మామిడి ప్రయోజనాలు, ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు

మామిడి ప్రయోజనాలు, ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు


భారతీయ ఉపఖండంలోని ఉప-హిమాలయన్ మైదానాలలో పండిస్తున్న అధిక పోషక-సమృద్ధమైన పండ్లలో “మామిడి” ఒకటి. మామిడి పండు ప్రత్యేకమైన కమ్మదనాన్ని, రుచిని మరియు సువాసనని కల్గి ఉంది .  ఇలాంటి అద్భుతమైన పండును తర తరాల నుండి దాదాపు ప్రతి భారతీయుడు ఇష్టంగా తిని ఆస్వాదిస్తున్నారు. వేసవి కాలంలో భారతదేశంలో మామిడి లేదా మామిడిపండ్ల రసాన్ని ఎవరు ఇష్టపడరు చెప్పండి? వాస్తవానికి, మామిడి యొక్క అద్భుతమైన పరలోక రుచి (heavenly taste) కారణంగా దాన్ని'దేవతల ఆహారంగా' పిలువడం జరుగుతోంది. మామిడిని ప్రాచీన కాలం నుండి సాగు చేయడం  జరుగుతోంది. ప్రసిద్ధ కవి, కాళిదాస మామిడిపండ్ల రుచిని తన పురాణగ్రంథాల్లో బాగా  పొగిడారని తెలుస్తోంది. అలాగే, మొఘల్ పాలకుడు, అక్బర్ చక్రవర్తి, ఆధునిక బీహార్ లో ‘దర్భంగా’ అని పిలువబడే ప్రదేశంలో 1,00,000 మామిడి చెట్లను నాటారు అని నమ్మడం జరుగుతోంది.

కానీ, మామిడిలో దాని రసభరితమైన (జ్యుసి) రుచి, కమ్మదనం కంటే అది అందించే లాభాలు కూడా ఎన్నో ఉన్నాయి. మామిడి పండులో విటమిన్లు,  ప్రీబయోటిక్ డైటరీ పీచుపదార్థాలు, మరియు పాలీ ఫెనోలిక్ ఫ్లేవానోయిడ్ అనామ్లజనకాలు ఖనిజాలు కలిగి  ఉంటాయి. దీనిలో విటమిన్ A, C మరియు D వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.  ఇది మొత్తం శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మామిడిపండ్లను పండుగా లేదా రసాలను తీసి జ్యూస్ గా/షేక్స్ లాగా కూడా సేవించవచ్చును .  ఎలా తిన్నా కూడా మీరు దాని ఆరోగ్య ప్రోత్సహక లక్షణాల ఫలితాన్ని పొందుతారు. మామిడిపండులో ఉండే ఈ రెండింతల ప్రయోజనాలవల్లే బహుశా దానికి  "పండ్ల రాజు" అనే కీర్తి దక్కిందనొచ్చును .

మామిడి ఎక్కువగా ఉష్ణమండల దేశాల్లో బాగా పెరుగుతుంది.  మామిడి ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదేశం.  మామిడి భారతదేశం యొక్క జాతీయ పండు కూడా. కొండ ప్రాంతాల మినహా, మామిడి భారతదేశం యొక్క దాదాపు అన్ని ప్రాంతాలలో బాగా సాగు చేస్తారు. ఒక్క భారతదేశంలోనే వంద రకాలకు పైగా మామిడి రకాలు ఉన్నాయని తెలిస్తే  ఎంతో ఆనందం కలిగక మానదు. మామిడిపండ్లు వివిధ ఆకారాలు, పరిమాణాలు మరియు రంగుల్లో కూడా వస్తాయి. భారతదేశంలో లభించే  మామిడిపండ్ల ప్రసిద్ధ రకాలు కొన్నిఏవంటే లాంగ్రా (Langra), బంగినపల్లి , చౌసా (Chausa), తోతాపురి (totaapuri), సఫేదా (Safeda),  ఆల్ఫోన్సో మామిడిపండ్లు మొదలైనవి. 

మామిడి సాధారణంగా అండాకారంలో ఉండి మీగడవంటి గుజ్జును మరియు కండను కలిగి ఉంటుంది. వృక్షశాస్త్రజ్ఞులు మామిడిని టెంక (జీడు) గల్గిన కాయ (drupe) లేక రాతిపండు అని కూడా వర్ణించారు.  లోపల విత్తనంకల్గిన టెంక (pit or stone)ను ఇది కల్గి ఉంటుంది. ఒక షెల్ (పిట్ లేదా రాయి) పరిసరాల్లో ఉన్న ఒక విత్తనాలతో చుట్టబడిన ఒక ప్రత్యేకమైన బయటి కండర భాగం కలిగి ఉంటుంది. శప్తాలుపండు (peach)కు మరియు అనానస్ (పైనాపిల్) పండుకు మధ్యన ఉండే రుచిని మామిడిపండు కల్గి ఉంటుందని ఆహారప్రియులు కూడా వర్ణిస్తారు.

మామిడి చెట్టు ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల ప్రాంతాల్లో పెద్ద చెట్టుగా, అటుపై మానుగా ఆకులతో కూడుకుని బాగా పెరుగుతుంది.  ఇది సతతహరితమైన మాను కూడా . మామిడి పండ్ల చర్మం రంగులో భిన్నంగా ఉంటుంది.  అంటే రకరకాల మామిడిపండ్లు వేర్వేరు రంగుల్లో కూడా ఉంటాయి. సాధారణంగా,  ఆకుపచ్చ, ఎరుపు, పసుపు మరియు నారింజ రంగుల్లో మామిళ్ళు వస్తాయి. కానీ మామిడి పండు యొక్క అంతర్గత రసభరిత గుజ్జు మాత్రం సాధారణంగా బంగారు-పసుపు రంగులోనే కూడా  ఉంటుంది. ఇంకా మాగని (పండని) మామిడికాయ పైన తొక్క (చర్మం) నునుపుగా మరియు ఆకుపచ్చగా కూడా ఉంటుంది. కానీ అది పండే వృక్షాన్ని బట్టి బంగారు పసుపు, పసుపు, క్రిమ్సన్ ఎరుపు, లేదా నారింజ-ఎరుపు వర్ణాలు మామిడి పండుకు రావడం  జరుగుతాయి . మామిడి పండ్లు సాధారణంగా ఫిబ్రవరి మరియు ఆగస్టు నెలల మధ్య ఇవి పండుతాయి. పండిన మామిడి సాధారణంగా తియ్యగా ఉంటుంది.  కానీ వాటిలో కొన్ని మాగి పండైనా కూడా ఇంకా పుల్లని రుచినే కలిగి ఉంటాయి.

మామిడిని తాజాగానే తింటారు.  చట్నీ, ఎండిన మామిడి ఉత్పత్తులు, పురీ, ఊరగాయలు, కూరలు, మామిడితేనె మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన డబ్బాల్లో భద్రపరిచే (క్యాన్డ్) ఘనీభవించిన మామిడి ముక్కలుగా తయారు చేయబడుతుంది. మనం పచ్చి మామిడికాయలనుండి “ఆమ్ పన్నా” మరియు పండిన మామిడి నుండి మామిడి మిల్క్ షేక్ (mango milkshake), మామిడి రసం (ఆమ్ రష్) చేసుకుంటారు . మామిడి కుల్ఫీ, (mango kulfi), సోర్బెట్‌లు (sorbets) మరియు మామిడి ఐస్ స్క్రీముల్ని పండిన మామిడి గుజ్జు నుండి తయారు చేయవచ్చును . మామిడి జాంలను ఎలా మర్చిపోగలం చెప్పండి! మామిడి జామ్ అంటే పిల్లలకు చాలా ఇష్టం.

పచ్చి మామిడి కాయని ముక్కలుగా కోసుకుని ఉప్పు -కారంతో తింటారు. అవి  చాలా రుచిగా ఉంటుంది.

మీకు తెలుసా?

పూర్తిగా పండిన మామిడిపండు సంపదను సూచిస్తుంది. నిజానికి, భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన బహుమతి మామిడి పండే కదా 

మామిడి గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు:


వృక్షశాస్త్రం (బొటానికల్) పేరు: మాంగిఫెరా ఇండికా (Mangifera indica)
కుటుంబము: అనకార్డియేసి (Anacardiaceae). 
సాధారణ పేరు: మామిడి,  ఆమ్
సంస్కృత నామం: అమ్రాం
ఉపయోగించే భాగాలు: చక్కెరవ్యాధి (మధుమేహం) చికిత్స కోసం మామిడి ఆకులు చాలా బాగా ఉపయోగపడతాయి. భారతదేశంలో పవిత్రమైన సందర్భాలలో లేదా పండుగ రోజులలో ప్రతి ఇంట్లోను తమ ముంగిటి తలుపులకు తోరణాల్ని కట్టడానికి మామిడాకులనే ఉపయోగిస్తారు. మామిడి విత్తనాలను చమురు తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. మామిడి పండును అందరూ ఇష్టపడతారు.

