చింతపండు ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు

చింతపండు ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు 


చింతకాయ చింత చెట్టు, టేమరిండస్ ఇండికా (Tamarindus indica) నుండి లభించే ఒక సన్నగా మరియు కొద్దిగా వంకర ఆకారంలో ఉండే పండు. చింతకాయలలో 3 నుండి 12 ఎర్రటి గోధుమ రంగు పిక్కలు ఉంటాయి వీటి చుట్టూ పుల్లని గుజ్జు ఉంటుంది. విత్తనాలు. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఈ కాయను వంటకాల్లో రుచి కోసం ఉపయోగిస్తారు. చింతపండును హిందీలో ఇమ్లీ అని పిలుస్తారు.

చింతపండు ఫాబేసీ కుటుంబానికి చెందిన ఒక లెగ్యుమ్ (చిక్కుడు). ఇది ఆఫ్రికాకు చెందినది కాని భారతదేశం ప్రపంచంలోనే చింతపండు యొక్క అతి పెద్ద ఉత్పత్తిదారు. భారతదేశంలో, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గడ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో చింతపండును సాగు చేస్తారు. నిజానికి, ఇది దక్షిణ భారత వంటకాల్లోని ప్రాధమిక పదార్ధాలలో ఒకటి.

చింతపండును పచ్చిగా తినవచ్చు లేదా సూప్‌లు, సాస్‌లు, కూరలు మరియు పచ్చడిలో కూడా ఉపయోగించవచ్చు. పచ్చి చింతకాయలను అన్నం, చేపలు మరియు మాంసాలలో రుచి కోసం ఉపయోగించవచ్చు, గుజ్జు మాత్రమే కాకుండా, చింత చెట్టు పువ్వులు మరియు ఆకులను కూడా వంటలలో ఉపయోగించవచ్చు. భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో, ఇమ్లీ గోలీ (చింతపండుతో  చేసిన మిఠాయి) భోజనం తర్వాత జీర్ణక్రియకు సహాయంగా తీసుకుంటారు.

చింతపండు కేవలం రుచినిచ్చే ఏజెంట్ మాత్రమే కాదు. ఇది యుగాలుగా ఒక సాంప్రదాయ ఔషధంగా కూడా ఉపయోగించబడుతుంది. చింతపండు కొలెస్ట్రాల్‌ను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది మరియు ఇది కొన్ని రకాల అల్సర్ల  నివారణకు కూడా సహాయపడుతుంది. ఎండబెట్టి మరియు ఉడకబెట్టిన చింత పువ్వులు మరియు ఆకులను బెణుకులు, బొబ్బలు, కీళ్ళ వాపు మరియు కండ్లకలకలకు ఒక సమర్థవంతమైన ఔషధంగా భావిస్తారు.
చింతపండు ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు

చింతకాయ గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:


శాస్త్రీయ నామం: టేమరిండస్ ఇండికా (Tamarindus indica)
కుటుంబం: ఫాబేసి (Fabaceae)
సాధారణ పేరు: చింతపండు, ఇమ్లీ (హిందీ)
సంస్కృత పేరు: చించ్చ (चिञ्चा)
స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: తూర్పు ఆఫ్రికాలోని మడగాస్కర్ చింతపండు యొక్క మూలం అని నమ్ముతారు. భారతదేశం, థాయిలాండ్, బంగ్లాదేశ్, మయన్మార్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, మధ్య మరియు దక్షిణ అమెరికా చింతపండును సాధారణంగా పండించే దేశాలు.
ఆసక్తికరమైన విషయం: దేవాలయాలలో ఇత్తడి దీపాలు, విగ్రహాలు మరియు ఫలకాలను శుభ్రపర్చడానికి చింతపండు గుజ్జును ఉపయోగిస్తారు.

చింతపండు పోషక వాస్తవాలు
చింతపండు ఆరోగ్య ప్రయోజనాలు 
చింతపండు దుష్ప్రభావాలు
ఉపసంహారం

చింతపండు పోషక వాస్తవాలు 

చింతపండు శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలను కలిగి ఉంటుంది. కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఏ, బి 3, బి 9, సి మరియు కె వంటి వివిధ ముఖ్యమైన విటమిన్లు కూడా ఉంటాయి. చింతపండులో  చాలా తక్కువ కొవ్వు శాతం ఉంటుంది.

యుఎస్‌డిఏ (USDA) న్యూట్రియంట్ డేటాబేస్ ప్రకారం, 100 గ్రాముల పచ్చి చింతపండు ఈ క్రింది పోషక విలువలను కలిగి ఉంటుంది:

పోషకాలు :100 గ్రాములకి 

శక్తి :239 కిలో కేలరీలు 
కొవ్వు :0.60 గ్రా  
కార్భోహైడ్రేట్లు :62.50 గ్రా 
ఫైబర్లు :5.1 గ్రా 
చక్కెరలు :38. 80 గ్రా 
నీరు :31.40 గ్రా 
ప్రోటీన్ :2.80 గ్రా  

ఖనిజాలు:100 గ్రాములకి 

కాల్షియం:74 mg
ఐరన్:92 mg
మెగ్నీషియం:113 mg
ఫాస్పరస్:628 mg
సోడియం:28 mg
జింక్:0.10 mg

విటమిన్లు :100 గ్రాములకి 

విటమిన్ ఏ:2 µg
విటమిన్ బి1:0.428 mg
విటమిన్ బి2 :0.152 mg
విటమిన్ బి3:1.938 mg
విటమిన్ బి6:0.066 mg
విటమిన్ బి9:14 µg
విటమిన్ సి;3.5 mg
విటమిన్ ఇ;010 mg
విటమిన్ కె:2.8 µg

ఫ్యాట్లు/ఫ్యాటీ యాసిడ్లు:100 గ్రాములకి 

సాచురేటెడ్:0.272 గ్రా  
మోనోఅన్సాచురేటెడ్:0.181 గ్రా 
పోలిఅన్సాచురేటెడ్:0.059 గ్రా 


చింతపండు ఆరోగ్య ప్రయోజనాలు

కడుపు కోసం: చింతపండు జీర్ణక్రియకు సహాయం చేస్తుందని మరియు జీర్ణ రుగ్మతను తగ్గిస్తుందని సూచిస్తున్నాయి. చింత ఆకులను పారంపరంగా ఆజీర్ణానికి చికిత్స కోసం ఉపయోగిస్తున్నారు. 

పెప్టిక్ అల్సర్స్ కు: చింత గింజల/పిక్కల సారాలు యాంటీఅల్సర్  లక్షణాలు కలిగి ఉన్నట్లు ప్రీక్లినికల్ అధ్యయనాలు సూచించాయి. చింత చెట్టు బెరడు నుండి తయారు చేసిన టానిక్ ను అల్సర్స్ చికిత్స కోసం ఉపయోగిస్తారు.  

మధుమేహం కోసం: పాంక్రియాటిక్ ఐలెట్స్ యొక్క బీటా కణాల పై చింత పిక్కల సారాలు యాంటీ-ఇన్ఫలమేటరీ మరియు ఇన్ఫలమేటరీ  సైటోకైనిన్స్ స్థాయిలను తగ్గిస్తాయని ఒక ప్రీక్లినికల్ అధ్యయనం తెలిపింది. ఈ లక్షణాలు అన్ని కలిపి ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరచి మరియు మధుమేహ లక్షణాలను తగ్గిస్తాయి.

ఇన్ఫలమేషన్ కోసం: జంతు ఆధారిత అధ్యయనాలు చింత ఆకుల సారాల యొక్క యాంటీఇన్ఫలమేటరీ లక్షణాలను తెలిపాయి.వీటిలో ఉండే కెటికిన్లు, మ్యుసిలెజ్,పెక్టిన్ మరియు యూరోనిక్ యాసిడ్లు చింత ఆకుల యొక్క యాంటీఇన్ఫలమేటరీ లక్షణాలకు బాధ్యత వహిస్తాయి.

