జామ ప్రయోజనాలు, పోషక వాస్తవాలు మరియు దుష్ప్రభావాలు
మనలో ప్రతి ఒక్కరం కనీసం ఒక సారయినా ప్లేట్ నిండా తియ్య-తియ్యని జామపండ్లపై ఉప్పు-కారం (లేక చాట్ మసాలాను) జల్లుకుని వాటిని మనసారా తిని ఆస్వాదించి ఉండమా? జామను తింటున్నప్పుడు మత్తెక్కించే దాని మధురమైన రుచి మరే ఇతర పండూ దానికి సాటి రాదనుకుంటాం. జామపండుతో చేసిన అనేక ఇతర పదార్థాలైన తియ్యని జామ్‌లు, జెల్లీలు, ప్యూర్లు, మకరందాలు, జామ కేకులు, రసాలు, మరియు మురబ్బాలు జామ లక్షణాలను కలిగి తీపి మరియు సువాసనతో కూడి రుచులూరిస్తాయి.
హిందీలో జామపండును ‘అమౄద్’ గా కూడా పిలుస్తారు.జామపండ్లు మధ్యలో కొద్దిగా కఠినమైన విత్తనాలను కలిగి ఉంటాయి. వాస్తవానికి, జామ విత్తనాలు పంటి కింద పడి కారకరలాడకపోతే జామపళ్ల రుచి మనకు పూర్తి తెలియకపోవచ్చును . జామ ఒక ఉష్ణమండల పండు మరియు ఇది ఉపఉష్ణమండల పరిస్థితులకు బాగా పెరుగుతుంది. జామ పండు ఆవిర్భావం మధ్య అమెరికాలో జరిగిందంటారు, ఇక్కడ దీనిని "స్యాండ్ ప్లం" అని కూడా పిలుస్తారు. ప్రారంభ స్పానిష్ మరియు పోర్చుగీసు వలసదార్లు దీన్ని ప్రంపంచంలో కొత్తప్రాంతాలకు పరిచయం చేశారు. ఆ విధంగా, ఈస్ట్ ఇండీస్ మరియు గుయాం ప్రాంతాలకు జామ పండు దిగుమతి అయింది. ఇది తరువాత ఆసియాలో మరియు ఆఫ్రికా యొక్క ఉష్ణ మండలాలలో ఓ పంటగా ఆమోదించబడింది . ప్రస్తుతం జామను ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండలాలలో విస్తృతంగా కూడా పండిస్తున్నారు.
అనానస్ (పైనాపిల్‌ను) పండును ‘పండ్లలో రాజు’ అని పిలిస్తే జామను ‘పండ్లలో రాణి’ అని కూడా పిలుస్తారు. పసుపు, గులాబీ మరియు ఎరుపు రంగుల్లో చిన్నవిగా, గోళాకారంగా లేదా అండాకారంలో (ఓవల్) జామపండ్లు మెత్తని గుజ్జుతో తియ్యగా సువాసనాభరితంగా తినడానికెంతో బాగుంటాయి. జామపండు యొక్క వైవిధ్యతే దానికి లెక్కింపును గుర్తింపును తెస్తోంది. ఇది భారతదేశం యొక్క మొట్టమొదటి సాధారణ మరియు ముఖ్యమైన పండ్లలో ఒకటి. మామిడి, నిమ్మజాతి పండ్లు (సిట్రస్), అరటి మరియు ఆపిల్ తర్వాత భారతదేశంలోని ఐదవ అతి ముఖ్యమైన పండుగా జామ పరిగణించబడుతుంది. కేవలం చిరుతిండి కోసం ముక్కలుగా చేసి తిన్నా లేదా సలాడ్లకు జోడించి తిన్నా జామపండ్లు రుచిలో అద్భుతమైనవి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో, జామ ఒక చీజ్ లాగా సృష్టించబడిన ఒక మందపాటి, సువాసనాభరితమైన (flavourful) పేస్ట్ గా ప్రసిద్ధి చెందింది. సహజమైన మరియు తాజా జామ రసం హవాయి దేశంలో సాధారణంగా ఉంటుంది. ఫిజీ దేశంలో, జామపండ్లను రుచికరమైన జెల్లీని తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు.
జామ దాని విలక్షణ రుచి మరియు సువాసనకు ప్రసిద్ధి చెందింది. అంతేగాక, ఈ పండులో ఉన్న వివిధ ఆరోగ్య ప్రయోజనాల కారణంగా, జామ పండు కూడా సూపర్ ఫ్రూట్లలో ఒకటిగా పరిగణించబడింది. ఈ సున్నితమైన పండు చర్మం యొక్క ఆరోగ్యానికి మరియు రోగనిరోధకతకు బాగా సహాయపడుతుంది, ఎందుకంటే దీనికో అస్కొర్బిక్ ఆమ్లం, లైకోపీన్ మరియు అనామ్లజనకాలు వంటివి సమృద్ధిగా ఉంటాయి. వాస్తవానికి, జామ పండులో అత్యధికంగా ఉండే విటమిన్ సి మరియు ఖనిజాల కారణంగా దీన్ని ఉష్ణమండల ఆపిల్ పండుగా పరిగణించబడుతోంది. జామపండ్లు పోషకాలకు మరియు మాంగనీసుల గొప్ప నిలయం. దీనిలోని ఈ మాంగనీసు మనం తినే ఆహారం నుండి పొందే వివిధ కీలక పోషకాలను శరీరంలో కలిసిపోయేలా చేయడంలో కూడా సహాయపడుతుంది. జామపండులో “ఫెలేట్” అనే ఖనిజం పుష్కలంగా ఉంటుంది, ఇది సంతానోత్పత్తిని ప్రోత్సహించే ఒక ఖనిజము. కనుక, లైంగికపరంగా జామవల్ల సిద్దించే ఆరోగ్యప్రయోజనాల్ని అందులోని ఫెలేట్ కారణంగానేనని చెప్పవచ్చు. ఇంకా, జామలో ఉన్న పొటాషియం రక్తపోటు స్థాయిలను నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. ఆసక్తికరంగా, అరటి మరియు జామ-ఈ రెండు పండ్లలోనూ పొటాషియం దాదాపు ఒకే ప్రమాణంలో ఉంటుంది.
అనేక పర్యావరణ పరిస్థితులు మరియు పండే నేల పరిస్థితులకు తట్టుకునే మంచి సామర్ధ్యం కలిగిన చవకైన పోషక ఫలంగా జామ అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఖచ్చితంగా పండించేందుకు ఓ అనువైన పంట. జామ గట్టిగా ఉండే పండే గాక పండుశాతాన్ని (కండరభాగం) బాగా కల్గిన ఓ మంచి ప్రతిఫలకరమైన పండు. జామ పంట దాన్ని పండించే ప్రతి యూనిట్ ప్రాంతానికి మంచి రాబడిని కూడా అందిస్తుంది మరియు దేశమంతటా దీన్ని పండించొచ్చు. వ్యవసాయపరంగా, బావులు, బోరుబావులకు దగ్గరగా జామను ఓ వాణిజ్యపంటగా ప్రతిచోటా పండించొచ్చును .
జామ గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
శాస్త్రీయనామం: సిడియం గువాజావా ఎల్. (Psidium guajava L)
కుటుంబం: మిర్టెసియే
సాధారణ పేరు (లు): గువాయాబో (స్పానిష్), గోయాబీరా (పోర్చుగీస్), రెడ్ గువా, గువావా, కువావా, గువా (ఆంగ్లం)
జాతి: సిడియం (Psidium)
సంస్కృతం పేరు: పెరుకా
హిందీ పేరు: అమౄద్ జామ ( Amrood )
స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: దక్షిణ అమెరికా మరియు మెక్సికో యొక్క ఉష్ణమండల ప్రాంతాల్లో జామచెట్టు పుట్టింది. భారత్ తో పాటు థాయ్‌లాండ్, ఇండోనేషియా, చైనా, మెక్సికో, బ్రెజిల్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్ మరియు ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ నైజీరియా జామను పండించే దేశాల్లో ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద జామాపండ్ల ఉత్పత్తిదారుగా భారత్ ఉంది. దేశ జామపండ్ల ఉత్పత్తిలో మహారాష్ట్ర రాష్ట్రంలో 12.8 శాతం పండుతున్నాయి. కాగా, మధ్యప్రదేశ్ (10.2 శాతం), ఉత్తరప్రదేశ్ (10.0 శాతం), బీహార్ రాష్ట్ర (9.76 శాతం) జామను పండించే రాష్ట్రాల్లో ప్రముఖంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఉత్తమ నాణ్యమైన జామపండ్లు బాగా పండుతాయి. ఆసక్తికరంగా, యు.పి.లోని అలహాబాదు జిల్లా భారతదేశంలోనే కాక, ప్రపంచంలోనే అతి నాణ్యమైన జామ పండ్లు పండుతాయని కీర్తిని బాగా సంపాదించింది.
సరదా వాస్తవాలు:
జామపండ్ల యొక్క ప్రత్యేకమైన రకాలు ఉన్నాయి కానీ అవి ఏ ఒక్క జాతి కిందికీ రావు. అవి సాధారణంగా ప్రత్యామ్నాయ జాతులకి చెందినవి. ఒక ఉదాహరణగా, అక్కా సెల్లోవియానా(Acca Sellowiana)ను పేర్కొనవచ్చు, ఇది అనానస్ జామ శాస్త్రీయనామం.
జామరకాల్లో మొట్టమొదటిది మరియు ఎలాంటి రిమార్కులు లేకుండా అందరిచేతా ఆనందంగా తినబడే జామరకాన్ని "ఆపిల్ జామ" అని పిలుస్తారు.
- జామ పోషక విలువలు
- జామపండు ఆరోగ్య ప్రయోజనాలు
- జామ దుష్ప్రభావాలు
- ఉపసంహారం
జామ పోషక విలువలు
జామ తక్కువ కేలరీలు మరియు కొవ్వుల్ని కల్గి ఉంటుంది. అయితే, ఇది అనేక ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, మరియు పాలిఫినోలిక్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఈ పండు కరిగిపోయే ఆహార పీచుపదార్థానికి ఓ గొప్ప నిలయం. యాంటీ - ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి యొక్క అద్భుతమైన మూలం జామ పండు. ఇది కూడా విటమిన్-ఎ మరియు కెరోటిన్, లైకోపీన్, లుయుటిన్, మరియు క్రిప్టోక్సాన్టిన్ వంటి ఫ్లేవానాయిడ్లను గణనీయమైన స్థాయిలో కల్గి ఉంటుంది. 100 గ్రాముల గులాబీ జామ పండు 5204 μg కెరోటినాయిడ్లను కల్గి ఉంటుంది, ఇది దాదాపు టమోటాల పరిమాణానికి రెండింతలు. పొటాషియంను కల్గిన అత్యంత ధనిక మూలాలలో తాజా జామ పండ్లు ఒకటి. ఇది అరటి కంటే ఎక్కువ పొటాషియంను కలిగి ఉంటుంది. అంతేకాక, ఈ పండు B- కాంప్లెక్స్ విటమిన్స్ యొక్క మితమైన సరఫరా కల్గిన పండు. విటమిన్లు, విటమిన్ -6 (పిరిడోక్సిన్) వంటివి, మెగ్నీషియం, కాపర్ మరియు మాంగనీస్ వంటి ఖనిజాలు కూడా జామపండులో గణనీయమైన మొత్తంలో కూడా ఉన్నాయి.
USDA న్యూట్రియెంట్ డేటాబేస్ ప్రకారం, 100 గ్రాముల జామపండులో క్రింది పోషకాలను కలిగి ఉంటుంది:
పోషకం:100 g లకు విలువ
నీరు:80.80 గ్రా
శక్తి;68 కిలో కే
ప్రోటీన్లను:2.55 గ్రా
కొవ్వులు (ఫాట్స్):0.95 గ్రా
పిండిపదార్థాలు:14.32 గ్రా
పీచుపదార్థాలు (ఫైబర్):5.4 గ్రా
చక్కెరలు:8.92 గ్రా
మినరల్స్:18 mg
కాల్షియం:0.26 mg
మెగ్నీషియం:22 mg
పొటాషియం:417 mg
భాస్వరం:40 mg
సోడియం:2 mg
జింక్:0.23 mg
విటమిన్లు
విటమిన్ సి:228.3 mg
విటమిన్ B1:0.067 mg
విటమిన్ B2:0.040 mg
విటమిన్ B3:1.084 mg
విటమిన్ B-6:0.110 mg
విటమిన్ B9:49 μg
విటమిన్ ఎ:31mg
విటమిన్ ఇ:0.73 mg
విటమిన్ కె:2.6 μg
కొవ్వులు / కొవ్వు ఆమ్లాలు
సాచ్యురేటెడ్ (సంతృప్తక్రొవ్వులు);0.272 గ్రా
అసంతృప్త క్రొవ్వులు:0.087 గ్రా
పాలీఅన్శాచ్యురేటెడ్:0.401 గ్రా
జామపండు ఆరోగ్య ప్రయోజనాలు
జామపండు పోషక ప్రయోజనాలు మరియు చికిత్సాపర ప్రయోజనాలతో నిండిన తక్కువ కేలరీల పండు. ఇది బరువు కోల్పోవటానికి బాగా సహాయపడుతుంది మరియు స్వేచ్చారాశులు కల్గించే నష్టం విరుద్ధంగా పోరాడటానికి కూడా సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని ప్రోత్సహించడంలో కూడా ఉపయోగపడుతుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: గుండెకు అత్యంత అనుకూలమైన ఆహారాలలో జామ కూడా ఒకటి. రక్తపోటు స్థాయిలను క్రమబద్ధీకరించడానికి ఇది సహాయపడుతుంది, అయితే జామ శరీరంలోని కొవ్వు (కొలెస్ట్రాల్) స్థాయిలను అదుపు చేయడంలో కూడా సహాయపడుతుంది, అందువలన హృదయకండరాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ ఇది సహాయకారి. అంతేకాకుండా, ఇది అనామ్లజని కాంపౌండ్స్ యొక్క శ్రేణిని కలిగి ఉంటుంది. ఇది గుండె కండరాలపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి గుండెను యవ్వనంగా కూడా ఉంచుతుంది.
ముట్టు (ఋతుక్రమ) నొప్పిని తగ్గిస్తుంది: రోజువారీగా 6 ఎం.జీ.ల జామపండు సారం యొక్క సేవనం ముట్టనొప్పి (dysmenorrhea)ని తగ్గించేందుకు దోహదపడుతుందని వైద్య అధ్యయనాలు కూడా సూచించాయి. వాస్తవానికి, జామపండు యొక్క ప్రభావాలను కొన్ని వాణిజ్య నొప్పినివారిణులతో పోల్చారు, కాబట్టి ముట్టునొప్పికి జామ పండు ఓ మంచి మందులా కూడా పనిచేస్తుంది.
రోగనిరోధకతను మెరుగుపరుస్తుంది: జామపండు నారింజ (కమలాపండు) కన్నా రెట్టింపుగా విటమిన్ C ని కలిగి ఉంటుంది. ఇది అద్భుతమైన రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించడంలో మరియు శరీరంలోని వ్యాధికారకాల ప్రవేశాన్ని నిరోధించడంలో విటమిన్ సి ఒక ముఖ్యమైన పాత్ర కూడా పోషిస్తుంది.
బరువు కోల్పోవడానికి సహాయపడుతుంది: జామ తక్కువ కాలరీలు, అధిక పీచుపదార్థాలున్న ఆహారం, మీరు ఎక్కువ సమయం పాటు కోసం పూర్తి అనుభూతిని పొందడం ద్వారా బరువు కోల్పోవడంలో కూడా సహాయపడుతుంది. చాలా ఆహారాలు కాకుండా, ఇది ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి మీరు అవసరమైన పోషణ లేకపోవడం గురించి ఆందోళన లేదు.
రక్తంలో గ్లూకోస్ స్థాయిలను మెరుగుపరుస్తుంది: రక్తంలో చక్కెర స్థాయిలను కాపాడుకోవడంలో జామ ఉపయోగకరంగా ఉంటుందని, శరీరంలో చక్కెర జీవక్రియను నియంత్రించడానికి కూడా ఈ పండు సహాయపడుతుందని ప్రయోగశాల అధ్యయనాలు సూచించాయి. ఇది అనేక హైపోగ్లైసెమిక్ (రక్త చక్కెర తగ్గిస్తుంది) ఏజెంట్లు శరీర కణాల ప్రతిఘటనను కూడా తగ్గిస్తుంది.
- చక్కెరవ్యాధికి జామ
- మలబద్ధకం కోసం జామ
- బరువు తగ్గుదల కోసం జామ
- స్కర్వీ వ్యాధికి జామ
- జామపండు రోగనిరోధక శక్తిని పెంచుతుంది
- గుండె ఆరోగ్యానికి జామ
- ఋతుక్రమ నొప్పికి జామ
- జామపండు క్యాన్సర్ ను నిరోధిస్తుంది
- చర్మం కోసం జామ ప్రయోజనాలు
చక్కెరవ్యాధికి జామ
శరీరంలో గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరచడంలో జామపండ్లు బాగా సహాయపడతాయని ఓ బలమైన రుజువు ఉంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో జామ చెట్టు ఆకు రసం బాగా పని చేస్తుందని అనేక ప్రయోగశాల-ఆధారిత మరియు జంతువులపై జరిపిన అధ్యయనాలు కనుగొన్నాయి. రక్తంలో చక్కెరను (గ్లూకోస్ను) తగ్గించే కొన్ని హైపోగ్లైసెమిక్ ఏజెంట్లకు శరీర నిరోధకతను తగ్గించడంలో కూడా జామపండు ప్రభావవంతమైనదిగా నివేదించబడింది. అంతేకాకుండా, ఇప్పటికే చక్కెరవ్యాధి (మధుమేహం) ఉన్నా లేదా అది వచ్చే ప్రమాదం ఉన్నా అటువంటి వ్యక్తులలో గ్లూకోజ్ జీవక్రియ మెరుగుదలకు జామపండ్లు బాగా దోహదపడతాయి.
మలబద్ధకం కోసం జామ
జామపండ్లు ఆహారపీచుపదార్థాల్ని గణనీయమైన పరిమాణంలో మన శరీరానికి సరఫరా చేయగలవు. అందువల్ల, జామపండ్లను దండిగా తినడంవల్ల ఆరోగ్యకరమైన ప్రేగు కదలికలకు (అంటే మంచి జీర్ణక్రియకు) ఈ పండు సహాయపడుతుంది . మలబద్ధకం నుండి కూడా దీనివల్ల ఉపశమనాన్ని కూడా పొందవచ్చు. ఒక జామపండులో రోజులో మన శరీరానిక్కావలసిన పీచుపదార్థం పరిమాణంలో సూచించిన 12% ఉంటుంది. జామలోని విత్తనాల్ని నమిలి మింగినా లేదా అలాగే గింజల్ని నమలకుండా మింగేసినా అవి పేగుల్లో కదలికలకు దేహదపడి మంచి భేదిమందులా కూడా పనిచేస్తుంది. అంతేకాకుండా, జామపండ్లు అతిసారంయొక్క తీవ్రతను తగ్గించి భేదులు తగ్గిపోయేలా కూడా చేస్తుంది.
బరువు తగ్గుదల కోసం జామ
బరువు తగ్గడానికి సహాయపడే అనేక పండ్లలో జామపండు కూడా ఒకటి. కేవలం ఒక పండులో 37 కేలరీలు మరియు మీకు సూచించిన రోజువారీ పీచుపదార్థా (ఫైబర్)ల్లో12% తీసుకోవడంతో జామలోని ఇవి కడుపు నిండుగా ఉండేట్టు చేస్తాయి, కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి, జామపండును తినేవారి భోజనం మధ్య అంతరాన్ని కూడా పెంచుతుంది మరియు అదనపు బరువు పెరగకుండా ఉండేందుకు దోహదపడుతుంది. ఇతర తక్కువ కాలరీల స్నాక్స్ మాదిగా కాకుండా జామలో విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి - అందువలన మీరు జామపండును తినడంవల్ల ఎలాంటి అగత్య పోషకాలను కోల్పోకుండా ఉంటారు. ఇంకా ఏమి అంటే జామపండ్ల రుచి చాలా గొప్పగా ఉంటుంది! కాబట్టి, బరువు కోల్పోవాలన్నమీ ధ్యేయం దెబ్బతినకుండా తియ్యగా మరియు కరకరలాడే (crunchy) జామపండ్ల సలాడ్ ను తిని ఆస్వాదించండి.
స్కర్వీ వ్యాధికి జామ
మనుషుల పోషణకు చెట్ల ఆహారం (Plant Foods for Human Nourshment) అనే ప్రచురణలోని ఒక అధ్యయనం ప్రకారం, విటమిన్ సి తక్కువైతే శరీరంలో స్కర్వీ వ్యాధిని ప్రేరేపించగలదు. అందువల్ల ఈ ప్రమాదకరమైన రుగ్మతకు సరైన పరిష్కారం నీటిలో కరిగే ఈ విటమిన్ ను సరిగ్గా తీసుకోవడం. ఆసక్తికరంగా, జామపండు దాని యొక్క విటమిన్ సి గాఢతలో నారింజ వంటి పలు పండ్లను అధిగమించింది. నిజానికి, జామ నారింజ కంటే నాలుగు రెట్లు ఎక్కువ విటమిన్ సి ని కలిగి ఉంది. అందువల్ల, జామ యొక్క సాధారణ సేవనం శరీరంలో విటమిన్ సి లోపాన్ని కూడా నిర్మూలించవచ్చు.
జామపండు రోగనిరోధక శక్తిని పెంచుతుంది
మీ శరీరంలో తక్కువ యాంటీఆక్సిడెంట్ స్థాయిలు సాధారణంగా అంటురోగాల ప్రమాదంతో సంబంధం కలిగి ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు యొక్క అత్యంత పుష్కలమైన ఆహార వనరుల్లో ఒకటైన జామ . ఈ రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలను పొందేందుకు ఓ అద్భుతమైన ఎంపిక . వాస్తవానికి, ఒక జామపండులో దాదాపుగా రోజువారీ ఆహారసేవన సూచిక (Reference Daily Intake-RDI)లో సూచించినదానికంటే రెండింతల విటమిన్ సి ఉంటుంది. జామలో నారింజలో ఉండే విటమిన్ సి కి రెండింతలుంటుంది. కాబట్టి ఒక జామపండును తింటే రెండు నారింజలు తిన్నట్టే. మన శరీరంలో ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించి, నిర్వహించడంలో విటమిన్ సి కీలక పాత్ర కూడా పోషిస్తుంది.
గుండె ఆరోగ్యానికి జామ
జామపండు వివిధ రకాలుగా గుండె ఆరోగ్యాన్ని బాగా పెంచుతుంది. మొదటగా జామపండు అనామ్లజనకాల యొక్క గొప్ప మూలం. జామలో ఉన్న అనామ్లజనకాలు మరియు విటమిన్లు హృదయ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా గుండెకు స్వేచ్ఛా రాశుల నష్టం తగ్గించవచ్చని అనేక అధ్యయనాలు కూడా పేర్కొన్నాయి . జామపండ్లలో పొటాషియం మరియు కరిగే పీచుపదార్థాల యొక్క ఉన్నత స్థాయిలు కూడా హృదయానికి ప్రయోజనకరంగా ఉంటాయి. పొటాషియం అనేది రక్తనాళాన్ని నియంత్రించడానికి అవసరమైన ఒక ఖనిజ పదార్థం అయితే, శరీరం యొక్క కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కరిగే పీచుపదార్థాలు (ఫైబర్స్) చాలా ఉపయోగకరంగా ఉంటాయి. తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలతో పాటు రక్తపోటు తక్కువగా ఉండటం వల్ల హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి చాలా బాగా వీలుపడుతుంది.
ఋతుక్రమ నొప్పికి జామ
అనేకమంది స్త్రీలు ముట్టు అయిన సమయంలో నొప్పి (డిస్మెనోరియా) ని అనుభవిస్తారు. అయితే, పరిశోధనలు సూచించేదేమంటే జామ పండ్లు లేదా జామతో తయారైన పదార్దాలు ముట్టు నొప్పి తీవ్రతను బాగా తగ్గిస్తాయని. 197 డిస్మెనోరియా రోగులతో కూడిన క్లినికల్ అధ్యయనంలో రోజుకు 6 mg జామాకు సారం తీసుకోవడం వలన నొప్పి తీవ్రత బాగా తగ్గింది. ఇంకా, కొన్ని నొప్పినివారణా మందుల కంటే జామ ఎక్కువ శక్తివంతమైన నొప్పి నివారిణి (అనాల్జేసిక్) అని పేర్కొంది.
జామపండు క్యాన్సర్ ను నిరోధిస్తుంది
జామపండు రసం క్యాన్సర్ వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉన్నట్లు నిరూపించబడింది. పరీక్షణనాళిక (టెస్ట్ ట్యూబ్) మరియు జంతు విశ్లేషణ పరీక్షలు జామపండ్ల జ్యూస్ కాన్సర్ కణాలవృద్ధిని నిరోధిస్తుంది, అంతేగాక క్యాన్సర్‌కణాల వృద్ధిని నిలిపివేయనూగలదు అని నివేదించాయి. ఇటీవలి అధ్యయనం, శరీరంలో క్యాన్సర్‌కణాల జననానికి మరియు వ్యాప్తికి సంబంధించిన కొన్ని సిగ్నలింగ్ మార్గాల్లో జామరసం అడ్డుపడి క్యాన్సర్ పెరుగుదలను బాగా తగ్గించవచ్చు, అని పేర్కొంది.
చర్మం కోసం జామ ప్రయోజనాలు
జామ వివిధ రకాల విటమిన్లు మరియు అనామ్లజనకాలుతో నిండి ఉంటుంది, కాబట్టి జామపండును తినడంవల్ల చర్మానికి అద్భుతాలే చేయగలదు. జామపండులో అనామ్లజనకాలు అధిక స్థాయిలో ఉన్నందున వృద్ధాప్య ప్రక్రియను బాగా తగ్గించడం మరియు చర్మం ముడుతల్ని తగ్గించడంతో సహా అనేక ఇతర చర్మ సమస్యలకు ఇది దోహదపడుతుంది. మోటిమల చికిత్సకు కూడా జామ సారాలు బాగా సహాయపడతాయి .
జామ దుష్ప్రభావాలు
గర్భధారణ మరియు తల్లిపాలనిచ్చే సమయంలో
జామ పండును ఓ ఆహారంగా తింటే సురక్షితమే. అయితే, ఆరోగ్య అనుబంధంగా ఉపయోగించేటప్పుడు జామను పెద్ద మొత్తాలలో తినడం సురక్షితమా కాదా అనేదాన్ని అర్థం చేసుకోవడానికి తగినంతగా విషయసంగ్రహం (డేటా) లేదు. అందువల్ల జామ పండ్లను ఆరోగ్య అనుబంధంగా సేవించాలనుకుంటే ముందుగా వైద్యుడిని సంప్రదించి పొందడం మంచిది.
జామపండు పీచుపదార్థాలు అధికంగా కల్గి ఉండటం వలన, ఇది విరేచనాల్ని కల్గించి నిర్జలీకరణ (dehydration)కు దారి తీస్తుంది మరియు తద్వారా గర్భధారణ సమయంలో నిర్జలీకరణాన్ని ప్రేరేపిస్తుంది. గర్భధారణ సమయంలో జామపండ్లను గాని లేదా జామకాయల్ని కానీ తినడంవల్ల ‘గర్భధారణ మధుమేహం’ వచ్చే అవకాశం కూడా ఉంది.
జామ ప్రేగుల్లో మంటను, ఇతర వ్యాధి లక్షణాల్ని కలిగించగలదు
జామలో ఫ్రక్టోజ్ (fructose) అని పిలవబడే సహజమైన చక్కెరను కలిగి ఉంటుంది. ఈ ఫ్రక్టోజ్ చక్కర పొట్టలో కలిసిపోవడం (assimilation) వల్ల, మీరు విరేచనాలతో పాటు పేగుల్లో గందరగోళకరమైన జీర్ణ వ్యవస్థ పరిస్థితిని కూడా అనుభవించవచ్చు.
జామలో పొటాషియం, పీచుపదార్థాలు (ఫైబర్) మరియు విటమిన్ C పుష్కలంగా ఉంటాయి. పీచుపదార్థాల్ని లేదా పొటాషియంను తక్కువగా సేవించాల్సిన ఏదైనా రుగ్మతతో బాధపడుతున్నట్లయితే, అలాంటి వ్యక్తులు ఆమె జామ పండును తినకూడదు.
ఉపసంహారం
జామ భూమధ్యరేఖా ప్రాంతానికి చెందిన (ఈక్వెటోరియల్ ఏరియా) పండ్ల రకం. జామపండు దాని విలక్షణమైన రుచి మరియు ఆరోగ్య-ప్రోత్సాహక లక్షణాలతో కొత్త ప్రయోజనకారి ‘సూపర్ ఫ్రూట్స్’ అనబడే వర్గంలోకి సరిగ్గా ఇమిడిపోతుంది. జామ పండ్లు టెరాయ్లమోనోగ్లుటిమిక్ (pteroylmonoglutamic) యాసిడ్ యొక్క మితమైన స్థాయిలు ఉన్న ఆహార ఫైబర్ మరియు అస్కోర్బిక్ ఆమ్లం యొక్క మంచి మూలం. జామలో గొప్ప రుచి మాత్రమే కాదు మంచి ఔషధగుణాలు కూడా నిమిడి ఉన్నాయి. జామ పండులో దుష్ప్రభావాలు ఏవీ ఎక్కువగా లేనప్పటికీ, ఏది (అదెంత రుచిగా ఉన్నా కూడా) కూడా అతిగా తినడం చాలా మంచిది కాదు. కాబట్టి జామపండుని మితంగా తిని దాని యొక్క గొప్పతనాన్ని ఆనందించండి.
Post a Comment