స్థానికత మరియు భౌగోళిక విస్తీర్ణం: మామిడి దక్షిణ ఆసియాకు చెందినది. దక్షిణ ఆసియాలో మామిడి సాగుచేయబడి , ప్రశంసించబడుతోంది .  పురాతన కాలం నుంచి తన మాతృభూమిలో అందరిచేత ఇష్టంగా చూడబడి , ఆరాధింపబడుతోంది. పెర్షియన్లు దీనిని క్రీ.శ 10 వ శతాబ్దంలో తూర్పు ఆఫ్రికాకు తీసుకువెళ్లారు అని చెప్పబడింది. 1833 లో మామిడిని యుకాటన్ నుండి కేప్ సబలే కు డాక్టర్ హెన్రీ పెరిన్ టెంకల నుండి మొలకెత్తిన మామిడి మొక్కల్ని రవాణా చేయబడ్డాయి.  అతను భారతీయులచే చంపబడిన తరువాత ఆ మామిడి  మొక్కలన్నీ బతకలేదు. 1862 లేదా 1863 లో డాక్టర్ ఫ్లెచర్ చే మామిడి విత్తనాలు వెస్ట్ ఇండీస్ నుండి మయామి లోకి దిగుమతి చేసుకోబడ్డాయి. బౌద్ధ సన్యాసులు మలయా మరియు తూర్పు ఆసియా ప్రాంతాల్లో మామిడిని కీ.పూ 4 వ మరియు 5 వ శతాబ్దం లో తీసుకువచ్చారని కూడా నమ్ముతారు. మామిడి 1782 లో జమైకాకు కూడా చేరుకుంది, మరియు 19 వ శతాబ్దం ప్రారంభంలో ఇది ఫిలిప్పీన్స్ మరియు వెస్టిండీస్ నుండి మెక్సికోకు చేరుకుంది.

మామిడి గురించిన తమాషా వాస్తవాలు (ఫన్ ఫాక్ట్స్): 1. ఒకరు మరొకరికి ఓ  బుట్ట నిండా మామిడి పండ్లను కానుకగా ఇవ్వడాన్ని స్నేహానికి గుర్తుగా కూడా భావిస్తారు.
2. మామిడి ఆకుల్ని తరచుగా వివాహ సందర్భాల్లో ఉపయోగిస్తారు, కొత్తగా పెళ్లి చేసుకున్న జంటకు అనేకమంది పిల్లలు కలగాలని ఆకాంక్షిస్తూ మామిడాకుల్ని కూడా ఉపయోగిస్తారు.

 • మామిడి పోషక వాస్తవాలు 
 • మామిడి ఆరోగ్య ప్రయోజనాలు 
 • మామిడి దుష్ప్రభావాలు
 • ఉపసంహారం


మామిడి పోషక వాస్తవాలు 

ఒక కప్పు మామిడి పండు కేవలం 100 కేలరీలు అందిస్తుంది.  మామిడి పండు ఒక సంతృప్తికరమైన తీపి విందు. కాబట్టి ఒక మామిడి పండును ఎలాంటి సందేహం పెట్టుకోకుండా హాయిగా తినవచ్చును . ప్రతి మామిడిపండు సేవనం కొవ్వు రహితం మరియు సోడియం రహితం మాత్రమే కాదు, కొవ్వురహితం కొలెస్ట్రాల్ కూడా!

మామిడి ఒక అద్భుతమైన ఆహారంగా (సూపర్‌ఫుడ్) పరిగణించబడుతుంది.  ఎందుకంటే ఇది 20 కంటే ఎక్కువ విభిన్న విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉంది .

యూ.ఎస్.డి.ఏ(USDA) పోషకాహారాల దత్తఅంశాల (న్యూట్రియెంట్ డేటాబేస్) ప్రకారం, మామిడిపండు  యొక్క 100 గ్రాములు క్రింది విలువలను కలిగి ఉంటుంది.


పోషకాలు:100 గ్రాములకు
నీరు:83.46 గ్రా
శక్తి:60 kCal
ప్రోటీన్:0.82 గ్రా
ఫాట్స్:0.38 గ్రా
పిండిపదార్థాలు:14.98 గ్రా
ఫైబర్:1.6 గ్రా
చక్కెర;13.66 గ్రా

మినరల్స్: 

కాల్షియం:11 mg
ఐరన్:0.16 mg
మెగ్నీషియం:10 mg
ఫాస్ఫర్స్:14 mg
పొటాషియం;168 mg
సోడియం:1 mg
జింక్:0.09 mg

విటమిన్లు

విటమిన్ సి:36.4 mg
విటమిన్ B1:0.028 mg
విటమిన్ B2:0.038 mg
విటమిన్ B3:0.669 mg
విటమిన్ B6:0.119 mg
విటమిన్ B9:43 μg
విటమిన్ ఎ:54 μg
విటమిన్ ఇ:0.9 mg
విటమిన్ కె:4.20 μg

కొవ్వులు / కొవ్వు ఆమ్లాలు

 సాచ్యురేటెడ్:0.092 గ్రా
మోనోఅన్శాచ్యురేటెడ్:0.14 గ్రా
పాలీఅన్శాచ్యురేటెడ్:0.071 గ్రా


మామిడి ఆరోగ్య ప్రయోజనాలు

మామిడి కేవలం వేసవిలో లభించే కమ్మనైన పండు మాత్రమే కాదు.  ఇది ఒక క్రియాశీల సమ్మేళనాలను కలిగి ఉన్న ఒక ఆరోగ్యకరమైన మరియు పోషకాహారభరితమైన ఆహారం.  వివిధ ఆరోగ్య పరిస్థితులకు చికిత్సా ప్రభావాలతో కూడిన మామిడిపండు మన శరీరంలో మధ్యవర్తిత్వం జరిపి మేలు బాగా  చేస్తుంది. 


మామిడి వడదెబ్బను (heat stroke) నిరోధిస్తుంది: మామిడి రసం (mango juice) లేదా ఆమ్ పన్నా, తాగడంవల్ల శరీరంలో శీతలీకరణ ప్రభావాన్ని చాలా  కలిగిస్తుంది.  ఆ కారణంగా, శరీరంలో వేడిని అరికట్టడానికి మామిడి ఒక అద్భుతమైన చిట్కా పరిహారం. వేసవి నెలలలో మీ శరీరానికి తగినంతగా నీటిని అందజేయడానికి మామిడిని ‘మ్యాంగో షేక్’ రూపంలో కూడా  తీసుకోవచ్చును .

మామిడి మలబద్ధకాన్ని ఉపశమింపజేస్తుంది: పీచుపదార్థం (ఫైబర్) మంచి వనరుగా ఉండటంతో, మామిడి మలాన్ని మృదువుగా మార్చడానికి దోహదం కూడా  చేస్తుంది .  ఎలిమెంటరీ కాలువ ద్వారా సులభంగా జారిపోయేటందుకు సహాయపడుతుంది, తద్వారా మలబద్ధకం తొలగించడం  కూడా జరుగుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది: మామిడికి అంతర్లీనంగా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంది.  అంటే అవి మీ రక్తంలో చక్కెర స్థాయిలపై గణనీయమైన ప్రభావం చూపించవు. ఇంకా, ఈ పండులో ఉండే పీచుపదార్థాలు (ఫైబర్) మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి పేగుల్లోంచి గ్లూకోజ్ శోషణను కూడా  తగ్గిస్తుంది.

గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది: మామిడ్లు సహజమైన హైపోలిపిడెమిక్ (కొలెస్టరాల్‌ను తగ్గించడం) గుణాన్ని కలిగినవి మరియు పొటాషియం యొక్క అద్భుతమైన మూలం.  రెండోది ఇది రక్తపోటు స్థాయిలను నిర్వహించడంలోనూ కూడా  సహాయపడుతుంది. గుండె పోటు మరియు స్ట్రోక్ వంటి గుండె కండరాల (కార్డియోవాస్కులర్) రుగ్మతల ప్రమాదాన్ని తగ్గించడానికి మామిడి యొక్క ఈ లక్షణాలన్నీ కలిసి  బాగా పనిచేస్తాయి.

చర్మం కోసం ప్రయోజనాలు: మామిడికాయలు విటమిన్ A మరియు C లను పుష్కకలంగా కలిగి ఉన్నాయి . ఈ విటమిన్లు రెండూ కూడా చర్మపు పునరుత్పత్తి మరియు చర్మం సమగ్ర నిర్వహణలో ముఖ్యమైన పాత్రను కలిగి ఉంటాయి. ఈ రెండు విటమిన్లు చర్మం రంధ్రాలను శుభ్రం చేసి మోటిమలు రాకుండా కూడా నిరోధిస్తాయి.

కంటికి మంచిది: కంటి ఆరోగ్యాన్ని పెంపొందించే పోషకాలను మరియు విటమిన్లతో మామిడి నిండి ఉంటుంది. ఈ పండులోని విటమిన్ A మరియు కెరోటిన్ దృష్టి నష్టాన్ని నివారించి  మరియు వయసుకు సంబంధించిన కంటి వ్యాధులైన  మాక్యులార్ డిజెనరేషన్ మరియు కంటిశుక్లం వ్యాధుల ప్రమాదాన్ని నుండి మామిడి తగ్గిస్తుంది.

 • మామిడి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది 
 • కళ్ళకు మామిడి ప్రయోజనాలు 
 • చర్మానికి మామిడి ప్రయోజనాలు
 • బలమైన ఎముకలకు మామిడి 
 • కాలేయానికి మామిడి
 • వడదెబ్బకు మామిడి
 • మామిడి యొక్క క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు 
 • మామిడి బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది 
 • మలబద్ధకానికి మామిడి 
 • మామిడి రోగనిరోధక శక్తిని పెంచుతుంది 
 • రక్తపోటుకు మామిడి 
 • చక్కెరవ్యాధికి మామిడి


మామిడి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది 

మామిడిపండ్లు తినడంవల్ల దానిలోని అనేక పోషకాహారాలు శరీరంలోని కొవ్వు (కొలెస్ట్రాల్) స్థాయిల మీద లాభదాయకమైన ప్రభావాన్నికూడా  కలిగిస్తాయి. మామిడిలో ఉన్న ఆహారపీచుపదార్థాలు (ఫైబర్) కొన్ని కొవ్వుల్ని కూడా  బంధిస్తుంది, ఆ తర్వాత దాన్ని మలంతోపాటు విడుదల చేస్తుంది. అదనంగా, కరిగే పీచుపదార్థాలు (ఫైబర్లు) శరీరంలోని లిపిడ్ జీవక్రియతో కూడా కలుస్తుంది.  ఇది కొవ్వుల (కొలెస్ట్రాల్) స్థాయి తగ్గడానికి కూడా దారితీస్తుంది.

వైద్య ప్రయోగాల యొక్క విశ్లేషణ ప్రకారం, విటమిన్ సి, తక్కువ సాంద్రత (చెడు) కొవ్వులు మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా, విటమిన్ సి ఒక అద్భుతమైన ప్రతిక్షకారిణి. ఇది ధమనులలో కొవ్వుల ఆక్సీకరణను కూడా నిలిపివేస్తుంది.  తద్వారా అథెరోస్క్లెరోసిస్  మరియు ‘కరోనరీ ఆర్టరీ వ్యాధి’ వల్ల ధమనుల్లో ఏర్పడే ఫలకాన్ని కూడా నివారిస్తుంది.


కళ్ళకు మామిడి ప్రయోజనాలు 

మామిడి మంచి పోషకాలతో నిండి ఉంటుంది. మామిళ్ళు విటమిన్లు, కాల్షియం, మరియు మెగ్నీషియం ఇనుముతో నిండి ఉంటాయి. మామిడిలో ఉండే బీటా-కెరోటిన్ మరియు విటమిన్ ఎ కళ్ళ ఆరోగ్యానికి మరియు శ్రేయస్సుకు మంచిది. "వృద్ధాప్యానికి సమీపిస్తున్న కంటికి పోషకాహారం” అనే అధ్యయనం ప్రకారం, విటమిన్ E, విటమిన్ సి, మరియు బీటా-కెరోటిన్ వంటి ఆహార పదార్థాలు కంటిశుక్లం మరియు మక్యూలర్ డిజెనెరేషన్ వంటి వయసు-సంబంధిత కంటి వ్యాధులను నివారించడంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అందువల్ల, మామిడి యొక్క సాధారణ క్రమసేవనం మీ కళ్ళను  ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా మరియు యవ్వనంగా కూడా ఉంచవచ్చును .


చర్మానికి మామిడి ప్రయోజనాలు 

మామిడిలో ఉండే విటమిన్లు చర్మాన్ని ఆరోగ్యంగా మరియు యవ్వనంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. మామిడిలోని విటమిన్ A మరియు విటమిన్ సి లు చర్మా న్ని  సరిచేయడానికి కూడా సహాయపడతాయి. ఇది రంధ్రాలను శుభ్రపరుస్తుంది మరియు మొటిమలు రాకుండా చేసి చర్మాన్ని రక్షిస్తుంది. అందువల్ల మామిడిని బాగా తినేవాళ్లు స్వచ్చమైన చర్మాన్ని కలిగి ఉంటారు. ముఖం అందానికి మెరుపు రావడానికి మీరు తేనె మరియు శనగ పిండిని  (besan flour) మామిడి గుజ్జుతో కలిపి ఇంట్లోనే ముఖంపై పట్టీని (face pack)  వేసుకోవచ్చును . మామిడిని తినడంవల్ల దాని యొక్క అనామ్లజని లక్షణాలు చర్మానికి అలెర్జీలు మరియు ముడుతలు కలగకుండా కూడా రక్షిస్తుంది.


బలమైన ఎముకలకు మామిడి 

మామిడి లోని అధిక విటమిన్లు మరియు ఖనిజ పదార్థాలు.  ఎముక ఆరోగ్యానికి ఈ ఫలాన్ని ఓ పరిపూర్ణమైన ఫలంగా మారుస్తుంది. మామిడి పండ్లను తినడంవల్ల ఎముకలు విరగడాన్ని కూడా నివారించి  ఎముక బలాన్ని మెరుగుపరిచి  మరియు ఎముక సాంద్రతను కూడా  పెంచుతుంది.

