వేప నూనె ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు

వేప నూనె ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు 

వేప నూనెను వేప చెట్టు యొక్క పండ్లు మరియు విత్తనాల నుండి పొందవచ్చును . విస్తృత శ్రేణి సౌందర్య ఉత్పత్తలు మరియు ఔషధాలలో వేప నూనె ఒక ముఖ్యమైన అంశం. ఇది భారత ఉపఖండానికి చెందిన ఒక సతత హరిత వృక్షం (ఎవర్ గ్రీన్). ఎండలో ఎండబెట్టిన లేదా కృత్రిమంగా ఎండబెట్టిన వేప గింజల నుండి నూనె  తీయబడుతుంది. దీనిని సేకరించిన తర్వాత, మలినాలను తొలగించడానికి వేప నూనె ఫిల్టర్ కూడా చేయబడుతుంది (వడకట్టబడుతుంది). ఈ నూనె యొక్క మిశ్రమము మరియు నాణ్యత అనేవి సాధారణంగా సంగ్రహణ (ఎక్సక్ట్రేషన్) పద్ధతి మరియు ఉపయోగించిన ప్రక్రియలపై ఆధారపడి కూడా ఉంటాయి.

వేప నూనెకు బలమైన మరియు ఘాటైన వాసన కూడా  ఉంటుంది. ఇది సాధారణంగా పసుపు లేదా గోధుమ రంగులో ఉంటుంది. భారతదేశంలో వేప చెట్లకు ప్రతి సంవత్సరం 3.5 మిలియన్ టన్నుల విత్తనాలను కాస్తాయని  మరియు దానితో సంవత్సరానికి 700,000 టన్నుల నూనెను ఉత్పత్తి చేయవచ్చని ఒక అంచనా. కూడా 

వేప నూనెను ప్రధానంగా సేంద్రీయ వ్యవసాయం, ఔషధం మరియు సౌందర్య ఉత్పత్తలలో కూడా ఉపయోగిస్తారు. ఈ నూనెను ఉపయోగించి వేప సబ్బులు, వేప షాంపూలు, నూనెలు, బాడీ లోషన్లు, మాయిశ్చరైజర్లు వంటి చర్మ సంరక్షణ ఉత్పత్తులను  కూడా  తయారు చేస్తారు. దీనికి యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయని కూడా అంటారు.  అందువల్ల  క్రిమినాశకారులను (యాంటీసెప్టిక్) తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు.

సేంద్రీయ రైతులు పురుగులు మరియు తెగుళ్ళ వల్ల పంట దెబ్బతినకుండా ఉండటానికి వేప నూనెను పురుగుమందుగా కూడా  ఉపయోగిస్తారు. వేప నూనె యొక్క ఈ లక్షణం దోమలు, చీమలు, బొద్దింకలు, నల్లులు వంటి ఇళ్లలో ఉండే పురుగులను తొలిగించడానికి  కూడా ఉపయోగపడుతుంది.

వేప నూనె ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు

వేప  ప్రాథమిక వాస్తవాలు:


 • శాస్త్రీయ నామం: ఆజాడిర్కటా ఇండికా (Azadirachta indica)
 • కుటుంబం: మెలియాసియే (Meliaceae); మహోగని కుటుంబం
 • సాధారణ నామం: వేప, భారతీయ లిలక్
 • సంస్కృత నామం: నింబ్, అరిస్టా
 • ఉపయోగించే భాగాలు: ఆకులు, విత్తనాలు మరియు పండ్లు
 • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: వేప చెట్టు భారతదేశం మరియు బర్మాకు చెందినది. ప్రస్తుతం, ఇది ఆసియా మరియు ఆఫ్రికాలోని అనేక ప్రాంతాలలో మరియు పశ్చిమ అర్ధగోళంలో (hemisphere) ని ఉష్ణమండల ప్రాంతాలలో కూడా  ఉంటుంది. ఇది భారతదేశంలోని ఉత్తర శీతల రాష్ట్రాలతో సహా దాదాపు అన్ని ప్రాంతాలలో పెరుగుతుంది. అయితే, వేప చెట్ల యొక్క అధిక సంఖ్య వాయువ్య భారతదేశంలో మరియు ఉత్తర ప్రదేశ్‌లో ఉంటుంది. భారతదేశంలో, వేపను సాధారణంగా రహదారి పక్కన మొక్కగా పెంచుతారు.  ఎందుకంటే ఇది ఏడాది పొడవునా ఆకులను కలిగి ఉంటుంది. బర్మా, ఇండోనేషియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, ఘనా, నైజీరియా, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలలో కూడా వేప చెట్లు ఉంటాయి.


వేప నూనె పోషక వాస్తవాలు 

వేప నూనె ఆరోగ్య ప్రయోజనాలు 

 • వేప విత్తనాల నూనెకు యాంటీఇన్ఫలమేటరీ లక్షణాలు ఉన్నాయి 
 • నోటి ఆరోగ్యానికి వేప నూనె 
 • చర్మ సంరక్షణ కోసం వేప నూనె
 • వేప నూనెకు యాంటీ బాక్టీరియల్ చర్యలు ఉంటాయి 
 • నెత్తి (స్కాల్ప్) పై కణితి గాయాలకు వేప నూనె 
 • తలలో పేనుల నియంత్రణకు వేప నూనె 
 • వేప నూనె యొక్క దోమ వికర్షక ప్రయోజనాలు 
 • క్యాన్సర్‌కు వేప నూనె ప్రయోజనాలు 

వేప నూనె దుష్ప్రభావాలు 

ఉపసంహారంవేప నూనె పోషక వాస్తవాలు 

వేప నూనెకు అనేక రకాల  ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఇది చేదుగా ఉంటుంది. తినదగినది కాదు. చేదుదనం తొలగించిన వేప నూనె కూడా ఇతర తినదగిన (ఎడిబుల్) నూనెల మాదిరిగానే పోషక విలువలు మరియు రసాయన మిశ్రమాన్ని కలిగి ఉంటుందని ఇటీవలి పరిశోధనలు కూడా సూచిస్తున్నాయి. వేప నూనెలో 50% ఒలిక్ యాసిడ్ మరియు 15% లినోలెయిక్ యాసిడ్ ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.


వేప నూనె ఆరోగ్య ప్రయోజనాలు 

యునాని, ఆయుర్వేద మరియు హోమియోపతి ఔషధాలలో వేప నూనెను చాలా సంవత్సరాల నుండి ఉపయోగిస్తున్నారు. ఆధునిక ఔషధం విధానంలో కూడా ఈ నూనెను అనేక రోగాల యొక్క చికిత్స కోసం ఉపయోగిస్తున్నారు. వేప నుండి అనేక ప్రయోజనాలను సేకరించేందుకు విస్తృతమైన పరిశోధనలు కూడా జరుగుతున్నాయి.

యాంటీఇన్ఫలమేటరీ చర్యలు: చాలా  యాంటీఇన్ఫలమేటరీ మందులు దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి.  అందువల్ల దుష్ప్రభావాలు లేని యాంటీఇన్ఫలమేటరీ ఏజెంట్ అవసరం. వేప నూనె ఎటువంటి దుష్ప్రభావాలు కలిగించని మంచి యాంటీఇన్ఫలమేటరీ ఏజెంట్ మరియు నొప్పిని కూడా తగ్గిస్తుందని పరిశోధనలు కూడా తెలుపుతున్నాయి. 

నోటి ఆరోగ్యం కోసం: వేప నూనె దంతక్షయాలు మరియు ప్లేక్స్ (Plaque) ఏర్పడడం వంటి దంత సమస్యలను కూడా తగ్గిస్తుంది. మరియు ఇది వాణిజ్యపరమైన నోటిసంరక్షణ ఏజెంట్ల మాదిరిగా దుష్ప్రభావాలు కూడా కలిగించదు.

చర్మానికి: వేపనూనెకు శక్తివంతమైన చర్మ సంభందిత చర్యలు ఉన్నాయని అధ్యయనాలు కూడా సూచిస్తున్నాయి. వేపనూనెతో తయారు చేసిన లోషన్లు రింగ్ వార్మ్ మరియు గజ్జి వంటి సమస్యల నుండి చర్మాన్ని రక్షిస్తాయి.

యాంటీ- బాక్టీరియాల్ చర్యలు: వేపనూనె కొన్ని రకాల బాక్టీరియాకు వ్యతిరేకంగా శక్తివంతమైన చర్యలు చూపినట్లు పరిశోధనలు కూడా తెలిపాయి. దీనిలో ఉండే నింబిడియోల్, నింబిడిన్ మరియు డైఇథైల్ సల్ఫైడ్ల వంటి ఫైటోకెమికల్స్ వేపనూనె యొక్క యాంటీమైక్రోబయాల్ లక్షణాలకు బాధ్యత వహిస్తాయని కూడా తెలుస్తుంది.

గర్భనిరోధకం: వేపనూనె మంచి గర్భనిరోధక సాధనంగా పనిచేస్తుందని పరిశోధనలు కూడా తెలిపాయి. వేపనూనెను యోని చుట్టూ పూసినప్పుడు అది వీర్య  కణాలను ఇమ్మొబిలైజ్ చేయడం ద్వారా అండం దగ్గరకి వీర్యకణాలు చేరకుండా చేస్తుంది.

దోమలవికర్షకంగా: వేపనూనె దోమల వికర్షకంగా (రిపెలెంట్) కూడా పనిచేస్తుంది. దీనికి ప్రభావంతమైన పురుగుమందు చర్యలు ఉన్నాయి .  ఒక సహజ పరదార్థం కాబట్టి ఇతర పురుగుమందుల వాలే దుష్ప్రభావాలు  కలిగించదు.


వేప విత్తనాల నూనెకు యాంటీఇన్ఫలమేటరీ లక్షణాలు ఉన్నాయి 

వాపు (ఇన్ఫలమేషన్) అనేది ఒక పరిస్థితి.ఇది ప్రభావిత ప్రాంతాలలో నొప్పి, ఎరుపుదనం మరియు మంట సంచలనం కలిగిస్తుంది. చాలా యాంటీఇన్ఫలమేటరీ మందులు దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. అందువల్ల, వాపు వ్యతిరేక లక్షణాలు కలిగిన సహజ మరియు మూలికా ప్రత్యామ్నాయాలను కనుగొనడానికి చాలా పరిశోధనలు కూడా  జరుగుతున్నాయి. ప్రస్తుత పరిశోధనలు వేప విత్తనాల నూనెలో యాంటీఇన్ఫలమేటరీ మరియు అనాల్జిక్ (నొప్పిని తగ్గించే) లక్షణాలు ఉన్నాయని సూచిస్తున్నాయి. జంతువుల నమూనాలతో చేసిన అధ్యయనంలో, వేపనూనెలో ఉండే   ట్రైటెర్పెన్స్, గాల్లిక్ ఆసిడ్, నింబిడిన్, ఫ్లేవనాయిడ్లు,కెటకిన్ వంటి ఫైటోకెమికల్స్ వల్ల దానికి వాపు నిరోధక లక్షణాలు ఉన్నాయని కనుగొనబడింది.. వేప నూనెలో ఉండే కొన్ని పాలిసాకరైడ్లు (polysaccharides) కూడా వాపు నిరోధక శక్తిని కలిగి ఉన్నట్లు కనుగొనబడింది.


నోటి ఆరోగ్యానికి వేప నూనె 

అన్ని వయసుల వారిలో నోటి సంరక్షణ అనేది ఒక ప్రధాన విషయం. దంత పరిశుభ్రత లేకపోవడం ఫలకాల (plaques) అభివృద్ధికి కూడా  దారితీస్తుంది. ఫలకం అంటే దంతాలపై మృదువుగా, జిగురుగా ఉండే పొరను సూచిస్తుంది.  అది బ్యాక్టీరియా అభివృధికి కూడా కారణమవుతుంది. చికిత్స చేయకుండా వదిలేస్తే, ఇది దంత క్షయం మరియు చిగుళ్ల సమస్యలు వంటి నోటి వ్యాధులకు కూడా కారణమవుతుంది. పురాతన కాలంలో, నోటి వ్యాధులను నివారించడానికి ప్రజలు వేప పుల్లలను నమిలేవారు, ఎందుకంటే ఇది లాలాజల స్రావాన్ని మెరుగుపరుస్తుంది మరియు ఫలకాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

వాణిజ్యపరంగా దొరికే నోటి సంరక్షణ ఏజెంట్లలో చాలావాటిలో రసాయనాలు ఉన్నాయని, ఇవి ఎక్కువ కాలం ఉపయోగిస్తే దుష్ప్రభావాలను  కలిగిస్తాయని వాటి పై చేసిన ఒక పరిశోధన తెలిపింది. మరోవైపు, వేప నూనె ఎటువంటి దుష్ప్రభావాలను కలిగించకుండా దంతాల పై ఫలకం పెరగడాన్ని నిరోధించిందని పరిశోధన వెల్లడించింది.


చర్మ సంరక్షణ కోసం వేప నూనె 

చర్మం శరీరంలో అతి పెద్ద మరియు అతి ముఖ్యమైన అవయవం మరియు ఇది బ్యాక్టీరియా మరియు వైరస్లు శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధించడం మరియు హానికరమైన యువి (UV) కిరణాల నుండి శరీరాన్ని రక్షించడం వంటి వివిధ చర్యలకు బాధ్యత కూడా వహిస్తుంది. అయినప్పటికీ, ఇది చాలా అరక్షితమైన అవయవం ఎందుకంటే ఇది బయటి వాతావరణానికి నేరుగా బహిర్గతమవుతుంది. వేప నూనెలో చర్మసంబంధమైన ప్రభావాలు ఉన్నాయని పరిశోధనలు కూడా  సూచిస్తున్నాయి.  ఇవి ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చర్మాన్ని కాపాడుతాయి. వేప నూనెతో తయారు చేయబడిన లోషన్లు చర్మాన్ని రింగ్ వార్మ్ మరియు గజ్జి వంటి చర్మ వ్యాధుల నుండి రక్షించడంలో బాగా  సహాయపడతాయి.

వేప నూనెలో నింబిడియోల్, నింబిడిన్ మరియు నింబిన్ ఉన్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి, ఇవి మానవుల మరియు జంతువుల చర్మం పై ఫంగస్ పెరుగుదలను నివారించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. వేప నూనె మొటిమలను నివారించగలదని మరియు చర్మం యొక్క ఎలాస్టిసిటీ మెరుగుపరుస్తుందని మరొక అధ్యయనం తెలిపింది.


వేప నూనెకు యాంటీ బాక్టీరియల్ చర్యలు ఉంటాయి 

ప్రపంచంలో 40 మిలియన్లకు పైగా బ్యాక్టీరియా ఉన్నాయి.  ఇవి మానవులలో వివిధ వ్యాధులను కలిగిస్తాయి. ఈ బ్యాక్టీరియాలలో రక్తంలో రుగ్మతలు, న్యుమోనియా, ఎముక మరియు జాయింట్ ఇన్ఫెక్షన్లు వ్యాధులు కలిగించే స్టెఫైలోకాకస్ ఆరియస్ (Staphylococcus aureus) మరియు టైఫాయిడ్ మరియు ఫుడ్ పాయిజనింగ్ వంటి వ్యాధులకు కారణమయ్యే సాల్మొనెల్లా టైఫోసా (Salmonella typhosa) వంటివి ఉంటాయి. ప్రయోగశాల పరీక్షలలో, ఈ రెండు బ్యాక్టీరియాల యొక్క పెరుగుదలను వేప నూనె అణిచివేస్తుందని కూడా కనుగొనబడింది. అయితే, ఎస్చెరిషియా కోలి (Escherichia coli) మరియు ప్రోటీయస్ మోర్గాసి (Proteus morgasi) వంటి వ్యాధికారక బాక్టీరియాపై వేప నూనె పనిచేయలేదని కనుగొనబడింది.

వేపలో ఉండే నింబిడియోల్, నింబిడిన్ మరియు డైఇథైల్ సల్ఫైడ్ల వంటి ఫైటోకెమికల్స్ యాంటీమైక్రోబయాల్ లక్షణాలకు భాద్యత వహిస్తాయని మరొక పరిశోధన వెల్లడించింది.


గర్భనియంత్రణ కోసం వేప నూనె 

గర్భనిరోధకాలు (Contraceptives) అవాంఛిత గర్భాలను నివారించడానికి ఒక ప్రభావవంతమైన మార్గం. కానీ చాలా దేశాలలో గర్భనిరోధక పద్ధతుల లభ్యత మరియు వ్యయం గర్భనిరోధక సాధనాల వాడకాన్ని ప్రజలు ఉపయోగించకుండా చేస్తున్నాయి, తద్వారా అది అవాంఛిత గర్భాలకు మరియు అసురక్షిత గర్భస్రావ పద్ధతులకు  కూడా దారితీస్తుంది. వేప నూనె సమర్థవంతమైన గర్భనిరోధక సాధనం అని పరిశోధన సూచించింది. యోనిలో వేప నూనెను రాయడం/పూయడం వల్ల అది వీర్యకణాలను పూర్తిగా  కదలకుండా (ఇమ్మొబిలైజ్) చేస్తుందని, తద్వారా వాటిని అండం వరకు చేరకుండా నిరోధిస్తుందని ఒక ప్రిక్లినికల్ అధ్యయనం తెలిపింది. అలాగే వేప నూనె ఎటువంటి దుష్ప్రభావాలను చూపించలేదని కూడా అధ్యయనం సూచించింది. అందువల్ల వేపనూనెను మహిళల సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని ప్రభావితం చేయకుండా, చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న మరియు సులభంగా లభించే ఒక గర్భనిరోధకం అని చెప్పవచ్చు.


నెత్తి (స్కాల్ప్) పై కణితి గాయాలకు వేప నూనె 

కొన్ని రకాల చర్మ క్యాన్సర్‌లకు శస్త్రచికిత్స చేసి ప్రభావిత ప్రాంతాన్ని తొలగించడం ద్వారా చికిత్స చేస్తారు. దీనిని సాధారణంగా స్కిన్ ఎక్సిషన్ (skin excision) అని కూడా అంటారు. తరచుగా చర్మం యొక్క ఈ తొలగింపు బహిరంగ గాయాలను వదిలివేస్తుంది, ఇది నయం కావడానికి సమయం పడుతుంది మరియు ఇది మొత్తం రికవరీ ప్రక్రియను కూడా ఆలస్యం చేస్తుంది. ముఖ్యంగా నెత్తిమీద జరిపే శస్త్రచికిత్సల విషయంలో ఈ పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. అందువల్ల వేగంగా నయం కావడానికి ఒక మార్గాన్ని కనుగొనడం చాలా అవసరం. అలాంటి ఒక ప్రయత్నంలో, స్కాల్ప్ ట్యూమర్ సర్జరీ నుండి కోలుకుంటున్న 9 మంది రోగులపై క్లినికల్ ట్రయల్ జరిగింది. ఈ రోగుల గాయాలకు ఒక 4 వారాల సమయం పాటు వేప నూనె కలిగిన మిశ్రమంతో చికిత్స అందించారు.. ఈ గాయాలను నయం చేయడంలో వేప నూనె చాలా సరళమైనది, సురక్షితమైనది మరియు ప్రభావవంతమైనదని పరిశోధనా ఫలితాలు కూడా సూచించాయి.


తలలో పేనుల నియంత్రణకు వేప నూనె 

పేలు పరాన్నజీవి కీటకాలు, ఇవి రక్తాన్ని పీల్చుతూ నెత్తిమీద మరియు చర్మంపై జీవిస్తాయి. ఇది సాధారణంగా పాఠశాలకు వెళ్ళే పిల్లలలో, ముఖ్యంగా బాలికలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఒక వ్యక్తి నుండి మరొకరికి సులభంగా వ్యాపిస్తాయి. తలలో పేనులు ఉండడం అనేది సాధారణంగా దురదతో ముడిపడి కూడా ఉంటుంది మరియు వీటిని వదిలించుకోవటం చాలా కష్టమైన పని. పేనులకు వ్యతిరేకంగా వేప విత్తన నూనె ప్రభావవంతంగా కూడా పనిచేస్తుందని పరిశోధనలో తేలింది. వేప నూనె కలిగిన షాంపూలను ఉపయోగించడం వలన మొదటి ఉపయోగంలోనే పేల సమస్య పూర్తిగా తగ్గినట్లు ఈ అధ్యయనం ద్వారా సూచించింది.


వేప నూనె యొక్క దోమ వికర్షక ప్రయోజనాలు 

దోమలు చాలా భయం కలిగించే కీటకాలు ఎందుకంటే అవి చర్మపు దద్దుర్లు మరియు దురదలకు మాత్రమే కారణం కాక వివిధ రకాల వ్యాధులను కూడా వ్యాప్తి చేస్తాయి. దోమల వల్ల కలిగే అత్యంత సాధారణ మరియు ప్రాణాంతక వ్యాధులు డెంగ్యూ, మలేరియా మరియు చికున్‌గున్యా. వేప విత్తన నూనె మలేరియా కలిగించే దోమలపై ప్రాణాంతకమైన ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

చాలా దోమల వికర్షకాలలో (రెప్పెలెంట్స్) ప్రధాన పదార్ధమైన ఎన్, ఎన్- డైఇథైల్ -3- మిథైల్ బెంజామైడ్ (DEET, N, N-diethyl-3- methylbenzamide) వలన అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. దీనిని యొక్క సాధారణ దుష్ప్రభావాలు చర్మపు దద్దుర్లు మరియు చికాకు. మరోవైపు, వేప నూనె, సహజ పురుగుమందుగా పనిచేస్తుందని మరియు అలాంటి దుష్ప్రభావాలేవి కలిగించదని అధ్యయనాలు చెబుతున్నాయి.


క్యాన్సర్‌కు వేప నూనె ప్రయోజనాలు 

క్యాన్సర్ అనేది శరీర కణాల అసాధారణ పెరుగుదల. చర్మ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్లు కూడా ఉన్నాయి. ప్రస్తుత చికిత్సా విధానాలలో కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ మరియు సర్జరీలు ఉన్నాయి. ఈ చికిత్సలు తరచుగా జుట్టు రాలిపోవడం, అలసట, చర్మం పొడిబారడం మరియు బొబ్బలు ఏర్పడడం వంటి దుష్ప్రభావాలను కూడా కలిగిస్తాయి. రేడియేషన్ మరియు కెమోథెరపీ సంయుక్త విధానాలు తరచుగా చర్మవాపు (డెర్మటైటిస్)తో ముడిపడి ఉంటాయి. ఇటువంటి చికిత్సలలో చర్మవాపును తగ్గించడానికి వేప నూనె ఉపయోగపడుతుందని క్లినికల్ అధ్యయనాలు కనుగొన్నాయి. అదనంగా, వేప నూనె రొమ్ము క్యాన్సర్ కణాలలో అపోప్టోసిస్ (సెల్ డెత్) ను ప్రేరేపిస్తుందని మరియు రొమ్ము క్యాన్సర్ వ్యాప్తిని నిరోధిస్తుందని కూడా  కనుగొనబడింది.


వేప నూనె దుష్ప్రభావాలు 

వేప నూనెను బాహ్యంగా ఉపయోగించడానికి సురక్షితం అయినప్పటికీ, వేప నూనెను నోటి ద్వారా తీసుకోవడం మంచిది కాదు ఎందుకంటే ఇది విషపూరితమైనది. టాక్సికాలజికల్ అధ్యయనాలు వేప నూనె మానవుల శారీరక మరియు జీవక్రియ ప్రక్రియలను ప్రభావితం చేస్తుందని సూచిస్తున్నాయి. మానవులలో, వేప నూనె వినియోగం అజీర్ణానికి  కూడా కారణమవుతుందని చెప్తారు, ఇది వాంతులు, మగత, శ్వాసకోశ సమస్య మరియు మూర్ఛ వంటి సమస్యలకు కారణమవుతుంది. వేప నూనె కళ్ళు మరియు కొంతమందిలో చర్మపు చికాకును కూడా  కలిగిస్తుంది.


ఉపసంహారం 
ప్రాచీన ఔషధం విధానం వివిధ వ్యాధుల చికిత్సకు వేప నూనెను ఉపయోగిస్తోంది. వేప నూనె కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడంలో బాగా సహాయపడుతుంది, యాంటీమైక్రోబయాల్ లక్షణాలను కలిగి ఉంటుంది, సమర్థవంతమైన గర్భనిరోధకంగా మరియు దోమ వికర్షకంగా ఉపయోగపడుతుంది. చేదుదనం తొలగించిన వేప నూనెను ఇతర తినదగిన నూనెలకు ప్రత్యామ్నాయంగా  ఉపయోగించడం పై పరిశోధనలు జరుగుతున్నాయి.

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇక్కడ చూడండి

రావి ఆకు కషాయం ఉపయోగాలు
ఊదలు యొక్క ఉపయోగాలు
అండు కొర్రలు యొక్క ఉపయోగాలు
శతావరి ప్రయోజనాలు, ఉపయోగాలు- దుష్ప్రభావాలు
చేప నూనె వలన కలిగే ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
సామలు యొక్క ఉపయోగాలు
అరికెలు యొక్క ఉపయోగాలు
కొబ్బరి బొండం ఒక అమృత కలశం
కరక్కాయ యొక్క పూర్తి వివరాలు
ఎండిన పండ్లు యొక్క పూర్తి వివరాలు
ద్రాక్షపళ్ళ ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
అంజీరము యొక్క ఆరోగ్య ఉపయోగములు దుష్ప్రభావాలు
మెంతులు వలన కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు
మజ్జిగ వలన కలిగే ఉపయోగాలు
రోగనిరోధక శక్తిని పెంచేదెలా ఆహారాలు -చిట్కాలు
రక్తాన్ని శుద్ధపరచుకోవడనికి గృహ చిట్కాలు
స్టార్ ఫ్రూట్ ఉపయోగాలు ప్రమాదాలు - దుష్ప్రభావాలు
చిలగడదుంప వలన కలిగే ఉపయోగాలు
సబ్జా గింజలు వల్ల కలిగే ఆరోగ్యం
పప్పులతో జబ్బులు దూరం 
గులాబీ పువ్వు వలన కలిగే ఉపయోగాలు
గురివింద గింజ వలన కలిగే ఉపయోగాలు
తాటి బెల్లం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
ఉల‌వ‌లు వలన కలిగే ఉపయోగాలు
వేగంగా బరువు తగ్గించే పానీయాలు
వెల్లుల్లి ప్రయోజనాలు ఉపయోగాలు -దుష్ప్రభావాలు
ఆరోగ్యానిచ్చే పండ్లు
పొగాకు వలన ఉపయోగాలు దుష్ప్రభావాలు
సీతాఫలం వలన కలిగే ఉపయోగాలు దుష్ప్రభావాలు
సోంపు (ఫెన్నెల్ విత్తనాలు) ప్రయోజనాలు దుష్ప్రభావాలు
టమాటా ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
శంఖపుష్పి ప్రయోజనాలు మోతాదు - దుష్ప్రభావాలు
అర్జున చెట్టు బెరడు ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
ఉత్తరేణి వలన కలిగే ఉపయోగాలు
కానుగ చెట్టు వలన కలిగే ఉపయోగములు
జీర్ణశక్తిని పెంచుకునేదెలా ఆహారాలు -చిట్కాలు
లావణ్యానికి సుగంధ తైలం
సంతులిత ఆహారం యొక్క చార్ట్, ప్రాముఖ్యత ప్రయోజనాలు
అనులోమ విలోమ ప్రాణాయామ యొక్క ప్రక్రియ దశలు 
పసుపు యొక్క ప్రయోజనాలు ఉపయోగాలు  దుష్ప్రభావాలు
 నల్ల జిలకర ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
ముఖానికి, జుట్టుకి మరియు చర్మానికి ముల్తానీ మట్టి  ప్రయోజనాలు
మొక్కజొన్న వలన కలిగే ఉపయోగాలు
లీచీ పండు ఎంతవరకు ఆరోగ్యకరం
అరటి పండు ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
ఆముదంను జుట్టు పెరగడానికి ఎలా ఉపయోగించాలి
కాల్షియం ఆహారాలు వనరులు ప్రయోజనాలు దుష్ప్రభావాలు
కార్బోహైడ్రేట్లు ఆహారాలు వనరులు ప్రయోజనాలు దుష్ప్రభావాలు
ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
అల్ఫాల్ఫా ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
ప్రోటీన్ ఆహారాలు ప్రయోజనాలు ఉపయోగాలు దుష్ప్రభావాలు
ఆపిల్ ప్రయోజనాలు, కేలరీలు పోషక విలువలు, దుష్ప్రభావాలు  
పిస్తా పప్పు ప్రయోజనాలు, ఉపయోగాలు దుష్ప్రభావాలు
సగ్గుబియ్యం వలన కలిగే ప్రయోజనాలు  దుష్ప్రభావాలు
గోధుమ గడ్డి వలన కలిగే ఉపయోగాలు
సోయాబీన్ వలన కలిగే ప్రయోజనాలు  దుష్ప్రభావాలు
జిలకర జీలకర్ర విత్తనాల ప్రయోజనాలు   దుష్ప్రయోజనాలు

0/Post a Comment/Comments

Previous Post Next Post