బ్రోకలీ ప్రయోజనాలు, ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు

బ్రోకలీ ప్రయోజనాలు, ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు 


బ్రోకలీ క్యాబేజీ కుటుంబానికి చెందిన ఒక మొక్క, దీని అద్భుతమైన ప్రయోజనాల దృష్ట్యా పూవురూపంలో ఉన్న ఈ కూరగాయ విస్తృతంగా ప్రశంసించబడింది. ఇది వివిధ రకాలైన పోషకాలు, ఖనిజాలు, మరియు విటమిన్ల యొక్క గొప్ప మూలం. ఆరోగ్యకరమైన ఆహారం కోసం బ్రోకలీని మనం తీసుకునే ఆహారంలో ఓ భాగంగా చేసుకొమ్మని పౌష్టికాహార నిపుణులు సిఫారసు చేస్తారు. బ్రోకలీ ఆకుపచ్చ రంగులో పెద్ద పెద్ద పువ్వు తలల్ని కల్గి ఉంటుంది. దీని నిర్మాణం ఎలా  ఉంటుందంటే ఒక దట్టమైన కొమ్మ నుండి ఓ చెట్టును పోలి, పూవుతో కూడిన తలను కల్గి ఉంటుంది.మరి దీన్ని మనం తినొచ్చును . పెద్ద పెద్ద బ్రోకలీ పూల తలల చుట్టూ ఆకులుంటాయి.

ఈ మొక్క బ్రస్సికా కుటుంబానికి చెందిన వృక్ష సమూహంలో చేర్చబడింది. కల్టివర్స్ గా పిలువబడే ఇవి సంప్రదాయిక మొక్కల సంతానోత్పత్తి ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేయబడే మొక్కల రకాలు. సహజంగా సంభవించే మొక్కల సముదాయం నుండి ఈ మొక్కలను ఎంపిక చేస్తారు.  అప్పుడు అవి కావలసిన లక్షణాల సమూహాన్ని ఉత్పత్తి చేయగలవు లేదా వాటిని అప్పటికే ఉన్న లక్షణాలను కూడా పెంచుతాయి. బ్రోకలీకి కోసుపువ్వు (కాలీఫ్లవర్కు) కీ అద్భుతమైన పోలిక ఉంది, కోసుపువ్వు  కూడా అదే జాతులకు చెందిన మరో వృక్ష సమూహపు (కూరగాయ) మొక్క.

రోమన్ సామ్రాజ్యం కాలంనాటి నుండి బ్రోకలీ విలువైన ఆహార పదార్థంగా  కూడా పరిగణించబడింది. బ్రోకలీ మొక్క ఉనికి క్రీస్తుకు పూర్వం 6 వ శతాబ్దం నుండి ఉన్నట్లు తెలుస్తోంది మరియు మధ్యధరా ప్రాంతాలలో ప్రస్తుత బ్రాసాకా పంటల్ని జాగ్రత్తగా పెంచిన ఫలితంగా ఉత్పత్తి చేయబడిందని చెప్పబడుతోంది. 'బ్రోకలీ' అనే పదాన్ని 'బ్రోక్కోలో' అనే పదం నుండి తీసుకోబడింది, ఇది 'క్యాబేజీ పుష్పం' అని కూడా సూచిస్తుంది.


బ్రోకలీ ప్రయోజనాలు, ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు

బ్రోకలీ గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు


వృక్షశాస్త్రం (బొటానికల్) పేరు: బ్రాసియా ఒలెరాసియా వర్. ఇటాలికా (Brassica oleracea var. Italica)
సాధారణ పేరు: బ్రోకలీ
ఉపయోగించే భాగాలు: పువ్వులు, ఆకులు, తొడిమ, కాడలు
స్థానిక ప్రాంతాలు మరియు భౌగోళిక విస్తీర్ణం: ప్రపంచంలోని మధ్యధరా ప్రాంతాలు. ఎక్కువగా మితమైన మరియు ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో బ్రోకలీని బాగా సాగు చేస్తారు.


 • బ్రోకలీ గురించిన పోషక వాస్తవాలు 
 • బ్రోకలీ దేనికి మంచిది? 
 • బ్రోకలీ రకాలు 
 • ఆరోగ్యకరమైన మరియు సులభంగా చేసుకోగల బ్రోకలీ వంటకం 
 • బ్రోకలీ యొక్క దుష్ప్రభావాలు 


బ్రోకలీ గురించిన పోషక వాస్తవాలు

బ్రోకలీ పోషకాలు, ఖనిజాలు మరియు విటమిన్లకు నిలయం. 100 గ్రాముల ముడి బ్రోకలీలో ఉండే  పోషక విలువలు క్రింద పేర్కొనబడ్డాయి.

బ్రోకలీ పోషకాలు:100 g లకు విలువ

శక్తి:34 గ్రా
నీరు:89.30 గ్రా
పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్లు):6.64 గ్రా
ప్రోటీన్లను:2.82 గ్రా
చక్కెర:1.7 గ్రా
ఆహార పీచు పదార్థం (ఫైబర్):2.6 గ్రా
మొత్తం లిపిడ్లు:0.37 గ్రా

విటమిన్లు

 విటమిన్ ఎ:31 ug
విటమిన్ B1:0.071 mg
విటమిన్ B2:0.117 mg
విటమిన్ B3:0.639 mg
విటమిన్ B6:0.175 mg
విటమిన్ B9:63 ug
విటమిన్ సి:89.2 mg
విటమిన్ ఇ:0.78 mg
విటమిన్ కె :101.6 mg

మినరల్స్

పొటాషియం:316 mg
కాల్షియం:47 mg
ఫాస్ఫరస్  :66  mg
సోడియం:33  mg
మెగ్నీషియం:21  mg
ఐరన్:0.73  mg
జింక్:0.41  mg

కొవ్వు ఆమ్లాలు (లిపిడ్లు)

మొత్తం సంతృప్తకొవ్వులు:0.114  గ్రా
మొత్తం మోనోఅన్ స్యాచురేటెడ్ కొవ్వులు:0.031  గ్రా
మొత్తం బహుళఅసంతృప్త కొవ్వులు:0.112  గ్రా


బ్రోకలీ దేనికి మంచిది? 

బ్రోకలీ యొక్క సాధారణ నిత్యసేవనంవల్ల గల ఆరోగ్య ప్రయోజనాలు భారీగా ఉంటాయి. బ్రోకలీలో మనకవసరమైన చాలా ఆహార పదార్ధాలు సమృద్ధిగా వుండటంవల్ల ఇది అందరికీ ఎంతో అభిమానమైన ఆహారవస్తువుగా మారింది. బ్రోకలీ యొక్క ప్రయోజనాలు 

జీర్ణక్రియకు: బ్రోకలీలో అధికం మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ క్రియకు బాగా ఉపయోగపడుతుంది. బ్రోకలీలో ఉండే ‘కాఎమ్పెఫొరోల్’  కడుపులో లోపలి పొరలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మలబద్దకం ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ వంటి రుగ్మతలను ఇది బాగా నివారిస్తుంది.  

కేలేయం కోసం: బ్రోకలీ కాలేయ జీవక్రియను (మెటబాలిజం) కూడా  నియంత్రిస్తుంది. పరిశోధనల ప్రకారం బ్రకోలి కాలేయంలో ట్రైగ్లిసెరైడ్ స్థాయిలను తగ్గించి వాటితో ముడి పడి ఉండే నాన్ అల్కోహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుందని  కూడా తెలిసింది. 
    
యాంటీయాక్సిడెంట్గా: బ్రోకలీలో అధిక మొత్తంలో యాంటీయాక్సిడెంట్లు ఉంటాయి.  అవి ఆరోగ్యానికి ఎంతో  బాగా ఉపయోగపడతాయి. బ్రోకలీలో యాంటీయాక్సిడెంట్ లక్షణాలు కలిగిన ఫినాలిక్ సమ్మేళనాలు ఉన్నట్లు పరిశోధనలలో తేలింది.     

మెదడుకు: బ్రోకలీకి  న్యూరో ప్రొటెక్టీవ్ (మెదడును రక్షించే) చర్యలు ఉన్నట్లు గుర్తించబడింది. మెదడు సమస్యలకు ముఖ్యకారణం.  ఆక్సీకరణ ఒత్తిడి బ్రోకలీలో  ఉండే యాంటీయాక్సిడెంట్ చర్యలు ఈ ఒత్తిడిని తగ్గించి మెదడు ఆరోగ్యాన్ని బాగా  పెంపొందిస్తాయి.      

చెక్కెర వ్యాధికి: టైపు 2 మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులకు వారి ఆహారంలో బ్రోకలీ చేర్చడం వలన వారిలో ఇన్సులిన్ నిరోధకత పెరిగిందని అలాగే ఆక్సీకరణ ఒత్తిడి కూడా తగ్గిందని ఒక పరిశోధనలో  కూడా తెలిసింది.   

చర్మం మరియు జుట్టు కోసం: బ్రోకలీలో ఉండే విటమిన్ సి ఆరోగ్యకరమైన చర్మానికి కూడా సహాయపడుతుంది. ఇది స్కర్వి వంటి వ్యాధుల నియంత్రణకు బాగా  సహాయపడుతుంది. అలాగే అల్ట్రా వయొలెట్ కిరణాల వలన కలిగే చర్మ నష్టాన్ని కూడా తగ్గిస్తుంది.బ్రోకలీలో విటమిన్ ఎ కూడా ఉంటుంది. విటమిన్ సి మరియు విటమిన్ ఎ జుట్టు కుదుళ్లను బలోపేతం కూడా  చేస్తాయి మరియు జుట్టు రాలడాన్ని బాగా  తగ్గిస్తాయి.  

కొలెస్ట్రాల్ కోసం: బ్రోకలీ తీసుకోవడం వలన చెడు కొలెస్ట్రాల్గా పిలవబడే తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ల (LDL)  స్థాయిలు  బాగా తగ్గుతాయి.  బ్రోకలీలో ఉండే గ్లూకోరేంఫనిన్ (glucoraphanin) అనే బయోఆక్టివ్ సమ్మేళనం దీనికి  చాలా ముఖ్య కారణం.    


 • కొలెస్ట్రాల్ తగ్గించే బ్రోకలీ
 • క్యాన్సర్ కోసం బ్రోకలీ 
 • జీర్ణక్రియకు బ్రోకలీ 
 • కాలేయానికి బ్రోకలీ 
 • యాంటీఆక్సిడెంట్గా బ్రోకలీ 
 • వాపు నివారిణిగా బ్రోకలీ -
 • మెదడుకు బ్రోకలీ 
 • చర్మానికి, జుట్టుకు బ్రోకలీ 
 • కళ్ళకు బ్రోకలీ 
 • చక్కెరవ్యాధికి బ్రోకలీ 


కొలెస్ట్రాల్ తగ్గించే బ్రోకలీ

బ్రోకలీని సేవించడంవల్ల తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్లను (LDL) తగ్గించడంలో ప్రభావవంతమైనదిగా గుర్తించబడింది.  తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్లను చెడు కొవ్వులు గా పిలుస్తారు. అధిక కొలెస్ట్రాల్ ఉన్న రోగులకు సంబంధించిన యాదృచ్ఛిక క్లినికల్ ట్రయల్స్ నివేదికల ప్రకారం అధ్యయనం కాలంలో బ్రోకలీ యొక్క సాధారణ వినియోగం రోగులలో LDL స్థాయిల్ని గణనీయంగా తగ్గించిందని  కూడా సూచించింది. కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించడంలో ప్రధాన జీవశరీర సమ్మేళనం గ్లూకోరాఫానిన్, బ్రోకలీలో అధికంగా కూడా లభిస్తుంది.

క్యాన్సర్ కోసం బ్రోకలీ 

ప్రయోగాత్మక అధ్యయనాలు బ్రోకలీలోని ఉత్తమమైన ఆహారం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగలదని  కూడా సూచిస్తున్నాయి. జనవరి 2011 మరియు ఫిబ్రవరి 2012 మధ్య నిర్వహించిన ఒక వైద్య  అధ్యయనంలో (క్లినికల్ ట్రయల్), ఒకే కుటుంబానికి చెందిన బ్రోకలీ మరియు ఇతర కూరగాయలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని  కూడా నిరూపితమైంది.   బ్రోకలీని సేవించడంవల్ల శరీరం యొక్క జీవక్రియను పునరుద్ధరించడానికి బాగా సహాయపడుతుంది, ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా సాధారణంగా జీవక్రియ కూడా  పనిచేయదు.

బ్రోకలీ లోని గ్లూకోసినోలెట్స్ (glucosinolates) రక్షిత చర్య ద్వారా మధ్యవర్తిత్వం చేయబడుతుందనే వాస్తవం గురించి అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ, ఈ పరికల్పనకు మరింత పరిశోధన అవసరం. అదనంగా, బ్రోకలీలో కనుగొనబడిన బయోయాక్టీవ్ సమ్మేళనం ‘కాయెమ్ప్ ఫెరోల్’ క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలను కూడా కలిగి ఉందని, అధ్యయనాలు కూడా సూచిస్తున్నాయి.


జీర్ణక్రియకు బ్రోకలీ 

బ్రోకలీలో పీచుఆహారపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. బ్రోకలీలో ఉన్న ఈ అధిక పీచుఆహారపదార్థాలు (ఫైబర్ కంటెంట్) శరీరం యొక్క జీర్ణ క్రియను నిర్వహించడానికి అద్భుతంగా తోడ్పడతాయి. బ్రోకలీలోని జీవచైతన్య సమ్మేళనం, ‘కాఎమ్పెఫొరోల్’, కడుపు లోపలి పొరను సురక్షితంగా కూడా ఉంచుతుంది.  ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా స్థాయిల్ని నిర్వహిస్తుందని అధ్యయనాలుకూడా  కనుగొన్నాయి.

ఆరోగ్యకరమైన పేగుబ్యాక్టీరియా (healthy gut bacteria) జీర్ణక్రియ ప్రక్రియలో బాగా  సహాయపడతాయి.  అందువలన మన ఆహారంలో బ్రోకలీని కూడా చేర్చడంవల్ల మలబద్ధకం మరియు పేగుల్లో మంట రుగ్మత (ఐబిఎస్) వంటి జీర్ణ రుగ్మతలను నిరోధించవచ్చును . అదనంగా, బ్రోకలీ నిర్వహించే జీర్ణ జీవక్రియ (digestive metabolism) యొక్క నియంత్రణ బరువు తగ్గింపు కార్యక్రమాలకు కూడా ప్రభావవంతమైనదిగా నిరూపించగలదు.


కాలేయానికి బ్రోకలీ 

మనం తినే ఆహారంలో బ్రోకలీని చేర్చడంవల్ల కాలేయానికి మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. కాలేయ సిర్రోసిస్ మరియు కాలేయ క్యాన్సర్ వంటి నాన్-ఆల్కహాలిక్ కొవ్వు కాలేయ వ్యాధుల్లో (NAFLDs) ఇటీవల పెరుగుదల కానవస్తోంది. నివేదికలు మరియు గణాంకాల ప్రకారం కాలేయ క్యాన్సర్ ప్రస్తుత సందర్భంలో ఐదవ అతి సాధారణమైన క్యాన్సర్గా పరిగణించబడుతుంది. కాలేయ క్యాన్సర్ ను సాపేక్షకంగా నివారించవచ్చును .  ఎందుకంటే దీనికి సంబంధించిన ప్రమాద కారకాలు ప్రధానంగా ఆహారం మరియు జీవనశైలికి సంబంధించినవే కాబట్టి.

బ్రోకలీ కాలేయంలో జీవక్రియను బాగా  నియంత్రించడానికి మరియు NAFLD యొక్క అభివృద్ధిని నిరోధిస్తుందని అధ్యయనాలు కనుగొన్నాయి. కాలేయంలో ట్రైగ్లిజెరైడ్స్ తగ్గించడంలో బ్రోకలీ సహాయపడుతుందని పరిశోధకులు  కూడా సూచిస్తున్నారు, ఇది NAFLD తో ముడిపడిన ప్రమాదాన్ని మరింత తగ్గిస్తుంది. అయితే, కాలేయ పనితీరు యొక్క సక్రమ నిర్వహణకు బ్రోకలీవల్ల జరిగే క్రియావిధానం గురించి ఇంకా పూర్తిగా అన్వేషించబడలేదు.


యాంటీఆక్సిడెంట్గా బ్రోకలీ 

బ్రోకలీలో అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్ (antioxidants) ఉంటాయి.  ఇవి ఆరోగ్యానికి ప్రయోజనకరమైన ప్రభావాలను  కూడా కలిగిస్తాయి. అనామ్లజనకాలు ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా ఏర్పడే సెల్యులార్ నష్టాన్ని నివారిస్తాయి లేదా ఆ నష్టాన్ని ఆలస్యం కూడా చేస్తాయి.

బ్రోకలీలో పెద్ద సంఖ్యలో ఫినోలిక్ పదార్థాలు ఉన్నట్లు అధ్యయనాలు కనుగొన్నాయి.  దీనివల్ల బ్రోకలీ అనామ్లజనక పదార్థంగా పనిచేయగలదు. అందువలన, బ్రోకలీలో మన శరీరంపై రక్షణ చర్యల్ని చేపట్టగలదు . కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడానికి మన ఆహారంలో దీన్ని చేర్చడం చాలా అవసరం.

వాపు నివారిణిగా బ్రోకలీ 

ఆహారంలో బ్రోకలీని చేర్చడంవల్ల కీళ్లనొప్పులు (ఆర్థరైటిస్) మరియు కీళ్లు మరియు ఎముకల నొప్పి (ఆస్టియో ఆర్థరైటిస్) వంటి వ్యాధుల వాపును తగ్గించడంలో బాగా  సహాయపడుతుంది. ఇటీవలి ఓ అధ్యయనం ప్రకారం, బ్రోకలీలో ఉన్న జీవచైతన్య (bioactive) సమ్మేళనం, సల్ఫోరాఫాన్, పేర్కొన్నవ్యాధుల వల్ల వచ్చే వాపుకు వ్యతిరేకంగా కూడా  పనిచేస్తుంది. ఈ సమ్మేళనం కీళ్ళనాశనానికి కారణమయ్యే ఎంజైమ్లను నిరోధిస్తుందని నమ్ముతారు. అయినప్పటికీ, మరిన్ని అధ్యయనాలు ఈ పరిశోధనలకు మద్దతు ఇవ్వాల్సి ఉంది.

మెదడుకు బ్రోకలీ 

బ్రోకలీ వినియోగం అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని బాగా  తగ్గించగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రోకలీ పనితీరును బట్టి చూస్తే ఇది మెదడును రక్షించేది (న్యూరోప్రొటెక్టివ్) గా గుర్తించబడింది. నర సంబంధమైన (న్యూరోడెనెనరేటివ్) వ్యాధులకు సాధారణ కారకం ఆక్సీకరణ ఒత్తిడి. బ్రోకలీలో అనామ్లజనకాలు అధికంగా ఉంటాయి.   ఆక్సీకరణ ఒత్తిడి స్థాయిని గణనీయంగా  కూడా తగ్గిస్తుంది.

2015 లో నిర్వహించిన ఒక అధ్యయనం ముడి బ్రోకలీ రసం యొక్క సేవనం అల్జీమర్స్ (జ్ఞాపక శక్తిని కోల్పోయే రుగ్మత) వ్యాధిని నిరోధించగలదని కనుగొంది. వయస్సుతో మూసివేయబడే ఒక ప్రత్యేక సిగ్నలింగ్ మార్గం అయిన Nrf2 ని తిరిగి క్రియాశీలకంగా మార్చడం ద్వారా బ్రోకలీ అల్జీమర్స్ ను కూడా నిరోధిస్తుంది. ఏదేమైనప్పటికీ, బ్రోకలీ యంత్రాంగం యొక్క ఖచ్చితమైన చర్యను అర్థం చేసుకోవడానికి.మరింత అధ్యయనం చాలా  అవసరం.


చర్మానికి, జుట్టుకు బ్రోకలీ 

బ్రోకలీలో విటమిన్ సి చాలా అధిక మొత్తంలో ఉంటుంది.  ఆరోగ్యవంతమైన చర్మాన్ని నిర్వహించడానికి విటమిన్ సి  చాలా అవసరం. ఈ విటమిన్ యొక్క లోపం పొడి చర్మ రుగ్మతలు మరియు స్కర్వీ (సి-విటమిన్ లోపవ్యాధి) వంటి వ్యాధులకు కారణమవుతుంది . బ్రోకలీని తినడంవల్ల అటువంటి చర్మవ్యాధులను దూరంగా ఉంచండి.

బ్రోకలీలో ఉన్న సమ్మేళనాల యొక్క అనామ్లజనిక లక్షణాలు చర్మం యొక్క వృద్ధాప్య ప్రక్రియను బాగా ఆలస్యం చేస్తాయి.  ఇది అకాల వయస్సులో వచ్చే మచ్చలు మరియు ముడతలను కూడా నిరోధిస్తుంది. బ్రోకలీ సేవనం మీ చర్మానికి ప్రకాశవంతమైన కాంతినిస్తుంది. చర్మంపై అతినీలలోహిత కిరణం యొక్క ప్రభావాన్ని బ్రోకలీ తగ్గిస్తుందని కనుక్కోబడింది. బ్రోకలీలో ఫైటోన్యూట్రియెంట్, గ్లూకోరాఫానిన్ పుష్కలంగా ఉంది.  ఇది చర్మంపై అతినీలలోహిత కిరణం యొక్క (UV) బహిర్గత ప్రభావాలను తిప్పికొడుతుందని సూచించబడింది.

అదనంగా, బ్రోకలీలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. విటమిన్ ఎ మరియు విటమిన్ సి రెండూ కలిసి తలవెంట్రుకల కుదుళ్ళలో తేమను కల్గించే సహజమైన కొవ్వుపదార్థాన్ని (sebum) ఉత్పత్తి చేస్తాయి. ఈ రెండు విటమిన్లు జుట్టు మూలాలను బలోపేతం కూడా చేస్తాయి, జుట్టు రాలడాన్ని మరియు వెంట్రుకలు తునగడాన్ని కూడా నివారిస్తాయి. కాబట్టి, మీరు పట్టులాంటి, ఒత్తైన మెరిసే జుట్టును సొంతం చేసుకోవాలంటే  మీ ఆహారంలో బ్రోకలీ తప్పకుండా ఉండేట్లు చూసుకోండి.


కళ్ళకు బ్రోకలీ 

బ్రోకలీ విటమిన్ ‘ఎ’ ని పుష్కలంగా కల్గి ఉంటుంది.  దీన్ని తినడంవల్ల కళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది. సరైన దృష్టికి అవసరమైన కళ్ళలోని కడ్డీలు మరియు కోన్ కణాల (rods and cone cells of eyes) అభివృద్ధికి విటమిన్ ఎ చాలా అవసరం. అదనంగా, విటమిన్ ఎ లోపం కళ్ళు పొడిబారిపోయే రుగ్మతకు మరియు కండ్లకలక, జీరోప్తాల్మియా (xerophthalmia) వంటి వ్యాధులకు కూడా దారి తీస్తుంది. బ్రోకలీలో అధిక మొత్తంలో ఉండే  విటమిన్ ఎ వల్ల ఇటువంటి కళ్ళ వ్యాధులను కూడా  నివారించవచ్చు.

బ్రోకలీని తినడంవల్ల కంటిశుక్లాలు మరియు మాక్యులార్ డిజెనరేషన్ వంటి వయసు సంబంధిత కంటి రుగ్మతలకు సంబంధించిన ప్రమాదాలు కూడా దూరం కాగలవని అధ్యయనాలు కనుగొన్నాయి. ఆరోగ్యకరమైన కళ్ళకోసం చాలా చిన్న వయస్సులోనే పిల్లల ఆహారంలో బ్రోకలీని చేర్చమని పౌష్టికాహార నిపుణులు  కూడా సిఫార్సు చేస్తారు.


చక్కెరవ్యాధికి బ్రోకలీ

చక్కెరవ్యాధి (మధుమేహం) రావడానికి గల ప్రధాన కారణాలలో ఒకటి ఆక్సీకరణ ఒత్తిడి. బ్రోకలీ యొక్క సేవనంవల్ల చక్కెరవ్యాధి (మధుమేహం) తక్కువ స్థాయికి దిగొస్తుంది.  దీనిక్కారణమేమంటే బ్రోకలీలో అనామ్లజని మరియు హైపోగ్లైసీమిక్ (బ్లడ్ షుగర్ని తగ్గించే గుణం) కూరగాయల లక్షణాలు పుష్కలంగా ఉండడమేనని నిర్ధారించబడింది.

టైప్ 2 చక్కెరవ్యాధి (డయాబెటీస్) ఉన్న రోగులపై జరిపిన అనేక వైద్య పరిశోధనలు (క్లినికల్ ట్రయల్స్) కనుగొన్నదేమిటంటే ఆహారంలో బ్రోకలీని చేర్చడం వలన చక్కెరవ్యాధి (మధుమేహం) తగ్గుముఖం పడుతుందని. ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరచడం ద్వారా మరియు ఆక్సీకరణ ఒత్తిడి స్థాయిని తగ్గించడం ద్వారా బ్రోకలీ చక్కెరవ్యాధిని తగ్గిస్తుందని గుర్తించవచ్చు. అయితే రక్త చక్కెర స్థాయిలను తగ్గించే బ్రోకలీ యొక్క ఖచ్చితమైన మెకానిజం ఏమిటన్నదాన్ని ఇంకా పరిశోధించాల్సి దించాల్సి ఉంది.


బ్రోకలీ రకాలు

బ్రోకలీ యొక్క పోషక ప్రయోజనాల కోసం దాన్ని  బాగా సాగు చేస్తారు. అందుబాటులో ఉన్న బ్రోకలీ యొక్క సాధారణ రకాలు క్రింద పేర్కొనబడ్డాయి.

కాలిబ్రేజ్ బ్రోకలీ: దీనిని “బ్రోకలీ” అనే పిలుస్తారు.  దీనికి ఈ పేరును దీన్ని మొదట పండించిన ప్రదేశం పేరునే పెట్టారు. ఇటలీలో కాలాబ్రియా లో బ్రోకలీ ని మొదట పండించారు. ఈ రకమైన బ్రోకలీ మందపాటి కాడలు మరియు పెద్ద ఆకుపచ్చ తలలు కలిగి ఉంటుంది.

మొలకెత్తే (Sprouting) బ్రోకలీ: ఈ రకమైన బ్రోకలీ సన్నగా ఉండే లేత కాడలు మరియు పెద్ద సంఖ్యలో తలలు కలిగి ఉంటుంది.

ఊదా రంగు (పర్పుల్) బ్రోకలీ: బ్రోకలీ యొక్క ఈ రకాన్ని ప్రధానంగా ఐరోపా మరియు ఉత్తర అమెరికాలో బాగా సాగు చేస్తారు. బ్రోకలీ యొక్క ఈ రకమైన ఫ్లవర్ మొగ్గలు చిన్నవి మరియు ఊదా రంగు కలిగి ఉంటాయి.

చైనీస్ బ్రోకలీ: బ్రోకలీ ఈ రకమైన బ్రోకలీలో పూవు యొక్క తలలు ఉండవు. ఇది ఇతర రకాల బ్రోకలీతో పోలిస్తే ముదురు ఆకుపచ్చ రంగు మరియు బలమైన రుచి కలిగి ఉంటుంది. ఇది ఆసియాలో ప్రధానంగా చైనాలో కనిపిస్తుంది .  మొక్క మొత్తాన్ని పూర్తిగా  కూడా తింటారు.

ఆరోగ్యకరమైన మరియు సులభంగా చేసుకోగల బ్రోకలీ వంటకం

బ్రోకలీని అనేక కార్బోహైడ్రేట్లు మరియు మాంసాలతో పాటు అనేక రకాల వంటకాల్లోను లేదా నంజుకునే వంటకం (సైడ్ వెజిటబుల్) గా ఉపయోగించవచ్చును . బ్రోకలీని సేవించే  అత్యంత సులభమైన మరియు ఆరోగ్యకరమైన మార్గం ఇక్కడ వివరించబడింది.


 • సుమారు 250 గ్రాముల బ్రోకలీని తీసుకోండి.
 • బ్రోకలీ యొక్క పుష్పగుచ్చాల్ని, కాండాలు మరియు ఆకుల్ని కావలసిన పరిమాణంలో ముక్కలుగా కట్ చేసుకోండి. వాటిని పూర్తిగా శుభ్రం చేయండి.
 • ఒక గిన్నెలో సుమారు 500 ml (2 పెద్ద కప్పులు) నీటిని తీసుకుని అందులో కట్ చేసుకున్న బ్రోకలీ ముక్కలను వేయండి.
 • బ్రోకలీ మిశ్రమాన్ని వేడి చేయండి, ఆ తర్వాత నీటిని వంచేయండి.
 • ఉప్పు మరియు మిరియాల (పొడి)ని వేసి ఆ తర్వాత ఆలివ్ నూనె యొక్క చినుకుల్ని సున్నితంగా చిలకరించండి.
 • ఇపుడు తయారైన మీ బ్రోకలీ వంటకాన్ని తిని ఆనందించండి. బ్రోకలీతో మీకిష్టమైన ఇతర కూరగాయలను జోడించి సలాడ్ను కూడా సిద్ధం చేసుకుని తినొచ్చు.


బ్రోకలీ యొక్క దుష్ప్రభావాలు 

బ్రోకలీని తినడంవల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే, కొందరు బ్రోకలీని మితం మించి తినడంవల్ల కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయి. ఈ దుష్ప్రభావాలు క్రింద చర్చించబడ్డాయి.

బ్రోకలీలో రక్త చక్కరను (బ్లడ్ షుగర్) తగ్గించగల గుణం ఉండటం వల్ల దీన్ని తిన్నపుడు రక్త చక్కెర చాలా తక్కువకు పడిపోతుంది. అందువల్ల, బ్రోకలీని అధిక మొత్తంలో ఆహారంలో చేర్చినట్లయితే, రక్తంలో చక్కెర స్థాయిలను సమయోచితంగా పర్యవేక్షించుకోవడం అవసరం.

గర్భధారణ సమయంలో బ్రోకలీ యొక్క అధిక వినియోగం పొత్తికడుపు నొప్పి, ప్రేగు సంబంధిత అడ్డంకులు వంటి సమస్యలకు  కూడా కారణమవుతుంది. అందువల్ల, గర్భిణీ స్త్రీలు బ్రోకలీని ఓ మోస్తరు మొత్తంలో మాత్రమే తినాలి, తద్వారా ఎలాంటి సమస్యలు రాకుండా నివారించుకోవచ్చు.

రక్తాన్ని పల్చబరిచే మందుల్ని(blood thinning medicines) తీసుకొనేవాళ్ళు బ్రోకలీని సేవించే ముందు తీసుకోవడం గురించి ఒక పౌష్టికాహార నిపుణుడిని సంప్రదించాలి.  ఎందుకంటే దీనిలో విటమిన్ K అధిక మొత్తంలో ఉంటుంది.  కాబట్టి ఇది మందుల ప్రభావంతో జోక్యం చేసుకోవచ్చును .
కొన్ని బ్రోకలీలను తినటంవల్ల కొంతమందికి  చర్మంపై దద్దుర్లు, దురద వంటి అలెర్జీ ప్రతిచర్యలు (reactions) రావచ్చు .

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇక్కడ చూడండి

శనగ పప్పు యొక్క ప్రయోజనాలు దుష్ప్రభావాలు
ఆర్గాన్ నూనె యొక్క ప్రయోజనాలు
కుసుమ నూనె వల్ల కలిగే ప్రయోజనాలు
విటమిన్ కె ప్రయోజనాలు వనరులు మరియు దుష్ప్రభావాలు
కాపెరిన్ యొక్క ప్రయోజనాలు
ఆలివ్ ఆకు యొక్క ప్రయోజనాలు 
బచ్చలికూర యొక్క ప్రయోజనాలు
ఉల్లిపాయ రసం వల్ల కలిగే ప్రయోజనాలు
పామాయిల్ యొక్క ప్రయోజనాలు
బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు 
కరివేపాకు మసాలా వల్ల కలిగే ప్రయోజనాలు
మందార టీ వల్ల కలిగే ప్రయోజనాలు 
వెన్న యొక్క ప్రయోజనాలు
అవోకాడో ఆయిల్ యొక్క ప్రయోజనాలు
బఠానీల వల్ల కలిగే ప్రయోజనాలు 
చెరకు వల్ల కలిగే ప్రయోజనాలు
పర్స్లేన్ యొక్క ప్రయోజనాలు 
వేరుశెనగ యొక్క ప్రయోజనాలు
మార్జోరాం యొక్క ప్రయోజనాలు 
వనిల్లా యొక్క ప్రయోజనాలు
రంబుటాన్ ఫ్రూట్ యొక్క ప్రయోజనాలు
కాలీఫ్లవర్ యొక్క ప్రయోజనాలు
గార్డెనియా ప్లాంట్ యొక్క ప్రయోజనాలు
చందనం నూనె యొక్క ప్రయోజనాలు
అల్లం టీ వల్ల కలిగే ప్రయోజనాలు
పెపినో యొక్క ప్రయోజనాలు
కనోలా నూనె యొక్క ప్రయోజనాలు
జింక్ యొక్క ప్రయోజనాలు
వైన్ ఆకుల యొక్క  ప్రయోజనాలు
రోవాన్ పండు యొక్క ప్రయోజనాలు
లావెండర్ టీ యొక్క ప్రయోజనాలు
మొలకలు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు
చిక్కుడుకాయ ఆరోగ్య ప్రయోజనాలు
కర్బూజ వలన కలిగే ప్రయోజనాలు  ఉపయోగాలు
పొన్నగంటి కూర ఉపయోగాలు
వెలగపండు ఉపయోగాలు
బీరకాయల్లోని  ఆరోగ్య ప్రయోజనాలు
డార్క్‌ సర్కిల్స్‌ నివారణకు  చిట్కాలు
నిద్రలేమి అంటే ఏమిటి? సంకేతాలు, లక్షణాలు మరియు చికిత్స
చామంతి టీ వలన  కలిగే ఉపయోగాలు
చామదుంపలు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
విటమిన్ A యొక్క ప్రయోజనాలు దుష్ప్రభావాలు
నాజూకైన నడుమును పొందడమెలా
శిలాజిత్తు ప్రయోజనాలు ఉపయోగాలు దుష్ప్రభావాలు
జిన్సెంగ్ యొక్క ప్రయోజనాలు
గర్భంతో ఉన్నపుడు ఏమి తినాలి, ఏమి తినకూడదు
గోంగూర వలన కలిగే ఉపయోగాలు
డ్రాగన్ ఫ్రూట్  యొక్క ప్రయోజనాలు
దురియన్ పండు యొక్క ప్రయోజనాలు
పండ్లను పోలిన పండ్లు
ఆవాలు వలన కలిగే  ఆరోగ్య ప్రయోజనాలు
సెలెరీ వల్ల కలిగే ప్రయోజనాలు 
పాల‌కూర‌తో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు
వంకాయ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
కొర్రలు యొక్క ఉపయోగాలు 
Home Made హెర్బల్ షాంపూ
పనసపండు ప్రయోజనాలు, పోషణ - దుష్ప్రభావాలు
త్రిఫల యొక్క ప్రయోజనాలు దుష్ప్రభావాలు
నేరేడు పళ్ళు ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
ఏ సిరిధాన్యం ఏయే వ్యాధులను తగ్గిస్తుంది
కాల్షియం అధికంగా ఉండే భారతీయ ఆహారాలు
పుదీనా ఆకుల పేస్ట్‌ తో ఉపయోగాలు
ఉల్లికాడలు వలన కలిగే ఉపయోగాలు
పుదీనా ఆకులతో ముఖ సౌందర్యం
క్యారెట్ వలన ఉపయోగాలు దుష్ప్రభావాలు
శరీర దుర్వాసన పోవాలంటే ఏం చేయాలి?
జాస్మిన్ ఆయిల్ ఉపయోగాలు / ప్రయోజనాలు
ఉదయాన్నే చేయవల్సిన పనులు
బేకింగ్ సోడా వల్ల కలిగే ప్రయోజనాలు దుష్ప్రభావాలు
తులసి ఆరోగ్య రహస్యాలు
చలిని తగ్గించే ఆహారం
ఆల్‌బుకారాపండ్లు వలన కలిగే ఉపయోగాలు
కాకరకాయ వలన కలిగే ఉపయోగాలు
అలోవెరా (కలబంద) యొక్క ఉపయోగాలు -దుష్ప్రభావాలు
అసాధారణ ప్రయోజనాలనందించే తాటి బెల్లం
అవిసె గింజలు ప్రయోజనాలు, ఉపయోగాలు, -దుష్ప్రభావాలు
గోధుమ వలన ఉపయోగాలు దుష్ప్రభావాలు
పెసలు వలన కలిగే ప్రయోజనాలు
పుచ్చకాయ వలన కలిగే ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
అలసటను దూరము చేసే ఆహారము
మార్నింగ్ వాక్‌తో ప్రయోజనాలు
బియ్యం కడిగిన నీటితో ఉపయోగాలు
జలుబు,దగ్గును దూరం చేసే చిట్కాలు
ఆరోగ్యపరంగా తమలపాకు ఉపయోగాలు
కరివేపాకు కషాయం ఉపయోగాలు
మెంతి ఆకు కషాయం ఉపయోగాలు
జామ ఆకు కషాయం ఉపయోగాలు
సదాపాకు కషాయం ఉపయోగాలు
తమలపాకు కషాయం ఉపయోగాలు
రావి చెట్టు ఉపయోగాలు ప్రయోజనాలు - దుష్ప్రభావాలు

0/Post a Comment/Comments

Previous Post Next Post