ఆకుకూరలుతో కలిగే మేలు
ఆకుకూరల్లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే శరీర పెరుగుదల మరియు దృఢత్వానికి, చక్కని ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి.
భారతదేశంలో అనేక రకాల ఆకుకూరలు వినియోగంలో ఉన్నాయి. వీటిలో పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర మరియు మునగాకులు, పుదీన తదితరాలు ప్రముఖమైనవి.
ఆకుకూరలు ఎక్కువగా ఖనిజ పోషకాలు, ఇనుముధాతువు కలిగి ఉంటాయి. శరీరంలో ఇనుములోపం కారణంగా అనీమియా వ్యాధికి కూడా గురవుతారు. గర్భవతులు, బాలింతలు(పాలిచ్చే తల్లులు), పిల్లలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతారు.
ప్రతిరోజూ తీసుకొనే ఆహారంలో ఆకుకూరలను తప్పకుండా చేర్చాలి. తద్వారా అనీమియాను నివారించి, చక్కని ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చును .
ఆకుకూరల్లో కాల్షియం, బీటాకెరోటిన్ మరియు విటమిన్ - సి కూడా పుష్కలంగా ఉంటాయి.
విటమిన్-ఎ లోపం కారణంగా భారతదేశంలో ప్రతీ యేటా ఐదేళ్ళ లోపు వయస్సు పిల్లలు సుమారు 30 వేల మంది కంటిచూపును కూడా కోల్పోతున్నారు. ఆకుకూరల ద్వారా లభించే కెరోటిన్ మనశరీరంలో విటమిన్-ఎ గా మారి అంధత్వం రాకుండా చేస్తుంది.
విటమిన్-సి ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు చాలా అవసరమైన పోషకం. వంట చేసేటపుడు ఆకుకూరలను ఎక్కువసేపు మరిగిస్తే, వీటిలో ఉన్న విటమిన్ సి కూడా ఆవిరైపోతుంది. దీన్ని నివారించటానికీ అకుకూరలను స్వల్ప వ్యవధిలోనే వండాలి. ఆకుకూరల్లో కొన్ని రకాల బి- కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉంటాయి.
సాధారణంగా వినియోగించే ఆకుకూరల్లో ఉండే పోషక విలువలు
ఆకుకూరలు పిల్లలకు విరేచనాలు కలిగిస్తాయనేది కొందరి అపోహ. ఈ కారణంగా చాలామంది తల్లులు తమ పిల్లలను ఆకుకూరల నుంచి దూరం చేస్తారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటుంది. నేల, నీరు ద్వార ఆకుకూరలను సూక్ష్మక్రిములు (బాక్టీరియా), కీటకాలు కలుషితం చేస్తాయి. వీటిని శుభ్రం చేయకుండా వినియోగిస్తే విరేచనాలు కలుగుతాయి. కనుక వినియోగించడానికి ముందు ఆకుకూరలను శుభ్రమైన నీటితో బాగా కడగాలి. ఆ తర్వాత వినియోగించినట్లయితే ఎలాంటి రుగ్మతలు రాకుండా నివారించవచ్చును
.
వండిన ఆకుకూరలను శిశువులకు తినిపించే ముందు వాటిలో పీచు పదార్ధం లేకుండా జాగ్రత్తపడాలి. ఆకుకూరలను వండిన తర్వాత వాటిని గుజ్జుగా చేసి వడపోయడం ద్వారా పీచు పదార్ధాన్ని తొలగించవచ్చును . మరీ ఎక్కువ ఉష్ణోగ్రతలోకానీ ఎక్కువసేపుగాని వండితే ఆకుకూరల్లోని పోషకాలు కూడా నశిస్తాయి. వండిన తర్వాత మిగిలే నీటిని పారేయరాదు. ఆహారం వండుతున్నప్పుడు గిన్నెపై మూత ఉంచండి. ఆకుకూరలను ఎండలో ఎండబెట్టరాదు. అలాచేస్తే అందులోని కెరోటిన్ అనే పోషకం కూడా నశిస్తుంది. ఆకుకూరలను నూనెలో వేపుడు చేయరాదు.
ఆకు కూరల్లో పోషక పదార్ధాలను వాటి ధరను బట్టి నిర్ణయించరాదు. చాల చౌకగా లభిస్తాయి కనుక వాటిని వాడటానికి కొందరు భేషజం ప్రదర్శిస్తారు. ధర తక్కువే అయినప్పటికి ఆకుకూరలు పోషకాల పరంగా అత్యంత శ్రేష్టమైనవి. అందరికి చాలా అవసరమైనవి.
ఆకుకూరల పెంపకాన్ని ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి. తద్వారా ఇవి ఏడాది పొడవునా అందుబాటులో కూడా ఉంటాయి.పెరటి తోట,ఇంటి డాబా పైన,పాఠశాలలోని తోట,ఆవరణ లాంటి ప్రదేశాలు ఆకుకూరల పెంపకానికి చాలా అనువైనవి. మునగ చెట్టు,అవిసె చెట్టు లాంటి వాటిని ఇంటి పెరట్లో నాటి పెంచినట్లయితే, వాటినుంచి ఆకులను సేకరించడం చాల సులువుగా ఉంటుంది.
ఆకుకూరలు కొన్ని ప్రత్యేకతలు కలిగిన ఆహార పదార్థం. ఆనుదిన ఆహారంలో దాదాపు 20% వరకు వీటిని తీసుకుంటే మంచిది. వీటివలన చాలా లాభాలున్నాయి.
ఆకుకూరల్లో మిగిలిన కూరగాయలతో పొలిస్తే విటమిన్ కె ఎక్కువగా ఉంటుంది. విటమిన్ కె రక్తం గడ్డకట్టటానికి తొడ్పడే పొషకపదార్థం. ఆంతే కాకుండా గుండె రక్తనాళాల జబ్బులు, ఎముకలు గుల్లబారటం, రక్తనాళాల్లో, మూత్రపిండాలలో రాళ్ళు వంటి వాటిని నియంత్రించకలిగే శక్తి దీనికి కూడా ఉంటుంది.
కొలెస్ట్రాలును తగ్గించే గుణం ఆకుకూరల్లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే శరీర పెరుగుదల, దృఢత్వానికి, చక్కని ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి.
భారతదేశంలో అనేక రకాల ఆకుకూరలు వినియోగంలో ఉన్నాయి. వీటిలో పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, మునగాకులు, పుదీన తదితరాలు ప్రముఖమైనవి.
ఆకుకూరలు ఎక్కువగా ఖనిజ పోషకాలు, ఇనుముధాతువు కలిగి ఉంటాయి. శరీరంలో ఇనుములోపం కారణంగా అనీమియా వ్యాధికి గురవుతారు. గర్భవతులు, బాలింతలు(పాలిచ్చే తల్లులు), పిల్లలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతారు.
ప్రతిరోజూ తీసుకొనే ఆహారంలో ఆకుకూరలను తప్పకుండా చేర్చాలి. తద్వారా అనీమియాను నివారించి, చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు.
రోగాల బారి నుండి శరీరానికి రోగనిరోధక శక్తినిచ్చే ఖనిజ లవణాలు విటమిన్లు ఉంటాయి కాబట్టి వీటిని రక్షిత ఆహార పదార్థాలు అంటారు.ఉంది. లివర్ లో కొలెస్ట్రాలును వినియోగించుకొని బైల్ యాసిడ్ ను తయారుచేస్తుంది. ఇది కొవ్వు జీర్ణ ప్రక్రియలో కూడా తొడ్పడుతుంది. ఆయితే ఆకుకూరల్లో ఉండే పీచుతో బైలు యాసిడ్ కల్సినపుడు అది విసర్జించబడుతుంది. ఆందుచేత లివర్ మరలా మరలా, బైలు యాసిడ్ ను తయారు చేసుకోవలసి వస్తుంది. ఈ విధంగా కొలెస్ట్రాల్ ఎక్కువగా వాడబడుతుంది.
ఆకుకూరలు కంటిచూపును పరిరక్షిస్తాయి. ఆకుకూరల్లో విటమిన్ ఎ కెరొటినాయిడ్, క్సైంతిన్ రూపంలో ఉంటుంది. ఇవి అత్యంత కాంతివంతంగా వచ్చే వెలుతురును కూడా నియంత్రించగలిగే శక్తిని కలిగి ఉంటాయి. కనుక కంటిచూపు బాగా పరిరక్షించబడుతుంది.
శరీరానికి కావలసిన ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఆకుకూరల్లో బి విటమినులు, ముఖ్యంగా బి5 (పాంటోథెనిచ్ యాసిడ్) ఉంటాయి. ఇవి పిండి పదార్థాలను గ్లూకోజ్ రూపంలోకి మారుస్తాయి. అందుచేత శరీరానికి శక్తినిచ్చే ఇంధనంగా ఇది పనిచేస్తుంది. అంతేకాక బి విటమినులకు నీటిలో కరిగే గుణం ఉంటుంది కనుక, ఇవి శరీరంలో కూడా నిల్వచేయబడవు. అందుకే ఆకుకూరలు ప్రతిదినం తీసుకోవాలి.
ఎముకల ఆరోగ్యానికి ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో కాల్షియం అనే ఖనిజలవణం అధికంగా ఉంటుంది. ప్రతిరోజు ముఖ్యంగా 31-35 సంవత్సరాల వయస్సు మహిళలు 1000 మి.గ్రా. కాల్షియం తీసుకోవాలి. ప్రతిరోజు ఆకుకూరలు తీసుకుంటే కొంతవరకు సిఫార్సు చేయబడ్డ పరిమాణాన్ని పొందవచ్చు.
పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన పెద్దపేగు క్యాన్సర్‌ను కూడా నివారించకలుగుతాయి.
ఎక్కువగా దొరికే ఆకుకూరలు, వాటి పొషక విలువలు:
పాలకూర, గొంగూర, తోటకూర, మెంతికూర, బచ్చలికూర, చుక్కకూర, మునగాకు, సొయ్యకూర, గంగవల్లి కూర, క్యాబేజి, కాలిఫ్లవర్, పొన్నగంటి కూర, కోత్తిమీర, కరివేపాకు, పుదీన.
గోంగూర
విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. కావున కంటి వ్యాధులు వచ్చే అవకాశం చాల తక్కువ.
పాలకూర
విటమిన్ ఎ, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అందువలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకల సాంద్రతకు చాలా ఉపయోగపడుతుంది
బచ్చలి కూర
విటమిన్ ఎ, సి మరియు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. అందువలన రక్తకణాలు ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. రక్తహీనతను నివారిస్తుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
పొన్నగంటి
విటమిన్ ఎ మరియు కాల్షియం ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని క్రిములని నాశనం చేస్తుంది. ఎముకల బలాన్ని పెంచుతుంది. శరీరంలో వేడిని బాగా తగ్గిస్తుంది.
చుక్కకూర
విటమిన్ ఎ మరియు మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది అందువల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది
తోటకూర
యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కణాల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి అందువల్ల రక్తహీనతను నివారిస్తుంది ఎముకలకు బలాన్నిస్తుంది
మెంతికూర
పీచుపదార్దం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మధుమేహులకు, అధికబరువుకు, గుండె ఆరోగ్యానికి చాల మంచిది. ఇందులొ సెలీనియం ఎక్కువగా ఉండడం వల్ల కాలేయ ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది.
సొయ్యకూర
ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తకణాలు ఎర్పడడానికి ఉపయోగపడుతుంది విటమిన్ ఎ,సి ఎక్కువ ఉండడం వలన రోగనిరోధకశక్తి పెరుగుతుంది జీర్ణశక్తిని కూడా పెంచుతుంది.
మునగాకు
అన్ని ఆకుకూరలలో కన్నా దీనిలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి, ఐరన్, కాపర్ కూడా ఎక్కువగా ఉండడం వలన రక్తహీనతను నివారిస్తుంది, ఎముకలకు బలాన్నిస్తుంది.
కోత్తిమీర
యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యవంతమైన కణాల కోసం ఉపయోగపడుతుంది. వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది.
కరివేపాకు
బయోటిన్ ఎక్కువగా ఉండడం వల్ల జుట్టు సమ్రక్షణకు మంచిది.అరుగుదల శక్తిని పెంచుతుంది.
పుదీన
యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది చలువ కనుక వేసవి కాలంలో దీన్ని తీసుకోవడం వలన శరీరంలో వేడిని తగ్గిస్తుంది.
గంగవల్లి
ఒమేగ-3 ఫాటీ యాసిడ్ ఎక్కువగా ఉండటం వలన గుండె జబ్బులను దరికి రానివ్వదు. మాంసాహారం తీసుకొనని వారు దీన్ని తినడం వలన గుండె జబ్బులను తగ్గించుకోవచ్చు. అంతే కాకుండా యాంటి ఆక్సిడెంట్లు ఉండడం వలన ముఖం పై ముడతలు తగ్గుతాయి. పొటాషియం ఎక్కువగా ఉండడం వలన రక్తపోటు అదుపులో ఉంటుంది.
క్యాబేజి
గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వలన మధుమేహులకు మంచిది. ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. కొలైన్ ఎక్కువ ఉండడం వల్ల నరాల బలహీనతలను నివారిస్తుంది.
కాలీ ఫ్లవర్
కాల్షియం ఎక్కువగా ఉంటుంది అందువలన ఎముకలకు మరియు పంటి ఆరోగ్యానికి ఉపకరిస్తుంది.
ఆకుకూరలు వండడం:
ముందుగా కడిగి తరువాత కోయాలి. కోసాక నీళ్ళలో వేస్తే వాటిలొ ఉండే నీటిలో కరిగే బి విటమిన్లు వృధా అయిపోతాయి.
తక్కువ నూనేతొ వండాలి. నూనెలో కరిగే కె విటమిన్ ఉండడం వలన ఎక్కువ నూనె వాడితే అది వృధా అయిపోతుంది.
నీళ్ళు పోయకుండానే , వాటిలో ఊరే నీళ్ళతో ఉడికించాలి.
ఆకుకూరలను పప్పుతో కలిపి వండటం వలన పోషకపదార్థాల సమతుల్యత లభిస్తుంది.
రెండు మూడు రకాల ఆకుకూరలు కలిపి వండటం వలన అన్నిరకాల ఖనిజలవణాలు విటమినులు పొందవచ్చు.
రోగాల బారి నుండి శరీరానికి రోగనిరోధక శక్తినిచ్చే ఖనిజ లవణాలు విటమిన్లు ఉంటాయి కాబట్టి వీటిని రక్షిత ఆహార పదార్థాలు అంటారు.
Post a Comment