మిరియాల ప్రయోజనాలు ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు

మిరియాల ప్రయోజనాలు ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు హిందీలో కాలి మిర్చ్ అని పిలవబడే మిరియాలు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ముఖ్యమైన మసాలాలలో ఇది  ఒకటి. ఇది ఆహారాలకు ఒక ఘాటు రుచిని ఇస్తుంది అది చాలా మందికి ఇష్టమైన రుచి. ఎండబెట్టి పొడి చేసిన మిరియాలు యూరోప్ వంటలో ముఖ్యముగా వాడే సాధారణ మాసాలలో ఇది ఒకటి. భోజనంలో మొదటి రకం (సూప్స్, స్టార్టర్స్ వంటివి) నుంచి మెయిన్ కోర్స్ (ప్రధాన మీల్) నుంచి డెజర్ట్స్ (స్వీట్) వరకు, ఇది ప్రతి వంటకంలో కూడా ఉపయోగపడుతుంది. మిరియాల యొక్క ఘాటు దానిలో ఉండే పెప్పరైన్  (piperine) అనే రసాయనం వలన వస్తుంది.  ఇది జీర్ణాశయ వ్యవస్థకు చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది. అద్భుతమైన స్టొమకాక్ (stomachic, జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది) మాత్రమే కాక, ఇది ఒక శక్తివంతమైన యాంటీయాక్సిడెంట్గా కూడా ఉంటుంది. కాబట్టి, ఇది ఆహారాన్ని బాగా జీర్ణం చెయ్యడంలో సహాయపడడం మరియు ఆహారాన్ని సరిగ్గా గ్రహించేలా చెయ్యడమే కాక శరీర జీవక్రియ (మెటబాలిజం) వలన ఉత్పన్నమైన ఆక్సీకరణ ఒత్తిడితో వ్యవహరించడంలో కూడా సహాయపడుతుంది. మిరియాలు యొక్క వంటకాల మరియు ఆరోగ్య  ప్రయోజనాలు అన్ని కలిపి వీటికి "మాసాలలో రాజు" (King of Spices) అనే పేరును తెచ్చి పెట్టాయి.

వాణిజ్యపరంగా ఉపయోగించే మిరియాలు ఉష్ణమండల ప్రాంతాలలో, సంవత్సరం పొడవునా కాసే తీగ మొక్కైన పైపర్ నైగ్రం ఎల్ (Piper Nigrum L.) కు కాసే పక్వానికి చెందిన  ఎండిన కాయలు. ఈ మొక్క పైపర్సియే కుటుంబానికి చెందినది. మిరియాలు భారతదేశంలోని దక్షిణ పశ్చిమ ప్రాంతంలో ప్రధానంగా పెరుగుతాయి. కేరళ రాష్ట్రంలో మరియు మైసూరు, తమిళనాడు మరియు గోవాలోని కొన్ని ప్రాంతాలలో వీటి సాగు బాగా  జరుగుతుంది. ఆసక్తికరంగా, ఒకప్పుడు మొత్తం మిరియాలు మలబార్ అని పిలవబడే ప్రాంతంలో మాత్రమే పండేవి. ఇది ప్రస్తుతం కేరళగా పిలువబడుతుంది. పురాతన కాలం నుండి మలబార్ తీరం మిరియాలు యొక్క సాగు మరియు దిగుమతి-ఎగుమతికి బాగా  ప్రసిద్ది చెందింది. ఇక్కడ నుండే మిరియాలు ఇండోనేషియా, మలేషియాలకు ఎగుమతి చేయబడ్డాయి.  తరువాత అవి మిరియాలు పండగల దేశాలగా  వ్యాపించాయి.

మిరియాలు వాటి యొక్క ప్రత్యేకమైన రుచి మరియు ఆరోగ్య లక్షణాల వలన అంతర్జాతీయ మార్కెట్‌లో చాలా విలువగలవిగా ఉన్నాయి . సాధారణంగా "పెప్పర్ " గా పిలవబడే మిరియాల పొడి , ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా ప్రతి డైనింగ్ టేబుల్స్ దగ్గర చూడవచ్చును .  సాధారణంగా  చాలా రెస్టారెంట్లలో టేబుల్ మీద ఉప్పుతో పాటుగా దీనిని కూడా ఉంచుతారు.

మిరియాల ప్రయోజనాలు ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు

మిరియాల గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:


శాస్త్రీయ నామం: పైపర్ నైగ్రం (Piper nigrum)
కుటుంబం: పైపర్సియే (Piperaceae)
సాధారణ నామం: మిరియాలు, పెప్పర్
సాధారణ హిందీ మరియు సంస్కృత నామం: కాలి మిర్చ్

స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్టీర్ణం: మిరియాలు ప్రధానంగా దక్షిణ భారతదేశానికి చెందినవి. రోమన్ యుగంలో, మిరియాలు భారతదేశంలోని నౌకాశ్రయాల నుండి ఎర్ర సముద్రం (రెడ్ సి) ప్రాంతానికి దిగుమతి బాగా చేయబడ్డాయి.  తర్వాత ఇది తూర్పు ఉష్ణమండల ప్రాంతాలుకు విస్తరించింది. మిరియాలు ప్రపంచ మసాలాదినుసుల వాణిజ్యంలో ఒక పురాతన పదార్థంగా పరిగణించబడుతున్నాయి. దక్షిణ భారతదేశంలో మరియు చైనాలో మిరియాలను సాగు చేస్తారు.  అలాగే ఈస్ట్ మరియు వెస్ట్ ఇండీస్, మాలే పెనిన్సుల, మాలే అర్కోపీలాగో, సియామ్, మలబార్, వియత్నాం, బ్రెజిల్, ఇండోనేషియా మొదలైన దేశాలలో కూడా ఇవి సాగు చేయబడుతున్నాయి.

సరదా విషయం: యునైటెడ్ స్టేట్స్ ప్రస్తుతం అత్యధికంగా పరిమాణంలో మిరియాలను దిగుమతి చేసుకుంటోంది, ఈ దేశం 2009 లో 671 మిలియన్ డాలర్ల మిరియాలను దిగుమతి చేసుకుంది. ఇది ప్రపంచ మిరియాల దిగుమతిలో దాదాపు 18% మాత్రమే 

మిరియాలు రెస్టారెంట్ యొక్క వాడకంలో 50% వాటాను కాన బరుస్తుంది.
మధ్య యుగాలలో, బరువు పరంగా  మిరియాల కంకులు వెండి కంటే ఎక్కువ ధర పలికేవి.

 • మిరియాల పోషక వాస్తవాలు 
 • మిరియాలు ఆరోగ్య ప్రయోజనాలు 
 • మంచి రోగనిరోధక శక్తి కోసం మిరియాలు 
 • కడుపు కోసం మిరియాల ప్రయోజనాలు
 • మిరియాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి 
 • యాంటిపైరేటిక్గా మిరియాలు 
 • ఆర్థరైటిస్ కోసం మిరియాలు
 • మిరియాల యాంటీమైక్రోబయాల్ లక్షణాలు
 • మిరియాలు క్యాన్సర్ను నిరోధిస్తాయి
 • సహజ యాంటియోక్సిడెంట్ వలె మిరియాలు 
 • Black pepper for chronic diseases - in Telugu
 • మిరియాల దుష్ప్రభావాలు 
 • ఉపసంహారం 
 • మిరియాలు కొనుగోలు మరియు నిల్వ -
 • నలుపు, తెలుపు, ఆకుపచ్చ, గులాబీ మరియు ఎరుపు మిరియాలు మిరియాల పోషక వాస్తవాలు 

మిరియాలలో సంతృప్త కొవ్వులు మరియు సోడియం  కొలెస్ట్రాల్త క్కువగా ఉంటాయి. ఇది విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం మరియు పొటాషియం, మరియు డైటరీ ఫైబర్, విటమిన్ కె, ఐరన్, కాపర్, మరియు మాంగనీస్లకు కూడా చాలా మంచి మూలం.

యూ.ఎస్.డి.ఏ (USDA) న్యూట్రియెంట్ డేటాబేస్ ప్రకారం, 100 గ్రాముల మిరియాలు ఈ క్రింది పోషకాలను కలిగి ఉంటాయి:

పోషకాలు:100 గ్రాములకు
నీరు:12.46 గ్రా
శక్తి:251 కిలో కేలరీలు
ప్రోటీన్లు :10.39గ్రా
ఫ్యాట్స్:3.26గ్రా
కార్భోహైడ్రేట్స్:63.95 గ్రా
ఫైబర్స్:25.3గ్రా
చెక్కెరలు:0.64 గ్రా

మినరల్స్

కాల్షియం:443mg
ఐరన్:9.71 mg
మెగ్నీషియం:171mg
ఫాస్ఫర్స్:158 mg
పొటాషియం:1329mg
సోడియం:20mg
జింక్:1.9mg

విటమిన్లు

విటమిన్ బి1:0.108 mg
విటమిన్ బి2:0.18 mg
విటమిన్ బి3:1.143 mg
విటమిన్ బి6:0.291 mg
విటమిన్ ఏ:27 గ్రా
విటమిన్ బి9:17µg
విటమిన్ ఇ:1.04 mg
విటమిన్ కె:1.163.7µg

ఫ్యాట్లు/ఫ్యాటీ యాసిడ్లు  

సాచురేటెడ్:1. 392 గ్రా
మోనోసాచురేటెడ్:0.739 గ్రా  
పోలిసాచురేటెడ్:0.998 గ్రా  


మిరియాలు ఆరోగ్య ప్రయోజనాలు 

ఆరోగ్యానికి: మిరియాలు ఒక అద్భుతమైన ఇమ్మ్యూనోమోడ్యూలేటర్లు (immunomodulator)  హ్యూమరల్ మరియు సెల్-మెడియటేడ్ ఇమ్మ్యూనిటి రెండింటిని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. అలాగే వీటిని అనేక సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా పనిచేయగల యాంటీమైక్రోబయల్ ప్రభావాలు కలిగి ఉంటాయి తద్వారా అంటువ్యాధులు మరియు అనారోగ్యాన్ని నివారించడంలో కూడా ఉపయోగపడతాయి. అంతేకాక ఇది సహజ యాంటీయాక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది.   అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా  తగ్గిస్తుంది.

జీర్ణక్రియ కోసం: ఆహారాన్ని బాగా జీర్ణం చేయడంలో మిరియాలు కూడా సహాయపడతాయి.  కడుపులో గ్యాస్ట్రిక్ రసాల స్రావాన్ని  కూడా  ప్రోత్సహిస్తుంది.

కొలెస్ట్రాల్ కోసం: మిరియాలును తీసుకోవడం వలన అవి శరీరంలో కొలెస్ట్రాల్ యొక్క జీవక్రియకు సహాయం కూడా చేస్తాయి .  హెచ్.డి.ఎల్ (లేదా మంచి కొలెస్ట్రాల్) స్థాయిలు పెంచడానికి సహాయపడి  అదే సమయంలో ఎల్.డి.ఎల్ (లేదా చెడు కొలెస్ట్రాల్) ను కూడా  తగ్గిస్తుంది.

జ్వరాన్ని తగ్గించడానికి: మిరియాలకు యాంటీపైరేటిక్ (జ్వరాన్ని తగ్గించే) మరియు అనాల్జేసిక్ చర్యలు ఉంటాయని భావిస్తారు .  మలేరియా జ్వరం యొక్క కాల వ్యవధిని కూడా తగ్గించగలదని కూడా చెప్పబడింది.

ఆర్థరైటిస్ కోసం: మిరియాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లు మరియు ఆర్థరైటిస్ తో బాధపడుతున్నవారిలో నొప్పి మరియు వాపు యొక్క ఎపిసోడ్లను కూడా  తగ్గించగలదు.  వారిలో ఎముకల కణజాలం యొక్క క్షణతను కూడా నివారించగలదు.

క్యాన్సర్ నివారణ: క్యాన్సర్ కణాల పెరుగుదల వలన విడుదలయ్యే ప్రోనిఫ్లామేటరీ సైటోకైన్ల పెరుగుదలను నియంత్రించేందుకు మిరియాలు  ఎంతో సహాయపడతాయి.  తద్వారా క్యాన్సర్ నివారణలో కూడా ఇవి పాత్రను కలిగి ఉంటాయి.

మంచి రోగనిరోధక శక్తి కోసం మిరియాలు 

విట్రో అధ్యయనాలు మిరియాలు ఒక అద్భుతమైన ఇమ్మ్యూనోమోడ్యూలేటర్ (రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేసే) అని సూచిస్తున్నాయి. మిరియాలు శరీరంలో మాక్రోఫేజ్ (ఒక రకమైన తెల్ల రక్త కణాలు) ఉత్పత్తిని కూడా ప్రోత్సహిస్తాయి. ఇది మెరుగైన రోగనిరోధక ప్రతిస్పందనకు దారి కూడా తీస్తుంది.

ప్రీ-క్లినికల్ అధ్యయనాల ప్రకారం, మిరియాలు యొక్క క్రమమైన వినియోగం రోగనిరోధక శక్తి యొక్క హ్యూమరల్ మరియు సెల్-మెడియటేడ్ ఇమ్మ్యూనిటి రెండింటి మీద అనుకూల ప్రభావాన్ని కలిగి ఉంటుంది.


కడుపు కోసం మిరియాల ప్రయోజనాలు 

మిరియాలలో పైప్పరైన్ అని పిలువబడే ముఖ్యమైన అరోమాటిక్  సమ్మేళనం కలిగి  ఉంటుంది. పైప్పరైన్ జీర్ణాశయ మార్గం ద్వారా సెలీనియం, విటమిన్ బి, కెరోటిన్ మరియు కర్కుమిన్ వంటి వివిధ పోషకాలు మరియు ఖనిజాలు లోపలి ప్రవేశించేలా పైప్పరైన్  కూడా సహాయపడుతుంది అని ధృవీకరించబడింది.

మిరియాలు వినియోగం జీర్ణశయ ప్రేగులకు అనేక ఇతర ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది.

ఇది జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది మరియు కడుపులో జీర్ణ రసాల స్రావాన్ని కూడా  ప్రోత్సహిస్తుంది.
ఇది క్లోమము మరియు కాలేయం నుండి జీర్ణ ఎంజైములు విడుదలను కూడా  ప్రేరేపిస్తుంది, తద్వారా ప్రేగులలో ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
ఇది రవాణా సమయాన్ని ( జీర్ణవ్యవస్థ గుండా ఆహారం పయనించడానికి తీసుకునే సమయం) కూడా తగ్గిస్తుంది.

మిరియాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి 

ఇన్ వివో అధ్యయనలు మిరియాలు యొక్క హైపోలిపిడెమిక్ (కొలెస్టరాల్ తగ్గించే) ప్రయోజనాలు సూచిస్తున్నాయి. మిరియాలు యొక్క క్రమమైన వినియోగం అధిక-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ల (మంచి కొవ్వులు) స్థాయికి కూడా పెంచుతుందని నివేదించబడింది, అదే సమయంలో ఇది తక్కువ-సాంద్రత మరియు చాలా తక్కువ-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ల స్థాయిని కూడా తగ్గిస్తుంది.

అంతేకాక, శరీరంలోని కొలెస్ట్రాల్ జీవక్రియకు మిరియాలు సహాయం చేస్తాయని సూచించారు, ఇది తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలకి కూడా దారితీస్తుంది.


యాంటిపైరేటిక్గా మిరియాలు 

భారతదేశంలోని ఆయుర్వేదిక, యునాని, సిద్ధ మరియు జానపద ఔషధాలలో మిరియాలను మరియు మిరియాలతో తయారు చేసిన సమ్మేళనాలను ఆగి ఆగి వచ్చే జ్వరం, న్యూరైటిస్, జలుబు, గొంతు నొప్పుల చికిత్సకు కూడా ఉపయోగిస్తున్నారు. అదనంగా, ఆగి ఆగి వచ్చే మలేరియా జ్వరం చికిత్సకు కూడా ఉపయోగిస్తారు అలాగే  అనాల్జేసిక్ (నొప్పి నివారిణి) లక్షణాలు మరియు యాంటిపైరేటిక్ (జ్వరము తగ్గిస్తుంది) లక్షణాలు కలిగి ఉందని చెపుతారు. జంతువుల నమూనాలపై నిర్వహించిన ప్రయోగాలు మిరియాలు యొక్క శక్తివంతమైన యాంటిపైరేటిక్ ప్రభావానికి పైప్పరైన్ బాధ్యత కలిగి ఉంటుందని సూచించాయి.


ఆర్థరైటిస్ కోసం మిరియాలు 

ఆర్థరైటిస్ అంటే ఎముక క్షిణించడం.  మోకాలు, మణికట్లు మరియు వేళ్లు వంటి జాయింట్లలో వాపు కలిగించే ఒక వ్యాధి. దీనికి సాధారణంగా యాంటీఇన్ఫలమేటరీ (వాపు నిరోధక) మందుల సహాయంతో చికిత్స  కూడా చేస్తారు.  ఆర్థరైటిస్ వలన శరీరంలో కలిగే ఎరుపుదనం, నొప్పి మరియు వాపు వంటి లక్షణాలను  యాంటీఇన్ఫలమేటరీ మందులు తగ్గిస్తాయి. మిరియాలను ఒక అద్భుతమైన యాంటీఇన్ఫలమేటరీ ఏజెంట్ అని పిలుస్తారు. IL-6 మరియు PGE2 వంటి కొన్ని వాపు వలన ఉత్పత్తి అయ్యే కాంపౌండ్లను మిరియాలు అడ్డుకుంటాయని అధ్యయనాలు ద్వారా సూచించాయి.

అదనంగా, మిరియాలు ఆర్థిరిక్ రోగులలో ఎముక కణజాల క్షీణతకు కారణమయ్యే  కొన్ని ఎంజైములు (కొల్లాజినేజెస్) యొక్క పనితీరును నిరోధిస్తాయని నివేదించబడింది.


మిరియాల యాంటీమైక్రోబయాల్ లక్షణాలు

అనాదిగా మిరియాలను క్రిమినాశకరంగా (యాంటీసెప్టిక్) ఉపయోగిస్తున్నారు. కణ గోడ (సెల్ వాల్) మరియు పొరను (మెంబ్రేన్) నాశనం చేయడం ద్వారా సెల్యులార్ పదార్థాల నిర్మాణం మరియు పనితీరును మార్చి యాంటీసెప్టిక్లు సూక్ష్మజీవులను చంపూతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మిరియాలు యొక్క ఈ లక్షణాలను నిరూపించడానికి ప్రయోగాలను కూడా నిర్వహించారు. సాల్మోనెల్లా టైఫిమూరియం (Salmonella typhimurium), బాసిల్లస్ (Bacillus), ఎస్చెరిచియా కోలి (Escherichia coli) మరియు స్టెఫిలోకాకస్ ఆరియస్ (Staphylococcus aureus) వంటి ఇన్ఫెక్షన్ కలిగించే బాక్టీరియాల పెరుగుదలను మిరియాలలో ఉండే ఫెనాల్ మిశ్రమాలు నిరోధిస్తాయని ఒక పరిశోధన నిరూపించింది. దీని వల్ల మిరియాలకు కొన్ని యాంటీమైక్రోబయాల్ లక్షణాలు ఉండవచ్చని మరియు ఆహారం పాడు చేసే మరియు ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధికారక బాక్టీరియాను మిరియాలు ఎంతో నిరోధించగలవని తెలుస్తుంది.


మిరియాలు క్యాన్సర్ను నిరోధిస్తాయి

ఇతర యాంటీట్యూమర్ చర్యలు కలిగిన మసాలా దినుసుల మరియు ఆహార పదార్దాల యొక్క బయోఅవైలబిలిటీ (ఏదైనా మందు లేదా ఇతర పదార్థం శరీర రక్త ప్రసరణలోకి ప్రవేశించిన తర్వాత అది సమర్ధవంతముగా దాని ప్రభావం చూపడానికి అందుబాటులో ఉండడం) సమయాన్ని మిరియాలు పెంచుతాయి.  తద్వారా క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పని చేసే వాటి సామర్థ్యాన్ని మరియు ప్రభావాన్ని కూడా మిరియాలు పెంచుతాయి.

మిరియాలు నేరుగా కూడా క్యాన్సర్ అభివృద్ధికి వ్యతిరేకంగా పోరాడతాయి. దీని ప్రధాన ఫైటోకెమికల్ పైప్పరైన్.  ఇది కొన్ని పెరిగే కణాల ద్వారా ఉత్పన్నమైయ్యే ప్రోనిఫ్లామేటరీ సైటోకైన్లను నిరోధిస్తుంది. ఈ సైటోకైన్ నిరోధం (inhibition) క్యాన్సర్ కణాలు మధ్య కమ్యూనికేషన్ నిరోధిస్తుంది, తద్వారా అటువంటి కణాల పెరుగుదల అవకాశాలను  కూడా తగ్గిస్తుంది.

మూత్రం నుండి శరీరంలోని హానికరమైన రసాయన పదార్దాలను తొలగించేందుకు సహాయపడే కొన్ని ఎంజైమ్‌ల చర్యను ప్రోత్సహించడం ద్వారా మిరియాలు రసాయన కార్సినోజెనిసిస్ (రసాయనాల వలన అభివృద్ధి చెందిన క్యాన్సర్) ను కూడా  నియంత్రిస్తాయి.

పైప్పరైన్ యొక్క యాంటీయాక్సిడెంట్ లక్షణాలను మరియు లింక్డ్ అన్సాచురేటెడ్ అమైడ్లు (linked unsaturated amides) కూడా కార్సినోజెనెసిస్ వ్యతిరేక చర్యలను కలిగి ఉంటాయి.


సహజ యాంటియోక్సిడెంట్ వలె మిరియాలు 

ఆహార పదార్ధాలలో ఉండే యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఆరోగ్య పరిరక్షణ సమ్మేళనాలుగా ముఖ్యమైన పాత్ర కూడా పోషిస్తాయి. అవి శరీరం లో ఉన్న ఫ్రీ రాడికల్స్ ను తొలగించి  మరియు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.  అన్ని ముఖ్యమైన శరీర అవయవాల యొక్క సరైన పనితీరుకు కూడా సహాయపడతాయి. మిరియాలు క్రియాశీలక యాంటీఆక్సిడెంట్లకు నిల్వలు. మిరియాలు ఈ కీలక మిశ్రమాల యొక్క స్థాయి మరియు ప్రభావాన్ని కూడా మెరుగుపరుస్తాయి. మిరియాలలో అనేక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి .  ఆక్సీకరణ ఒత్తిడిని నివారించే ప్రధాన మసాలా దినుసులలో ఇది ఒకటి. అంతేకాకుండా, మిరియాలలో ఉండే అనేక యాంటీఆక్సిడెంట్లు  పరోక్షంగా శరీరంలోని కొన్ని సహజ యాంటీఆక్సిడెంట్ చర్యలను కూడా మెరుగుపరుస్తాయి.
మిరియాల దుష్ప్రభావాలు 

జీర్ణశయా సమస్యలు
మిరియాలను అధిక మొత్తంలో తీసుకుంటే అవి జీర్ణశయా అసౌకర్యానికి దారితీస్తాయి. ఒక అధ్యయనంలో, నలుపు మరియు ఎర్ర మిరియాల అధిక వినియోగం యొక్క ప్రభావాలను కూడా గమనించారు.  దానిలో ఇవి పెరైటల్ స్రావం (parietal secretion), పెప్సిన్ స్రావం మరియు పొటాషియం నష్టం వంటి వాటి యోక్క  గణనీయమైన పెరుగుదలకు కారణమైందని గమనించబడింది. ఇది తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్యలకు కూడా దారితీసింది. తీవ్రసున్నితత్వం (హైపర్ సెన్సిటివ్నెస్) గల  కడుపు/పొట్ట ఉన్నవారు మిరియాల నుండి దూరంగా ఉండాలని కూడా సూచించబడుతుంది.

అలెర్జీ ప్రతిస్పందనలు

మిరియాలను అధికంగా తీసుకోవడం వలన గర్భిణీ స్త్రీలలో హైపర్ సెన్సిటివ్ ప్రతిచర్యలు లేదా అలెర్జీ లాంటి లక్షణాలు కూడా ప్రేరేపించబడతాయని కనుగొనబడింది. గర్భిణీ స్త్రీ సున్నితమైన వ్యక్తి అయితే, తన శారీరక పరిస్థితి ప్రకారం మిరియాలు నివారించడం చాలా ఉత్తమం.

శ్వాస సంబంధిత సమస్యలు

మిరియాలు మితిమీరిన వినియాగం శ్వాస సంబంధిత సమస్యలకు కూడా దారి తీయవచ్చును . మిరియాలు శ్వాస సమస్యలతో  కూడా ముడిపడి ఉంటాయి  .  వాటి అతి వాడకం గొంతులో సమస్య, ఉబ్బసం మరియు ఇతర శ్వాస సంబంధిత సమస్యలను కూడా కలిగిచవచ్చును . 17-నెలల బాలుడికి సంబంధించిన ఒక కేస్ స్టడీలో, అతను నల్ల మిరియాలు వేసిన వంటకాన్ని తిన్న వెంటనే దద్దుర్లు, కండ్లకలక, ముఖపు వాపు మరియు తీవ్రమైన దగ్గు అభివృద్ధి చెందినట్లు కూడా కనుగొనబడింది.

చనుబాలు ఇచ్చే సమయంలో నివారించాలి

మిరియాలను గర్భిణీ స్త్రీలు నివారించాలని కూడా సూచించబడుతుంది, ముఖ్యంగా చనుబాలు ఇచ్చే సమయంలో కూడా వీటిని నివారించాలి. మిరియాలను తినడం వలన అవి చివరికి రొమ్ము పాలుకు ఘాటును కూడా కలిగిస్తాయి.  పాల రుచి కూడా మారిపోవచ్చు మరియు బిడ్డకు జీర్ణ సమస్యలు కూడా ఏర్పడవచ్చును .

చర్మం పొడిబారడానికి దారితీస్తుంది

మిరియాలు అధిక మొత్తంలోకి తీసుకోవడం వలన చర్మం పొడిబారి పొరలు పొరలుగా మారవచ్చని భావిస్తారు. పొడి చర్మం కలవారు, మిరియాలు లేదా మిరియాల పొడి వేసిన యొక్క ఆహారాలను అధిక మొత్తంలో కూడా  తీసుకోకూడదు. ఇది పరిస్థితిని మరింత అద్వానంగా చేస్తుంది దురద, బిరుసుదనం మరియు చర్మాన్ని మరింత సున్నితంగా చేయవచ్చును .

ఉపసంహారం

దాదాపు ప్రతి వంటకంలో ఒక చిటికెడు మిరియాల పొడిని జోడించడం సహజం. ఇవి ఒకప్పుడు నగదుగా ఉపయోగించబడ్డాయి మరియు దేవతలకు పవిత్ర అర్పణగా సమర్పించబడేవి. ఏడాది పొడవునా అందుబాటులో ఉండే అత్యంత ప్రముఖమైన మసాలా దినులలో ఇది ఒకటి. పెప్పరైన్, మిరియాల యొక్క ఘాటుకు కీలకమైన భాగం.  ఈ ఆర్గానిక్ సమ్మేళనానికి అనేక చికిత్సా చర్యలు ఉన్నాయి. ఇది పోషక మరియు బయోలాజికల్  సమ్మేళనాల జీవ లభ్యత (బయోఅవైలబిలిటీ)ని పెంచడంలో కూడా ప్రసిద్ధి చెందింది . ఒక మసాలాదీనిసు కంటే ఎక్కువ సహాయం చేసే అనేక ఆరోగ్య ప్రయోజనాలు మిరియాలకు కూడా  ఉన్నాయి. మీరు మిరియాలు మీ షెల్ఫ్ తొలగించాలనుకుంటే మళ్ళి ఒకసారి ఆలోచించండి. ఈ సాధారణ మసాలాదినుసు మీరు ఊహించేదాని కంటే ఎక్కువ లాభాలను కలిగి ఉంటుంది.


మిరియాలు కొనుగోలు మరియు నిల్వ

మిరియపు గింజలు మార్కెట్‌లో ఏడాది పొడవునా సులభంగా లభిస్తాయి. మిరియాల పొడి కల్తీ చేయబడే అవకాశం కూడా ఉంటుంది.  కనుక మిరియపు గింజలను కొనడం మంచిది. మిరియపు గింజ బరువుగా, గుండ్రంగా మరియు దళసరిగా కూడా ఉంటుంది.

మిరియాలను సులువుగా అనేక సంవత్సరాలపాటు గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయవచ్చును.    అవసరమైనప్పుడు వాటిని చిన్న రోలుతో పొడి చేసుకోవచ్చును . ఇది ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు రిఫ్రిజిరేటర్లో కూడా నిల్వచేయవచు.ను  పిండిచేసిన మిరియాలు రిఫ్రిజిరేటర్ లోపల గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి.


నలుపు, తెలుపు, ఆకుపచ్చ, గులాబీ మరియు ఎరుపు 

ఎండబెట్టిన మిరియపుగింజ, కేవలం 5 మిల్లీమీటర్లు వ్యాసంలో మరియు నలుపు రంగులో ఉంటుంది. అయితే, సూపర్ మార్కెట్‌లో వివిధ రకాల మిరియాలు అందుబాటులో ఉంటాయి. తెల్ల మిరియాలు, ఆకుపచ్చ మరియు గులాబీ రకాలు కూడా ఉన్నాయి! నలుపు, తెలుపు, ఎరుపు లేదా ఆకుపచ్చ ఏ రంగులైన కానీ అన్ని రకాలు వంటలలో రుచికోసం విస్తృతంగా కూడా ఉపయోగించబడతాయి.

కానీ వాటి మధ్య ఉండే తేడా ఏమిటి? తెలుసుకుందాము.

ఆకుపచ్చ మిరియాలు అంటే చిన్న పిందెలు ఇవి పసరు వాసనతో కూడా  ఉంటాయి.  అవి బాగా ముదిరిన/ముగ్గిన తర్వాత స్పష్టమైన ఎరుపు రంగులోకి కూడా మారుతాయి. అయితే సాధారణంగా, ఎరుపు మిరియాలను నల్ల మిరియాలుగా తయారు చేసేందుకు ఎండబెట్టేస్తారు కాబట్టి మనం వాటిని ఎక్కువగా చూడము. తెల్ల మిరియాలు వాస్తవానికి నల్ల మిరియాలే, తెల్ల మిరియాల పై తొక్కలు తీసేస్తే అవి నల్ల మిరియాలు అవుతాయి.

మిరియాల యొక్క ఘాటు అన్నింటికన్నా తెల్ల మిరియాలలో ఎక్కువగా ఉంటుంది మరియు ఆకుపచ్చ మిరియాలులో తక్కువగా ఉంటుంది.  అయితే నల్ల మరియు ఆకుపచ్చ మిరియాలు మిరియాలు తెల్ల వాటికన్నా ఎక్కువ వాసనను కలిగి ఉంటాయి.

ఎరుపు మిరియాలకు కంచెం తీపి రుచి మరియు నల్ల మిరియాలకు ఉండే ఘాటుదనం మరియు రుచి కలిసి ఉంటుంది.

ఆకుపచ్చ మిరియాలు ఎక్కువగా సాస్ మరియు వినెగార్లలో సువాసన కలిగించే చేసే ఏజెంట్‌గా కూడా ఉపయోగిస్తారు, అయితే తెల్ల మిరియాలను చైనీస్ వంటలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

గులాబీ మిరియాలు అసలు మిరియాలే కాదు. కానీ, అవి ఒక తీపి మరియు మిరియాల రుచి కలిగి ఉండే  ఒక రకమైన ఉష్ణమండల పండు.

0/Post a Comment/Comments

Previous Post Next Post