యాంటీయాక్సిడెంట్ లక్షణాలు: చింత పిక్కల సారాలలో ఉండే కెటికిన్లు, ఎపికెటికిన్లు మరియు ప్రోసైనడిన్ బి2 వంటి ఫెనోలిక్ కాంపౌండ్లు యాంటీయాక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయని అవి ఫ్రీ రాడికల్స్ ను తొలగించడానికి మరియు ఆక్సిడేటివ్ ఒత్తిడిని తొలగించడానికి సహాయం చేస్తాయని ఒక అధ్యయనం తెలిపింది.

యాంటీమైక్రోబియల్ గా: సాధారణ ఇన్ఫెక్షన్లు కలిగించే ఆస్పర్జిల్లిస్ నైగర్ మరియు కాండిడా వంటి ఫంగస్లకు వ్యతిరేకంగా చింతపండు యాంటీఫంగల్ లక్షణాలను కలిగి ఉన్నట్లు పరిశోధనలు ధ్రువీకరించాయి. అంతేకాక చింత చెట్టు సారాలు ఇతర మొక్కలలో వచ్చే వ్యాధులు మరియు తెగుళ్లను నివారించడానికి సహాయపడతాయి.

  • కడుపు కోసం చింతపండు 
  • పెప్టిక్ అల్సర్స్ కోసం చింతపండు
  • అధిక రక్త కొలెస్ట్రాల్ కోసం చింతపండు
  • అధిక రక్తపోటు కోసం చింతపండు
  • మధుమేహం కోసం చింతపండు
  • ఇన్ఫలమేషన్ కోసం చింతపండు -
  • చింతపండుకి యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి 
  • బరువు తగ్గడానికి చింతపండు 
  • యాంటీమైక్రోబయాల్‌గా చింతపండు


కడుపు కోసం చింతపండు 

ఆహారం మరియు జీవనశైలి ఎంపికలు సరిగా లేని కారణంగా చాలా మంది కడుపు నొప్పి, అతిసారం మరియు జీర్ణశయా రుగ్మతలు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. చింతపండు మంచి జీర్ణక్రియకు సహాయపడుతుందని మరియు కొన్ని జీర్ణక్రియ సమస్యల నుండి ఉపశమనం కలిగించగలదని పరిశోధనలు సూచిస్తున్నాయి. చింతపండు ఆకులను పారంపర్యంగా అజీర్ణాన్ని నివారించడానికి ఉపయోగిస్తారు. థాయ్ ఔషధ విధానంలో, చింతపండును జీర్ణక్రియకు, కడుపు వాయువును (గ్యాస్) తగ్గించడానికి మరియు మలబద్దకాన్ని నివారించడానికి ఉపయోగిస్తారు. కొన్ని దేశాలలో, చింతపండు చెట్టు యొక్క వేర్లు, బెరడు మరియు కొమ్మల నుండి తయారుచేసిన సారాన్ని కడుపు నొప్పి చికిత్స కోసం ఉపయోగిస్తారు.


పెప్టిక్ అల్సర్స్ కోసం చింతపండు 
పెప్టిక్ అల్సర్లు అనేవి కడుపు లోపలి పొర మరియు చిన్న ప్రేగు యొక్క పై భాగంలో సంభవించే నొప్పిని కలిగించే పుండ్లు. అధిక మందులు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ (హెలికోబాక్టర్ పైలోరి) లేదా మద్యపానం వంటి అనేక కారణాల వల్ల ఈ పూతలు/పుండ్లు సంభవించవచ్చు. అయితే, అధిక ఆమ్లత్వం కూడా కడుపు పొరను దెబ్బతీస్తుంది. చింతపండు విత్తనాల సారం యాంటీఅల్సర్ లక్షణాలను కలిగి ఉందో లేదో పరిశీలించడానికి ఒక ప్రీ క్లినికల్ అధ్యయనం జరిగింది. చింతపండు విత్తనాల యొక్క మెథనాలిక్ సారం కడుపులో గ్యాస్ట్రిక్ రసాల విడుదలను నెమ్మదిపరచడంలో సహాయపడుతుంది, తద్వారా పూతల/పుండ్ల నుండి ఉపశమనం లభిస్తుంది. పారంపర్యంగా, చింత చెట్టు బెరడుతో తయారు చేసిన టానిక్ అల్సర్ చికిత్సకు ఉపయోగిస్తారు. విత్తనాల నుండి తయారు చేసిన పొడిని కొన్ని రకాల పూతల చికిత్సకు బాహ్యంగా పూస్తారు/రాస్తారు. చింత పువ్వులను కూడా చర్మపు పూతల నివారణగా ఉపయోగిస్తారు.అధిక రక్త కొలెస్ట్రాల్ కోసం చింతపండు

ఆరోగ్యకరమైన కణాలను నిర్మించడానికి కొలెస్ట్రాల్ అవసరం. అయినప్పటికీ, అధిక స్థాయి కొలెస్ట్రాల్ ధమనులను అడ్డుకుంటుంది (అథెరోస్క్లెరోసిస్), ఇది అధిక రక్తపోటు, స్ట్రోక్ మరియు గుండెపోటు వంటి సమస్యలకు కారణమవుతుంది. చింతపండు యొక్క హైపోలిపిడెమిక్ లక్షణాలను వివిధ అధ్యయనాలు సూచించాయి. ఒక ప్రీ క్లినికల్ అధ్యయనం ప్రకారం, చింతపండు గుజ్జు నుండి సేకరించిన సారాలు మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిని (టిసి) మరియు తక్కువ-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (చెడు కొలెస్ట్రాల్) స్థాయిని తగ్గిస్తుందని తెలిసింది. అంతేకాక ఇది అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (మంచి కొలెస్ట్రాల్) స్థాయి పెరుగుదలకు కూడా దారితీసింది. చింతపండు అథెరోస్క్లెరోసిస్ చికిత్సకు ఉపయోగపడుతుందని ఈ అధ్యయనం సూచించింది.అధిక రక్తపోటు కోసం చింతపండు 

శరీరంలో రక్తపోటు స్థాయిని నిర్వహించడానికి సోడియం నుండి పొటాషియం నిష్పత్తి (sodium to potassium ratio) తక్కువగా ఉండడం అవసరం. పొటాషియం రక్త నాళాలను సడలించడానికి సహాయపడుతుంది, తద్వారా రక్తపోటును తగ్గిస్తుంది. చింతపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది మరియు ఇది రక్తపోటు నుండి ఉపశమనం అందించగలదు.ఒక క్లినికల్ అధ్యయనం ప్రకారం, రోజుకు 15mg / Kg చింతపండు తీసుకోవడం వల్ల డయాస్టొలిక్ రక్తపోటు గణనీయంగా తగ్గుతుందని తెలిసింది.

మధుమేహం కోసం చింతపండు 

మధుమేహం అంటే శరీరం గ్లూకోజ్‌ను మెటాబోలైజ్ (జీవక్రియ ప్రక్రియ) చేయలేకపోయే ఒక పరిస్థితి. ఈ గ్లూకోజ్ రక్తప్రవాహంలో ఉండిపోతుంది అది  రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదలకు దారితీస్తుంది. అనేక అధ్యయనాలు మధుమేహ చికిత్సలో చింతపండు యొక్క సామర్థ్యాన్ని తెలిపాయి. ఒక ప్రీక్లినికల్ అధ్యయనం,చింతపండు విత్తనాల సారం యొక్క యాంటీఇన్ఫలమేటరీ లక్షణాలు మరియు మధుమేహం మధ్య అనుబంధాన్ని వెల్లడించింది. చింతపండు విత్తనాల సారం ప్యాంక్రియాటిక్ ఐలెట్స్ యొక్క బీటా కణాలపై వాపు నిరోధక చర్యను ప్రదర్శిస్తుందని మరియు అది ఇన్ఫలమేటరీ సైటోకిన్‌ల స్థాయిలను తగ్గిస్తుందని అధ్యయనం సూచిస్తుంది. ఈ లక్షణాలు అన్ని కలిసి ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరచడంలో మరియు మధుమేహ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. మరోక జంతు ఆధారిత అధ్యయనం రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించే శక్తిని కలిగి ఉండే ఫ్లేవనాయిడ్ల వంటి కొన్ని ఫైటోకెమికల్స్ చింతపండులో ఉన్నట్లు తెలిపింది.


ఇన్ఫలమేషన్ కోసం చింతపండు 

ఇన్ఫలమేషన్ అనేది శారీరక పరిస్థితి, ఇది సంక్రమణ లేదా గాయానికి ఒక ప్రతిచర్యగా సంభవిస్తుంది. ప్రభావిత ప్రాంతంలో వాపు, ఎరుపుదనం, నొప్పి మరియు అసౌకర్యం వంటి లక్షణాలు ఉంటాయి. జంతు ఆధారిత అధ్యయనాలు చింతపండు ఆకు సారం యొక్క వాపు నిరోధక శక్తిని సూచించాయి. చింతపండులో ఉండే కాటెకిన్లు, ముసిలేజ్, పెక్టిన్ మరియు యురోనిక్ యాసిడ్లు ప్రధానమైన వాపు  నిరోధక సమ్మేళనాలు అని ఆ నివేదిక తెలిపింది. చింతపండు విత్తనాల నుండి తయారైన వివిధ పదార్దాలపై చేసిన పరిశోధన వాటిలో ఆల్కలాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ కాంపౌండ్లు మరియు స్టెరాయిడ్లు ఉన్నాయని సూచించింది అవి వాపు నిరోధక లక్షణాలను ప్రదర్శిస్తాయి.

చింతపండుకి యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి

ఫ్రీ రాడికల్స్ (రియాక్టివ్ ఆక్సిజన్ జాతులు) వల్ల కలిగే హానికరమైన ప్రభావాలతో శరీరం పోరాడలేకపోయినప్పుడు ఆక్సీకరణ ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది క్యాన్సర్, ఆర్థరైటిస్, కార్డియోవాస్కులర్ మరియు న్యూరోడిజెనరేటివ్ రుగ్మతలు వంటి సమస్యల యొక్క ప్రమాద కారకంగా ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం, చింత పిక్కల పొర యొక్క సారాలు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయని తెలిసింది.ఈ సారాలలో ఉన్న కాటెకిన్, ఎపికాటెచిన్ మరియు ప్రోసైనడిన్ బి 2 వంటి ఫినోలిక్ సమ్మేళనాలు ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడానికి మరియు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి కారణమని అధ్యయనం వెల్లడించింది. చింత పిక్కల పొడి (tamarind seed powder) ని రసాలు, కుకీలు వంటి ఆహార ఉత్పత్తులకు సహజ యాంటీఆక్సిడెంట్‌గా చేర్చవచ్చా అని తెలుసుకోవడానికి మరోక పరిశోధన జరిగింది. ఈ ఆహార ఉత్పత్తులకు చింత పిక్కల పొడిని జోడించడం వల్ల కొన్ని బయోయాక్టివ్ ఫైటోకెమికల్స్ ఆక్టివ్ అవుతాయని మరియు వాటి యాంటీఆక్సిడెంట్ లక్షణాలను పెంచుతాయని తెలిసింది.

బరువు తగ్గడానికి చింతపండు

శరీర కణజాలాలలో అధిక కొవ్వు పేరుకుపోవడం ద్వారా కలిగే ఒక పరిస్థితి ఊబకాయం. ఊబకాయం యొక్క కొన్ని సాధారణ కారణాలు అధికంగా తినడం, తక్కువ శారీరక శ్రమ మరియు కొన్ని వైద్య సమస్యలు. చింత పిక్కలు బరువు పెరగకుండా నిరోధించగలవని పరిశోధనలు చెబుతున్నాయి. చింతపండు విత్తనంలో ట్రిప్సిన్ ఇన్హిబిటర్ (trypsin inhibitor) ఉంటుందని, అది బరువు పెరగడాన్ని నిరోధిస్తుందని ఒక ప్రీ క్లినికల్ అధ్యయనం వెల్లడించింది. ఈ ట్రిప్సిన్ ఇన్హిబిటర్ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది, తద్వారా ఆకలిని అరికడుతుంది మరియు ఆహారం ఎక్కువగా తీసుకోవడాన్ని నివారిస్తుంది. ఊబకాయ నిరోధక ఔషధాలకు సహజ ప్రత్యామ్నాయంగా చింతపండు యొక్క సంభావ్య ఉపయోగాన్ని గురించి ఇది సూచిస్తుంది.

యాంటీమైక్రోబయాల్‌గా చింతపండు 

చింత కాయలు మరియు ఆకులు యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఆస్పర్జిల్లస్ నైగర్ (Aspergillus niger), ఇది చెవి ఫంగల్ ఇన్ఫెక్షన్కు సాధారణ కారణం మరియు కాండిడా అల్బికెన్స్ (Candida albicans), ఇది సాధారణంగా నోటి మరియు యోని ఇన్ఫెక్షన్లతో సంబంధం కలిగి ఉంటుంది ఈ రెండింటికి వ్యతిరేకంగా చింతపండు యొక్క యాంటీ ఫంగల్ లక్షణాలను పరిశోధన నిరూపించింది. ఎస్చెరిషియా కోలి (Escherichia coli) మరియు సాల్మొనెల్లా పారాటైఫి (Salmonella paratyphi) వంటి కొన్ని సాధారణ వ్యాధికారక బాక్టీరియా జాతులకు వ్యతిరేకంగా కూడా చింతపండు సారం యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. చింతపండు యొక్క యాంటీమైక్రోబయాల్ చర్య కారణంగా, చింత చెట్టు యొక్క సారాన్ని (extract) కొన్ని దేశాలలో తాగునీటిని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు.

కౌపీయా మొజాయిక్ వైరస్ (cowpea mosaic virus) వల్ల కలిగే మొక్కలకు కలిగే ఇన్ఫెక్షన్ల చికిత్సకు చింత మొక్కల సారాన్ని సాధారణంగా ఉపయోగిస్తారు. చింతపండు సారంలో ఉండే ట్రైటెర్పినాయిడ్లు మరియు ఇతర ఫినాల్స్ మరియు ఆల్కలాయిడ్లు వంటి కొన్ని సమ్మేళనాలు ఇతర మొక్కలలో తెగుళ్ళు మరియు వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.


చింతపండు దుష్ప్రభావాలు 

చింతపండు హైపోగ్లైసీమిక్ లక్షణాలను కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. కాబట్టి, మధుమేహం కోసం మందులను వాడేవారు, చింతపండును క్రమంగా (రోజువారీ) తినడాన్ని నివారించాలి. ఒక కేసు స్టడీలో, మధుమేహంతో బాధపడుతున్న 47 ఏళ్ల వ్యక్తి మందుమేహ మందుల పై ఉన్నప్పటికీ అతని చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులకు గురవుతాయని తెలిసింది. క్షుణ్ణమైన పరిశోధనలో, రక్తంలో గ్లూకోజ్ హెచ్చుతగ్గులకు దగ్గు కోసం అతడు తీసుకునే చింతపండు మూలికా మాత్రలు  కారణమని కనుగొనబడింది.
చింతపండును అధిక మొత్తంలో తరచుగా తీసుకోవడం వల్ల పిత్తాశయ రాళ్లు సంభవించవచ్చు.
చింతపండు రక్తపోటును తగ్గిస్తుందని అంటారు. రక్తపోటు కోసం మందులు వాడుతున్నట్లైతే, చింతపండును నివారించడం మంచిది.

ఉపసంహారం 
చింతపండు ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది ఎందుకంటే ఇది తీయ్యగా మరియు పుల్లగా ఉంటుంది. చింత చెట్టు యొక్క దాదాపు ప్రతి భాగం వేర్లు, బెరడు, ఆకులు, పండ్లు మరియు పువ్వులతో సహా  అన్ని ఆరోగ్య మరియు ఔషధ లక్షణాలను కలిగి ఉంటుంది. వంటకాల్లో చింతపండును చేర్చడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది ఖనిజాలు, ఫైటోకెమికల్స్, యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ల యొక్క మంచి మూలం, ఇవి శరీరం యొక్క సరైన పనితీరుకు అవసరం. చింతపండు మధుమేహం మరియు ఊబకాయం వంటి సమస్యల చికిత్సకు సహాయపడుతుంది, దీనికి యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి మరియు కొన్ని రకాల పూతల/అల్సర్స్ నివారణను కూడా పని చేస్తుంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd