయడమే కాకుండా ఎగుమతి కూడా చేస్తున్నారు. అలాగే చైనాలో కూడా ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇది పంచదారతో పోలిస్తే 120 రేట్లు ఎక్కువ తీపిదనము కలిగి ఉంటుంది. పంచదారకు సురక్షితమైన ప్రత్యేమ్నాయంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నుండి 2008 లో సురక్షితమైన ఆహారంగా ఆమోదాన్ని కూడా పొందింది.
మన శరీరం ఎదుర్కునే చాల సమస్యలకు పంచదార కూడా ఒక ముఖ్య కారణం. పంచదారలో ఉండే కాలరీస్ ఎక్కువ. దీనిలో ఉండే గ్లూకోస్, కాలరీస్ ముక్యంగా షుగర్, రక్తపోటు, లివర్ , జీర్ణ సంబంధ,ఒబెసిటీ తదితర సమస్యలకు చాలా కారణం అవుతున్నాయి. ఇప్పటివరకు పంచదారకు సరైన ప్రత్యామ్నాయం లేకపోవడం వళ్ళ ఈ సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఈ స్టీవియా పంచదారకు సురక్షితమైన ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చును . దీనిని వాడటం వళ్ళ చాల సమస్యలకు చెక్ పెట్టవచ్చును .
ఈ స్టీవియా లిక్విడ్, పౌడర్, టాబ్లెట్స్ రూపంలో కూడా దొరుకుతున్నాయి. వీటి ఆకులు(ఎండబెట్టినవి) దొరుకుతున్నాయి. ఈ ఆకులు డికాషన్ గ చేసి ఫ్రిజ్ లో ఉంచితే 10-15 రోజులు నిల్వ ఉంటుంది. దీనిని డ్రాప్స్ ల వాడుకోవాల్సి కూడా ఉంటుంది. ఈ స్టీవియా యాంటీ వైరస్ మరియు యాంటీ బాక్టీరియల్యాం టీ ఇన్ఫ్లమెటరీ గుణాలను కలిగి ఉంటుంది.
స్టీవియా వలన కలిగే ప్రయోజనాలు:
ఇది “0” కాలరీస్ ని కలిగి ఉంటుంది.
వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుతుంది.
జాయింట్ పెయిన్స్ కి మంచి మెడిసిన్.
ఒబెసిటీ(అధిక బరువు) సమస్యను కూడా నివారిస్తుంది.
కంటి చూపు మెరుగుపడుతుంది.జుట్టు రాలటం సమస్య బాగా తగ్గుతుంది.
పళ్ళు పుచ్చిపోవు, నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తుంది.
శ్వాసకోశ వ్యాధులను బాగా అరికడుతుంది.
బ్లడ్ ప్రెజర్, షుగర్, కాన్సర్ లాంటి వ్యాధులకు దీని డికాషన్ పరగడుపున తీసుకోవడం వళ్ళ మంచి ఫలితం కూడా ఉంటుంది.
Health Tips
మరింత సమాచారం కోసం :-
.......
Post a Comment