విరేచనాలకు గృహ చిట్కాలు


విరేచనాలకు గృహ చిట్కాలు - Home Remedies for Diarrhoea in Teluguవిరేచనాలు (అతిసారం) అంటే రోజుకు కనీసం మూడు సార్లు మలవిసర్జన నీళ్లలా అవుతుంది. సంక్రమణ (ఇన్ఫెక్షన్) రకాన్ని బట్టి ఈ పరిస్థితి కొన్ని రోజుల నుండి వారాల వరకు ఉంటుంది. ఇది ఉదర ఉబ్బరం, వాయువు (గ్యాస్) లేదా అపానవాయువుతో కలిసి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. అతిసారం వల్ల కలిగే ద్రవ నష్టం తరచుగా డీహైడ్రేషన్ కు దారితీస్తుంది.

సమాయంతో పాటు తరచుగా, విరేచనాలు మరింత తీవ్రంగా మారతాయి మరియు ప్రతిస్పందన తగ్గిపోవడం, మూత్రవిసర్జన, హృదయ స్పందన రేటు మరియు చర్మం రంగు కోల్పోవడం వంటి ఇతర పరిస్థితులకు దారితీస్తుంది. అతిసారం అనేది అన్ని వయసులవారిని ప్రభావితం చేసే ఒక పరిస్థితి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) ప్రకారం, ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉండే దేశాలలో చిన్న పిల్లలలో, వ్యాధులు మరియు మరణానికి కారణాలలో అతిసారం ఒకటి.

అసలు అతిసారం ఎందుకు వస్తుంది?

ఈ క్రింద పేర్కొన్న అనేక రకాల కారణాల వల్ల అతిసారం సంభవించవచ్చు. అయితే, కలుషితమైన నీటిని తీసుకోవడం వల్ల ఇది ఎక్కువగా సంభవిస్తుంది.

బ్యాక్టీరియా, వైరస్ లేదా పరాన్నజీవులు (పారసైట్) అతిసారం యొక్క ప్రధాన కారక జీవులు.
వేరేచనాలకి కారణమయ్యే వైరస్లలో  రోటవైరస్, అడినోవైరస్ మరియు నోరోవైరస్లు రకాలు ఉంటాయి.
బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు మరింత తీవ్రమైన విరేచనాలకు కారణమవుతాయి. అతిసారానికి కారణమయ్యే బ్యాక్టీరియాలలో షిజెల్లా (Shigella), కాంఫైలోబాక్టర్ (Campylobacter), ఎస్చెరిషియా కోలి (Escherichia coli), యెర్సినియా (Yersinia), లిస్టిరియా (Listeria) మరియు సాల్మొనెల్లా (Salmonella) ఉన్నాయి.
అతిసారానికి కారణమయ్యే ప్రధాన పరాన్నజీవులు ఎంటామీబా హిస్టోలిటికా (Entamoeba histolytica), గియార్డియా లాంబ్లియా (Giardia lamblia) మరియు క్రిప్టోస్పోరిడియం (Cryptosporidium).
ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, సిలియాక్ వ్యాధి మరియు మైక్రోస్కోపిక్ కొలైటిస్ వంటి కొన్నిప్రేగుల వ్యాధులు  కూడా అతిసారానికి కారణమవుతాయి.
గౌట్, రక్తపోటు, క్యాన్సర్ వంటి వ్యాధుల కోసం మందుల ప్రతిచర్యల కారణంగా మరియు కొన్ని యాంటీబయాటిక్ల  ప్రతిచర్యల కారణంగా కూడా అతిసారం సంభవిస్తుంది.
లాక్టోస్ అసహనం (lactose intolerance) వంటి కొన్ని అలెర్జీలు అతిసారానికి కూడా కారణమవుతాయి.
మద్యపాన దుర్వినియోగం, అనగా మద్యాన్ని అధికంగా తాగడం కూడా విరేచనాలకు కారణం కావచ్చు.
లింఫోమా, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మరియు పెద్దప్రేగు క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్లు  కూడా అతిసారానికి కారణం కావచ్చు.
విరేచనాలు ఉన్నట్లు తెలిపే సంకేతాలు

అతిసారం/విరేచనాల  యొక్క లక్షణాలు అది ఎలా వచ్చిదనే దానిపై ఆధారపడి మారవచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్ల లక్షణాలు సాధారణంగా తేలికపాటి నుండి మధ్యస్తంగా ఉంటాయి. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వలన వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పి మరియు జ్వరం వంటి లక్షణాలు కలుగుతాయి. ఈ సందర్భంలో మలవిసర్జన చాలా తరచుగా ఉంటుంది మరియు నీటితో కూడిన వదులుగా ఉండే మలం మరియు వాయువు బలంగా బయటకు వెలువడడం వంటివి జరుగుతాయి. అతిసారానికి కారణమయ్యే మరింత తీవ్రమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లలో, మలం చీము, శ్లేష్మం లేదా రక్తంతో కూడి ఉంటుంది.

 • విరేచనాలకు గృహ నివారణ చిట్కాలు 
 • విరేచనాల కోసం అల్లం 
 • అతిసారం చికిత్స కోసం పుదీనా 
 • విరేచనాల చికిత్స కోసం దాల్చినచెక్క 
 • విరేచనాల కోసం జీలకర్ర -
 • కొబ్బరి నీరు విరేచనాలకు చికిత్స చేస్తుంది -
 • విరేచనాలను నయం చేయడానికి ఆరెంజ్ టీ -
 • విరేచనాల చికిత్సకు గుమ్మడికాయ 
 • విరేచనాలను నయం చేయడానికి తులసి ఆకులు
 • విరేచనాలకు లైకోరైస్ 
 • అతిసారం చికిత్సకు ఓరల్ రీహైడ్రేషన్ సిస్టమ్/థెరపీ 
 • విరేచనాల కోసం పెరుగు -
 • విరేచనాల కోసం వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి 
విరేచనాలకు గృహ నివారణ చిట్కాలు 
విరేచనాల చికిత్స కోసం అనేక రకాల మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, వ్యాధికి చికిత్స చేయడంలో సహాయపడే అనేక ప్రభావవంతమైన గృహ నివారణ చిట్కాలను కూడా ప్రయత్నించవచ్చని తెలిస్తే అది మనకు ఆసక్తి కలిగిస్తుంది. అయితే, లక్షణాలు తీవ్రమవుతుంటే వైద్యులను సంప్రదించడం మంచిది. విరేచనాల యొక్క తేలికపాటి నుండి మధ్యస్థ లక్షణాలకు చికిత్స చేయడానికి ఉపయోగపడే గృహ నివారణా చిట్కాలు ఈ క్రింద వివరంగా చర్చించబడ్డాయి.

 • విరేచనాల కోసం అల్లం 
 • అతిసారం చికిత్స కోసం పుదీనా 
 • విరేచనాల చికిత్స కోసం దాల్చినచెక్క
 • విరేచనాల కోసం జీలకర్ర 
 • కొబ్బరి నీరు విరేచనాలకు చికిత్స చేస్తుంది 
 • విరేచనాలను నయం చేయడానికి ఆరెంజ్ టీ -
 • విరేచనాల చికిత్సకు గుమ్మడికాయ 
 • విరేచనాలను నయం చేయడానికి తులసి ఆకులు
 • విరేచనాలకు లైకోరైస్ 
 • అతిసారం చికిత్సకు ఓరల్ రీహైడ్రేషన్ సిస్టమ్/థెరపీ -
 • విరేచనాల కోసం పెరుగు 


విరేచనాల కోసం అల్లం - Ginger for loose motion in Telugu
అల్లం కడుపులో అసౌకర్యం మరియు అజీర్ణం కోసం సాధారణంగా ఉపయోగించే సహజ నివారణ. అల్లంలో ఉండే జింజెరోల్స్ (gingerols) మరియు షోగాల్స్ (shogaols) అని పిలువబడే బయోయాక్టివ్ సమ్మేళనాలు కడుపు సంకోచాలను పెంచడానికి సహాయపడతాయి. ఇది కడుపులో అజీర్ణాన్ని కలిగించిన ఆహార పదార్థాల యొక్క వేగవంతమైన కదలికకు సహాయపడుతుంది, తద్వారా అజీర్ణం నుండి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది. అల్లం లో ఉండే సమ్మేళనాలు వికారం మరియు వాంతులు తగ్గించడానికి కూడా సహాయపడతాయి.

విరేచనాలతో బాధపడుతున్న వ్యక్తులు వారి ఆహారంలో అల్లాన్నిజోడించవచ్చు లేదా టీ రూపంలో తీసుకోవడానికి ప్రయత్నించవచ్చు. కొన్ని సహజ అల్లం లాంటి మొక్కల రకాలలో కూడా  తగినంత అల్లం ఉంటుంది, ఇది కడుపులో అసౌకర్యానికి ఉపశమనం కలిగిస్తుంది.


అతిసారం చికిత్స కోసం పుదీనా - Mint to treat diarrhoea in Telugu
పుదీనా లేదా మెంథా లాంగిఫోలియా (Mentha longifolia) ఆకులను మూలికా చిట్కాలలో ఉపయోగిస్తారు, వీటిని జీర్ణశయా రుగ్మతల కోసం ఉపయోగిస్తారు. ఈ మూలిక అజీర్ణ వాయువు (indigestion gas) మరియు విరేచనాల చికిత్స కోసం సాంప్రదాయ ఇరానియన్ ఔషధ విధానాల్లో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. పుదీనా యొక్క ఎస్సెంషియాల్ నూనెల(essential oil) లోని  భాగాలైన పులేగోన్ (pulegone), సినోల్ (cineol) మరియు ఐసోమిథనోన్ (isomenthone) ప్రధానంగా దాని విరేచన నిరోధక చర్యకు కారణమని అధ్యయనాలు కనుగొన్నాయి.

పుదీనా ఆకులను పచ్చిగా లేదా ఉడికించి తినవచ్చు. పుదీనా ఆకులతో స్మూతీని తయారు చేసుకుని తీసుకోవచ్చు. పరంపరంగా, ప్రజలు సాధారణంగా పుదీనా ఆకులను ఏలకులను నీటిలో కలిపి కాచి టీని తయారుచేస్తారు. పుదీనా ఆకులను పొడి చేసి ఇతర పానీయాలు, టీలు లేదా ఆహారాలతో కలపడం కూడా చేయవచ్చు.


విరేచనాల చికిత్స కోసం దాల్చినచెక్క - Cinnamon for treating diarrhoea in Telugu
విరేచనాల చికిత్స విషయంలో దాల్చినచెక్క మరొక ప్రభావవంతమైన ఇంటి నివారణా చిట్కా. ఈ మసాలా దినుసు అనేక యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది, ఇవి జీర్ణ ప్రక్రియలో సహాయపడతాయి మరియు జీర్ణవ్యవస్థలో చికాకు లేదా నష్టం సంభవించే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. దాల్చినచెక్కలో ఎక్కువగా ఉండే యాంటీఆక్సిడెంట్లు యూజీనాల్, సిన్నమాల్డిహైడ్ (cinnamaldehyde), లినాలూల్ మరియు కేంఫర్ (camphor). దాల్చినచెక్కలోని ఈ సమ్మేళనాలు గ్యాస్, ఉబ్బరం, తిమ్మిరి మరియు పులి తేన్పులను తగ్గించడానికి సహాయపడతాయి. అజీర్ణం మరియు గుండెల్లో మంటను తగ్గించడానికి కడుపులోని ఆమ్లతను న్యూట్రలైజ్ చేయడానికి కూడా ఇవి సహాయపడతాయి.

అతిసారం చికిత్స కోసం, మీ భోజనంలో 1 స్పూన్ దాల్చిన చెక్క పొడి లేదా దాల్చిన చెక్కను  జోడించండి. ప్రత్యామ్నాయంగా, దాల్చినచెక్కను వేడినీటితో కలిపి దాల్చిన చెక్క టీని కూడా చేసుకోవచ్చు.  విరేచనాల చికిత్సకు ఈ టీని రోజుకు రెండు, మూడు సార్లు తీసువాలి.


