మేక పాలు ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు

మేక పాలు ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు భారతీయ ఆహారంలో పాలు ఒక అనివార్యమైన భాగం. పాలను మీరు వెచ్చగా లేక వేడిగా  మరియు చల్లగా లేదా అదనపు రుచులతో కలిపి తాగడానికి ఇష్టపడినా, పాలు ఖచ్చితంగా అనేక  రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. శరీరం యొక్క పోషక అవసరాలను తీర్చడానికి మరియు శరీర పనితీరును చక్కగా పొందడానికి పాలు తాగడం చాలా ముఖ్యం.

పాలలో బలమైన ఎముకలు నిర్మించడానికి అవసరమైన అన్ని  రకాల పోషకాలు ఉన్నాయి. ఇంకా, ఇది ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ మరియు హృదయ సంబంధ రుగ్మతల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. పాలు తాగడం వల్ల అనేక రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధకులు కూడా అంటున్నారు. పాలు తాగడం అందరికీ ముఖ్యం అయితే, శిశువులకు ఇది చాలా ముఖ్యమైనది.

ఇప్పుడు, ఏ పాలు తాగాలనేది చర్చ: ఆవు పాలా లేదా మేక పాలా? మీలో చాలామంది ప్రతిరోజూ ఆవు పాలను తాగుతుండొచ్చును.  కానీ మేక పాలు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా? అవును, మేక పాలు అనేక ప్రయోజనాలను మనకు కలిగిస్తాయి. 

 • మేక పాల పోషకాంశాలు 
 • మేక పాల ప్రయోజనాలు 
 • మేక పాలు ఎలా తాగాలి 
 • మేక పాలు దుష్ప్రభావాలు

మేక పాలు ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు

మేక పాల పోషకాంశాలు 

అమెరికా వ్యవసాయ శాఖ (యుఎస్‌డిఎ) ప్రకారం, 1 కప్పు మేక పాలు కింది పోషకాంశాల్ని కల్గి ఉంటాయి:

శక్తి: 156 కిలో కేలరీలు
ప్రోటీన్: 8 గ్రా
కొవ్వులు: 9 గ్రా
కార్బోహైడ్రేట్లు: 10 గ్రా
చక్కెర: 10 గ్రా
కాల్షియం: 300 మి.గ్రా
సోడియం: 115 మి.గ్రా
విటమిన్ సి: 2.9 మి.గ్రా
కొలెస్ట్రాల్: 24 మి.గ్రా

మేక పాల ప్రయోజనాలు 

మాంసకృత్తులు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు మరియు కాల్షియం అధికంగా ఉన్నందున, మేక పాలు అనేక  రకాల ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. 

బరువు తగ్గుదల కోసం: మేకపాలులో  ఉండే అధిక ప్రోటీన్ పరిమాణం మరియు ప్రభావంతమైన పోషకలు, అవసరమైన కొవ్వులు ఆమ్లాలు వాటిని ఒక తృప్తినిచ్చే (కడుపు నిండిన భావనను కలిగించే) ఆహారంగా కూడా చేసాయి. పరిశోధనలు ఆవు పాల కంటే మేకపాలు కడుపు నిండిన భావనను వేగంగా కలిగిస్తాయని కూడా తెలిపాయి. ఇవి ఆకలిని అణిచివేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి తద్వారా అదనపు కేలరీలను  బాగా కరిగిస్తాయి.

మంచి జీర్ణక్రియకు: మేక పాలలో తక్కువ చైన్లుగల ఫ్యాటీ యాసిడ్లు ఉండి  ఫ్యాట్ మొలిక్యూల్స్ కూడా చిన్నవి ఉంటాయి. మరియు ఇవి ఆవు పాల కంటే ఎక్కువ ఆల్కలైన్ గా కూడా ఉంటాయి ఈ అన్ని లక్షణాలు కలిపి మేక పాలు తేలికగా జీర్ణమయ్యేలా కూడా  చేస్తాయి. జీర్ణ సమస్యలతో బాధ పడుతున్నవారు వారి రోజువారీ దినచర్యలో ఒక కప్పు ఆవు పాలకి బదులు ఒక కప్పు మేకపాలను తీసుకుంటే  చాలా  సహాయకరంగా ఉంటుంది.

ఎముక ఆరోగ్యం కోసం: ఆవు పాల కంటే మేక పాలలో కాల్షియం ఎక్కువ గా ఉంటుందని అధ్యయనాలు  కూడా తెలిపాయి. జంతు-ఆధారిత అధ్యయనం వల్ల  మేక పాలను ఆహారంలో భాగంగా తీసుకుంటే అవి ఎముక శిధిలతను (రిసోర్ప్షన్) నయం చేస్తుందని కూడా సూచించింది. అదనంగా ఎముకలలో అధిక కాల్షియం శాతం కూడా గమనించబడింది.

రుమటాయిడ్ అర్థరైటిస్ కోసం: రుమటాయిడ్ అర్థరైటిస్ అనేది ఒక ఆటోఇమ్మ్యూన్ రుగ్మత.  దీనిలో శరీరంలోని  వివిధ జాయింట్లలో వాపు   కూడా ఏర్పడి  ఇది ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని కూడా కలిగిస్తుంది. అటువంటి సందర్భాలలో మేక పాలు త్రాగడం అనేది ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని నుంచి నివారిస్తుంది.

క్యాన్సర్కు: అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటుగా మేక పాలు కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఒక ఇన్ వివో అధ్యాయంలో మేక పాలు మరియు సొయా పాల యొక్క క్యాన్సర్ ప్రభావాలను పోల్చడం కూడా  జరిగింది. సొయా పాలలో అధిక యాంటీఆక్సిడెంట్ చర్య ఉన్నపటికీ మేక పాలు క్యాన్సర్ ప్రక్రియను నిరోధించచడంలో సమర్థవంతంగా ఉన్నట్లు కనుగొనబడింది.

శిశువులకు: ఆవు పాలకు ఎలర్జీ (అసహనం) ఉండే వారు మేక పాలకు సహనం కలిగి ఉంటారని అనేక పరిశోధకులు  ద్వారా తెలియజేసారు. మేక పాలలో ఉండే తక్కువ లాక్టోస్ శాతం దీనికి కారణం అని కూడా చెప్పవచ్చును . అయితే మరికొన్ని పరిశోధనలు దీనికి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి దీనిపై మరిన్ని ఆధారాలువ్ చాలా  అవసరం.

 • బరువు తగ్గడానికి మేక పాలు
 • మంచి జీర్ణక్రియకు మేక పాలు
 • చక్కెరవ్యాధికి మేక పాలు 
 • ఎముక ఆరోగ్యానికి మేక పాలు
 • రుమటాయిడ్ ఆర్థరైటిస్ కోసం మేక పాలు -
 • మేక పాలు క్యాన్సర్‌ను నివారిస్తాయి
 • శిశువులకు మేక పాలు


బరువు తగ్గడానికి మేక పాలు 

ఆధునిక ప్రపంచంలో శరీర బరువుకు సంబంధించిన సమస్యలు చాలా సాధారణం. మొత్తం కేలరీలను తగ్గించుకోవడం అనేది బరువు తగ్గడానికి ఓ అనువైన విధానం అయితే, మీరు మీ ఆకలి కల్గించే బాధలను నింపాదిగా నిర్వహించుకునేంత వరకు ఇది సాధించలేరు. మొత్తం కేలరీల లోటును కొనసాగిస్తూనే పొట్ట నిండిన పూర్తి సంతృప్తిని పెంచే ఆహారపదార్థాలను తినడం అనేది ఆకలి బాధను ఎదుర్కోవడానికి  ఉన్న ఒక మార్గం. ఈ ఆహారాలు ఎక్కువసేపు మీకు పొట్ట పూర్తిగా నిండిన అనుభూతిని కలిగించడంలో కూడా సహాయపడతాయి.

మేక పాలలో అధిక మాంసకృత్తుల (ప్రోటీన్) అంశం మరియు  సమర్థవంతమైన పోషకాంశాల కలయిక, అన్ని అవసరమైన కొవ్వు ఆమ్లాలు ఉండటం వలన, మేకపాలు పొట్ట నిండిన సంతృప్తిని మనకు కలిగిస్తుంది.

సంప్రదాయ ఆవు పాలు కంటే మేక పాలు మంచి సంతృప్తి సూచికను అందిస్తాయని పరిశోధకులు నిరూపించారు. ఇది అదనపు కేలరీలను తగ్గించడానికి మిమ్మల్ని అనుమతించే ఆకలిని  బాగా తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఏదేమైనా, ఈ అధ్యయనం ఆరోగ్యకరమైన 33 మందిపై నిర్వహించబడింది మరియు తినడానికి ఆత్మాశ్రయ కోరికలను మాత్రమే నమోదు చేసింది. బరువు లేదా BMI లో తేడాలు కూడా నమోదు చేయబడలేదు.

కానీ, ఆవు లేదా గేదె పాలతో పోల్చినప్పుడు మేక పాలలో మొత్తం ఘనపదార్థాలు మరియు కొవ్వులు ఉన్నాయని పరిశోధనా ఆధారాలు చెబుతున్నాయి, కాబట్టి, ఇది మీ ఆహారంలో ఆరోగ్యకరమైన అదనంగా ఉండవచ్చును . బరువు మరియు BMI (body mass index) తగ్గింపుపై దాని నిర్దిష్ట ప్రభావం అస్పష్టంగా ఉంది, అయినప్పటికీ ఇది వివో జంతు అధ్యయనాలలో చాలా వరకు రుజువు చేయబడింది. అందువల్ల, ఉత్తమ ఫలితాల కోసం మేక పాలను మీ అల్పాహారం దినచర్యలో చేర్చాలని కూడా  సిఫార్సు చేయబడింది.


మంచి జీర్ణక్రియకు మేక పాలు 

మేక పాలులోని పోషకాంశాల యొక్క మిశ్రమం ఆవు పాలు కంటే కొద్దిగా భిన్నంగా కూడా  ఉంటుంది.  కొవ్వు ఆమ్లాల కురుచ గొలుసులు మరియు చిన్న పరిమాణంతో కూడిన కొవ్వు గోళాలు (గ్లోబుల్స్) మేకపాలలో  చాలా ఉంటాయి. అంటే, కొవ్వుపదార్ధం ఆవు పాలలో కంటే మేక పాలలోనే ఎక్కువగా చెదరగొట్ట బడి ఉంటుంది.  ఆవు పాలలో కంటే మేకపాలలోనే ఆల్కలీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ కారకాలన్నీ సమిష్టిగా మేక పాలను జీర్ణక్రియకు దోహదపడే ఓ మంచి పదార్థంగా చేస్తాయి.

మేకపాలు ఆల్ఫా -1-కేసైన్ యొక్క తక్కువ స్థాయిల్ని కలిగి ఉంటాయి మరియు మానవజాతి తల్లి పాలతో సమానంగా ఉంటాయి. మేకపాలు మానవ శరీరానికి మరింత సులభంగాను ఆమోదయోగ్యంగా ఉంటాయి. మేక పాలు మాత్రమే కాదు, మేక పాల నుండి ఏర్పడిన పెరుగు కూడా తేలికైనది మరియు తక్కువ దట్టంగా ఉంటుంది, ఇది మరింత సులభంగా మరియు త్వరగా కూడా జీర్ణమవుతుంది.

కాబట్టి, మీరు అజీర్ణ రుగ్మతతో బాధపడుతుంటే, మీరు నిత్యం సేవించే ఆవు పాలకు బదులు  మేక పాలను మరియు మీ సాధారణ పెరుగును మేక పెరుగుతో ప్రత్యామ్నాయం చేయడం, మీ అజీర్ణ రుగ్మత నివారణకు  బాగా సహాయపడుతుంది.

అయితే, పాలకు అసహనం ఉన్నవారికి ఈ మేకపాల ప్రత్యామ్నాయంతో స్పష్టమైన పోషక ప్రయోజనం ఏదీ గమనించబడక పోవచ్చు లేదా ఈ ప్రత్యామ్నాయం ఏవిధంగానూ ఉపయోగపడక పోవచ్చు. కానీ, కొన్ని అధ్యయనాల ప్రకారం, ఆవు పాలతో కల్గిన అలెర్జీకి చికిత్స చేయడానికి మేక పాలను కూడా ఉపయోగించవచ్చని సూచిస్తున్నాయి. కాబట్టి, ఆవుపాలకు బదులు ప్రత్యామ్నాయంగా మేకపాలు సేవించేందుకు ముందు మీరు మీ వైద్యుడిని సందర్శించడానికి ప్రాముఖ్యత నివ్వాలి.


చక్కెరవ్యాధికి మేక పాలు 

మీ ఆరోగ్యానికి పాలు తాగడం చాలా ముఖ్యం. మేక పాలను ఎంచుకోవడం మరింత, ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. మేక పాలు చక్కెరవ్యాధి (మధుమేహం లేక డయాబెటిస్)  ప్రమాదంతో సంబంధం కలిగి ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆవు పాలలో ఉన్న ఆల్ఫా 1 రకం కంటే ఆల్ఫా 2 బీటా కేసిన్ ఉండటం దీనికి కారణం. ఆల్ఫా 1 బీటా కేసిన్ డయాబెటిస్ మరియు అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు ప్రేరేపించేదని 2003 పరిశోధనలో కూడా తేలింది. ఆల్ఫా 1 రకంలో సహజంగా వెనుకబడి ఉండడం వల్ల, చక్కెరవ్యాధి (డయాబెటిస్) నివారణకు మేక పాలు అనువైనవి.


ఎముక ఆరోగ్యానికి మేక పాలు 

ఎముకల నిర్మాణం మరియు సమగ్రతను కాపాడటానికి కాల్షియం అవసరం మరి క్యాల్సియం లోపం పేలవమైన ఎముక ఆరోగ్యంతో కూడా  ముడిపడి ఉంటుంది.

ఆవు పాలలో కంటే మేక పాలలో కాల్షియం అధికంగా ఉందని అధ్యయనాలు కనుగొన్నాయి, అందుకే మేకపాలు మీ ఎముకలకు  చాలా మంచిది. కానీ మేక పాలకు అనుకూలంగా చేసే పరిశోధన దానికి మాత్రమే పరిమితం అవుతుందా? ససేమిరా.

ఇనుము లోపం రక్తహీనత ఎముక డీమినరలైజేషన్తో సంబంధం కలిగి ఉంటుంది. దీర్ఘకాలిక ఇనుము లోపం బోలు ఎముకల వ్యాధి మరియు ఎముక పునశ్శోషణ ప్రమాదాన్నికూడా  పెంచుతుంది. జంతువుల ఆధారిత పరిశోధనలో మేక పాలతో ఆహారం తీసుకోవడం ఎముక పునరుత్పత్తి యొక్క పునరుద్ధరణకు కూడా సహాయపడుతుందని నిరూపించింది. ఇది ఎముక టర్నోవర్ రేటు స్థిరీకరణకు దారితీసింది. అదనంగా, ఎముకలలో అధిక కాల్షియం కంటెంట్ గమనించబడింది మరియు ఆవు పాలతో పోలిస్తే మేక పాలతో తినిపించిన సమూహంలో ఇనుము శాతం పెరుగుదల కూడా గమనించబడింది.

మేక పాలు తాగడంవల్ల శరీరంలో ఇనుము స్థాయిలు మెరుగ్గా కోలుకోవడం జరుగుతుందని కనుగొన్నారు, మేకపాల కలిగే ఈ ఉపయోగానికి కాల్షియం-ఇనుముకు మధ్య జరిగే పరస్పర చర్య కారణమని చెబుతున్నారు . కాల్షియం యొక్క అదనపు భర్తీ సహాయంతో దీనిని సాధించలేము, ఎందుకంటే ఇది ఇనుము స్థాయిల క్షీణతకు చాలా  దారితీస్తుంది. కాబట్టి, ఆవు పాలు తాగడం కంటే మేక పాలు తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని మరియు ఎముకలకు కాల్షియం కూడా ఇవ్వవచ్చని నిర్ధారించవచ్చును .


రుమటాయిడ్ ఆర్థరైటిస్ కోసం మేక పాలు 

కీళ్లనొప్పి (రుమటాయిడ్ ఆర్థరైటిస్) అనేది శరీరంలోని అనేకమైన కీళ్లవాపు ద్వారా వర్గీకరించబడే స్వయం ప్రతిరక్షక (autoimmune disorder) రుగ్మత. కీళ్లనొప్పి లేక కీళ్లవాపు అనేది చాలా బాధాకరమైన రుగ్మత. కీళ్లనొప్పివ్యాధితో (రుమటాయిడ్ ఆర్థరైటిస్తో) బాధపడుతున్న వ్యక్తులు తరచుగా తీవ్రమైన నొప్పి మరియు కీళ్ల దృఢత్వానికి (నరాలు బిగుతుగా పట్టివేయడం)  కూడా గురవుతారు. వారికి బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఉంది.  అంటే వారి ఎముకలు  చాల తక్కువ సాంధ్రతకు (ఎముకలు పలుచబడుతాయి) మారతాయి మరియు ఎముకల పగుళ్లకు ఎక్కువ అవకాశం కలిగి  ఉంటుంది.

ఇలాంటి సందర్భాల్లో, ముఖ్యంగా బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో మేక పాలు తాగడం సహాయపడుతుందని పరిశోధకులు అంటున్నారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న 42 మంది రోగులపై నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, ఔషధ చికిత్స మరియు బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి చేపట్టిన ఇతర చర్యలతో పాటు 400 మి.లీ మేక పాలను రోజువారీ సేవనం ఎముక జీవక్రియను మెరుగుపరచడంలో సానుకూల ప్రభావాన్ని కూడా చూపింది.


మేక పాలు క్యాన్సర్‌ను నివారిస్తాయి

పాలు ఒక శారీరక ద్రవం.  ఇది అధిక పోషక పదార్ధాలను కలిగి ఉంటుంది మరియు శరీర పనితీరుకు ముఖ్యమైనది. మేక పాలు ఆరోగ్యకరమైనవి అని ఇప్పుడు మనకు తెలుసు, కాని, మేకపాలలో మనకు ఉపకరించేవి ఇంకా ఏమేమి ఉన్నాయి?

అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, మేక పాలు కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుందని, ఇందుగ్గాను తగిన పరిశోధన ఆధారాలు కూడా మద్దతు పలుకుతున్నాయి. క్యాన్సర్ కారక ప్రక్రియకు కారణమైన కణితి మార్కర్ ఎంజైమ్‌ల స్థాయిలపై మేక పాలు మరియు సోయా పాలు యొక్క ప్రభావాలను పోల్చడానికి చేసిన వివో జంతు అధ్యయనం మేక పాలు మంచి ప్రత్యామ్నాయమని కూడా  నిరూపించింది.

సోయా పాలలో అధిక యాంటీఆక్సిడెంట్ కార్యకలాపాలు ఉన్నప్పటికీ, ఇది క్యాన్సర్ పుట్టుక ప్రక్రియను నిరోధిస్తుందని నమ్ముతారు.  అయితే మేక పాలు ఇందుకు మంచి ప్రత్యామ్నాయంగా కనుగొనబడింది. మానవ ఆహారంలో కొన్ని పదార్థాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. మరికొన్ని ఆహారపదార్థాలు క్యాన్సర్ ను  నివారించడంలో కూడా సహాయపడవచ్చును . రసాయనికంగా ప్రేరేపించబడిన కణితులు మరియు క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడానికి పాల కొవ్వు కూడా సహాయపడుతుందని పరిశోధకులు చెప్పారు. ఇది క్యాన్సర్ తీవ్రతను తగ్గించడంలో కూడా సహాయపడింది.

మేకలు తమ మేత (ఫీడ్) నుండి బీటా కెరోటిన్, బీటా అయోనిన్ మొదలైన క్యాన్సర్ నిరోధక ఏజెంట్లు కల్గిన ఆహారాన్నే ఎన్నుకొని తినగలవని, అటుపై ఆ తిన్నదాన్ని పాలకు బదిలీ చేయగలవని పరిశోధకులు కూడా కూడా నమ్ముతారు, తరువాత ఈ మేకపాలను మానవులమైన మనం తాగుతాం. మేకపాలు క్యాన్సర్ వ్యతిరేక (యాంటికాన్సరస్) ఏజెంట్‌గా పనిచేసే విధానం ఇది.

పాలు మరియు పాల ఉత్పత్తులతో సమృద్ధిగా ఉండే ఆహారం తిన్న వ్యక్తులలో గడ్డలు, కణితి ఏజెంట్ల కార్యకలాపాలు తగ్గిపోతాయని పరిశోధకులు నిర్ధారించారు. ఈ అధ్యయనం నుండి, జంతువుల నమూనాలలో క్యాన్సర్ ఉత్పదకాల (హెపాటోకార్సినోజెనిసిస్) నివారణలో మేక పాలు ప్రతిస్కందక (anticancerous) ఏజెంట్‌గా పనిచేశాయని పరిశోధకులు కూడా రుజువు చేశారు. కాబట్టి, మేక పాలను మీ ఆహారంలో చేర్చడంవల్ల బలమైన ఎముకల నిర్మాణానికి మాత్రమే కాక మరింత  ఆరోగ్యప్రదానానికి తోడ్పడవచ్చును . అయినప్పటికీ, తగినంత మానవ ఆధారితమైన పరిశోధనలు ఈ దావా యొక్క మంచి విశ్లేషణకు సహాయం చేస్తాయి.


శిశువులకు మేక పాలు

పెరుగుదల ప్రక్రియకు మరియు ఆరోగ్యకరమైన ఎముక నిర్మాణం అభివృద్ధికి పాలు అవసరం, శిశు తరుణంలో ఆరోగ్యకరమైన ఎముక నిర్మాణం తర్వాతి జీవితకాలానికి బలమైన పునాది వేస్తుంది. పాలు తాగడం పెద్దల కంటే శిశువులకు చాలా ముఖ్యమైనది. కానీ, ఆవు పాలు శిశువుకు సరిపోకపోతే ఏం చేయాలి? ఈ సందర్భంలో మేక పాలు తగిన ప్రత్యామ్నాయంగా ఉండటానికి అవకాశాలు ఉన్నాయి, అయినప్పటికీ ఈ సంగతి ఇంకా ధృవీకరణ కాలేదు.

ఆవు పాలకు అసహనం (అలెర్జీ) కల్గి ఉన్న వ్యక్తులు సాధారణంగా మేక పాలకు తట్టుకోగలరని పలువురు పరిశోధకులు కూడా నిరూపించారు. ఇతర రకాల పాలతో పోల్చినప్పుడు మేక పాలలో దాని తక్కువ లాక్టోస్ కంటెంట్ దీనికి కారణమని చెప్పవచ్చును . ఏదేమైనా, మరొక అధ్యయనం ప్రకారం, శిశువు లాక్టోస్ అసహనం లేదా పాలకు ఒక నిర్దిష్ట అలెర్జీ ప్రతిచర్య కలిగి ఉంటే, మేక పాలతో ప్రత్యామ్నాయం కూడా సహాయపడదు. ఎందుకంటే ఈ రెండు రకాల పాలలో ఉండే ప్రోటీన్ల నాణ్యత చాలా పోలికను కల్గిఉంటుంది.

గణనీయమైన పరిశోధన ఆధారాలు లేనప్పటికీ, మీరు మీ బిడ్డకు ఆవు పాలకు ప్రత్యామ్నాయంగా మేక పాలను ఉపయోగించవచ్చు మరియు మేకపాలు శిశువుకు సరిపోతాయో లేదో కూడా తనిఖీ చేయవచ్చును . కానీ, శిశువులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను తోసిపుచ్చడానికి మీరు మొదట శిశువైద్యునితో లేదా మీ కుటుంబ వైద్యుడిని సంప్రదించాలి.

అలాగే, మీరు మేక పాల యొక్క పోషక అంశాల గురించి మరియు మీ శిశువు పెరుగుదలపై దాని ప్రభావం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మేక పాలలో చాలా ఎక్కువ పోషక పదార్ధాలు ఉన్నాయి మరియు మేక పాలు ఆధారంగా అనుపానాలు (సూత్రాలు) పెరుగుదల మరియు అభివృద్ధిపై మంచి ప్రభావాన్ని చూపుతాయని పరిశోధకులు చెప్పారు. వాస్తవానికి, జంతువుల అధ్యయనాలు మేక పాలు తాగడంతో మంచి రోగనిరోధక శక్తిని పొందుతారని కనుగొన్నారు.


మేక పాలు ఎలా తాగాలి 

అనారోగ్యాలు మరియు అంటువ్యాధుల (ఇన్ఫెక్షన్ల) ప్రమాదాన్ని నివారించడానికి మేక పాలను వేడి చేసి (కాచి) తాగడం చాలా ముఖ్యం. పాశ్చరైజ్డ్ మేక పాలను ఎన్నుకోవడం చాలా ముఖ్యం మరియు మేకపాలను తప్పకుండా వేడి చేసుకునే తాగాలి, వేడిచేసిన మేకపాలు  తాగడంవల్ల పాలలోని అన్ని హానికరమైన సూక్ష్మజీవులు నశిస్తాయి, తద్వారా మనకు ఆరోగ్యం సమకూరుతుంది. 

శిశువులకు మేక పాలు తాపేందుకు ముందు, మీరు ఈ క్రింది వాటిని నిర్ధారించుకోవాలి:

పాలు బాగా వేడి చేయండి, పాశ్చరైజ్ చేసిన పాలనే వాడండి. 
పాలు నమ్మదగిన మూలం నుండి (అంటే పాల ఉత్పత్తిదారు లేదా డెయిరీ) మాత్రమే పొందండి
పాలు పితికే జంతువు క్షయ, బ్రూసెల్లోసిస్ వంటి అంటువ్యాధులకు పరీక్షించబడి ఉండాలి
పాలను పరిశుభ్రమైన వాతావరణంలోనే పితకాలి. 
మేక పాలు మూడింటా ఒకపాలు నీటికి కలిపి వాడాలి.  
నీళ్లు కలపని మేకపాలు శిశువులకు సురక్షితం కాదు
6 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువులకు మేక పాలను ఇవ్వకూడదు, నీళ్లు కలపని పాలను కూడా తాపకూడదు. 
అలాంటి ఆరు నెలల కంటే తక్కువ వయసున్న చిన్నపిల్లలకు తల్లిపాలే  చాలా అనువైనవి.

మేక పాలు దుష్ప్రభావాలు 

మేకపాలవల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఈ పాలు కొన్ని దుష్ప్రభావాలను కూడా కలిగిస్తాయి. ముఖ్యంగా పచ్చి మేకపాలను సేవిస్తే ఆ దుష్ప్రభావాలు కలుగుతాయి. పచ్చి మేక పాలు తాగడంవల్ల కలిగే దుష్ప్రభావాలు క్రిందిస్తున్నాం:

విరేచనాలు
వికారం మరియు వాంతులు
కడుపు తిమ్మిరి
రక్త విరేచనాలు
ఆహారం విషతుల్యమవడం 
బ్రూసెలోసిస్ అనే వ్యాధి, ఇది కండరాల నొప్పి, జ్వరం, అలసట మరియు బరువు తగ్గడం వంటి వ్యాధి లక్షణాలను కలిగి ఉంటుంది
క్షయ
రాత్రి చెమట పట్టడం 
గుల్లెయిన్ బారే సిండ్రోమ్ వంటి తీవ్రమైన  చాలా రుగ్మతలు
పక్షవాతం
మూత్రపిండ (కిడ్నీ) వైఫల్యం
ఆఘాతం లేక స్ట్రోక్
మేక పాలను వేడి చేయకుండా అలాగే పచ్చిపాలు తాగడంవల్ల మన శరీరానికి పైన పేర్కొన్న నష్టాలు వాటిల్లి ఆసుపత్రిలో చేరడానికి కారణం కావచ్చును . తీవ్రమైన సందర్భాల్లో, ఇది ప్రాణాంతక ప్రమాదాన్ని కూడా కలిగిస్తుంది. కాబట్టి, మేకపాలు పచ్చివి వాడకుండా ఉండడం మంచిది. పచ్చి మేక పాలు అనేక సూక్ష్మజీవులకు నిలయం, అలాంటి మేకపాలను కాంచకుండా మనుషులమైన మనం తాగితే ఆరోగ్యానికి హాని కల్గి వ్యాధికారకంగా తయారవుతుంది. కాబట్టి, పశువుల ఆరోగ్యం, పాల పాశ్చరైజేషన్ (పాలు పులియకుండా 140 డిగ్రీలకు వెచ్చజేసియుంచు పద్ధతి) యొక్క స్థితి మరియు పశువుల పాక యొక్క పరిశుభ్రత పట్ల జాగ్రత్త తీసుకోవాలి.

అలెర్జీ ప్రతిచర్యల ప్రమాదం కారణంగా, శిశువులకు మేక పాలు తాపడం లేదా మేక పాల అనుపానాది ఉత్పత్తులు సిఫారసు చేయబడవు. లాక్టోస్ అసహనం మరియు పాలకు అలెర్జీ ఉన్నవారు కూడా మేకపాలను కూడా  తాగకూడదు.

ఇంకా, మేక పాలలో కొవ్వులు మరియు కొలెస్ట్రాల్ ఎక్కువ గా ఉంటాయి.  మేకపాలను అధికంగా తాగడంవల్ల బరువు పెరగడానికి మరియు రక్తంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయి పెరిగేందుకు చాలా దోహదం చేస్తుంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post