గ్లిసరిన్ ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు

గ్లిసరిన్ ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు గ్లిసరాల్, లేదా గ్లైకాల్ అని కూడా గ్లిసరిన్ ను పిలుస్తారు, ఇది ఒక ఆర్గానిక్ సమ్మేళనం, ఇది కూరగాయల కొవ్వు మరియు నూనె నుండి తయారవుతుంది. ఇది రంగు, వాసన లేని మరియు విషరహిత (నాన్-టాక్సిక్) ద్రవం. ఇది తీపి రుచితో ఉంటుంది.

గ్లిసరిన్ హైడ్రేటింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది మరియు పొడి చర్మం, సోరియాసిస్ మరియు తామర వంటి వివిధ చర్మ సమస్యలకు సమర్థవంతమైన చికిత్సగా పనిచేస్తుంది. ఇది చర్మానికి గొప్ప మాయిశ్చరైజింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది మరియు క్రమంగా దీనిని ఉపయోగిస్తే చర్మానికి  పోషణను అందించగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. చర్మంపై కొన్ని రసాయనాల వలన కలిగే ప్రతికూల చర్యలను నివారించడంలో కూడా ఇది సహాయపడుతుంది. సాధారణంగా శిశువు సంరక్షణ ఉత్పత్తులు (baby care products), సబ్బులు మరియు ఇతర సౌందర్య ఉత్పత్తులలో గ్లిజరిన్ ఉంటుంది.

దాని విషరహిత మరియు తీపి లక్షణాల కారణంగా, గ్లిసరిన్ ను సంరక్షణకారిగా (preservative) మరియు ఆహార స్వీటెనర్ గా కూడా ఉపయోగిస్తారు.

గ్లిసరిన్ ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు

గ్లిసరిన్ గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:


శాస్త్రీయ నామం: గ్లిజరిన్ యొక్క శాస్త్రీయ నామం ప్రొపేన్- 1, 2, 3-ట్రైయోల్
రసాయన సూత్రం: గ్లిజరిన్ యొక్క రసాయన సూత్రం C3H8O3.
సాధారణ పేరు: గ్లిసరిన్
వనరులు: జంతువుల కొవ్వులు, కూరగాయల నూనెలు మరియు పెట్రోలియం - ఈ మూడు ప్రధాన వనరుల నుండి గ్లిసరిన్ను పొందవచ్చు.
గ్లిసరిన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు: శీతాకాలం సమీపిస్తున్నప్పుడు, చాలా కీటకాలు వాటి శరీరంలోని నీటి పరిమాణాన్ని(కంటెంట్‌ను)  గ్లిసరాల్‌తో భర్తీ చేసుకుంటాయి. ఎందుకంటే ముఖ్యంగా ప్రపంచంలోని అతి శీతల ప్రాంతాలలో, గ్లిసరాల్ ఈ కీటకాలను గడ్డకట్టకుండా నిరోధించే యాంటీ-ఫ్రీజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. 

 • గ్లిసరిన్ ఆరోగ్య ప్రయోజనాలు 
 • గ్లిసరిన్ దుష్ప్రభావాలు
 • ఉపసంహారం 


గ్లిసరిన్ ఆరోగ్య ప్రయోజనాలు

వాపును తగ్గిస్తుంది: గ్లిసరిన్ వివిధ చర్మ సమస్యలకు వ్యతిరేకంగా యాంటీ ఇన్ఫలమేటరీ చర్యలను కలిగి ఉంటుంది. గ్లిసరిన్ చర్మం యొక్క హైడ్రేషన్ ను మెరుగుపరుస్తుందని మరియు ఇది గాయం జరిగిన భాగంలో వాపును అధికంగా కలిగించే తెల్లరక్త  కణాలను తగ్గిస్తుందని ఒక అధ్యాయం తెలిపింది.   

యాంటీ మైక్రోబియల్ చర్యలు: పరిశోధనలు వివిధ రకాల గ్లైకోల్స్ సూక్ష్మజీవుల పై పోరాడగల యాంటీ మైక్రోబియల్ చర్యలు కలిగి ఉంటాయని తెలిపాయి. పోలీఇథిలీన్ గ్లైకోల్, ప్రోపీలీన్ గ్లైకోల్ వంటివి శుద్ధమైన గ్లైకోల్ కంటే అధిక యాంటీ మైక్రోబియల్ చర్యను కలిగి ఉంటాయి.

ఫోటోథెరపీలో చర్మాన్ని కాపాడుతుంది: ఫోటోథెరపీ ఉపయోగించి తామర మరియు సోరియాసిస్ వంటి చర్మ సమస్యలకు చికిత్స చేస్తారు.దీని వలన చర్మ ఎర్రపెక్కుతుంది. గ్లిసరిన్ ఈ ఎరుపుదాన్ని తగ్గించడంలో ప్రభావంతంగా ఉంటుంది.

హైడ్రేషన్ కోసం: గ్లిసరిన్ డీహైడ్రేషన్ను నివారిస్తుంది తద్వారా శరీర శ్రమ చేసే సమయంలో అలసటను తగ్గించి పని చేసే సామర్ధ్యాన్ని పెంచుతుంది. మంచి హైడ్రేషన్ కు గ్లిసరిన్ ముఖ్యమైనది.

మెదడు కోసం: గ్లిసరిన్ వంటి ఒస్మాటిక్ డైయూరేటిక్లు మెదడు వాపు/ఎడెమా ను తగ్గిస్తాయని పరిశోదనలు తెలిపాయి. ఇవి మెదడులో ఉండే అధిక నీటిని పీల్చుకోవడం ద్వారా ఇంట్రాక్రేనియాల్ ప్రెషర్ ను 50% వరకు తగ్గిస్తాయని తెలిసింది.

గ్లకోమా కోసం: కంటిలో పీడనం/ఒత్తిడి సాధారణం కంటే అధికమవ్వడాన్ని గ్లకోమా అని అంటారు. గ్లకోమా చికిత్సకు శస్త్రచికిత్స అవసరమవుతుంది. ఈ చికిత్స ముందు లేదా  తర్వాత గ్లిసరిన్ ఉండే మందుల ఇస్తారు. గ్లిసరిన్ను ఓరల్ గాతీసుకోవడం వలన కంటిలో ఉండే అధిక పీడనం తగ్గుతుందని అధ్యయనాలు తెలిపాయి.ఇది గ్లకోమా రకాల మీద ఆధారపడి ఉంటుంది. 
 గ్లిసరిన్ పొడి చర్మ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే మలబద్దకం చికిత్సలో కూడా ఉపయోగపడుతుంది.

 • గ్లిసరిన్ యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది 
 • గ్లిసరిన్ వాపును తగ్గిస్తుంది 
 • గ్లిసరిన్ చర్మ పెర్మియబిలిటీ మెరుగుపరుస్తుంది 
 • గ్లిసరిన్ యాంటీమైక్రోబయాల్ చర్యలను చూపుతుంది -
 • గ్లిసరిన్ ఫోటోథెరపీ సమయంలో చర్మాన్ని రక్షిస్తుంది 
 • గ్లిజరిన్ హైడ్రేషన్ కోసం ఉత్తమమైనది 
 • గ్లిసరిన్ మెదడు వాపును తగ్గిస్తుంది 
 • గ్లాకోమాకు గ్లిసరిన్ ప్రయోజనాలు 
 • గ్లిసరిన్ మలబద్ధకానికి మంచిది 


గ్లిసరిన్ యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది 

చర్మం శరీరంలో అతిపెద్ద అవయవం మరియు ఇది ఉష్ణోగ్రత నియంత్రణ, సంరక్షణ మరియు ఇంద్రియ అవగాహనతో (sensory perception) సహా వివిధ బాధ్యతలను నిర్వహిస్తుంది. చర్మ  ఏజింగ్ (వృద్ధాప్యం) అనేది ఒక సహజ ప్రక్రియ ముడతలు, చర్మం పాలిపోవడం, పొడి చర్మం మరియు వయస్సు సంబంధిత మచ్చలు ఏర్పడడం అనేవి దీని సాధారణ లక్షణాలు. యాంటీ ఏజింగ్ ప్రక్రియలో తేమ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పరిశోధన వెల్లడించింది. చర్మంలో తేమను నింపగల/ఏర్పర్చగల సామర్థ్యం ఉన్నందున చాలా కాస్మెటిక్ ఏజెంట్లలో గ్లిసరిన్ను ప్రధాన పదార్ధాలలో ఒకటిగా ఉపయోగిస్తారు, తద్వారా చర్మం పొడిబారకుండా మరియు పై పొర తొలగిపోకుండా ఉంటుంది.


గ్లిసరిన్ వాపును తగ్గిస్తుంది 

రసాయన-ఆధారిత ఉత్పత్తుల క్రమమైన ఉపయోగం అలెర్జీ ప్రతిచర్యలు మరియు చర్మంలో చికాకు (ఇర్రిటేషన్) ను ఏర్పరుస్తుంది. ఈ సమస్యలను తగ్గించడానికి గ్లిజరిన్ సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇన్ఫెక్షన్ సోకిన చర్మానికి గ్లిజరిన్ మెరుగైన హైడ్రేషన్‌ అందిస్తుందని మరియు గాయం జరిగిన ప్రదేశంలో తెల్ల రక్త కణాలు (లింఫోసైట్లు) అధికంగా పోగుపడాన్ని  నిరోధిస్తుందని ఒక ప్రీ క్లినికల్ అధ్యయనం తెలిపింది. ఈ లింఫోసైట్లు గాయం తర్వాత వాపు మరియు ఎరుపుదనానికి కారణమవుతాయి. అలాగే, సైటోకిన్‌లు ప్రేరేపించే మంట మరియు వాపును కూడా ఇది తగ్గింస్తుందని కనుగొనబడింది. అందువల్ల గ్లిజరిన్ వివిధ చర్మ సమస్యలకు వ్యతిరేకంగా యాంటీ-ఇరిటెంట్ మరియు యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలను కలిగి ఉంటుందని చెప్పవచ్చు.

గ్లిసరిన్ చర్మ పెర్మియబిలిటీ మెరుగుపరుస్తుంది 

మానవ చర్మం తక్కువ ప్రవేశ్యత (పెర్మియబిలిటీ) కలిగి ఉంటుంది. ఇది బయటి పదార్దాలు శరీరంలోకి ప్రవేశించకుండా చేస్తుంది. అయితే, చర్మంలో సహజమైన తేమ కారకాలు ఉంటాయి, ఇవి నీటితో కలిసి (బైండ్ అయ్యి) చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. గ్లిసరిన్ అటువంటి ఒక సహజ తేమ కారకం (natural moisturizing factors [NMF]) అని అంటారు మరియు అనేక సౌందర్య ఉత్పత్తులు గ్లిజరిన్ను ఒక ప్రధాన పదార్ధాలలో ఒకటిగా ఉపయోగించటానికి ఇది ఒక కారణం.

డిహైడ్రేటెడ్ చర్మం ఆరోగ్యకరమైన చర్మం కంటే చాలా తక్కువ ప్రవేశ్యతను కలిగి ఉంటుంది మరియు దానికి గాయాన్ని నయం చేసే సామర్థ్యం కూడా చాలా తక్కువ ఉంటుంది. గ్లిజరిన్ యొక్క హైడ్రేటింగ్ లక్షణాలు పొడి చర్మ సమస్యను గణనీయంగా మెరుగుపరుస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. చర్మపు అల్సర్స్/పుండ్ల చికిత్సకు ఉపయోగించే కొన్ని సమయోచిత మందులను చర్మంపై నిలిపివుంచడానికి కూడా గ్లిజరిన్ సహాయపడుతుందని నిరూపించబడింది.


గ్లిసరిన్ యాంటీమైక్రోబయాల్ చర్యలను చూపుతుంది

మన చర్మం వివిధ బ్యాక్టీరియా మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్లకు గురవుతుంది. వివిధ వ్యక్తిగత కారకాలపై ఆధారపడి ఈ అంటువ్యాధులు తేలికపాటి నుండి తీవ్రమైనవిగా ఉంటాయి. ఇవి బాధ కలిగించడమే కాకుండా చాలా అసౌకర్యానికి కూడా కలిగిస్తాయి. వివిధ రకాల గ్లైకాల్‌లకు ఈ సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా పోరాడగల యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.

గ్లిజరిన్ యొక్క వివిధ మిశ్రమాలపై చేసిన ఒక అధ్యయనం, పోలిఇథిలిన్ గ్లైకాల్ 1000 (పిఇజి 1000) సూక్ష్మజీవులపై వ్యతిరేకంగా పనిచేయడంలో అత్యంత ప్రభావవంతమైనదని, దాని తరువాత ప్రొపీలిన్ గ్లైకాల్ ప్రభావవంతమైనదని తెలిపింది. ఎస్. ముటాన్స్ (S. mutans) మరియు ఇ. కోలి (E. Coli) వంటి వ్యాధి కారక బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా ప్రొపిలిన్ గ్లైకాల్ ప్రభావవంతంగా ఉంది. అయితే, స్వచ్ఛమైన గ్లిసరిన్ 100%  సాంద్రతతో (concentration) ఉన్నపుడు మాత్రమే ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొనబడింది.


గ్లిసరిన్ ఫోటోథెరపీ సమయంలో చర్మాన్ని రక్షిస్తుంది 

ఫోటోథెరపీ అనేది ఒక రకమైన చికిత్స, దీనిని సూర్యరశ్మి కాకుండా ఇతర కాంతి కిరణాలను ఉపయోగించడం ద్వారా నిర్వహిస్తారు. తామర మరియు సోరియాసిస్ వంటి వివిధ చర్మ సమస్యలకు చికిత్స చేయడానికి ఈ పద్ధతి ఉపయోగించబడుతుంది. అయితే, ఎరిథీమా అనే ఫోటోథెరపీ ప్రేరిత పరిస్థితి ఏర్పడుతుంది, దీనిలో చర్మం ఎరుపెక్కుతుంది. ఇది ఫోటోథెరపీ ప్రక్రియలో ఒక అవసరమైన భాగం మరియు దాదాపు 48 గంటల్లో నయమైపోతుంది. 32 మంది వాలంటీర్లపై జరిపిన ఒక పరిశోధనలో ఫోటోథెరపీకి ముందు గ్లిజరిన్ ఉపయోగించడం వల్ల ఎటువంటి అధికమైన ప్రతికూల ప్రభావాలు కలుగలేదని మరియు పరిస్థితి నయమవ్వడం కూడా మెరుగుపడిందని తెలిసింది. ఫోటోథెరపీని ప్రారంభించే ముందు చర్మ వ్యాధుల రోగులు గ్లిజరిన్ను ఉపయోగించవచ్చని పరిశోధన తేల్చింది.


గ్లిజరిన్ హైడ్రేషన్ కోసం ఉత్తమమైనది 

వర్కౌట్ తరచుగా డీహైడ్రేషన్కు దారితీస్తుంది, ఇది సామర్ధ్యాన్ని తగ్గిస్తుంది. ఇది మైకము, కండరాల తిమ్మిరి మరియు శక్తి హీనతకు కూడా కారణం కావచ్చు. గ్లిసరాల్ కలిగి ఉన్న పానీయాలు డీహైడ్రేషన్‌ను నివారించడంలో సహాయపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. గ్లిసరిన్ శరీర శ్రమ చేసే సమయంలో అలసటను తగ్గించి మరియు శరీరం యొక్క ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది, తద్వారా పని చేసే సామర్ధ్యాన్ని పెంచుతుంది. ఏదేమైనా, గ్లిజరిన్ తీసుకోవడం పనితీరు పెరుగుదలకు ప్రభావవంతంగా ఉపయోగపడుతుందా అని తెలుసుకోవడానికి  మరింత పరిశోధన అవసరమని అధ్యయనం తేల్చింది.

గ్లిజరిన్ భర్తీ తర్వాత ఏరోబిక్ (వాయు సహిత) మరియు అనారోబిక్ (వాయు రహిత) పనితీరును తెలుసుకోవడానికి 40 మంది వాలంటీర్లపై చేసిన పరిశోధనలో గ్లిజరిన్ ఉన్న పానీయాలు సేవించిన వాలంటీర్లు వారి పనితీరులో గణనీయమైన మెరుగుదలకు  ప్రదర్శించారని వెల్లడైంది.


గ్లిసరిన్ మెదడు వాపును తగ్గిస్తుంది 

మెదడు ఎడెమా లేదా మెదడు వాపు ఏదైనా గాయం లేదా క్యాన్సర్, స్ట్రోక్ మరియు మెనింజైటిస్ వంటి పరిస్థితుల వలన ప్రేరేపించబడుతుంది. ఇది మెదడులోని ఒత్తిడిని పెంచుతుంది, ఇది మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. మెదడు ఎడెమా/వాపు చికిత్సకు గ్లిజరిన్ వంటి ఓస్మోటిక్ డైయూరేటిక్స్ ఉపయోగపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఓస్మోటిక్ డైయూరేటిక్స్ అనేవి నీటిని అధికంగా పీల్చుకోవడాన్ని నిరోధించే ఏజెంట్లు, తద్వారా అవి వాపును తగ్గిస్తాయి. గ్లిజరిన్‌తో చికిత్స ఎడెమా రోగులలో ఇంట్రాక్రేనియల్ ప్రెజర్ (స్కల్ లోపల ఒత్తిడి) 50% తగ్గిస్తుంది. అయితే, గ్లిసరిన్ శరీరంలో డీహైడ్రేషన్కు కారణం కాలేదు (కలిగించదు).


గ్లాకోమాకు గ్లిసరిన్ ప్రయోజనాలు 

కంటి పీడనం (ప్రషర్) మిల్లీమీటర్ల (మెర్క్యూరీ) పాదరసం (mm Hg) లో కొలుస్తారు మరియు సాధారణ పరిధి 12 - 22 mm Hg గా పరిగణించబడుతుంది. అయితే, కంటిలో ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు, ఈ స్థాయిలు పెరగవచ్చు, ఇది గ్లాకోమా అనే పరిస్థితికి దారితీస్తుంది. గ్లాకోమా కంటి  నరాలను దెబ్బతీస్తుంది మరియు చికిత్స చేయకపోతే దృష్టి లోపానికి కూడా  దారితీస్తుంది.

ప్రస్తుతం పాటించే చికిత్సలో అదనపు ఒత్తిడిని తగ్గించడానికి శస్త్రచికిత్స చేయడం జరుగుతుంది. గ్లాకోమా శస్త్రచికిత్సకు ముందు లేదా తరువాత కూడా ఇంట్రాఓక్యులర్ ఒత్తిడిని (కళ్ళలో ఒత్తిడి) తగ్గించడానికి అనేక మందులు ఉపయోగిస్తారు. గ్లిజరిన్ను  ఓరల్ (నోటి ద్వారా) గా తీసుకోవడం వలన కళ్ళలో అధిక ఒత్తిడిని విడుదల చేయడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, దీని ప్రభావం గ్లాకోమా రకంపై ఆధారపడి ఉన్నట్లు కనుగొనబడింది.


గ్లిసరిన్ మలబద్ధకానికి మంచిది 

మలబద్ధకం అనేది ఒక జీర్ణశయా రుగ్మత, ఇది మలవిసర్జనలో కడుపు నొప్పి మరియు ఉబ్బరం వంటి సమస్యలను కలిగిస్తుంది. మలబద్ధకం ప్రాణాంతక వ్యాధి కాదు, అయితే ఇది మలద్వార  రక్తస్రావం, పురీషనాళంలోని రక్త నాళాలు వాపు మరియు దీర్ఘకాలం పాటు చికిత్స చేయకుండా వదిలివేస్తే  పెద్దప్రేగు క్యాన్సర్ వంటి సమస్యలకు దారితీయవచ్చు. సూచించిన మోతాదులో  గ్లిజరిన్ ఒక మంచి భేదిమందుగా పనిచేస్తుందని మరియు ప్రేగు కదలికలను సరిచేయడం  చేయడం ద్వారా మలబద్దకానికి చికిత్స చేయడంలో ఉపయోగపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.


గ్లిసరిన్ దుష్ప్రభావాలు 

 • ఇది అన్ని చర్మ రకాలకు అనుకూలంగా ఉండకపోవచ్చు
 • గ్లిసరిన్ అన్ని చర్మ రకాలకు తగినది కాకపోవచ్చు. అందువల్ల, మొదటిసారి గ్లిజరిన్‌ ఉన్న  ఉత్పత్తిని ఉపయోగించే ముందు జాగ్రత్తగా ఉండాలని సలహా ఇవ్వబడుతుంది. గ్లిజరిన్ను ఉపయోగించే ముందు ఇతర పదార్ధాలతో కూడా కలపాలని సిఫార్సు చేయబడింది. ఉదాహరణకు, ఇది ఉపయోగించే ముందు డిస్టల్లడ్ వాటర్ లేదా రోజ్ వాటర్ తో కలపవచ్చు.
 • గ్లిసరిన్ మలద్వార రక్తస్రావానికి దారితీస్తుంది
 • గ్లిజరిన్ వినియోగం పురీషనాళంలో చికాకు, మంట మరియు రక్తస్రావాన్ని కలిగించవచ్చు. వైద్యుడిని సంప్రదించకుండా గ్లిజరిన్‌తో ఎవరికివారే చికిత్స చేసుకోవడం మంచిది కాదు.
 • ఇతర ప్రతికూల ప్రభావాలు
 • కొద్దిమంది వాలంటీర్లలో, గ్లిజరిన్‌ ఉండే పానీయాల వినియోగం వికారం, జీర్ణశయాంతర సమస్యలు, మైకము మరియు తలనొప్పి వంటి సమస్యలు కలిగిన్నట్లు కనుగొనబడింది.


ఉపసంహారం 

గ్లిసరిన్ ఒక అద్భుతమైన ఉత్పత్తి, ఇది చర్మానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది చర్మ సమస్యలకు ఉపశాంతి కలిగిస్తుంది, మరమ్మతులు (రిపేర్) చేస్తుంది మరియు నయం చేస్తుంది మరియు ఘాడమైన తేమ ప్రభావాలను కలిగి ఉంటుంది. చర్మ సంబంధిత సమస్యలకు ఇది ఉత్తమమైన ఉత్పత్తులలో ఒకటిగా పరిగణించబడుతుంది మరియు దాదాపు అన్ని సౌందర్య ఉత్పత్తులలోనూ ఉంటుంది. అయినప్పటికీ, కొంతమందికి గ్లిజరిన్‌కు అలెర్జీ ప్రతిచర్య ఉండవచ్చు మరియు అందువల్ల స్వీయ-సంరక్షణ చర్యలో భాగంగా దీనిని చేర్చే ముందు జాగ్రత్త వహించడం మంచిది. చర్మ ప్రయోజనాలతో పాటు, మలబద్ధకానికి, మెదడు ఎడెమాకు మరియు గ్లాకోమా వంటి కంటి పరిస్థితులకు చికిత్స చేయడానికి గ్లిజరిన్ మంచి ఔషధంగా కూడా ఉపయోగించబడుతుంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post