అరటి పండు ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు

అరటి పండు ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు 
అరటిపండ్ల గురించి ప్రాసభరితమైన పాటలు మరియు ఆసక్తికరమైన కథలు పిల్లలకోసమని చాలానే రచింపబడ్డాయి. ఈ రుచికరమైన మరియు పుష్టికరమైన పండ్లు పచ్చని ఆకులతో కూడిన అరటి చెట్టు నుండి  వస్తాయి . ఆంగ్లంలో అరటిపండును “బనానా” (బనానా) అని కూడా అంటారు. ఈ బనానా అనే పదాన్ని అరబిక్ పదమైన "బనాన్" నుండి  తీసుకోబడింది.బనాన్ అంటే వేలి కొనలు అని కూడా అర్థం. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అరటిపండ్లు బాగా  పండుతాయి.  ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతాల్లో అరటి తోటలు విరివిగా కనిపిస్తాయి. అరటి పండ్ల కొరకే ఎక్కువగా అరటి మొక్కల్ని (పిలకల్ని) నాటి పంట పండిస్తారు.  వృక్షశాస్త్రపరంగా ఈ అరటి ఓ రకమైన బెర్రీ లేక ‘మృదుఫలం.’ కొన్ని అరటి రకాల్ని కేవలం అలంకారం కోసం లేదా వాటి నార కోసం కూడా పండిస్తారు.  ఇలాంటి రకాల అరటి చెట్లు చాలా బలంగా ఉంటాయి. సుమారు 110 వివిధ రకాల అరటి జాతులు ఉన్నాయి. మన భారతీయ సంస్కృతి మరియు వాణిజ్యం ప్రకారం, "అరటి" ని సాధారణంగా “మృదు మధుర ఫలం” గా సూచించబడుతుంది.  తీపిరుచితో కూడిన మెత్తని పండు అని కూడా  అర్థం. అందువల్ల, అరటిని భోజనానంతరం తినే ‘ఫలహార అరటి పండ్లు’ (డెజర్ట్ అరటి) అని కూడా పిలుస్తారు. ఈ పండ్ల యొక్క ఇతర వృక్షరకాలు ఇచ్చే పండ్లు గట్టిగాను మరియు గంజి-గంజిగా (starchier) ఉండే అరటి పండ్లను కాస్తాయి. వీటినే  సాధారణంగా “అరటి” చెట్లుగా పిలుస్తారు. పచ్చి అరటి కాయలను, అరటి చెట్టు భాగాల్ని ఎక్కువగా వంటలు, కూరలు వండడానికి కూడా  ఉపయోగిస్తారు .  అరటి చెట్ల నుండి లభించే నార కోసం కూడా అరటిని పండిస్తారు.

అరటి బూడిదను ఉపయోగించి సబ్బులు కూడా తయారు చేస్తున్నారు. ఆసియాలో, నీడలో పెరిగే కొన్ని మొక్కల కోసం తన వెడల్పాటి ఆకులతో మంచి నీడను కల్పించే అరటి చెట్లను ఉపయోగించడం జరుగుతోంది. అలా అరటి చెట్ల నీడలో పెరిగే పంట రకాలే వంటే కోకోవ, కాఫీ, నల్ల మిరియాలు మరియు జాజికాయ తదితరాలు. అరటి యొక్క  నీడనిచ్చే కారణంగానే, ఇతర పంటల తోటల్లో (plantations) అరటి చెట్లను కూడా మనం చూడవచ్చును .

అరటి మొక్క పచ్చని ఆకులతో కూడిన అతిపెద్ద పుష్పించే చెట్టుగా లెక్కించబడింది. అందువలన, అరటి చెట్లను తరచుగా మాన్లు (trees) గా పొరబాటుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. పండని అరటికాయలు ఎప్పుడూ ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పచ్చి అరటి కాయలు ఎప్పుడూ పసుపు రంగులో ఉండే పండిన అరటి పండ్లతో పోలిస్తే భిన్నంగా కూడా ఉంటాయి. పచ్చిఅరటికాయ మాగి పసుపు రంగులోకి లేదా ఎర్రటి రంగులోకి మారుతుంది. అరటి ఆకు నిర్మాణం మెలికెలు కలిగి ఆకు పెద్దగా ఉంటుంది.  ఆకు 2.65 మీటర్ల పొడవు మరియు 60 సెంమీ వెడల్పు పెరుగుతుంది. గట్టిగా వీచే గాలికి సులభంగా చిరిగిపోగలవు కూడా, అందుకే ఒకింత ముదిరిన అరటి ఆకులు చిరిగి చీలికల రూపంలోకనబడతాయి;ప్రపంచవ్యాప్తంగా 170 కంటే ఎక్కువ దేశాలు అరటిని పండిస్తున్నాయి. అరటిపండ్లను ముఖ్యంగా దాని యొక్క పోషక ప్రయోజనాల కోసం ప్రపంచమంతటా పండించబడుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్ధికవ్యవస్థను పెంచడంలో అరటి  ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దాని అనేక ఆరోగ్య ప్రయోజనాల కారణంగా అరటి ఒక అద్భుతమైన ఆహారం (super food)గా పరిగణించబడుతుంది. అరటిపండు విటమిన్ B6 నుఅధికంగా కల్గి ఉంటుంది. కేలరీలు మరియు కొవ్వుల్ని తక్కువగా కల్గిన అరటి సులభంగా జీర్ణం కూడా అవుతుంది. అరటి పండును సంపూర్ణ ఆహారంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే, దీనిలో పీచుపదార్థాలు, విటమిన్ సి, పొటాషియం మరియు మెగ్నీషియం కలిగి ఉంటాయి .  అరటిపండ్లకు అర్ద చంద్రాకృతి లాంటి ఒక విలక్షణమైన ఆకారం ఉంటుంది.  దీని రూపం చాలా ఆకర్షణీయంగా ఉండి అందర్నీ  బాగా ఆకర్షిస్తుంది. అరటి పండ్లు కోతులకు కూడా ఎంతో ఇష్టం.

అరటి పండు ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు


అరటి గురించిన ప్రాథమిక వాస్తవాలు


వృక్షశాస్త్రంలో అరటి పేరు: ముసా అక్యూమినేట్ (Musa acuminate)
కుటుంబం: ముసాసెయే
జాతి: ముసా
సాధారణ పేరు: అరటి
సంస్కృతం పేరు: “కదళీ” ఫలం

అరటిచెట్టులో ఉపయోగించే భాగాలు: తోలు, గుజ్జు, పండ్లు మరియు కాండం.

అరటి పండే ప్రాంతాల పంపిణీ: ఇతర ఉష్ణమండల పండ్లు లాగానే అరటిపండ్లు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, పసిఫిక్, మరియు కరేబియన్లలో బాగా పెరుగుతాయి. అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు అరటి ప్రధాన ఆహారంగా కూడా ఉంది. అన్ని అరటి రకాల్లో 15 నుండి 20% మాత్రమే వాణిజ్య ఉపయోగం కోసం ప్రపంచ మార్కెట్‌కు ఎగుమతి చేయబడుతున్నాయి.

అరటి గురించిన ఆసక్తికరమైన నిజాలు: తొలిగా ఉపయోగించిన అరటి యొక్క శాస్త్రీయ నామం ముసా స్యాపియంటం, అంటే అర్థం "జ్ఞానుల యొక్క ఫలము" అని. యాపిల్ పండు మరియు పుచ్చకాయలు వలె అరటిపండు కూడా నీటిలో తేలుతుంది. US లో అరటిని వాణిజ్యపరంగా పండించే ఏకైక ప్రదేశం హవాయ్, అయినా; ఒకప్పుడు దక్షిణ కాలిఫోర్నియా మరియు ఫ్లోరిడాలో కూడా అరటిని  పండించారు.

 • అరటి పోషక వాస్తవాలు
 • అరటిపండ్ల ఆరోగ్య ప్రయోజనాలు 
 • అరటి యొక్క దుష్ప్రభావాలు 
 • ఉపసంహారం 


అరటి పోషక వాస్తవాలు 

అరటిపండ్లు విటమిన్ సి, మరియు పొటాషియం యొక్క గొప్ప మూలం మరియు USDA న్యూట్రియెంట్ డేటాబేస్ ఆధారంగా, 100 గ్రా అరటి పండులో కింది పోషక విలువలుంటాయి:

పోషక విలువలు:100 g లకు పోషక విలువ

నీరు:74.91 గ్రా
శక్తి:89 కిలో కేలరీలు
ప్రోటీన్:1.09 గ్రా
కొవ్వులు (ఫాట్స్):0.33 గ్రా
ఫైబర్:2.6 గ్రా
చక్కెరలు;12.23 గ్రా

మినరల్స్


ఐరన్:0.26 mg
మెగ్నీషియం:27 mg
ఫాస్పరస్ :22 mg
పొటాషియం:358 mg
సోడియం:1 mg
జింక్:0.15 mg

విటమిన్లు


విటమిన్ B1:0.031 mg
విటమిన్ B2:0.073 mg
విటమిన్ B3:0.665 mg
విటమిన్ B6:0.367 mg
విటమిన్ ఎ:3 μg
విటమిన్ సి:8.7 mg
విటమిన్ కె :0.5 μg
విటమిన్ B9:20 μg
అరటిపండ్ల ఆరోగ్య ప్రయోజనాలు 

అరటిపండ్లు చాలా ఆరోగ్యకరమైనవి మరియు వీటివల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవి శక్తికి మంచి వనరుగా మాత్రమే కాదు, గుండె, పేగులు, మూత్రపిండాలు మరియు ఇతర శరీర అవయవాలకు కూడా మంచివి. 

అరటి శక్తిని అందిస్తుంది: అత్యంత సాధారణ చక్కెరలలో మూడున్నాయి. అవే-గ్లూకోజ్, ఫ్రూక్టోజ్ మరియు సుక్రోజ. అరటి ఈ మూడు చక్కెరల్ని పుష్కలంగా కల్గి ఉంది. ఈ చక్కెరలు మూడూ కలిసి స్థిరమైన వనరుతో కూడిన శక్తిని మనకందిస్తాయి.  కాబట్టి మీరు మీ రోజువారీ పనిని సులభంగా నిర్వర్తించొచ్చును . 

అరటి రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది: శరీరంలో కావలసిన స్థాయిలో రక్తపోటును నిర్వహించడానికి ముఖ్యమైనదైన పొటాషియం యొక్క ఉత్తమ వనరులలో అరటి ఒకటి. రక్తపోటును తగ్గించే మందుల కుండే సామర్థ్యాలన్నీ అరటిపండుకున్నాయని మరియు అరటిపండును  నిరంతరంగా తినడంవల్ల రక్తపోటు స్థాయిల్ని బాగా  తగ్గిస్తుందని నివేదించబడింది.

పిల్లలకు ప్రయోజనకరంగా అరటి: పోషకాల విషయంలో అరటి గొప్పదిగా ఉండటంవల్ల అరటి చంటి పిల్లలకు మంచి ఆహారం. అరటి సులభంగా జీర్ణమవుతుంది .  ఇది అలెర్జీలు లేదా గ్యాస్ట్రిక్ సమస్యలను కూడా  కల్గించదు.  

ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది: అరటిలో అధిక పీచుపదార్థం (ఫైబర్) ఉండటంవల్ల మలబద్ధకం మరియు అతిసారం వంటి జీర్ణశయాంతర సమస్యలను నివారించడానికి ఇది ఓ పరిపూర్ణ ఆహారంగా పని చేస్తుంది. ఇది ప్రేగులలో ఆహారాన్ని బంధిస్తుంది.  తద్వారా ఆహారానికి స్థూలత్వాన్ని కూడా అందిస్తుంది.  దీనివల్ల మలవిసర్జనను బాగా మెరుగుపరుస్తుంది. అలాగే, పెద్దమొత్తంలో నీటిని పీల్చుకునేలా పెద్దపేగుకు అరటిసేవనం కూడా  సహాయపడుతుంది . ప్రేగు కదలికలను క్రమబద్దీకరించడంలో అరటి మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:  ఓ సహజ హైపోటెన్సివ్ ఆహారంగా ఉండటం వలన, అరటిపండు గుండెపోటు మరియు స్ట్రోక్స్ ప్రమాదాన్ని కూడా  తగ్గిస్తుంది. మీ గుండె యొక్క మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయపడే అనామ్లజనకాలు అరటిలో పుష్కలంగా ఉంటాయి.

 • తక్షణ శక్తి కోసం అరటి 
 • ఆరోగ్యకరమైన గుండె కోసం అరటి 
 • ఆరోగ్యకరమైన పేగుల కోసం అరటి 
 • అరటి ప్రేగుల కదలికల్ని (మల కదిలికలు) నియంత్రిస్తుంది 
 • కుంగుబాటుకు అరటి
 • అల్జీమర్స్ వ్యాధికి అరటి
 • అరటి మూత్రపిండాలకు మంచిది 
 • శిశువుల కోసం అరటి 
 • రక్తపోటు కోసం అరటి 
 • హ్యాంగోవర్ కోసం అరటి
 • అరటి కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది 
 • రోగనిరోధకత కోసం అరటి


తక్షణ శక్తి కోసం అరటి 

అరటిలో పీచుపదార్థాలతో బాటు సుక్రోజ్, ఫ్రూక్టోజ్ మరియు గ్లూకోజ్ లనబడే మూడు చక్కెరలుంటాయి.  ఇవి మనకు తక్షణ శక్తిని కూడా  ఇస్తాయి. అందువల్ల, అలసట కలిగినప్పుడల్లా మీ శక్తిని పెంచడానికి ఒక అరటిను తినండి. నిజానికి, అరటికి అధిక శక్తిని ప్రసాదించే సామర్థ్యం ఉండడం వల్లనే క్రీడాకారులు మొదటగా ఈ పండుని ఎంపికచేసుకుంటారు.


ఆరోగ్యకరమైన గుండె కోసం అరటి 

శరీరంలో పొటాషియం స్థాయి తగ్గడం వలన స్ట్రోక్ ప్రమాదాన్ని బాగా పెంచుతుంది . 65 ఏళ్ళకు పైబడ్డ వయసున్న 5,600 మందిపై నిర్వహించిన ఇటీవలి ఓ వైద్య  అధ్యయనంలో, పొటాషియం తక్కువగా సేవిస్తున్నవారికి స్ట్రోక్‌ను వచ్చే ప్రమాదం 50% ఎక్కువగా ఉంటుందని కనుక్కోబడింది. స్ట్రాక్ ప్రమాదాన్నిఅరటి వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాల్ని తినడం ద్వారా తగ్గించవచ్చును .  ఈ విషయాన్ని నిర్ధారించేందుకు  అధ్యయనాలు మరింతగా జరగాల్సి ఉంది. 

అంతేకాకుండా, అరటి  అనేక అనామ్లజనకాలకు నిలయం. అనామ్లజనకాలు స్వేచ్ఛా రాశులు కల్గించే  నష్టాన్ని మరియు గుండె కండరాలపై ఆక్సిడెటివ్ ఒత్తిడిని తగ్గించే చురుకైన సమ్మేళనాలు. ఇది హృదయ వ్యాధులను నివారించడంలో మరియు మీ గుండె పనితీరును వాంఛనీయంగా ఉంచడంలో బాగా  సహాయపడుతుంది.


ఆరోగ్యకరమైన పేగుల కోసం అరటి 

అరటిపండు ఫెర్క్టులిగోసక్చరైడ్ (fructooligosaccharide) అని పిలువబడే కార్బోహైడ్రేట్ యొక్క అనూహ్యమైన గొప్ప మూలం. ఈ సమ్మేళనం కడుపు యొక్క పెద్దప్రేగులో మనకు మేలుచేసే స్నేహపూరిత బాక్టీరియాకు పోషణను కూడా  అందిస్తుంది. ఈ ప్రయోజనకరమైన బ్యాక్టీరియా విటమిన్లు మరియు జీర్ణ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడంలో నైపుణ్యం కూడా కలిగిస్తుంది, ఇవి పోషకాలు మరియు సమ్మేళనాలను గ్రహించే కడుపు సామర్థ్యాన్ని  బాగా మెరుగుపరుస్తాయి. ప్రతికూలమైన సూక్ష్మజీవులపై మనల్ని కాపాడతాయి. అటువంటి రక్షిత బ్యాక్టీరియా ద్వారా ఫ్యూక్టులైగోసక్చరైడ్స్ పులియబెట్టినప్పుడు, ప్రోబైయటిక్ బాక్టీరియా పెరుగుదలను మాత్రమే కాకుండా, ఇది కాల్షియంను గ్రహించే శరీర సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.  ఇది మన ఎముకల కోసం ఒక ముఖ్యమైన ఖనిజం.


అరటి ప్రేగుల కదలికల్ని (మల కదిలికలు) నియంత్రిస్తుంది 

అరటి పండ్లలో  జీర్ణ రహిత పీచుపదార్థాలు (సెల్యులోజ్, ఆల్ఫా-గ్లూకాన్స్ మరియు హెమిసెల్యూలోస్ వంటివి) ఎక్కువ గా ఉంటాయి. ఇటువంటి పీచుపదార్థాలు (ఫైబర్) సాధారణ ప్రేగు పనితీరును నిర్వహించడంలో లేదా జీర్ణక్రియను పునరుద్ధరించడంలో బాగా సహాయపడుతుంది, అందువలన అరటి మలబద్ధకం మరియు అతిసారం రెండింటిని అరికట్టడంలో సహాయం చేస్తుంది. క్రమమైన ప్రేగు కదలికలకు పెద్ద మొత్తంలో నీటిని పీల్చుకునే పెద్దప్రేగు యొక్క సామర్ధ్యాన్ని సాధారణీకరించడంలో అరటి క్రియాశీలకంగా పనిచేస్తుంది. పెక్టిన్ ను పుష్కలంగా కల్గిన అరటిపండు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పెక్టిన్  అనేది నీటిని బాగా పీల్చుకునే పదార్ధం, అందువల్ల ఇది పేగులకు పెద్ద మొత్తాన్ని ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఇస్తుంది.


కుంగుబాటుకు అరటి

కుంగుబాటుతో బాధపడుతున్న వ్యక్తులపై నిర్వహించిన క్లినికల్ అధ్యయనంలో , అరటి యొక్క వినియోగం మానసిక వేదనను తగ్గించి చిత్తవృత్తిని (మూడ్‌ను) పెంచుకునేందుకు సహాయపడిందని, వారికి మంచి అనుభూతిని కలిగించిందని తెలిసింది. అరటిపండు లో ట్రిప్టోఫాన్ అని పిలువబడే ప్రోటీన్ రకం ఉంది.  దీన్ని శరీరం సెరోటోనిన్గా మార్చుకుంటుంది. మానసిక స్థితి మెరుగుపర్చడానికి, మనసును సడలించడానికి మరియు సాధారణంగా సంతోషంగా అనుభూతి చెందడానికి సెరోటోనిన్ బాధ్యత కూడా వహిస్తుంది.


అల్జీమర్స్ వ్యాధికి అరటి

కార్నెల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు, అరటిలోని పదార్ధాలు న్యూరోటాక్సిసిటీని నివారించవచ్చని  కూడా కనుగొన్నారు. యాపిల్, అరటిపండ్లు మరియు నారింజ వంటి పండ్లు ఫినోలిక్ ఫైటో కెమికల్స్‌ను కలిగి ఉంటాయి. ఈ పండ్లను  ఇతర పండ్లతో కూడిన మన రోజువారీ ఆహారంలో చేర్చినట్లయితే, ఒత్తిడి-ప్రేరిత ఆక్సీకరణ న్యూరోటాక్సిసిటీ నుండి నాడీ కణాలను అవి రక్షిస్తాయని ఈ ఫలితాలు చూపించాయి. అల్జీమర్స్ వ్యాధి వంటి నరోడెజెనరేటివ్ రుగ్మతల ప్రమాదాన్ని తగ్గించడంలో అరటి కీలక పాత్ర పోషిస్తుంది.


అరటి మూత్రపిండాలకు మంచిది 

పొటాషియంతో సమృద్ధిగా ఉన్న అరటిపండు.  మూత్రపిండాల మొత్తం పనితీరును ప్రోత్సహిస్తుంది. ఆహారంలో పొటాషియంను సాధారణంగా తీసుకోవడంవల్ల మూత్రంలో కాల్షియం విసర్జింపబడకుండా చేసి తరువాత మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని కూడా  తగ్గిస్తుంది. ఆసక్తికరంగా, నెలకు కనీసం 2.5 సార్లు పండ్లు మరియు కూరగాయలను తినే మహిళలకు మూత్రపిండాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 40% తక్కువగా  ఉన్నట్లు కనుగొనబడింది. వారానికి కనీసం నాలుగు నుండి ఆరు సార్లు అరటిని తినేందుకు  ఇష్టపడే మహిళల్లో, అసలు అరటిని తినడానికి ఇష్టపడని వారితో పోలిస్తే, దాదాపు 50% వరకు మూత్రపిండాల క్యాన్సర్ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు అని కనుక్కోబడింది.


శిశువుల కోసం అరటి

అరటిపండు తమ శిశువులకు ఉత్తమ ఘనరూప ఆహారంగా ఉన్నందున, బిడ్డతల్లులు ఈ పండును నమ్మవచ్చును . బాగా పండిన అరటిపండు యొక్క గుజ్జు చాలా సులభమైన మరియు ఆరోగ్యకరమైన శిశు ఆహారం. అరటిపండ్లు సులభంగా జీర్ణమవుతాయి మరియు కడుపులో ఎలాంటి అలెర్జీ ప్రతిచర్యలను కలిగించవు. అరటి బ్రాట్ (BRAT-Bananas, Rice, Applesauce, Toast) ఆహారం అని పిలువబడే ఆహారం యొక్క ప్రధాన భాగం. ఈ బ్రాట్ ఆహారాన్ని జీర్ణశయాంతర సమస్యల నుండి కోలుకుంటున్న పిల్లలకు. ముఖ్యంగా అతిసారంవ్యాధి నుండి కోలుకుంటున్న శి శువులకు సిఫార్సు చేయబడుతుంది. ఇటీవల పరిశోధన ప్రకారం శిశువులకు అరటిపండ్లను తినిపించడంవల్ల శ్వాససంబంధ వ్యాధులకు  గురికాకుండా రక్షింపబడతారు.


రక్తపోటు కోసం అరటి 

సాధారణ రక్తపోటు మరియు హృదయ క్రియాశీలతను నిర్వహించడానికి పొటాషియం చాలా ముఖ్యం. అలాంటి పొటాషియం అరటిపండులో చాలా పుష్కలంగా ఉంటుంది. పొటాషియం శరీరం యొక్క కండరకణాల్లో సాధారణ ద్రవం మరియు ఎలక్ట్రోలైట్ సంతులనాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. ఓ మధ్యరకం పరిమాణంలో ఉన్న అరటి పండు నుండి 350 ఎం.జి. ల పొటాషియంను పొందవచ్చును . అరటిలో ఉన్న సహజ సమ్మేళనాలు రక్తపోటుకు పనిచేసే మందుల్లాగా అంటే రక్తపోటును తగ్గించే మందుల్లాగా (యాంటీ-హైపర్టెన్సివ్ ఔషధాల లాగా) పనిచేస్తాయని శాస్త్రవేత్తలు నివేదించారు. రోజువారీగా రెండు అరటి పండ్లను ఓవారంపాటు తిన్నవారిలో రక్తపోటు పది శాతం పడిపోయిందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.


హ్యాంగోవర్ కోసం అరటి 

మత్తుపానీయాల్ని ఒక రాత్రి భారీగా సేవించాక, ఆ దుష్ప్రభావంవల్ల శరీరంలో అవసరమైన ద్రవాలు తగ్గిపోతాయి.  అటుపైన శరీరంలో నిర్జలీకరణమేర్పడుతుంది. అరటిపండ్లు ముఖ్యమైన పోషకాలైన ఎలెక్ట్రోలైట్స్, పొటాషియం మరియు మెగ్నీషియంతో సమృద్ధంగా ఉంటాయి. మత్తుపానీయసేవనంతో ఏర్పడ్డ దుష్ప్రభావానికి (హ్యాంగోవర్) వేగవంతమైన మరియు ఉత్తమ పరిష్కారం రోజూ అరటిపండు, పాలు మరియు తేనెతో కలిపిన మిశ్రమాన్ని(cocktail) తీసుకోవడం. కడుపులో ఏర్పడే సమస్యలను ఉపశమింపజేయడంలో అరటిపండు చాలా ప్రభావవంతమైనది .  శరీరం కోల్పోయిన ద్రవాన్ని తిరిగి నింపడంలో అరటిపండు బాగా సహాయపడుతుంది. తేనె మరియు అరటి కలిసి శరీరానికి కావలసిన తక్షణ శక్తిని అందిస్తాయి.  రక్తంలో చక్కెర స్థాయిలను కూడా పెంచుతాయి.


అరటి కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది 

అరటి రక్తంలో కొవ్వును(రక్త కొలెస్ట్రాల్ ను) తగ్గిస్తుంది.  ఎందుకంటే ఈ పండులో రక్తంలో కొవ్వును తగ్గించే సామర్థ్యం చాలా  ఎక్కువగా ఉంది. అరటిలో ఆహార-పీచుపదార్థం ఉండడంవల్లనే దీనికి రక్తంలో కొవ్వును తగ్గించే ప్రభావం ఒనగూడింది. ఈ పీచుపదార్థం అరటి మాగినపుడు కూడా నిరంతరంగా ఉంటుంది మరియు ఈ రక్తంలో కొవ్వును తగ్గించే ప్రయోజనాన్ని అరటి ఉత్తమంగా నిర్వహిస్తుంది. అరటిలో ఆహార పీచుపదార్థం దండిగా ఉండటంవల్ల చెడు కొవ్వును (low-density lipoprotein-LDL) నియంత్రించడంలో బాగా  సహాయపడుతుంది.


రోగనిరోధకత కోసం అరటి 

అరటిపండ్లు పోషకాలకు నిలయం. అరటిలో విటమిన్ B6, విటమిన్ సి, పొటాషియం, ఇనుము, మరియు మెగ్నీషియం  ఫైబర్ ఉన్నాయి. అరటిని రోజూ సేవించడంవల్ల సిఫార్సు చేసిన 25% విటమిన్ B6 యొక్క (సిఫార్స్) రోజువారీ భత్యం (RDA)మన శరీరానికి లభిస్తుంది. విటమిన్ B6 ఓ రోగనిరోధకతను పెంచే బలవర్ధకంగా (బూస్టర్‌గా) పనిచేస్తుంది మరియు ఎర్ర రక్త కణాలు మరియు ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది కొవ్వుల జీవక్రియలో సహాయపడుతుంది. ఇది సంక్రమణ వ్యాధులకు వ్యతిరేకంగా మన శరీరానికి రక్షణ  కూడా కల్పిస్తుంది. సగటు పరిమాణంలో ఉండే ఒక అరటిపండు తినడంవల్ల బలమైన ప్రతిక్షకారిని, విటమిన్ సి ల యొక్క 15% సిఫార్స్ చేయబడిన రోజువారీ భత్యం మనకు లభిస్తుంది.


అరటి యొక్క దుష్ప్రభావాలు 

అరటి అసహన ప్రతిచర్యలకు కారణం కావచ్చు.

మీరు ఆస్టిమా రోగి లేదా చెట్ల పుప్పొడి వంటి వాటికి అలెర్జీ పొందేవారై ఉంటే మీరు అరటిపండ్లు తినడం మంచిది కాదు. అరటిలో ఉన్న లేటెక్స్, హైపర్సెన్సిటీని కలిగిస్తుంది, ఇది కణాల స్వీయ-దాడికి దారి కూడా తీస్తుంది. శ్వాసలో గురక శబ్దం, దగ్గు, దురద పెట్టే గొంతు, జలుబుతో ముక్కు కారటం మరియు కళ్ళ వెంట నీళ్ళు కారడం వంటి లక్షణాలు అరటితో కలిగే చాలా  అలెర్జీలో  సాధారణం.

మైగ్రెయిన్ తలనొప్పి

మద్యపానీయంతో పాటు అరటిపండు తినడం మంచిపని కాదు.  ఎందుకంటే, మత్తుపానీయంతో పాటు అరటిపండు కూడా తింటే పార్శ్వపు తలనొప్పి (migraine) మరింత పెరుగుతుంది.

ఇతర దుష్ప్రభావాలు:

 • అరటి సేవనం పొట్టలో అధిక వాయువు ఏర్పడటానికి దారితీస్తుంది.
 • అరటి టైప్ 2 డయాబెటిస్‌కు కారణం కావచ్చును 
 • అరటి మగతనిద్రకు కారణం అవుతుందనే నమ్మకం కూడా ఉంది.
 • ఇది దంత క్షయానికి కారణం కావచ్చు.


ఉపసంహారం 

ఇతర పండ్లవలె కాకుండా, తాజా అరటిపళ్ళు సంవత్సరం పొడవునా అందుబాటులో ఉంటాయి. పక్వానికొచ్చిన అరటికాయల్ని చెట్టు నుండి కోసినప్పటి నుండి అవి నిరంతరంగా మాగుతూనే ఉంటాయి. అరటి పండ్లను గది యొక్క ఉష్ణోగ్రతలోనే నిల్వ చేయడానికి ప్రాధాన్యతనిస్తారు. ఉదయంపూట తినే తృణధాన్యాల ఫలహారానికి లేదా వోట్మీల్కు అరటిపండ్లను కూడా కలుపుకుని తింటే ఫలహారం మరింత పోషకభరితమైన అల్పాహారంగా కూడా తయారవుతుంది. వేపుడు పదార్ధాలతో పాటు అరటిపండు గుజ్జును చేర్చి తింటే అది నూనె లేదా వెన్నలను భర్తీ చేయవచ్చును .  అంటే నూనె, వెన్నెలకు సమానంగా అరటి పోషకాలనివ్వగలదు. బేకరీ తీపి చిరుతిండ్లు (మఫిన్స్), కుకీలు మరియు కేకులకు అరటిపండు గుజ్జును కలిపితే అవి తడిగా తయారై సహజమై తీపి రుచిని కూడా కలిగిస్తాయి. అరటితో ఓ మంచి రసపానీయాన్ని లేదా జ్యూస్ (smoothie) ను తయారు చేసుకుని తాగి ఆనందించండి. ఇతర భక్ష్యాల (eatables) లాగానే, అరటిపండుకు కూడా దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది; 

0/Post a Comment/Comments

Previous Post Next Post