మంట-వాపును మానుపే (యాంటీ ఇన్ఫ్లమేటరీ) గుణాలు మరియు ప్రతిక్షకారిణి (యాంటీ- ఆక్సిడెంట్) అయిన మామిడి స్వేచ్చారాశులు (ఫ్రీ రాడికల్స్) కల్గించే ఎముక నష్టాన్ని  తగ్గించడంతో పాటుగా కీళ్లనొప్పుల (ఆర్థరైటిస్) యొక్క లక్షణాల నుంచి  ఉపశమనం చేయటానికి కూడా సహాయపడుతుంది.


కాలేయానికి మామిడి 

మామిడిలో కాలేయాన్ని రక్షించే (హెపాటోప్రొటెక్టివ్) లక్షణాలను కలిగి ఉండవచ్చునని. ‘మంగిఫెరిన్’ అనబడే ఒక ముఖ్యమైన రసాయన సమ్మేళనం మామిడిలో కూడా ఉంది.  ఇది కాలేయ నష్టాన్ని తగ్గిస్తుంది. రక్త సరఫరా అకస్మాత్తుగా రభసగా వెనక్కి తిరిగి వచ్చినపుడు కణజాలాలకు గాయం కల్గించడం మూలంగా ఏర్పడే పేగు రెఫెర్ఫ్యూజన్ వలన కలిగే కాలేయ నష్టాన్ని మామిడిలోని మంగిఫెరిన్ తగ్గించగలదని చాలా అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ చర్యను మంగిఫెర్న్ కొన్ని సిగ్నలింగ్ మార్గాల్లో జోక్యం చేసుకోవచ్చని సూచించబడింది. మామిడి యొక్క శోథ నిరోధక మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మామిడి యొక్క కాలేయ రక్షక (హెపాటోప్రొటెక్టివ్) చర్యకు కూడా కారణమయ్యాయి.

మామిడి పండ్లను తినడం ద్వారా హ్యాంగోవర్‌ను తగ్గించవచ్చును .  మద్యపానంవల్ల రక్తంలో మిగులుండే మద్యం స్థాయిని (hangover) మామిడిపండు సేవనం తగ్గించగలదని మునుపటి అధ్యయనం ధ్వారా పేర్కొంది.


వడదెబ్బకు మామిడి 

వేసవిలో మనం ఆరోగ్యంపట్ల ఎక్కువ జాగ్రత్తగా ఉండి  మరియు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి కూడా ఉంటుంది. ఎండా కాలంలో మన శరీరానికి తగినంతగా నీటిని కల్పించేందుకు నీళ్లను ఎక్కువాగా తాగాల్సి ఉంటుంది. వేసవిలో పండిన మామిడి రసాన్ని తాగ్గడంవల్ల మనం బాగా సేద (రిఫ్రెష్) తీరగలం. అలాగే పచ్చి మామిడి రసాన్ని ‘ఆమ్ పన్నా’ అని కూడా  పిలుస్తారు.  ఈ పచ్చి మామిడి రసాన్ని సేవించడంవల్ల శరీరం కూడా  చల్లబడుతుంది. మామిడిరసాన్ని వడదెబ్బను నివారించడానికి మరియు వడదెబ్బ నుండి కోలుకునే చికిత్సకు ఉపయోగిస్తారు . వడదెబ్బను నివారించడానికి అత్యంత సహజ నివారణాల్లో మామిడి పండు ఒకటి.


రక్తహీనతకు మామిడి

మామిడిలో మన శరీరానిక్కావలసిన ఇనుము (ఐరన్ కంటెంట్) ఎక్కువగా  ఉంటుంది. మామిడిలోని ఇనుము రక్తహీనతను నివారించడంలో కూడా సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో ఉంటే మామిడిపండ్లు తినడం మంచిదని సిఫారస్ చేయడమైనది. శరీరంలో ఇనుమును గ్రహించటానికి సహాయపడే విటమిన్ సి మామిడిపండ్లలో పుష్కలంగా ఉంది.


మామిడి యొక్క క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు 

రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు కాన్సర్, మరియు కాలేయ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వివిధ రకాలైన క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పనిచేసే పదార్థాలు మామిడి మరియు మామిడి తొక్కల్లో (mango peel) పుష్కలంగా ఉంటాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. మామిడి గుజ్జులోని కేరోటినాయిడ్స్, ఆస్కార్బిక్ ఆమ్లం, టెర్పెనోయిడ్స్ మరియు పాలిఫేనోల్స్ క్యాన్సర్ పెరుగుదల మరియు వ్యాప్తిని నివారించడంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

ఫైటోఫార్మకాలజీ జర్నల్ అనే పత్రికలో పేర్కొన్న ఒక అధ్యయనం ప్రకారం, మామిడి తొక్కలో కొన్ని శక్తివంతమైన క్యాన్సర్ వ్యతిరేక (యాంటి-క్యాన్సర్సర్) లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే, మామిడి గుజ్జు బీటా-కెరోటిన్ కు మంచి వనరు. రొమ్ము క్యాన్సర్‌ను నివారించడంలో బీటా-కరోటిన్ అధికంగా ఉన్న ఆహారపదార్థాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తామని పేర్కొన్నారు. బీటా-కెరోటిన్ అనేది వివిధ పండ్లలో ఉన్న ఒక సహజ సమ్మేళనం.  ఇది కణితి మరియు క్యాన్సర్ కణాల పెరుగుదలలో ఓ నిరోధక ప్రభావాన్ని కలిగి ఉంటుందని అధ్యయనాలు కూడా సూచిస్తున్నాయి.

అయినప్పటికీ, క్యాన్సర్ చికిత్సలో మామిడి పండు యొక్క పోషకాహార అనుబంధకాహారంగా (సప్లిమెంట్ గా) లాభాలను తెలుసుకోవడానికి ఇంకా ఎక్కువ పరిశోధన అవసరం ఉంది.


మామిడి బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది

మామిడిపండ్లను పరిమిత పరిమాణంలో తింటే బరువును కోల్పోవడంతో సహాయపడతాయి. ఒక కప్పు మామిడి పండులో కేవలం 100 కేలరీలు మాత్రమే కూడా  ఉంటాయి. కాబట్టి మీరు మామిడిపండ్లను తినడం ద్వారా ఊబకాయం పెరుగుతుందని చింతించడం కూడా మానివేయవచ్చును . అంతేకాక, మావిడిపండ్లలో యాంటీఆక్సిడెంట్ విటమిన్లు దండిగా ఉంటాయి మరియు కొవ్వులు దాదాపుగా  ఉండవు కాబట్టి, మామిడిపండ్లను తినడంవల్ల అవి మీ శరీర బరువు నిర్వహణలో కూడా సహాయపడగలవు.


మలబద్ధకానికి మామిడి 

మలబద్దకంతో బాధపడుతున్నవారికి మామిడి పండ్ల సేవనం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మామిడిపండ్లు ఆహార పీచుపదార్థాలను మరియు అధిక నీటి పదార్థాల్ని కలిగి ఉంటాయి. అందువల్ల, మామిడిపండ్లు తినడంవల్ల ప్రేగుల పనితీరును క్రమబద్ధం చేయడంలో కూడా సహాయపడుతుంది.  తద్వారా మలబద్ధకాన్ని నివారించవచ్చును . మామిడిలో ఉన్న పీచుపదార్థం (ఫైబర్ కంటెంట్) పేగుల్లో మలాన్ని మృదువుగా మార్చగలదు, తద్వారా, మలవిసర్జనం కూడా సులభతరమవుతుంది. అందువల్ల, మలబద్దకంతో బాధపడేవారు ఆహారంతోపాటుగా మామిడిపండ్లను తినడం మంచిదని బాగా సిఫార్సు చేయబడింది.


మామిడి రోగనిరోధక శక్తిని పెంచుతుంది 

మామిడిలో ఉన్న విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థ యొక్క అద్భుతమైన బలవర్థకం (booster). మామిడి కేవలం రోగనిరోధక శక్తిని బలపరచేది మాత్రమే కాదు.  సాధారణ అంటురోగాలకు నివారించడంతో కూడా సంబంధం కలిగి ఉంది. అదనంగా, మామిడిపండ్లలో విటమిన్ B6 మరియు విటమిన్ E లుపుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థ యొక్క ఆరోగ్యానికి ఈ రెండు విటమిన్లు కూడా చాలా అవసరం. అందువలన, మామిడిలో ఉన్న విటమిన్లు వ్యాధులు, సూక్ష్మజీవులు (జెర్మ్స్) మరియు అంటురోగాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే సామర్థ్యాన్ని శరీరానికి కూడా  కలుగజేస్తుంది.


రక్తపోటుకు మామిడి 

అధిక రక్తపోటు లేదా అధిక రక్తఒత్తిడి ప్రపంచవ్యాప్తంగా చాలా సాధారణ సమస్యగా మారింది నేడు. ఒకప్పుడీ అధిక రక్తపోటు వృద్ధులకు సంభవించే వ్యాధి, కానీ ఇప్పుడు యువకులకు కూడా తరచూ సంభవించడం జరుగుతోంది. చాలామంది వైద్యులు ఈ రక్తపోటు రుగ్మతను జీవనశైలి ఒత్తిడి మరియు ఆహార సేవన నమూనాలకు ముడి పెట్టడం జరుగుతోంది. ప్రస్తుతం, రక్తపోటు చికిత్సకు ఔషధాలతో పాటు పండ్లు మరియు కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం జరుగుతోంది. ఒక పండుగా మామిడి రక్తపోటు స్థాయిల్ని నిర్వహించడానికిగాను సరైన ఆహార ఎంపిక. శరీరంలోని ఉప్పు పదార్థాల్ని సంతులనం చేయడం ద్వారా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే పొటాషియంను మామిడి దండిగా కల్గి ఉంది. అదనంగా, మామిడిలో కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి . కాబట్టి, మామిడిపండ్ల సేవనం మీ శరీరంలో క్రొవ్వు పదార్ధాలను పెంచదు, రక్తంలో కొవ్వులు అనగానే సాధారణంగా ధమనులతో కొవ్వులు అడ్డుపడి రక్తప్రసరణకు అడ్డంకి ఏర్పడి గుండె మీద ఒత్తిడిని పెంచడంతో సంబంధం ఉంటుంది.


చక్కెరవ్యాధికి మామిడి 

మామిడిపండ్లు రక్తంలో ఇన్సులిన్ స్థాయిల్ని నియంత్రించడానికి సహాయపడతాయి. మామిడిలో చాలా తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. (అంటే మామిడిసేవనంవల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు.) అందువలన, మామిడిపండ్లు తినడం ద్వారా రక్తంలో ని  చక్కెర స్థాయి పెరగదు.

అంతేకాకుండా, మామిడిపండ్లు పీచుపదార్థాలకు ఓ మంచి మూలం.  ఇవి రక్తంలో చక్కెరను నియంత్రించటానికి కూడా బాధ్యత వహిస్తాయి. మామిడిలో ఉన్న ఈ  పీచుపదార్థాలు పేగుల్లో ఆహారం ఉండే సమయాన్ని కూడా  పెంచుతాయి.  దానివల్ల రక్తంలో గ్లూకోజ్ నెమ్మదిగా విడుదలయ్యేందుకు దారితీస్తుంది. అందువలన, చక్కెరవ్యాధి ఉన్నవాళ్లకు మామిడి ఒక సురక్షితమైన పండుగా పరిగణించబడుతుంది. అయితే, మీరు గనుక చక్కెరవ్యాధి కల్గినవారైతే  (డయాబెటిక్) మామిడి పండ్లను తినేందుకు ముందుగా మీ డాక్టర్‌తో మాట్లాడడం మంచిది.


మామిడి దుష్ప్రభావాలు 

 • కొందరు వ్యక్తులు మామిడిపండ్లను తింటే అలెర్జీలకు గురయ్యే అవకాశం ఉంటుంది .
 • మామిడిపండ్లను దండిగా తింటే గనుక కడుపులో ప్రతికూల ప్రభావాన్ని కలిగించి  మరియు అది అతిసారానికి కూడా దారి తీయవచ్చును  .
 • మామిడి జిగట (latex) లేక రసం కూడా కొంతమందికి అలెర్జీని కల్గిస్తుంది. 
 • వాంతులు మరియు శ్వాసకోశ ఇబ్బందులు వంటివి మామిడి రసం అలెర్జీ వలన అనుభవించగల మరి  కొన్ని దుష్ప్రభావాలు.
 • చాలా దండిగా మామిడిపండ్లను తినడంవల్ల కూడా బరువు పెరగవచ్చును .
 • మామిడి పండ్లు తినడంవల్ల ఇప్పటికే చక్కెరవ్యాధితో (మధుమేహంతో) బాధపడుతున్న వ్యక్తుల రక్తంలో చక్కెర స్థాయి కూడా పెరుగుతుంది.
 • నేటి రోజుల్లో, మామిడికాయల్ని కృత్రిమంగా పండ్లుగా మార్చే పద్ధతిని  చాల పాటిస్తున్నారు. ఇటువంటి కృత్రిమ మాగుడు పధ్ధతిలో మాగిన మామిడిపండ్లను తినడంవల్ల క్యాన్సర్, నాడీ సంబంధిత రుగ్మతలు, కడుపులో నోప్పి ఉదర రుగ్మతలు వివిధ ఇతర వ్యాధులు  రావడానికి  దారితీస్తుంది.


ఉపసంహారం

మామిడిపండ్లు తినడంవల్ల కలిగే ప్రయోజనాలు అద్భుతంగా ఉంటాయి. మీరు బలంగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి మీ ఆహారంలో మామిడిపండ్లను కూడా చేర్చాలి. మామిడిపండ్లను తినడమంటే అందరికీ ఇష్టమే.  విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి దీనిలో, ఈ ఖనిజాలన్నీ మానవ శరీరానికి చాలా ముఖ్యమైనవి. మామిడిపండు లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ (మంట-వాపును తగ్గించేది) మరియు యాంటీ-క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి. ఈ కారణంగా, ఇంకా, దాని బహుముఖ జీవరసాయనిక చర్యలు మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్షణాలను పొందడం కోసం ఈ పండును ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో చేర్చదిగింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post