విరేచనాల కోసం జీలకర్ర - Cumin for loose motion in Telugu
జీలకర్రను  సాధారణంగా జీరా అని పిలుస్తారు, దీనిలో టానిన్లు, ఆల్కలాయిడ్స్, గ్లైకోసైడ్లు, చక్కెరలు, టెర్పిన్లు మరియు ఫ్లేవనాయిడ్లు వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి, ఇవి అజీర్ణం మరియు కడుపులోని అదనపు ఆమ్లాలను (ఆసిడ్) తగ్గిస్తాయి తద్వారా గ్యాస్ తగ్గుతుంది. జీలకర్ర ఒక యాంటీ మైక్రోబియల్ కూడా మరియు ఇది ఇన్ఫెక్షన్ వల్ల కలిగే వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్న రోగులలో జీలకర్ర నొప్పితో కూడిన మలవిసర్జనను తగ్గించగలదని క్లినికల్ ట్రయల్స్ తెలిపాయి.

ఉత్తమ ఫలితాల కోసం, మీ భోజనంలో 1 లేదా 2 టీస్పూన్ల జీలకర్ర పొడి లేదా కొద్దిగా జీలకర్రను  నలిపి/నూరి కలపాలి. ప్రత్యామ్నాయంగా, కొన్ని టీస్పూన్ల జీలకర్రను లేదా జీలకర్ర పొడిని వేడినీటిలో కలిపి జీలకర్ర టీని తయారుచేసుకుని కూడా తాగవచ్చు.


కొబ్బరి నీరు విరేచనాలకు చికిత్స చేస్తుంది - Coconut water treat diarrhoea in Telugu
అనేక ప్రభావవంతమైన గృహ నివారణలలలో కొబ్బరి నీరు ప్రసిద్దమైనది. అతిసారం చికిత్సకు కూడా ఇది అంతే సమానంగా ప్రభావవంతముగా ఉంటుంది. అతిసారం డీహైడ్రేషన్ కు కారణమవుతుంది, దానికి కొబ్బరి నీటిని తీసుకోవడం ద్వారా చికిత్స చేయవచ్చు. ఇది ఖనిజాలు మరియు ఎలక్ట్రోలైట్ల యొక్క గొప్ప మూలం, అవి శరీర ద్రవాలను తిరిగి సరిచేస్తాయి. కొబ్బరి నీరు రక్త ప్రసరణను కూడా పెంచుతుంది మరియు అతిసారం నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. ఉత్తమ ఫలితాల కోసం రోజుకు రెండుసార్లు ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళను సిఫార్సు చేస్తారు.


విరేచనాలను నయం చేయడానికి ఆరెంజ్ టీ - Orange tea for curing diarrhoea in Telugu
విరేచనాలను నయం చేయడానికి కమలా టీ కూడా సమర్థవంతమైన నివారణ చర్య. ఈ టీ తాగడం వల్ల వ్యక్తి హైడ్రేట్ అవుతాడు, తద్వారా అది ఒక ఔషధంగా పనిచేస్తుంది. కమలాల పై తొక్కలతో ఇంట్లో తయారుచేసిన కాషాయం విరేచనాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కమలా పండుపై తొక్కలో పెక్టిన్ పుష్కలంగా ఉంటుంది, ఇది ఒక రకమైన కార్బోహైడ్రేట్, ఇది పెద్ద ప్రేగులలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా యొక్క నిష్పత్తిని పెంచుతుంది. తద్వారా  కమలా పండు పై తొక్క ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను నిర్వహిస్తుంది.

ఆరెంజ్ టీ తయారు చేయడానికి, కొన్ని నారింజ తొక్కలను వేడినీటిలో వేయండి. ఆ నీటిని వడకట్టి, చల్లారబెట్టి తరువాత కొద్దిగా నిమ్మరసం మరియు తేనె కలిపి దాని త్రాగవచ్చు.


విరేచనాల చికిత్సకు గుమ్మడికాయ - Pumpkin to treat loose motion in Telugu
గుమ్మడికాయ, ముఖ్యంగా గుమ్మడికాయ గింజలు మరియు ఆకులు కూడా విరేచనాల చికిత్సకు ఉపయోగపడతాయి. గుమ్మడికాయ ఆకులు మరియు విత్తనాలు శక్తివంతమైన పరాన్నజీవి నిరోధక (anti-parasitic) చర్యను కలిగి ఉంటాయి మరియు అతిసారానికి కారణమయ్యే సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా కూడాఉపయోగించవచ్చు. అలాగే, గుమ్మడికాయలో ఉండే కరిగే (సాల్యుబుల్) ఫైబర్స్ మలం గట్టిపడటానికి సహాయపడతాయి మరియు తద్వారా మలం నుండి నీటిని గ్రహిస్తాయి. గుమ్మడికాయలో అధిక స్థాయిలో పొటాషియం కూడా ఉంటుంది, కాబట్టి గుమ్మడికాయ వినియోగం శరీర ద్రవాలను తిరిగి ఎలక్ట్రోలైట్లతో సరిచేస్తుంది.

ఒక కప్పు ఉడికించిన లేదా వేపిన గుమ్మడికాయ ముక్కలను తినవచ్చు. మంచి ఫలితాల కోసం పచ్చి గుమ్మడికాయ ఆకులతో లేదా విత్తనాలతో తయారుచేసిన రసాన్ని కూడా తీసుకోవచ్చు.


విరేచనాలను నయం చేయడానికి తులసి ఆకులు - Basil leaves to cure loose motion in Telugu
తులసిలో లభించే ఎస్సెంటిషిల్ నూనెలో సైనోల్, కేంఫర్ మరియు థైమోల్ వంటి అనేక బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి, ఇవి ఆకలిని పెంచుతాయి, తిమ్మిరిని తగ్గిస్తాయి, గ్యాస్ ను  తగ్గిస్తాయి మరియు మొత్తం జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. తులసిలో యూజీనాల్ కూడా ఉంటుంది, ఇది కడుపులోని ఆమ్లతను (అసిడిటీని) న్యూట్రలైజ్ చేస్తుంది. తులసిలోని లినోలెనిక్ ఆమ్ల పరిమాణం యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల, తులసి అతిసారానికి ఒక సమర్థవంతమైన నివారణ చిట్కా.

అతిసారం యొక్క లక్షణాలు తగ్గే వరకు 1 లేదా 2 టీస్పూన్ల ఎండిన తులసి ఆకులు లేదా తాజా తులసి ఆకులను భోజనంలో చేర్చవచ్చు. మరింత తక్షణ ఫలితాల కోసం, అర టీస్పూన్ ఎండిన తులసి లేదా కొన్ని తాజా ఆకులను వేడి  నీటితో కలిపి టీ సిద్ధం చేసుకుని త్రాగవచ్చు.


విరేచనాలకు లైకోరైస్ - Licorice for diarrhoea in Telugu
లైకోరైస్ (Licorice) గ్లైసిర్రిజా గ్లాబ్రా (Glycyrrhiza glabra) యొక్క వేరు, ఇది తీపి రుచితో ఉంటుంది. ఈ వేరును విరేచనాలకు చికిత్సకు ఇంటి నివారణా చిట్కాగా ఉపయోగిస్తారు.  లైకోరైస్ ముఖ్యంగా రోటవైరస్ కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉంటుంది, రోటవైరస్ తీవ్రమైన గాస్ట్రోఎంటరైటిస్ కు కారణమయ్యే ముఖ్య  వ్యాధికారక జీవులలో ఒకటి మరియు ఇది మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది. లైకోరైస్ వేరుల యొక్క బయోయాక్టివ్ చర్యలకు సాపోనిన్లు, ఫ్లేవనాయిడ్లు, ఐసోఫ్లేవోన్లు, కౌమరిన్లు (coumarins), స్టిల్బెనాయిడ్లు (stilbenoids) బాధ్యత వహిస్తాయని తెలుస్తుంది.

ఈ సమ్మేళనాలు యాంటీ-వైరల్ మరియు యాంటీ బాక్టీరియల్ చర్యలుకల అనేక ఉపయోగకరమైన ఔషధ లక్షణాలను కలిగి ఉంటాయి. లైకోరైస్ ఉపయోగం అతిసారానికి చికిత్స చేయటానికి మరియు గాస్ట్రోఎంటరైటిస్ వల్ల వచ్చే పేగులలో వాపును తగ్గించటానికి సహాయపడుతుందని అధ్యయనాలు కనుగొన్నాయి.

లైకోరైస్ వేరులను పొడి చేసి, తరువాత దానిని వినియోగించి వేడినీటిలో కలిపి లైకోరైస్ టీని తయారు చేయవచ్చు.


అతిసారం చికిత్సకు ఓరల్ రీహైడ్రేషన్ సిస్టమ్/థెరపీ - Oral rehydration system/therapy to treat diarrhoea in Telugu
ఓఆర్ఎస్ (ORS) లేదా ఓఆర్ టి (ORT) అనేది ఒక ద్రవ రీప్లేస్మెంట్ విధానం, ముఖ్యంగా విరేచనాలు వలన ఏర్పడిన డీహైడ్రేషన్ ను నివారించడానికి మరియు చికిత్స చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ చికిత్సలో కొన్ని రకాల చక్కెరలు మరియు లవణాలను, ముఖ్యంగా సోడియం, పొటాషియం మరియు జింక్‌లను నీటిలో కలుపుకుని తాగడం జరుగుతుంది. తీవ్రమైన విరేచనాల సందర్భంలో జింక్ భర్తీను (సుప్ప్లీమెంటేషన్) ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization [WHO]) మరియు యునైటెడ్ నేషన్ చిల్డ్రన్స్ ఫండ్ (United Nations Children's Fund [UNICEF]) సిఫార్సు చేసింది. ఓఆర్ఎస్ మార్కెట్లలో ప్యాకెట్ రూపంలో లభిస్తుంది. సమర్థవంతమైన ఫలితాల కోసం, 100 గ్రా ప్యాకెట్ మొత్తన్నీ ఒక లీటరు నీటిలో కలిపి, లక్షణాలు తగ్గే వరకు చిన్న చిన్న పరిమాణాలలో తీసుకోవచ్చు.


విరేచనాల కోసం పెరుగు - Yoghurt for loose motions in Telugu
విరేచనాలు ఉన్నప్పుడు తీసుకోగలిగిన ఉత్తమ ఆహారాలలో ఒకటి పెరుగు. పెరుగులో ప్రోబయోటిక్లు లేదా మంచి బ్యాక్టీరియా ఉంటాయి, ఇవి సహజంగా కడుపును ప్రశాంతపరుస్తాయి మరియు జీర్ణవ్యవస్థను నిర్వహిస్తాయి. పెరుగులోని లాక్టిక్ ఆసిడ్ ప్రేగులలోని చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది మరియు మలం రీతిని కూడా నియంత్రిస్తుంది.

అర కప్పు పెరుగులో అరటిపండు లేదా ఇసాబ్గోల్ (సైలియం ఊక) కలిపి రోజుకు మూడుసార్లు తీసుకోవచ్చు.


విరేచనాల కోసం వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి - 
కడుపులో అసౌకర్యం, అజీర్ణం లేదా తేలికపాటి విరేచనాలు సాధారణంగా ఆందోళన కలిగించే విషయం కాదు. సాధారణంగా, చాలా సందర్భాలలో నివారణా చిట్కాలు పాటించిన కొద్ది గంటల్లోనే లక్షణాలు తగ్గుతాయి. అయితే, వృద్ధులు మరియు పిల్లలు చాలా వేగంగా డీహైడ్రేషన్కు గురవుతారు. అయితే, వాంతులు మరియు విరేచనాలకు ఒక రోజు కంటే ఎక్కువగా ఉంటే వైద్య సహాయం తీసుకోవాలి. అలాగే, తీవ్రమైన, తరచు లేదా నిరంతర కడుపు సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించాలి. నిరంతర అతిసారం లేదా క్రింద పేర్కొన్న లక్షణాలు ఉన్న సందర్భంలో, వైద్య సహాయం తీసుకోవడం అవసరం.

నిరంతర లేదా అనియంత్రిత వాంతులు లేదా విరేచనాలు
దీర్ఘకాలిక మలబద్ధకం
జ్వరం
రక్తపు మలం లేదా వాంతి 
వాయువును బయటకు పంపలేకపోవడం
మైకము లేదా తలతిప్పు
ఊరకనే బరువు తగ్గిపోవడం
పొత్తికడుపు లేదా పొట్టలో గడ్డ
మింగడంలో కష్టం
ఐరన్-లోప రక్తహీనత లేదా అటువంటి పరిస్థితుల చరిత్ర
మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి 

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd