తులసి ఆరోగ్యం ప్రయోజనాలు

తులసి ఆరోగ్యం ప్రయోజనాలు 



మానవుని ఆరోగ్య పరిరక్షణ లో అత్యధిక ప్రాధాన్యత కలిగిన తులసి, భారతీయ సంస్కృతి లో ఒక ప్రత్యేక స్థానం ఉంది.

చాలా ఆరోగ్య సమతుల్యతను కాపాడ గల తులసి ఒక విధంగా ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పవచ్చును విశిష్ట ఔషధ గుణాలున్న ఈ మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి మంత్రోపాసకుల తో సహా మనమంతా ఉత్సాహం చూపుతాం తప్ప. 

రోజుకు కనీసం ఒక  మూడు ఆకులు తినడానికి ఉత్సాహ పదము. దీని వాసన, దీని పై నుంచి వీచే గాలి, నీటిలో కరిగే వచ్చే తీర్థం…… అన్నీ రోగ నివారిణులుగా కూడా పని చేస్తుంది.

ఇది నయం చెయ్యని  రోగం  ఏది లేదు. తులసి ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకునే ముందు అసలు తులసి ఎన్ని రకాలు ఉన్నాయి అన్నది ఒకసారి తెలుసుకుందాం.

తులసి ఆరోగ్యం ప్రయోజనాలు



తులసి రకాలు – వివిద పేర్లు

నిఘంటువులో తులసి చాలా పేరు కనిపిస్తాయి. కానీ మనకు తులసి లో మొత్తం మన దేశానికి సంబంధించిన  7 తులసి రకాలున్నాయి. ప్రధానమైనవి. 3 అని అర్చన పరంగా చెప్పిన (శ్రీలక్ష్మి తులసి, కృష్ణ తులసి, వన తులసి) ఆయుర్వేదంలో ఉపయోగించే రకాలు నాలుగింటిని కలిపి ఏడు రకాలుగా తులసి లభ్యమవుతున్నది.


కృష్ణ తులసి
శ్రీలక్ష్మి తులసి .
రామ తులసి
అడవి/వన తులసి
నెల తులసి
మరువక తులసి
రుద్ర జడ తులసి


ఆంగ్లంలో ‘హోలీ బాసిల్’ (Holy Basil) అని పిలువబడే ఈ మొక్క ద్విదళాలుగా ఉండే ఆకులు తో (ప్రతి కణుపు వద్ద) ప్రవర్ధమాన మై ఒక మీటరు ఎత్తు వరకు పెరగగలదు.

 కృష్ణ తులసి

దీనినే ‘నల్ల తులసి’ అని కూడా వ్యవహరిస్తారు. మూడున్నర అడుగుల ఎత్తు వరకూ పెరగగల ఈ మొక్క శాస్త్రీయ నామం (Botanical name) “ఓస్సిమమ్ శాంక్టమ్’ క్రిష్టియన్స్ దీన్ని హోలీ బ్లాక్ బాసిల్ అని అంటారు. ఇది క్రీస్తు సమాధి మీద నాటబడినది. బొల్లి, మలేరియా, ధనుర్వాతం, గుండెజబ్బులు, విషదోషాలు, ప్లేగు కూడా నివారిస్తుంది. కృష్ణ తులసి తైలాన్ని ఊపిరి తిత్తుల రోగాలకు, గాయాలకు, చర్మ వ్యాధులు తయారు చేసే మందుల లో కూడా  ఉపయోగిస్తారు.


 లక్ష్మి తులసి

 ‘తెల్ల తులసి’ లేక లక్ష్మి తులసి అని వ్యవహరించే దీని శాస్త్రీయ నామం “ఓస్సిమమ్ విల్లోస్సమ్’. దీనికాడలు తెల్లగా ఉంటాయి. నాలుగైదు అడుగుల ఎత్తువరకు పెరుగుతుంది. . ఇందులో మళ్లీ రెండు జాతులు లభ్యమవుతున్నాయి. మంచి పరిమళం, పెద్ద పెద్ద ఆకుల తో, దట్టమైన పుష్పగుచ్ఛాలు ఉండే జాతి గల తెల్ల తులసి క్రిమి కీటక నాశిని. ఇంట్లో ఒక కొమ్మ వ్రేలాడ దాస్తే దోమలు దరిచేరవు.. ” వస్థ దవనం ఆకు వల్ల చిన్న చిన్న ఆకులు ఉండే ఇంకో జాతి తెల్ల తులసిని మూత్ర సంబంధ రోగాలు నివారినిగా కూడా  ఉపయోగిస్తారు.

 రామ తులసి

ఒక మీటరు ఎత్తు పెరిగే ఈ తులసి శాస్త్రీయ నామం ‘ఓసి మం బలాట్టమ్’. చాలా వాసన కలిగి ఉంటుంది. ఇది కూడా క్రిమి కీటక సంహారిణిగా కూడా పనిచేస్తుంది. రాతి నేలలు, కొండవాలు లలో ఎక్కువగా కనిపిస్తుంది . నీటి వనరులు లేని చోట్ల కూడా పెరగగలదు. జీర్ణశక్తిని పెంచే గుణం గల రామ తులసి ఆకులను కొన్నింటిని భోజనానంతరం సేవిస్తే కడుపులో నులి పురుగులు సైతం నశిస్తాయి.


అడవి తులసి

గిరిజనులు తమ పాలిటి కల్పతరువు గా భావించే అడవి తులసి కూడా ఔషధగుణాలను కలిగి ఉంది. ఎక్కువ ఎత్తు ఎదగదు. ‘ఓస్సిమమ్ కారోఫైమాటన్, దీని శాస్త్రీయ నామం. చాలా ఘాటైన వాసన కలిగి తేలు, జెర్రీ వంటి పెద్ద విషకీటకాల విషాన్ని విరిచే గుణాన్ని కలిగి ఉంది. శ్రీశైలం, తిరుపతి, తలకోన తదితర అడవులలోనూ కొన్ని కొండ ప్రాంతాల్లో ను కూడా  లభిస్తుంది.


 నెల తులసి

కొందరు దీనిని ‘వైద్య తులసి’ అని; ‘శొంఠి తులసి’ అనీ వ్యవహరిస్తారు. ఈ రకం తులసి కూడా చాలా ఘాటైన వాసన తో ఉండి సూక్ష్మ జీవుల్ని హరిస్తుంది, * వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. ‘ఓస్సిమమ్ పైలోసమ్’ అనేది దీని శాస్త్రీయ నామం. స్పోటకం వంటి అంటు రోగాలున్న చోట్ల ఈ తులసిని పూర్వం నాటేవారట.  ఇది ఉన్న ఊళ్లలో అమ్మవారు పోయుట జ్వరం వంటివి కనిపించవు. అలాగే మలేరియా క్రిములు సైతం నిర్మూలిస్తుంది.

 మరువక తులసి


దీని శాస్త్రీయ నామం ‘ఓస్సిమమ్ గ్రాటిస్సికమ్’. దీనినే కొందరు మరువం, మరువకం అనీ పిలుస్తారు.  కర్పూర తులసి కూడా అనీ అంటారు. దీనిని సువాసన గల ఇతర పుష్పాలతో జత చేసి దండలుగా కట్టు తల లో పెట్టుకోవడానికి దైవ పూజ నిమిత్తం కూడా వాడతారు. ఈ తులసి వాసనకు తలలో పేలు, ఈ పి, చుండ్రు కూడా  నశిస్తాయి.. జుట్టుకు  సువాసన అబ్బుతుంది. కొన్ని ప్రాంతాల్లో దీనిని కర్పూరం చేయడానికి ఉపయోగిస్తారు. అయితే ఈ కర్పూరం చర్మ రోగ నివారిణి ఔషధాలు వినియోగం కోసం తయారీ చేస్తారు. అట్లే దీని ఎస్సెన్స్ (సారాన్ని) సువాసన గల కేశ తైలం తయారీలో వినియోగిస్తారు. ఈ కర్పూర తులసి తైలం చెవిపోటుకి, ఉదర కోశ వ్యాధుల నివారణకు, వాత దోషాలు పోగొట్టడానికి సైతం వాడతారు.

 రుద్రజడ తులసి

వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా ప్రాచీనుల “సబ్జా గింజలను వాడేవారు. ఇది “రుద్రజడ తులసి’ జాతికి చెందినదిగా గుర్తించారు. ఈ తులసి గింజలు నీట నాని వేసి, ఆ పానీయం తాగితే – శరీరంలో అధికంగా చేరిన ఉష్ణం, త్వరితంగా  కూడా తగ్గుతుంది. “ఓస్సిమమ్ బాసివికమ్’ అనేది దీని శాస్త్రీయనామం. దీని ఆకులు కొద్దిగా మిరియాలను నూరి తింటే చాలు జ్వరాలు, సీమ జ్వరాలు సహితం తగ్గడం గమనార్హం. కొందరు ఈ ఆకులు శొంఠిపొడి వేసి కషాయంగా  కాచి, తీసుకుంటారు. ఇది కూడా జ్వరనివారణకు బాగా ఉపకరిస్తుంది. నిత్యం ఈ ఆకుల్ని సేవిస్తే, మూత్ర కోశ సంబంధ వ్యాధుల్ని కూడా నివారించుకోవచ్చును .  (స్థాలీపులాక న్యాయం ఈ తులసి రకాలు ఔషధ గుణాలు ఇక్కడ చర్చించడం జరిగింది. నిజానికి – తులసి వల్ల; మనదేశంలోని లభ్యమయ్యే 7 తులసి  రకాల వల్ల ఉపశమించే వ్యాధుల చిట్టా పరిశీలిస్తే – దాదాపు తులసి 500 రకంగా వైద్యం చేయవచ్చునని ఒక పరిశీలన లో తేలింది.)



తులసి ఆరోగ్యం ప్రయోజనాలు

 • చర్మరోగాలు నివారిస్తుంది.
 • ఆస్మా ఆస్మా, ఆయాసం, కోరింత దగ్గులను అరికడుతుంది. కఫాన్ని విరుస్తుంది.
 • సాంక్రమిక వ్యాధులైన కలరా, ప్లేగు వంటివి అదుపులో ఉంచుతుంది.
 • కడుపులో నులి పురుగుల్ని నిర్మూలిస్తుంది.
 • తులసి రసం మర్దన చేస్తే కీళ్ళ నొప్పులు, శిరో భారం తగ్గుతాయి.
 • తులసి రసాన్ని పై పూత గా పూస్తే, ఆర్నెల్లకు బొల్లి వ్యాధి మాయమవుతుంది.
 • తులసి విషహారిణిగా పనిచేస్తుంది.
 • ఇస్నోఫీలియా ను నయం చేస్తుంది.
 • మెదడు వాపు వ్యాధి ని నివారిస్తుంది.
 • ఆకలిని వృద్ధి చేస్తుంది.
 • నోటి అరుచి పోగొడుతుంది.
 • శ్వాసకోశనాళ శుభ్రతకు దోహదపడుతుంది.
 • పులిపిర్లను నిరోధిస్తుంది.
 • తులసి ఆకు రసం లో కొబ్బరి నూనె కలిపి కాళ్ల పగుల్లకు పూస్తే త్వరగా నయమయే అవకాశం ఉంది.
 • రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగు పడుతుంది.
 • ప్రతిరోజు క్రమం తప్పకుండా 10 – 15 తులసి ఆకుల్ని నమిలి తింటూవుంటే, శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎలాంటి వ్యాధులైనా సరేదరిచేరు సాహసించరు.
 • మలబద్దకాన్ని నివారిస్తుంది.
 • నోటి దుర్వాసన ను అరికడుతుంది.
 • కిడ్నీలో రాళ్లు కరిగిస్తుంది.
 • వీర్యపుష్టికివీర్యపుష్టికి తులసి గొప్ప వరం.


జుట్టు సంబంధ తులసి ఆరోగ్యం ప్రయోజనాలు


తలకు తులసి రసం రాసి, రాత్రంతా ఉంచుకొని – మర్నాడు తలస్నానం చేస్తే పేలు పోతాయి.

తలలో పేలు నశింపజేయడానికి మరో మార్గం కూడా ఉంది. రాత్రి పడుకోబోయే ముందు — ఘాటైన వాసన గల ముదురు తులసి ఆకులు (కోసి ఉంచిన విఎప్పుడైనా) దిండు పై ఒత్తుగా పరుచుకుని – వాటి ఘాటు తలకు పట్టేలా చూసుకున్నా చాలు! తెల్లవారేసరికి పేలు, ఈపులు సహా రాలిపోతాయి.

తులసి విత్తులు, నల్ల ఉమ్మెత్త విత్తులు కలిపి తింటే అద్భుతంగా నిద్రపడుతుంది.

మానసిక పరమైన ఒత్తిళ్లతో సతమతమయ్యే స్త్రీలకు తులసి ఒక  దివ్యౌషధం.

అందంగా ఉండే స్త్రీల జుట్టు సమస్యలు మొదలై, జుట్టురాలిపోతూంటే రోజూ గుప్పెడు తులసి ఆకుల్ని నమలడం వల్ల ఈ ఒత్తిడి దూరమై గుణం  కూడా కనిపిస్తుంది. నెల్లాళ్లు గడిచేలోగానే జుట్టు రాలడం కూడా  తగ్గుతుంది.

తులసి ఆకుల రసం కొన్నాళ్ల పాటు రోజూ వెంట్రుకలకు దట్టంగా పట్టించుకొని, ఉదయం పూట శిరః స్నానం చేస్తూంటే ఆరు నెలలుగా తెల్లజుట్టు తగ్గి నల్ల వెంట్రుకలు అధికం అవుతాయి . 

 నేత్ర సంబంధ తులసి ఆరోగ్యం ప్రయోజనాలు

తులసి విత్తనాల చూర్ణాన్ని కంట్లో కొద్దిగా వేస్తే దుమ్ము, ధూళి బైటికి వచ్చి కళ్లకు మంచి తేజస్సు కూడా కలుగుతుంది.

తులసి ఆకుల రసాన్ని నీడన ఎండించి, అది చిక్కనిద్రవంగా మారాక వేలికాసకు కాస్తతీసి రెండు పూటలా కంటి క్రింద భాగాన మసాజ్ చేస్తున్నట్లుగా రాస్తూవుంటే కంటి ఉబ్బు – కంటి క్రింద నలుపు దేరడం వంటివి  కూడా తగ్గుతాయి.

వయస్సు పై బడి చూపు మందగిస్తున్నట్లయితే – అటువంటి వారు ప్రతి రోజూ రెండు చుక్కల తులసి రసం కళ్లలో వేసుకుంటూ ఉంటే మంచి ఫలితం  కూడా కనిపిస్తుంది.

తులసి ఆకు రసాన్ని రెండు లేదా మూడు చుక్కలు కంట్లో వేస్తే కళ్ల వెంట నీలు. కారడం – కళ్ల మంటలు తగ్గడమే కాక, కంటికి మంచి బలాన్ని చేకూరుస్తుంది.

అడవి తులసి రసాన్ని పంచదారతో కలిపి ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు టానిక్ వలె పుచ్చుకుంటే – కంటికి కునుకు రాదన్న బెంగ కూడా  ఉండదు. నిద్రలేమి బాధ నుండి ఉపశమనం తధ్యం.



 చెవి  సంబంధ తులసి ఆరోగ్యం ప్రయోజనాలు

తులసి ఆకుల్ని బాగా ఎండబెట్టి, దానిమ్మ రసంలో నూరి ఆ మిశ్రమాన్ని పిల్లలుకు  ఇస్తే ఒళ్ళు నొప్పులు పాటు చెవి సంబంధ రోగాలు  కూడా అంతరిస్తాయి.

రుద్ర తులసి ఆకుల రసాన్ని కొద్దిగా వెచ్చజేసి చెవిలో వేస్తే చెవిపోటు కూడా తగ్గుతుంది. చెవి నుండి దుర్వాసన తో కూడిన చీము కారడాన్ని రుద్ర తులసి  బాగా అరికడుతుంది.

తులసి రసానికి సమపాళ్లలో నువ్వుల నూనె కలిపి కాచి, గోరువెచ్చగా ఉన్నప్పుడే 3 లేక 4 చుక్కలు చెవిలో వేసి దూది పెట్టినట్లయితే చెవిపోటు కూడా నెమ్మ దిస్తుంది.

ప్రాచీనకాలంలో చెవిపోట్లకు, వినికిడి సమస్యల నివారణకు తులసిపసరు చెవిలో పోసేవారని కూడా శాస్త్రప్రమాణాలున్నాయి.

కృష్ణ తులసి, భూతులసి రసాన్ని చెరొక రెండు స్పూన్లు తీసుకుని, శుద్ధమైన కొబ్బరి నూనెలో కలిపి గోరువెచ్చ గా చేసి, అందులో కొద్దిగా వేపతైలం చేర్చి చెవి యందు రెండు చుక్కలు వేసినచో ఆర్నెల్ల వరకు ఎటువంటి చెవిపోటు  కూడా ఉండదు.



శ్వాస సంబంధిత తులసి ఆరోగ్యం ప్రయోజనాలు


 కఫాన్ని వెడల గొట్టే శక్తి తులసికి బాగా వుంది. వన తులసి ఆకులు రోజూ గుప్పెడు నముల్లూంటే, శ్వాసనాళాలు కూడా శుభ్రమవుతాయి.

మిరియాల చూర్ణం తులసి రసంలో బాగా చాది, తేనెతో అద్ది లోపలికి పుచ్చుకుంటే శ్వాసకాసలు తగ్గుతాయి.

తులసి రసం, వస చూర్ణం, నువ్వులు నూనె సమపాళ్లలో తీసుకొని బాగా కాచి, చల్లార్చిన తర్వాత రోజు రెండుమూడు చుక్కలు వేసుకొంటూ వుంటే ఎలాంటి నాసికా రోగాలైనా కూడా  అంతరిస్తాయి.

ఎండబెట్టిన తులసి ఆకుల చూర్ణాన్ని నశ్యం మాదిరిగా పీలుస్తూ వుంటే ఆస్త్మా అద్భుతం గా నయం అవుతుంది పరిశోధనలో కూడా తేలింది.

నోరు, గొంతు సంబంధ తులసి ఆరోగ్యం ప్రయోజనాలు



ఒక స్పూన్ తులసి రసంలో కొంచెం తేనెను కలిపి ప్రతిరోజూ తీసుకుంటూ ఉంటే, బొంగురు పోయిన గొంతు, సాఫీగా కూడా మారుతు   ఉంటుంది. గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతాయి. నోట్లో పూతకు ఇదే మంచి మందు.

పళ్లు తోముకొనే ముందు, ముఖం కడుక్కొనే నీటిలో తులసి ఆకులు నానవేసి . ఆ నీటిని పుక్కిలించి ఆ పైన దంతధావనం చేస్తే, నోటి దుర్వాసన  కూడా ఉండదు.


 కడుపులో రుగ్మతలకు తులసి ఆరోగ్యం ప్రయోజనాలు


కావ్య వ్యాధులకు తులసి కషాయాన్ని వాడవచ్చు ను .  గుప్పెడు ఆకుల్ని వేడినీటిలో వేసి, మూత పెట్టి రెండు నిముషాలు అలాగే ఉంచు, ఆకుల్ని మెత్తగా పిండివడకట్టి, ఈ రసాన్ని గ్లాస్ నిండా పరగడుపున తీసుకుంటూ ఉంటే, మూడు నెలలకు మంచి గుణము కూడా కనిపిస్తుంది.

విరేచనాలు, రక్త విరేచనాలు సమపాళ్లలో తులసి రసం, ఉల్లిపాయ రసం, అల్లం రసం మరియు  తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ఏడు చెంచాలు (2×3) రెండు పూట్లో కూడా తీసుకోవాలి. మూడురోజులకు గుణము కనిపిస్తుంది.

తులసి కొమ్మలు లేతవి యధాతధంగా నీళ్లలో వేసి మరిగించి/కాచి చల్లార్చిన కషాయాన్ని రెండు రోజులు తీసుకుంటే జిగట విరేచనాలు కూడా మటుమాయం.

తులసి రసం  మరియు  తమలపాకు రసం కలిపి, దీనికి చిటికెడు పంచదార చేర్చి ఉదయం సాయంత్రం రెండేసి స్పూన్ల చొప్పున తీసుకుంటూ ఉంటే, మంచి ఆకలిపుట్టి జఠరాగ్ని కూడా ప్రేరేపిస్తుంది.

తులసి గింజలను బాగా నూరి, ఆ పొడిపాలలో కలుపుకొని త్రాగుతూంటే ఎటువంటి వాంతులైనా కూడా అరికట్టబడతాయి.



తులసి ఒళ్లు నొప్పులు ఉప‌శ‌మ‌నానికి 

ఒక్కోసారి ఏ కారణం లేకుండానే ఒళ్లునొప్పులు కూడా పుడుతుంటాయి. దీనికీ తులసి ఆకుల తో చక్కటి ఉపశమనం ఉంది. పది తులసి ఆకులను కప్పు నీళ్ళలో వేసి  బాగా వేడి చేయాలి. ఆకులు బా గా మరిగి నీళ్లు సగం అయ్యే దాకా కాచాలి. చల్లార్చిన తర్వాత ఆ కషాయానికి ఉప్పు కలిపి, దాన్ని ప్రతి రోజూ తీసుకుంటే నొప్పులు కూడా  ఉపశమిస్తాయి. ఇంకొక మార్గం కూడా ఉంది.

తులసి ఆకుల్ని, ఆముదపు చెట్టు వేర్లను నీటిలోవేసి మరిగించాలి. చల్లారిన తర్వాత వడగట్టి, ఈ ద్రవాన్ని సేవిస్తే కీళ్ల నొప్పులు, కీళ్ళ నొప్పులు సహా మత సంబంధమైన సమస్త నొప్పు లు కూడా హరిస్తాయి.

తులసి గింజల్ని పొడిచేసి, ఈ పొడిని పాలల్లో వేసి త్రాగుతూన్నట్లయితే, కొంత కాలానికి కండరాలనొప్పులన్నీ నుండి ఉపశమిస్తాయి.

తులసి రసం, అల్లపురసం ఎండించి, పుష్కర చెట్టు వేర్లతో కలిపి ముద్దగా నూరుకోవాలి. ఈ ముద్దు కీళ్ళ నొప్పులున్న చోట్ల మర్దనా చేయడం ద్వారా  నొప్పి నివారిణి గానీ అద్భుతంగా కూడా పనిచేస్తుంది.

ఇంకొక పద్దతి ప్రకారం – తులసి ఆకులు, ఆముదం ఆకులు, రాతి ఉప్పు మెత్తగా నూరిన ముద్ద తో కీళ్ల జాయింట్ వద్దు మర్దనా చేయడం ద్వారా కూడా ఇటువంటి నొప్పుల్ని నివారించవచ్చును . 

కాళ్ల ముణుకులు (మోకాళ్లు), పాదాల జాయింట్లు (మడమలు) వద్ద వచ్చే నొప్పుల నివారణకు  – తులసి ఆకు ఎండించి నీళ్లలో వేసి కాచి కషాయం వలె రోజూ తాగుతుంటే సరిపోతుంది.

గుప్పెడు మరువక తులసి ఆకుల్ని మెత్తగా దంచి రసం తీసి, ఈ రసాన్ని మామూలు నీళ్లలో కలిపి తీసుకున్నా కూడా అజీర్ణం, వాత వ్యాధులు మరియు  ఒళ్ళు నొప్పులను కూడా   హరిస్తుంది.

తులసి విషాలకు విరుగుడుగా


తులసి వేర్లు ఎండబెట్టి పొడుం చేసి నిల్వ ఉంచుకుని, తేలు కుట్టినచోట అద్దితే, నొప్పి మటు మాయం అవుతుంది.

తులసి వేర్లు బాగా ఎండబెట్టి, పొడుం చేసి చిన్నచిన్న మాత్రమే వలె కట్టుకుని ఏదైనా విషకీటకాలు కుట్టినప్పుడు రోజుకు నాలుగు ఐదు పర్యాయాలు లోపలికి తీసుకుంటే – విష ప్రభావం  నుండి అరికట్టబడుతుంది.

రెండేసి చెంచాల తులసిరసం ఆరారగా అరగంటకోసారి చొప్పున నోట్లో పోస్తూంటే, విష కీటకాలు కాటు వల్ల కలిగే అపస్మారం నుంచి విముక్తి పొందగలుగుతారు.


తులసి దురదలు నివారణగా


స్నానం చేసేటప్పుడు తులసి ఆకులను నలిపి నీటిలో వేసి, ఆ నీటితో స్నానం చేస్తే చెమట నుంచి ఉపశమనం కలిగి దురదలు కూడా  రాకుండా ఉంటాయి. (కృష్ణ తులసి అయితే ఇంకా శ్రేష్ఠం),

లక్ష్మీ తులసి రసం రెండు చెంచాలు, తేనె ఒక చెంచా కలిసిన నీటిని సేవిస్తే (ప్రతిరోజూ) కఫ జనితమైన వ్యాధులు  కూడా తగ్గిపోతాయి. శ్లేష్మ, కఫ, వాతములను హరించడమేగాక, కృష్ణ తులసి ఆకుల రసానికి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచే గుణం కూడా కలదు.

తులసి ఆకుల్ని ఎండబెట్టి, పొడుము మాదిరిగా కొట్టి ఉంచుకొని అప్పుడప్పుడు తేనె లో కలిపి పిల్లలు నాకిస్తూ ఉంటే, వారికి ‘సర్వరోగనివారిణి’ వలె కూడా పని చేస్తుంది.



తులసి రక్త శుద్ధికి 


ఏ తులసి రకం అయినా రక్తంలోని కొలెస్టరాలని కూడా నిరోధిస్తుంది.

ప్రతిరోజూ తులసిరసం చేత కొద్దిగానైనా తడుపబడిన గుడ్డను ఆవిరి పట్టడం ద్వారా హై బ్లడ్ ప్రెషర్ ను నిరోధించవచ్చును.  

ఉదయాన్నే కొన్ని తులసి ఆకుల్ని నమిలి మింగడం వల్ల నీరసం దరిచేరక చలాకీ గా కూడా ఉంటారు. గుండె జబ్బులు దగ్గరకి  రావు.

తులసి రస ప్రభావం వల్ల సమస్త రక్తదోషాలు తొలగిపోతాయి. రక్తదోషాలు లేకుంటే ఆకలి  పెరుగుతుంది. అందువల్ల పోషకాలు సరిగ్గా శరీరానికి కూడా అందగలవు. కృష్ణ తులసి లో ఈ గుణం చాలా అధికం.


తులసి కిడ్నీలో రాళ్లు


తులసి రసాన్ని క్రమం తప్పకుండా ప్రతీరోజు తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే, కిడ్నీలు   చక్కగా పని చేస్తాయి. కిడ్నీ లో రాళ్ళు కూడా  కరిగిపోతాయి.

అడవి తులసి రసాన్ని పంచదారలో కలిపి ప్రతిరోజూ రాత్రి పడుకొనే ముందు రెండు చెంచాలు తీసుకుంటే, బాగా నిద్ర పడుతుంది. నిద్రలేమి బాధపడేవారికి ఇది ఒక  గొప్ప ఔషధంగా పనిచేస్తుంది.


తులసి సౌందర్య సాధనంగా 1



అడవి తులసి ఆకుల రసంలో ఎన్నో ఔషధీయ గుణాలు కలిగి ఉన్నాయి. దీని రసాన్ని కంటి క్రింద పూస్తూ ఉంటే, కళ్ళ క్రింద వచ్చే ఉబ్బు – నల్లటి వలయాలు నుండి అరికట్టబడతాయి.

నేల తులసి విత్తనాలు చూర్ణాన్ని కంట్లో ప్రతి వారానికోసారి వాస్తు వుంటే, కంట్లో ఏర్పడే పూసి, కంట్ లో బాధ పెట్టే నలుసు బయటకు కూడా వచ్చేస్తాయి. కంటికి మంచి తేజస్సు కలుగుతుంది.

తులసి ఆకుల్ని ఎండబెట్టి చూర్ణం చేసి, దీనియందు కొద్దిగా నీటిని కలిపి పేస్ట్ లో తయారు చేసి, ముఖానికి – కాళ్లు, చేతులు పట్టిస్తే స్త్రీల చర్మ సౌందర్యం బాగా వృద్ధి చెందుతుంది. చర్మం సున్నితంగా  కూడా మారుతుంది.

తులసి ఆకుల్ని ఎండబెట్టి బాగా పొడుంలా కొట్టి, ఎస్త్రగాళితం పట్టి ఈ చూర్ణాన్ని ఫేస్ పౌడర్ వలె రాసుకుంటూ ఉంటే శోభి మచ్చలు సహా సర్వ మచ్చలు అంతరించి శరీరానికి చక్కని మెరుపు వస్తుంది. కుష్టు, బొల్లి మచ్చలు నుంచి కూడా నివారించబడతాయి.

ఆయుర్వేదీయ ఫేస్ పౌడర్ వలె పని చేసే తెలుసా కి చూర్ణానికి ఏదీ సాటి రాదు. వేసవిలో వేడి తగ్గిస్తుంది. చేమట వల్ల దుర్వాసన కూడా రాదు.

పిల్లలు పళ్లుతోముకోడానికి ముందు తులసి రసం పుక్కిలించి, ఉమ్మేసి, ఆ తర్వాత వెళ్ళి తోముకోడం అలవాటు చేసుకోవాలి. ఇలా ప్రతి రోజూ చేస్తూ ఉంటే, దంత సంబంధిత వ్యాధులు రాకుండా నివారించవచ్చును.  


తులసి సౌందర్య సాధనంగా 2

చిగుళ్లు గట్టి పడతాయి. నోటి దుర్వాసన కూడా  ఉండదు. ముఖ సౌందర్యం ఇనును డిస్తుంది.

పిల్లలకు ఊపిరి తిత్తుల్లో నెమ్ము చేరుకుంటున్నప్పుడు – ఎక్కువగా జలుబు చేయడం, ఊపిరి సరిగా అందకపోవడం, ఊపిరి తీస్తే ‘విజిల్’ వంటి శబ్దం రావడం….. ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి తగ్గడానికి ఓ వారం రోజుల పాటు తులసి ఆకులు వేసి మరిగించి న పాలు పట్టిస్తే సరిపోతుంది.

యువకులు ఉదయాన్నే కొన్ని తులసి ఆకుల్ని నమిలి మింగడం వల్ల నీరసం తగ్గిపోయి చలాకీగా ఉండగలరు. మంచి దేహారోగ్యం పెంపొందును.

 ఒకరోజంతా నిమ్మరసం తగినంత తీసుకుని రాగిపాత్రలో కూడా ఉంచాలి. ఇలా ఉండటం వల్ల తయారయిన ఆమె పదార్ధానికి కొంచెం తులసి ఆకుల రసాన్ని కలపాలి. దీనికి కొంచెం వెనిగర్ కలిపి ఈ మిశ్రమం ముఖానికి పట్టించి సూర్యకాంతిలో ఆరబెట్టి ముఖం శుభ్రంగా కడుక్కుని ఉండాలి. ఈ ఫేస్ ప్యాక్ ని ప్రతి రోజూ ముఖానికి పట్టిస్తుంటే ముఖం కాంతివంతంగా కళకళ లాడుతుంటుంది.

తులసి రసంలో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖం లేక శరీరం మీద నల్ల మచ్చలు న్న ప్రాంతంలో కూడా రాసుకోవాలి. ఆరిన తరువాత నీటితో కడుగుతూ ఉండాలి. ఇలా ప్రతి రోజుకు మూడు సార్లు చొప్పున గాని; రెండు పూటలా చేస్తున్నాగాని నల్ల మచ్చలు పోయి శరీరం తేజోవంతం అవుతుంది.

ఒక కేజీ పెసలు, 50గ్రా. వేప పొడి, 50గ్రా. తులసి పొడి, 25 గ్రా. కస్తూరి పసుపు, 15 గ్రా మంజిష్ఠ, 20p గ్రా. చందనం, 5d గ్రా. లవంగాలు ఒక తులం వట్టి వేర్ల పొడి, కొద్దిగా కర్పూరం వేసి అన్నింటినీ మెత్తగా పొడి చేసి – సున్నిపిండి లా వాడితే శరీరం కాంతివంతంగా వుండి, ఎలాంటి చర్మ వ్యాధులు సోకవు.


తులసి స్త్రీల వ్యాధులు

ప్రతిరోజూ క్రమం తప్పకుండా తులసి ఆకుల రసాన్ని సేవిస్తూ వుంటే, స్త్రీలకు ఎం అధికంగా అయ్యే రుతుస్రావం క్రమబద్దీకరించబడుతుంది.

స్త్రీలకు 5 రోజుల మించి ఋతుస్రావం ఎక్కువగా అవుతూ ఉంటే, ఈ ఆకుల రసం, తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే, రోజుల తరబడి అయ్యే స్రావం నుండి అరికట్ట బడుతుంది.

స్త్రీలకు గర్భాశయ లోపం ఉంటే, సహజంగా గర్భాలు నిలవకపోవడం జరుగుతూ ఉంటుంది. ప్రతి రోజు తులసి రసం తీసుకోవడం వల్ల ఎలాంటి గర్భాశయ వ్యాధులైనా నివారించబడి గర్భం దాల్చడానికి మార్గం సుగమం కాగలదు.

తులసి జలుబు నివారణగా

 తులసిరసం, దాల్చిన చెక్క లవంగాలు మరియు చిటికెడు పంచదార, పాలు కలిపి తీసుకుంటే జలుబు మూడు రోజుల్లో ఉపశమిస్తుంది.

 తులసి వేళ్ల చూర్ణం, తేనె లేహ్యం వలె చేసుకుని రెండు రోజుకు – ఆరుడోసులుగా వేసుకుంటే జలుబెలా వచ్చిందో అలా గే మాయం అవుతుంది.

కృష్ణ తులసి రసంలో శొంఠి, అల్లం కలిపి తీసుకున్నట్లయితే – రొంప, జలుబు నుండి తగ్గుతాయి.

తేనె, తులసిరసం, శొంఠి, నీరుల్లిపాయల రసం సమపాళ్లలో మేళవించి లోపలికి ఆరుపాటలు పుచ్చుకుంటే – జలుబు, దగ్గు తో కూడిన రొంప నుండి ఉపశమనం లభిస్తుంది. 

చిన్నపిల్లలకు జలుబు – జ్వరం వస్తే, తులసి రసమును, గుండెలమీద నుదుటి మీద ఆరారగా రాస్తూ, ఒక టీస్పూన్ తేనెతో ఒక టీ స్పూన్ తులసి ఆకుల రసాన్ని తాగితే జలుబు – జ్వరం కూడా తగ్గిపోతాయి. పిల్లలకు ప్రతి రోజూ ఉదయాన్నే కొంచెం తులసి ఆకుల రసాన్ని ఇస్తుంటే. వారికి తరచుగా వచ్చే జలుబు, దగ్గు, వాంతులు కూడా తగ్గుతాయి.

పది పదిహేను తులసి ఆకులు, ఐదు మిరియపు గింజలు వీటిని నూరి, అది బఠాణీ గింజ పరిమాణం లో మాత్రలు కూడా చేసుకోవాలి. వీటిని వారం రోజులపాటు – ఉదయం, మధ్యాహ్నం రాత్రి ఇలా మూడు పూటలా పూటకో మాత్ర చొప్పున వేసుకొని గ్లాసు నీరు తాగితే జలుబు – దగ్గు తగ్గి ఉపశమిస్తాయి.



తులసి గుండె సంబంధిత ఆరోగ్యం ప్రయోజనాలు కోసం

తులసి ఆకుల రసంలో పటిక, మరియు పంచదార వేసుకుని, ప్రతిరోజూ క్రమం తప్ప కుండ సేవిస్తూ ఉంటే, గుండె నొప్పి – దగ్గు – ఆయాసం నుంచి  నివారించబడతాయి.

ఐదుగ్రాముల తులసి ఆకు రసం లో రెండు గింజల మిరియాల పొడి, ఐదు , గ్రాముల పంచదార కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే గొంతు నొప్పి, కండరాలు నొప్పులతో పాటు గుండె నొప్పి కూడా ఉపశమిస్తుంది.

తులం తులసిరసం, తులం తేనె, అరతులం అల్లపురసం కలిపి రోజూ కొద్దికొద్దిగా – పది రోజుల పాటు సేవిస్తే, దగ్గు ద్వారా వచ్చే జ్వరం కూడా  తగ్గిపోతుంది.

పదిగ్రాముల తులసి ఆకుల రసం, కొద్దిగా బెల్లం, రెండు ఏలకులు వీటిని కలిపి బాగానూరి, ఈ మిశ్రమాన్ని తేనె లో కలుపుకొని సేవిస్తే, గుండె యందు  పేరు కొన్ని కఫం బయటకు వస్తుంది. ఆయాసము తగ్గిపోతుంది.

వార్థక్యం సమీపిస్తున్నవారు రోజూ గుప్పెడు తులసికి నమలడం దైనందిన జీవితంలో ఓ అవాటుగా కూడా మార్చుకోవాలి.  


తులసి ప్రతిరోజూ రెండు చెంచాలు అడవి తులసి రసాన్ని పిల్లల చేత త్రాగిస్తూ ! ఉంటే, వారి లో బుద్ధి వికాసం బాగా     మెరుగు పడుతుంది. 

తులసి ఆకుల కషాయాన్ని పరగడుపున/ఉదయాన్నే త్రాగుతూంటే…… కీళ్ల నొప్పి, నడుమునొప్పి, పొత్తికడుపు లో మంట, తొడ సలుపు, నడుము నొప్పి ఇలాంటివన్నీ నివారించబడతాయి.

ఇంగ్లీషు మందుల వల్ల కూడా నయం కాని కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులు తులసి వైద్యం తో నయం అవుతాయి. ప్రారంభ దశలో క్షయ, క్యాన్సర్ వంటి మొండి వ్యాధుల్ని గుర్తించడం జరిగితే, వరుసగా ఆరు నెలలపాటు ప్రతిరోజూ క్రమం తప్పకుండా తులసి ఆకుల రసాన్ని సేవించడం మంచిది.

గుప్పెడు తులసి ఆకుల్ని, ఏడు మిరియాల్ని బాగా నూరి, రెండు చెంచాల – నీళ్లలో కలిపి తీసుకుంటే, నీళ్ల విరేచనాలు కూడిన టైఫాయిడ్ నెమ్మదిస్తుంది.

తులసి వేర్లను నీటిలో మరిగించి, ఆనీటిని ప్రతిరోజూ తాగుతూంటే, స్త్రీలకు నడుం నొప్పి, కాళ్ళ నొప్పులు  కూడా నెమ్మదిస్తాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీల కాళ్ళ నొప్పులకు ఇది ఒక దివ్యౌషధం.



తులసి రతి సామర్థ్యం కోసం

 తులసి గింజల ఐదు గ్రాములు, సుధామూలం ఐదు గ్రాములు, సఫేద్ ముసిలి ఐదు గ్రాములు, ఏలకులు ఐదు గ్రాములు చూర్ణంగా మార్చుకొని పంచదారతో .” కలిపి గాని, లేదా ఆవు పాలలో కలుపుకొని గాని తాగితే పురుషులకు వీర్య వృద్ధి బాగా  అవుతుంది.

తులసి ఏభైగ్రాముల తులసి గింజల్ని చూర్ణం చేసుకొని, దానిలో సగం పంచదా కలుపు కొని, ప్రతిరోజూ ఉదయం ఆవుపాలతో తీసుకున్నట్లయినచో వీర్యవంది కలుగుతుంది.

కాక నిదానంగా జరిగి, స్త్రీని రతిలో ఎక్కువ సేపు సంతృప్తి పరచగలగుతారు.

ఎండబెట్టిన తులసి ఆకులు, మెంతిగింజలు, అశ్వగంధ – వీటిని కలిపి బాగా ఒక నూరి, ఈ మిశ్రమాన్ని ఆవు పాలతో కలిపి నిత్యం లోపలికి పుచ్చుకుంటూ ఉంటే, పురుషులకు వీర్య వృద్ధి.

తులసి గింజలు నీటిలో నానబెట్టి, పటిక, పంచదార చేర్చి రోజూ త్రాగితే. మూత్రంలో మంట మటుమాయం..

అధిక వేడి వల్ల గానీ, మరే ఇతర కారణాల వల్ల గాని, మూత్రం స్తంభిస్తే తులసి రసం లో ద్రాక్ష రసం లేదా చెరకు రసం, అదీ లేదంటే కొబ్బరినీరు గాని కలిపి సేవిస్తే – మూత్ర విసర్జన సాఫీగా కూడా జరుగుతుంది.

పదిగ్రాముల తులసి గింజల్ని ఒక గ్లాసుడు నీళ్లలో రాత్రంతా నానబెట్టి, మర్నాడు ఉదయాన్నే ఆ నీటిలో కొద్దిగా పంచదార కలిపి సేవిస్తూంటే మూత్ర విసర్జన కష్టంగా ఉండటం తగ్గుతుంది. ..

కొద్దిగా తులసి రసం, ఐదుగ్రాముల నీళ్లలో కలిపిత్రాగి, వెంటనే ఆవుపాలు ప్రతిరోజూ తాగుతుంటే పురుషులు మూత్ర విసర్జన సమయంలో ఏర్పడే మంట నుండి తగ్గుతాయి.

ఐదుగ్రాముల తులసి గింజలు – 125గ్రాముల నీళ్లలో నానబెట్టి ఆరారగా ఐదు రోజులు తాగుతుంటే పురుషులు సోకిన సుఖ వ్యాధులు నెమ్మదిస్తాయి.

తులసి గింజలు — బెల్లం మెత్తగా నూరి ముద్దవలె చేసి, ఆవు పాలలో వేసి తాగితే గనేరియా మాయం అవుతుంది . 

బలం తులసి ఆకుల రసం, ఐదు గ్రాములు అల్లం రసం నీటిలో కలిపి రోజూ రెండు ఔన్సుల మోతాదులో ప్రతిరోజూ తీసుకుంటూ ఉంటే, వాత సంబంధ వ్యాధులు తగ్గుతాయి.

తులసి ఆకుల రసంలో కొంచెం మిరియాల పొడి, స్వచ్ఛమైన నెయ్యి రోజూ ఈ మిశ్రమాన్ని తీసుకొంటూంటే వాత సంబంధిత మైన కడుపు మంటలు తగ్గిపోతాయి.



తులసి జ్వరాలు

 గుప్పెడు తులసి వేళ్లు కషాయంగా కాచి, కొద్దిగా తేనె చేర్చి తాగితే మలేరియాను నివారించవచ్చును . 

 తులసి ఆకులు, మిరియాలు, తేనె సమపాళ్లలో నూరి, లేహ్యంలా చేసుకుని ముప్పుటలా లోపలికి తీసుకుంటే ఎలాంటి జ్వరాన్నయినా నివారిస్తుంది.

 నల్ల మిరియాలు, గచ్చపప్పు సమపాళ్ళలో తీసుకొని తులసి రసంలో మర్ధించి, శనగ బద్దలంత మాత్రలు గా కట్టుకోవాలి. రోజుకు 4 మాత్రలు తక్కువ గాకుండా రెండుపూటలా ఉపయోగిస్తే బోద జ్వరం (ఫైలేరియా), ఇన్ ఫ్లూయెంజా నుండి నివారణ అవుతాయి.

 తులసి, సహదేవి మొక్క వేరు, సప్తపర్ణివేరు సమపాళ్లలో నూరి మాత్రలుగా చేసుకుని నాలుగు రోజులు పుచ్చుకుంటే, ఎంతటి పైత్య జ్వరమైనా హుష్ కాకి అవుతుంది.

 తులసి విత్తనాలు, బెల్లం కలిపి ఉదయం సాయంకాలం వాడుతూంటే, వంద రోజుల్లో వీర్యంలో సత్తువ పెరుగుతుంది. ఓజస్సు కు సంబంధించిన మేహదోషాలను నివర్తింప చేస్తుంది. తులసి రసం, తుమ్మిపూల రసం, మిరియాల చూర్ణం రోజాపూలు నీటితో కలిపి  – రోజూ కొద్ది కొద్దిగా త్రాగుతూంటే ఎటువంటి విష జ్వరాలైనా నివర్తించబడ

 ప్రతిరోజూ పరగడుపున కృష్ణతులసి ఆకులు ఓ పది – పది హేను తింటూ ఉంటే, శరీరంలో అధికంగా ఉన్న ఉష్ణం వెడల గొట్టబడి, దేహాన్ని సమ శీతలంగా ఉంచుకోవచ్చును . 


అంటువ్యాధుల విషయంలో :

 అతిసారం, మశూచి, ప్లేగు, కలరా, ఇటీవలే తాజాగా వెలుగులోకి వచ్చిన సార్స్ వైరస్ వ్యాధులు పోలిన అంటు వ్యాధులు విషయమై ‘- ప్రతి రోజూ రెండు స్పూన్ల తులసి రసం లో రెండు స్పూన్ల వేప రసం కలిపి (అంటువ్యాధులు , ప్రబలి ఉన్నంత కాలం) త్రాగుతూ ఉంటే, ఊరంతా వ్యాధి ఉన్నప్పటికీ ఆ ! కుటుంబ దరిదాపులకు కూడా పై వ్యాధులేవీ దరిచేరవు..

 తులసి ఆకుల రసం, వేప ఆకుల రసం, గజ నిమ్మకాయ రసం ఒకే మోతాదులో కలిపి, అందులో అరతులం గంధకం పొడిని మిళితం చేసి రాస్తే – గజ్జి, తామర, చిడుము పొక్కులు ఏవీ కూడా  దరిచేరవు. వడదెబ్బ నుంచి రక్షణగా :

తులసి ఆకుల రసం, నిమ్మరసం, కలబంద చేర్చి షర్బత్ గా తయారు చేసి, వేసవి కాలంలో రోజు తాగుతూ ఉంటే వడదెబ్బ కూడా తగలదు..

తులసి దళాలను ఎండబెట్టి వీటికి సమానంగా మెంతులు, అశ్వగంధ చూర్ణం కలిపి – ఆవుపాలతో సేవించినచో వీర్యవృద్ది కలుగుతుంది.



తులసిగర్భ సంబంధిత :

 రుద్రజడ తులసి గింజల్ని నీటిలో నానబెట్టి, ఆ నీటిని బహిష్టు మొదలైన నాటి నుంచి, బహిష్టు ముగిసిన రోజు దాకా ప్రతిరోజూ మూడు పూటలా త్రాగుతూ ఉంటే – స్త్రీల గర్భాశయం వృద్ధి – శుద్ధి చెందుతుంది. పిల్లలు పుట్టని వారికి – ఇది ప్రయత్నించి చూడడంలో తప్పులేదు.

 ఇరవై గ్రాముల తులసి ఆకుల రసం, ఇరవైగ్రాముల మొక్కజొన్న ఆకుల రసం, పది గ్రాముల అశ్వగంధ రసం, పది గ్రాముల తేనె……. ఒక సీసా కలికి ఉంచుకుని, ప్రసవానికి వారం రోజుల ముందు నుంచి సేవిస్తూ ఉంటే చనుబాలు వృద్ధి చెందుతాయి.

 తులసి రసాన్ని యోని పెదవులకు రాస్తూ వుంటే, ఏంటీ ఫంగస్గా  కూడా పనిచేస్తుంది.


తులసిచర్మ సంబంధిత వ్యాధుల్లో :

  గుప్పెడు తులసి ఆకులు మెత్తగా నూరి, శరీరానికి రాసుకొని 15 ని||లు అలాగే వుంచి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే, చర్మ వ్యాధులు కూడా అంతరిస్తాయి..

 తేనె, గొంఠి, నీరుల్లి పొంగుల రసానికి తగినంతగా తులసిరసం చేర్చి ఒక వద్ద నటి చేసి గజ్జి, తామర వంటి చర్మరోగాలు నశిస్తాయి.

 లక్ష్మీ తులసిని సమూలంగా నూరి, వారానికోసారి నలుగుపిండిలో కలిపి నలుగు పెట్టుకొని, అభ్యంగన స్నానం చేస్తే, ఎలాంటి చర్మ రోగం కూడా దరిచేరదు.

 తులసి వేర్లు ఎండబెట్టి, దంచి, చూర్ణం చేసుకొని దీన్ని ప్రతిరోజూ పిల్లలకు (మూడేళ్లు వచ్చే దాకా) తేనెతో నాకిస్తూఉంటే, అనవసరపు క్రొవ్వు తగ్గి, స్థూలకాయం బెడదను అరికడుతుంది.

మలబద్ధకం :

 రాత్రి పూట నీళ్లలో తులసి ఆకులు వేసి ఆ నీటిని ఉదయం ముఖం కడుక్కుని వెంటనే తాగితే మలబద్ధకం మటుమాయం.

ఒక టీ స్పూన్ తులసి ఆకుల రసంలో, అరస్పూన్ తేనె కలిపి, కొద్దిగా మంచినీరు జోడించి ప్రతిరోజూ ఉదయం తాగితే జీర్ణక్రియ సరిదిద్దడమే కాక, చర్మానికి మంచి మెరుపు కూడా వస్తుంది.

 తులసి ఆకులరసం, అల్లపు రసం సమపాళ్లలో కలిపి వేడిచేసి చల్లార్చిన తర్వాత తేనె లో కలిపి – అప్పుడప్పుడు పిల్లలు ఇస్తూ ఉంటే మలబద్దకం నివారించే బడుటయే గాక, ఇతర రోగాలను దరి చేరనీయదు.



పిల్లల వ్యాధులు

తులసి ఆకులు 10గ్రా, ఉత్తరేణి ఆకులు 10గ్రా; రెండేసి గ్రాముల చొప్పున వరుసగా అతివస, లవంగాలు, తలాక్షరి; చిన్న ఏలకులు 5 గ్రా……. ఈ ప్రకారము తీసుకొని చూర్ణంవలె నూరి శెనగబద్దంత పరిమాణంలో మాత్రలు

కట్టి ఉంచుకోవాలి.. ఉదయం ఒక మాత్ర, సాయంత్రం ఓ మాత్ర చొప్పున వేడినీటితో గాని, పాలతో కాని ఇస్తే…. ఆకు విరేచనాలు, రంగు విరేచనాలు, జ్వరం, పాలు ప్రక్కడం వంటి చిన్న పిల్లల వ్యాధులు నివారించవచ్చు ! (మూలికలు అమ్మా, పచారీ దుకాణాల్లో ఇవన్నీ లభ్యమవుతాయి.)


జలుబు తులసి కషాయం


చలికాలంలో జలుబూ, దస్తూ అందరినీ వేధించే సమస్య. ఇలాంటప్పుడు వేడి వేడిగా, ఘాటుగా, వగరుగా ఉండే పానీయాలను తాగాలని అనిపిస్తుంటుంది. టీ, కాఫీ లాంటివి తాగిన పెద్దగా ప్రభావం ఉండదు. ఇందుకు చిన్న చిట్కా.


పాటిస్తే జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. పది పదిహేను తులసి ఆకులు, చెంచాడు మిరియాలు తీసుకుని నీళ్ళలో మరగబెట్టాలి. బాగా వేడిగా ఉన్నప్పుడే ఆ కషాయాన్ని తాగెయ్యాలి. జలుబుతో బాధపడుతున్నప్పుడు కాకుండా చలికాలం మొత్తంలో ఈ కషాయం తాగిన మంచిదే.తులసి ఆరోగ్యం ప్రయోజనాలు.

0/Post a Comment/Comments

Previous Post Next Post