అంజీర్ పండు యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

అంజీర్ పండు యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు



అంజీర /మేడిపండు /అత్తిపండు :- అంజీర అందరికి డ్రై ఫ్రూట్ గానే తెలుసు ఈ అంజీర పండును మేడిపండు, అత్తిపండు, Indian Fig అని కూడా అంటారు.



ఈ మేడిచెట్టుకు ఆధ్యాత్మికంగానే కాదు ఆయుర్వేధంలో కూడా చాల ప్రాముఖ్యత ఉంది. మేడి పండ్లను కాయలను, ఆకులను, బెరడును వేరును ఇలా అన్నింటిని ఆయుర్వేధంలలో ఎక్కువగా వాడుతారు. అంజీర పండ్లు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇవి పండు రూపంలో ఎక్కువ కాలం నిల్వ ఉండవు. అందువల్ల వీటిని డ్రై ఫ్రూట్ గా ఎక్కువగా వాడుతారు. మేడిచెట్టును క్షీరవృక్షం అని అంటారు. పాలు, పాల ఉత్పత్తులు తీసుకొని వారు అంజీర పండ్లను తీసుకోవటం మంచిది.

పోషకాలు :-

ఇందులో విటమిన్ ఏ, బి, బి 12, సి ఉంటాయి. వీటిలో కొవ్వు పిండి పదార్ధాలు కాలిష్యం, ఐరన్, పొటాషియం, ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఒమెగా 3 ఫ్యాటిఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఇంకా సెల్యూలోజ్ కూడా లభిస్తుంది.

అంజీర్ పండు యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు


లాభాలు :-

రక్తహీనతతో బాధపడే వారికీ రోజు ఈ అంజీర పండ్లను (పచ్చివి లేదా ఎండినవి ) 3 లేదా 4 తీసుకోవటం వల్ల రక్తహీనత తగ్గి హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. ప్లేట్లెట్స్ తగ్గిన వారికీ కూడా ఇది చాల మంచిది .
కఫం, పైత్యంను తగ్గిస్తుంది. శరీరంలో వేడిని తగ్గించి చలువ చేస్తుంది. మొలలు ఉన్నవారు రోజు తీసుకుంటే ఉపశమనం కలిగిస్తుంది .
పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల గుండెకి బలాన్ని చేకూరుస్తుంది. బిపిని కంట్రోల్ లో ఉంచుతుంది. శరీర మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది.
లైంగిక సామర్థ్యం రెట్టింపు చేస్తుంది. సంతానం లేని సమస్యలను దూరం చేస్తుంది. స్త్రీలు, పురుషులలో ఇన్ఫెర్టిలిటీ సమస్య కూడా తగ్గిస్తుంది. వీర్యపుష్టి కలుగుతుంది. గర్భాశయ వ్యాధులు తొలగిపోతాయి.
నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. 
మలబద్దక సమస్యను నివారిస్తుంది. 
చిగుళ్ళవాపు నోటి అల్సర్ ను తగ్గిస్తుంది. అధిక బరువు సమస్యను అరికడుతుంది. ఎందుకంటే దీనిలో Pectin ఉంటుంది.
ఇన్సులిన్ స్థాయిలను క్రమబద్దీకరించి షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ ఉంచుతుంది.
శరీరంలోని టాక్సిన్స్ బయటకి పంపిస్తాయి. 
చెడు కొలెస్టాల్ ని తగ్గించి, మించి కొలెస్టాల్ ని పెంచుతుంది. రొమ్ము కాన్సర్ ప్రేగు కాన్సర్ ను తగ్గిస్తుంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd