ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు మనందరికీ తెల్సినట్లుగానే జీవించడానికి నీరు చాలా అగత్యం. శిశువుల శరీరంలో 75% నీరు ఉంటుంది, అదే పెద్దలలో అయితే 55% నీరు ఉంటుంది. అయినప్పటికీ, మన శరీరం స్పష్టంగా నీటితో సంయోగం చెందలేదు. కాబట్టి, శరీర అవసరాలను నిర్వహించడానికి తగినంత నీరు మనకు చాలా అవసరం. మనం సాదా నీరు, వెచ్చని నీరు, నిమ్మరసంతో కూడిన నీరు లేదా నీటిని అధికంగా కల్గిఉన్న పండ్లు మరియు కూరగాయల్ని తినడం చేయవచ్చు. పేర్కొన్నవి కాకుండా, మనం తినే దాదాపు అన్ని ఆహారాలలో ఎంతో కొంత మొత్తంలో నీరు ఉండనే ఉంటుంది.

కానీ, ప్రతిరోజూ తగినంత నీరు త్రాగకుండా ఉండగలమని అర్థం కాదు. నీరు తాగడానికి రోజులో ఉత్తమ సమయం ఏదో తెలుసా?

నిపుణులు చెప్పేదేమంటే ప్రతి రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో (పరగడుపున) రెండు గ్లాసుల నీటిని తాగడం మంచిది అని. అయినప్పటికీ, ఇది వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటుంది. వయస్సు, లింగం మరియు శారీరక శ్రమ స్థాయిల ఆధారంగా, మనం తాగే నీటి పరిమాణం అవసరం ఉంటుంది, అంటే ఒకరు ఎక్కువగా నీరు తాగొచ్చు మరొకరు  తక్కువ మొత్తం నీరు తాగొచ్చు, అంతే తేడా.

నీరు మన శరీరానికి ఏమి చేస్తుంది?

ఉదయాన్నే మనం తాగే నీళ్లు శరీరంలోని విషాన్ని తొలగిస్తుంది, జీర్ణక్రియలో సహాయం చేస్తుంది, బరువు కోల్పోవడంలో సహాయపడుతుంది అనేవి నీళ్ల తాగడంవల్ల ఉన్న ప్రయోజనాల జాబితాలో కొన్ని. ఉదయం నీటిసేవనంవల్ల కలిగే ఇతర ముఖ్యమైన ప్రయోజనాల గురించి ఈ వ్యాసంలో చర్చించడం జరిగింది.

ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు


ఉదయాన్నే నీళ్లు తాగడంవల్ల ప్రయోజనాలు 

 • బరువు కోల్పోయేందుకు ఉదయమే నీళ్లు తాగడం 
 • ఉదయం మంచి శ్వాస కోసం ఉదయాన్నే నీళ్లు తాగడం 
 • మైగ్రెయిన్ మరియు తలనొప్పికి ఉదయాన్నే నీటిసేవనం 
 • మంచి ఏకాగ్రతకు ఉదయమే నీటి సేవనం 
 • మెరుగైన జీర్ణక్రియకు ఉదయమే నీరు తాగడం 
 • ఉదయం కాఫీ బదులుగా వెచ్చని నీటి సేవనం 
 • సాధారణ రక్త చక్కెర స్థాయి కోసం ఉదయమే వేన్నీళ్ళ సేవనం 
 • మెరుగైన రోగనిరోధకత కోసం ఉదయమే తాగునీటి సేవనం 
 • సర్కెడియన్ లయలను నియంత్రించడానికి పరగడుపున్నే నీరు తాగడం 

ఉపసంహారంఉదయాన్నే నీళ్లు తాగడంవల్ల ప్రయోజనాలు 

ఉదయాన్నే నీటిని తాగడంవల్ల ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ప్రయోజనాల గురించి ఈ విభాగంలో విస్తారంగా వివరించబడ్డాయి.

 • ఉదయంపూట పరగడుపున్నేనీళ్లు తాగడంవల్ల ఉదయం నోటి నుండి వచ్చే దుర్వాసనను గణనీయంగా తగ్గించవచ్చని అధ్యయనాలు కనుగొన్నాయి. పొద్దున్నే నోటినుండి వచ్చే దుర్వాసనను తగ్గించడానికి , 200 మిల్లీలీటర్ల నీటిని 30 సెకన్ల లోపు  తాగేయ్యాలని ఈ అధ్యయనాలు తెలిపాయి.
 • రాత్రి 7 నుండి 8 గంటలు నిద్రించిన తరువాత శరీరం సాధారణంగా తేలికపాటి దేహ్యాడ్రేషన్ కు గురువవుతుంది, ఈ రకమైన దేహ్యాడ్రేషన్ తలనొప్పితో ముడిపడి ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీని మెదడలో ఉండే మెనింజెస్ కారణం అని తెలుస్తుంది. పార్శ్వపు తలనొప్పికి కూడా దేహ్యాడ్రేషన్ కారణం అని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. కాబట్టి వీటిని నివారించడానికి ఉదయాన్నే ఒక గ్లాసుడు మంచి తాగడం ఉత్తమం.
 • దేహ్యాడ్రేషన్ రోజువారీ పనులకు మరియు జీవనశైలికి ఆటంకం కలిగించవచ్చు ఇంకా, పనిలో లేదా చదువులో ఏకాగ్రత లోపానికి ఇది దారితీస్తుంది. దీన్ని నివారించడానికి, మరింత ఉత్సాహకారమైన రోజు కోసం ఉదయం లేవగానే, పరగడుపున్నే, ఓ గ్లాసెడు మంచి నీటిని తాగడం మంచిది.
 • జీర్ణక్రియకు నీరు చాలా సహాయం చేస్తుంది, ఆహారంలో ఉండే ఫైబర్స్ జీర్ణం కావడం కోసం నీరు అవసరం మరియు ఫైబర్స్ మలవిసర్జన సులువుగా కావడానికి సహాయపడతాయి. ఉదయాన్నే నీరు తీసుకోవడం అనేది మలబద్దకాన్నీ తగ్గిచడంలో కూడా ఉపయోగపడుతుంది.
 • ఉదయం లేచిన వెంటనే కాఫీ లేదా టీ తాగడం వలన అవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. కాఫీ, టీలలో ఉండే కెఫీన్ అలసట, నిద్రలేమి వంటి పరిస్థితులను కలిగిస్తుంది . మరియు సీరం కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం, గుండె పోటు మరియు స్ట్రోక్ వంటి ప్రమాదాలకు కూడా దారితీయవచ్చు కాబట్టి ఉదయం వేళా కాఫీ, టీలకు ప్రత్యామ్న్యాయంగా నీటిని తీసుకోవడం చాలా ఉత్తమం.
 • మధుమేహం ఉన్నవారు ఉదయం వేళా వెచ్చని నీరు లేదా నిమ్మరసం కలుపుకుని లేదా గ్రీన్ టీను సేవించవచ్చు. అది రక్తంలో  చెక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచేందుకు సహాయపడుతుంది.
 • ఉదయం పూట పరగడుపున నీరు త్రాగడం వలన అది బరువు తగ్గుదలకు సహాయపడుతుంది, శరీరంలో జీవక్రియను (మెటబాలిజం) వేగవంతం చేసి అదనపు క్యాలరీలు కరిగేలా చేస్తుంది. అలాగే ఆహారం తినేముందు  నీరు త్రాగడం వలన కడుపు నిండిన భావనను కలిగించి ఆహారం తక్కువ తీసుకునేలా చేస్తుంది.
 • నీరు ఒక శక్తివంతమైన యాంటీటాక్సిన్, ఇది శరీరం నుండి టాక్సిన్లను బయటకు తొలగించడంలో సహాయపడుతుంది. నీటిలో నిమ్మకాయ రసం కలుపుకుని తాగడం వలన అది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడడానికి శరీరానికి శక్తిని ఇస్తుంది.


బరువు కోల్పోయేందుకు ఉదయమే నీళ్లు తాగడం 

చాలామంది ఉదయం లేస్తూనే పరగడుపున్నే నీటిని తాగడానికి అత్యంత సాధారణ కారణం దానివల్ల కలిగే బరువు నష్టం ప్రయోజనాల కోసమే. బరువు కోల్పోవాలని కోరుకుంటున్న వాళ్ళు గది ఉష్ణోగ్రత కల్గిన నీటినే తాగుతారు లేదా వెచ్చని నీటిని తాగడానికి ఇష్టపడతారు. మరికొందరైతే తేనె మరియు నిమ్మరసం చేర్చిన వెచ్చని నీటిని సేవిస్తారు. కానీ, ఇది నిజమేనా, అంటే పరగడుపున్నే నీళ్లు తాగడంవల్ల బరువు తగ్గిపోతామన్న సంగతి నిజమేనా? ఉదయమే నీళ్లు త్రాగటం వల్ల నిజంగా బరువు తగ్గిపోతామా?

నీటి సేవనంవల్ల ప్రయోజనం గురించి ఎనిమిది మంది ఆరోగ్యకరమైన మహిళలపై నిర్వహించిన ఓ అధ్యయనం గురించి చూద్దాం ఇపుడు. ఈ అధ్యయనం ఎందుకంటే మనకు కలిగే ఆకలి మరియు తృప్తి పైన నీటిసేవనం యొక్క ప్రభావాలను నిర్ణయించడమే. ఈ ఎనిమిదిమంది మహిళలకు మూడురోజులపాటు అల్పాహారంతో పాటు అదనంగా రెండు గ్లాసుల నీటిని  ఇచ్చారు, మరియు తరువాత మూడు రోజులపాటు అల్పాహారం సమయంలో అసలు తాగడానికి నీళ్ళు ఇవ్వలేదు. ఈ అధ్యయనం 2 వారాల పాటు కొనసాగింది. ఈ రెండు వారాల వ్యవధిలో ఆ 8 మంది మహిళల్ని తమ అనుభావాల్ని తెలుపమంటూ కొన్ని ఫారంలు వారికిచ్చి వాటిని పలు వ్యవధానాలో (intervals) తమ అనుభవాలతో నింపమని అడిగారు. అంటే భోజనానికి ముందు, భోజనం చేసేటపుడు, భోజనం చేసిన తరువాత వరుసగా వారి ఆకలి, తృప్తి, మరియు తినాలన్న కోరికలను నిర్ణయించేందుకే వాళ్ళను ఫారంలలో తమ అనుభవనాల్ని రాయమని అధ్యయన నిర్వాహకులు కోరారు. ఈ అధ్యయనం యొక్క ఫలితాలు నిర్ధారించి చెప్పిందేమంటే అల్పాహారం ముందు నీరు తాగడంవల్ల ఆకలి తగ్గుతుంది మరియు భోంచేసేటపుడు తృప్తి పెరుగుతుంది. .

ఇది ఏమి సూచిస్తుంది?

ఉదయం 2 గ్లాసుల నీటిని తాగడంవల్ల ఆకలిని తగ్గించవచ్చని ఇది సూచిస్తుంది, దీనివల్ల భోజనం సమయంలో మీరు తక్కువగా తినడానికి వీలవుతుంది.

మరొక అధ్యయనం గురించి చూద్దామిపుడు, ఈ అధ్యయనం బరువు గురించి దాని ప్రత్యేక ప్రభావాల్ని తెలియజేస్తుంది. ఈ అధ్యయనం, 50 మంది ఎక్కువ బరువున్న బాలికలపైన 8 వారాల పాటు నిర్వహించారు, ఈ అధ్యయనంలో, అల్పాహారం, భోజనం మరియు రాత్రి భోజనానికి అరగంట ముందుగా 500 మిల్లీలీటర్ల నీటిని వారందరికీ త్రాగడానికిచ్చారు, దీనివల్ల వాళ్ళ శరీరం బరువు గణనీయంగా తగ్గింది. BMI స్కోరు తగ్గింపు (బాడీ మాస్ ఇండెక్స్)ను ఈ మహిళలలో గుర్తించబడింది.

ఇది బరువు తగ్గింపు ప్రక్రియలో నీటి పాత్రను ప్రస్పుటం చేస్తుంది మరియు ప్రతిరోజూ ఉదయం నీరు త్రాగడానికి మీకు ఒక రుజువైన హేతువును ఇస్తుంది. ఉత్తమ ఫలితాల కోసం, ప్రతి భోజనానికి అరగంట ముందుగా నీరు త్రాగమని సిఫార్సు చేయబడింది.


ఉదయం మంచి శ్వాస కోసం ఉదయాన్నే నీళ్లు తాగడం 

చాలా మంది వ్యక్తులు ఉదయంపూట శ్వాస సమస్యను ఎదుర్కొంటారు. పొద్దున్నే లేచిన తర్వాత వాళ్ళ నోటి నుండి దుర్వాసన రావడం జరుగుతుంది. ఈ దుర్వాసన చాలా తీవ్రంగా ఉండచ్చు లేదా తేలికపాటి దుర్వాసన అయి  ఉండచ్చు, అది వ్యక్తి తిన్న ఆహారం మరియు మౌఖిక పరిశుభ్రత స్థాయిని బట్టి ఉంటుంది. ఉదయంపూట దుర్వాసనతో కూడిన శ్వాస అనేది ప్రధానంగా నోటిలో మరియు దంతాల మధ్య రాత్రిపూట సంభవించే బ్యాక్టీరియా చర్యల వలన సంభవిస్తుంది, ఇది వాసన-కారక బ్యాక్టీరియా విడుదలకి దారితీస్తుంది.

ఉదయంపూట పరగడుపున్నేనీళ్లు తాగడంవల్ల ఉదయం నోటి నుండి వచ్చే దుర్వాసనను గణనీయంగా తగ్గించవచ్చని అధ్యయనాలు కనుగొన్నాయి. హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ లాగా వాసనను కలిగించే పదార్థాల స్థాయిల్ని ఇది (పరగడుపున్నే నీళ్లు తాగడం) 30-50% వరకూ తగ్గించగలిగింది. ఉత్తమమైన ఫలితం కోసం, అంటే పొద్దున్నే నోటినుండి వచ్చే దుర్వాసన  తగ్గడానికి, 200 మిల్లీలీటర్ల నీటిని 30 సెకన్ల కన్నా తక్కువ వ్యవధిలో తాగేయ్యాలని ఈ అధ్యయనాలు ప్రతిపాదించాయి.


మైగ్రెయిన్ మరియు తలనొప్పికి ఉదయాన్నే నీటిసేవనం 

రాత్రిపూట 7 నుండి 9 గంటలపాటు నిద్రించిన తర్వాత, మన శరీరాలు ఉదయం లేచేటప్పటికి తేలికపాటి నిర్జలీకరణ (దేహ్యాడ్రేషన్) స్థితిలో ఉంటాయ. ఒకవేళ, రాత్రి సమయంలో మధ్యలో లేచి నీళ్లు తాగే అలవాటు ఉంటె తప్ప సామాన్యంగా ఉదయం లేచినపుడు మన శరీరం నిర్జలీకరణాన్ని కల్గి ఉంటుంది. ఈ అభ్యాసం నిర్జలీకరణాన్ని నివారించవచ్చు కానీ అసమర్థ నిద్రకు దారి తీస్తుంది. ఈ సందర్భాలు రెండూ, అంటే నిర్జలీకరణం మరియు చెదిరిపోయే నిద్ర అనేవి, తలనొప్పి రావడానికి దారి తీస్తాయి.

నీటి లేమి లేదా నిర్జలీకరణ స్థితి సాధారణంగా తలనొప్పితో సంబంధం కలిగి ఉంటుందని అధ్యయనాలు కనుగొన్నాయి. ఈ రకమైన తలనొప్పులకు మూల కారణాలు మెదడు యొక్క నాడీ మండలంలో (meninges)  ప్రాధమికంగా గుర్తించబడ్డాయి.

పార్శ్వపు తలనొప్పికి శరీరంలో నీటి శాతం తగ్గడం యొక్క సంభావ్య పాత్ర ఉండవచ్చని అధ్యయనం సూచించింది. కాబట్టి, మీరు సాధారణంగా తలనొప్పి వలన బాధపడుతుంటే, నిర్జలీకరణ స్థితిని తప్పించడానికి ఉదయం లేచిన వెంటనే ఓ గ్లాసెడు మంచినీళ్లు తాగేందుకు సిఫార్సు చేయబడింది.

మీరు పార్శ్వపు తలనొప్పితో బాధపడుతుంటే, మీరు జాగ్రత్తపడవలసిన అవసరముంది, ఇందుగ్గాను  సరైన ఉష్ణోగ్రతలో నీటిని తాగండి. చల్లని నీరు త్రాగటంవల్ల, ముఖ్యంగా మహిళల్లో, పార్శ్వపు తలనొప్పిని ప్రేరేపించవచ్చని అధ్యయనాలు ఆధారసహితంగా సూచించాయి. ఈ మహిళలలో పార్శ్వపు తలనొప్పి నుదిటి ప్రాంతంలో ఉద్భవిస్తుంది. ఉదయంపూట ఓ గ్లాసెడు గోరు వెచ్చటి నీరు తాగడమే ఈ రకం పార్శ్వపు తలనొప్పి తగ్గడానికి సూచించబడింది.  


మంచి ఏకాగ్రతకు ఉదయమే నీటి సేవనం 

నిర్జలీకరణం తలనొప్పులు మరియు పార్శ్వపు తలనొప్పితో సాధారణంగా సంబంధం కలిగి ఉంటుంది, అయితే ఈ తలనొప్పుల్లో మెదడులోని నాడీమండలం ప్రమేయం వలన నిర్జలీకరణం ఇతర తీవ్రమైన ప్రభావాలను కలిగి ఉంటుంది. నిర్జలీకరణంవల్ల ఈ ప్రభావాలు తరచూ ఏకాగ్రత మరియు చిరాకును కలుగజేస్తాయి.

ఇది (నిర్జలీకరణం) మీ రోజువారీ కార్యకలాపాలు మరియు జీవనశైలిపై క్లిష్టమైన ప్రభావాలను కలిగి ఉండవచ్చు, ఇంకా, పనిలో లేదా విద్యా-సంబంధ విషయాల్లో పేలవమైన పనితీరుకు ఇది దారితీస్తుంది. దీన్ని నివారించడానికి, మరింత ఫలవంతమైన మరియు ఉత్పాదక రోజు కోసం ఉదయం లేవగానే, పరగడుపున్నే, ఓ గ్లాసెడు మంచి నీటిని తాగేందుకు మీకు సిఫార్సు చేయబడింది.


మెరుగైన జీర్ణక్రియకు ఉదయమే నీరు తాగడం 

జీర్ణ ప్రక్రియలో నీటికి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. మనము తాగే నీరు పీచుపదార్థాలు (ఫైబర్స్) జీర్ణం కావడంలో సహాయపడుతుంది, పీచుపదార్థాలు అనేవి మన ఆహారంలో ముఖ్యమైన భాగంగా ఉంటాయి మరియు జీర్ణక్రియకు తోడ్పడతాయి. దీనితో పాటుగా, ప్రేగుల కదలికలలు సులభతరం కావడానికి తగినంతగా నీటిని తాగడం చాలా అగత్యం మరియు తద్వారా శరీరం నుండి మలాన్ని తొలగించడం సులభతరం అవుతుంది.

మన శరీరంలో నిర్జలీకరణముమలబద్ధకాన్ని ప్రేరేపించవచ్చు లేక అప్పటికే  ఉంటే దాన్ని మరింత విపరీతం చేసేఅవకాశం ఉంది. మీరు మలబద్ధకంతో బాధపడుతుంటే, ఉదయమే గ్లాసుడు నీరు సేవిస్తే దానివల్ల ప్రేగు కదలికల్లో ఉద్దీపన ఏర్పడి అంతవరకూ సాఫీగా కాని మలవిసర్జన కావడం సులభం కావచ్చు.


ఉదయం కాఫీ బదులుగా వెచ్చని నీటి సేవనం 

మనలో చాలామందికి ఉదయం లేస్తూనే వేడి వేడి కాఫీ లేదా టీ తాగడం పరిపాటి, కానీ ఇది మంచి అలవాటేనా? కాఫీ, టీ లో ఉండే కెఫిన్ (తేనీరు మరియు కాఫీలో ఉండే రసాయనిక పదార్ధం) సేవనం సాధారణంగా ఆయాసం మరియు అలసటతో సంబంధం కలిగి ఉంటుంది, మరియు ఇది నిద్రలేమికి కూడా దారితీయవచ్చు అని పరిశోధకులు కనుగొన్నారు.

కౌమారదశలో ఉన్నవాళ్లు, కెఫీన్ ను సేవించడంవల్ల అలసట కలగడం మరియు నిద్రలేమి సమస్యలు ఉంటాయి. కెఫిన్ యొక్క అధికసేవనం ఈ అలసట, నిద్రలేమి ప్రభావాలను మరింత తీవ్రతరం చేస్తుంది. కాబట్టి, కౌమారప్రాయపు పిల్లలు మరియు చిన్నపిల్లలను ప్రత్యేకంగా కెఫిన్ సేవించకుండా ఉండేట్లు చూడ్డం మంచిది, అందుకు బదులుగా వెచ్చని నీటిని వారిచే సేవించవచ్చు. ఇలా చేయడంవల్ల రోజంతా  మంచి ఏకాగ్రతను మరియు విషయాలపై దృష్టి సారించడంలో సహాయపడుతుంది.

కాని, కెఫీన్ వినియోగ నిషిద్ధం కేవలం కౌమారదశ పిల్లలకు మాత్రమే పరిమితం కాకూడదు. కాఫీ యొక్క సంభావ్య దుష్ఫలితాలను గుర్తించేందుకు నిర్వహించిన మరొక అధ్యయనంలో, ఒక వ్యక్తి యొక్క గుండె ఆరోగ్యంపై కెఫిన్ అధిక సేవనం ప్రభావం చూపుతుందని నిర్ణయించారు.

ఇది సీరం కొలెస్టరాల్ స్థాయిలను పెంచుతుంది, మరియు గుండెపోటు, స్ట్రోక్ మరియు ఇతర రుగ్మతలకు కూడా హానికారకం కావచ్చు. మరొక అధ్యయనంలో, కాఫీ సేవనాన్ని కండరాల అలసటతో ముడిపెట్టడం జరిగింది. కాఫీ యొక్క నిర్దిష్ట దుష్ప్రభావాలు గర్భవతి మరియు ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలలో కనుగొనబడ్డాయి. ఇది కాకుండా, కెఫీన్ వ్యసనం మరియు దాని నుండి ఉపసంహరణ ప్రయత్నం కూడా ఒక ప్రధాన సమస్య.

కాబట్టి, ఉదయం ఓ గ్లాసెడు వెచ్చని నీటిసేవనం కాఫీకి మంచి మరియు సురక్షితమైన ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. కాఫీ సేవనం వల్ల కలిగే ప్రభావాల్లాగా కాకుండా ఇది మీ శక్తి స్థాయిలను పెంచుతుంది, నొప్పిని తగ్గిస్తుంది.సాధారణ రక్త చక్కెర స్థాయి కోసం ఉదయమే వేన్నీళ్ళ సేవనం 

రక్తంలో ఎక్కువైన గ్లూకోజ్ స్థాయిలతో గుర్తించబడే చక్కెరవ్యాధి (డయాబెటిస్), ఒక దీర్ఘకాలిక రుగ్మత, భారతీయ జనాభాలో 8.7% మందిని దెబ్బ తీస్తోన్న దీర్ఘకాలిక వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం 20 నుండి 70 ఏళ్ల వయస్సులోని వారిలో చక్కెరవ్యాధి సాధారణం. ఈ వ్యక్తుల యొక్క నిశ్చల జీవనశైలి మరియు అనారోగ్యకరమైన ఆహారసేవనం చక్కెరవ్యాధి సంభవానికి కారణమవుతుంది.

చక్కెరవ్యాధి (మధుమేహం) ఉన్నవాళ్ళు, తరచుగా తమ రక్తంలో చక్కెరను తగ్గించుకునే ప్రయత్నంలో, అస్పర్టమే లేదా సాచరిన్ (aspartame or saccharin) వంటి కృత్రిమ స్వీటెనర్లను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. ఇది టీ లేదా కాఫీకి తీపినిస్తుంది మరియు వాటి రుచిని మెరుగుపరుస్తుంది, అయితే ఈ కృత్రిమ స్వీటెనర్ల యొక్క భద్రత నిజంగా అధ్యయనం చేయబడలేదు. కాబట్టి, మధుమేహం ఉన్నవారు ప్రత్యామ్నాయంగా ఉదయం వెచ్చని నీరు లేదా నిమ్మరసం లేదా మూలికలతో చేసిన టీ ని సేవించవచ్చు.


అంతేకాకుండా, శిశువులకు పాలను అధికంగా తాగించడంవల్ల భవిష్యత్తులో వారికి చక్కెరవ్యాధి (డయాబెటిస్) వచ్చే ప్రమాదముందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.. ఇన్సులిన్ కి వ్యతిరేకంగా శరీరంలో ప్రతిరోధకాలు ఏర్పడడం వలన, డయాబెటిస్ ప్రమాదం ఎక్కువగా ఉన్న పిల్లలలో ఇది సంభవిస్తుంది.

మధుమేహం యొక్క కుటుంబ చరిత్ర వంటి ప్రమాదానికి గురైనవారిలో, వెచ్చని నీటి వంటి ప్రత్యామ్నాయం కొరకు ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసుకోవటానికి ఇది ఉత్తమమైనది.


మెరుగైన రోగనిరోధకత కోసం ఉదయమే తాగునీటి సేవనం 

నీరు ఒక ప్రసిద్ధమైన యాంటీ- టాక్సిన్, అంటే, ఇది మీ శరీరం నుండి విషాన్ని బయటకు ప్రవహింప చేసేందుకు సహాయ పడుతుంది. నిమ్మకాయ ఒక శక్తివంతమైన ప్రతీక్షకారిణి (యాంటీ ఆక్సిడైజింగ్ ఏజెంట్), తాగునీటిలో నిమ్మకాయ రసం కలిపి సేవిస్తే అది అంటువ్యాధులు మరియు రుగ్మతలపై పోరాడటానికి అపారమైన సామర్థ్యాన్ని శరీరానికి కలుగజేస్తుంది. కాబట్టి, మంచి రోగనిరోధక ప్రతిస్పందనను అభివృద్ధి చేయడానికి ఉదయాన్నే వెచ్చని నీటికి నిమ్మరసం చేర్చి  సేవించడం మంచిది. ఇది నొప్పి తగ్గించడానికి మరియు మంచి రోగనిరోధక పనితీరులో సహాయపడుతుంది.


సర్కెడియన్ లయలను నియంత్రించడానికి పరగడుపున్నే నీరు తాగడం 

సిర్కాడియన్ లయలు (circadian rhythms) అనేవి మానవులలో నిద్ర, జీర్ణక్రియ మరియు ఇతర జీవసంబంధ విధులను నియంత్రించే జీవ గడియారాలను (biological clocks) సూచిస్తాయి. సిర్కాడియన్ లయలు అనేవి మన శరీరంలో నీటిని లోనికి గ్రహించడంతో, ప్రత్యేకించి పొద్దునపూట, సంబంధాన్ని కలిగి ఉంటాయి.

ఉదయాన్నే నీటిని తీసుకోవడంపై నియంత్రణ పాటిస్తే అది కార్టికోస్టెరోన్ స్థాయిని పెంచుతుందని ఇటీవలి అధ్యయనం నిరూపించింది. కోర్టికోస్టెరోన్ శరీరంలోని ఒక హార్మోన్, దీనిస్థాయి పెరిగినట్లైతే మనలో ఒత్తిడి పెరుగుదలతో సంబంధాన్ని కల్గిఉంటుంది.

దీనికి మినహా, కార్టిసోన్ శరీరం యొక్క సిర్కాడియన్ లయలను నిర్వహించడంలో కూడా పాత్ర ఉంది. సో, ఉదయం త్రాగునీరు ఒత్తిడి తగ్గింపు మరియు సాధారణ నిద్ర మరియు ఇతర శరీర చక్రాల నిర్వహణ మీద ఒక ప్రభావాన్ని కలిగి ఉంది .


ఉపసంహారం

వివిధ ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ఉదయాన్నే మొట్ట మొదట నీరు తాగడం  ఉత్తమమైనది. ఇది బరువు నష్టం, జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు మీ సిర్కాడియన్ లయలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. వెచ్చని నీటిని (వేడి నీళ్లు)  సేవించడంవల్ల రోగనిరోధక శక్తి లో మెరుగుదల వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి, మరియు కెఫిన్ కు ఒక అద్భుతమైన అనుబంధం మనకు లభిస్తుంది. ఉదయం ఒక గ్లాసు నీరు తాగడంవల్ల మంచి నోటి ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుంది, చెడుశ్వాసను  నిరోధిస్తుంది మరియు తలనొప్పి, పార్శ్వపు నొప్పిని నివారిస్తుంది మరియు ఏకాగ్రతలో కూడా ఈ ప్రక్రియ ప్రభావవంతంగా పని చేస్తుంది. అందువల్ల మీరు ఒక ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు నీటిని తాగడం ప్రారంభించడం ఎంతో  ఉత్తమం.

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd