కీరదోస ప్రయోజనాలు, ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు

కీరదోస ప్రయోజనాలు, ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు 


"యాజ్ కూల్ యాజ్ కుకుంబర్” (as cool as a cucumber-కీర దోసకాయ లాగా చల్లగా) అనే ఓ ఆంగ్ల పలుకుబడిని విన్నపుడు మీకేదైనా ఓ మంచి అనుభూతి గుర్తుకు వస్తోందా?  అవును మరి, ఓ మండు వేసవి రోజున కరకరలాడే చల్ల చల్లని కీర దోసకాయను (మసాలా దట్టించి) తినడం లాంటి ఆనందం మరోటి లేదని అందరూ కూడా  అంగీకరిస్తారు. “కుకుమిస్ సాటివుస్” అనేది కీరదోసకు ఉన్న వృక్షశాస్త్రం పేరు. కీరదోసకాయలు మండు వేసవిలో వేడిని నిరోధించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కీరదోసకాయ గుమ్మడి కుటుంబం, ‘కుకుర్బిటాసియా’ కు చెందినది. కీరదోసకాయ కూరగాయల వర్గానికి చెందినదిగా  విస్తృతంగా వర్గీకరించబడినప్పటికీ, ఇది కీరదోస పువ్వుల నుండి పెరుగుతుంది మరియు ఈ కీరదోసకాయ విత్తనాల్ని కలిగి ఉంటుంది. అందువల్ల కీరదోస నిజానికి ఒక రకమైన పండు.

దోసకాయలు వేర్వేరు ఆకారాలు, పరిమాణాలు మరియు రంగులలో పెరుగుతాయి మరియు మీ పెరట్లో కూడా సులభంగా పెరుగుతాయి కీరదోసలు. విత్తనాల ఉపయోగం మరియు వాటి ఉనికి ఆధారంగా, దోసకాయ మూడు రకాలుగా ఉంటుంది. ఒక రకం విత్తనాలు లేనివి. ఇతర రెండు రకాలు వాటి ఉపయోగం ఆధారంగా ఉంటాయి; ముక్కలు కోసుకుని ముడిగానే తినదగినవి లేదా ఊరగాయగా పెట్టుకుని తినదగినవి. దోసకాయ యొక్క అనేక రకాలు ఈ 3 ప్రాథమిక రకాలు నుండి అభివృద్ధి చేయబడ్డాయి. కీరదోస భారత ఉపఖండం నుండి ఉద్భవించిందని ప్రసిద్ధి కానీ ప్రస్తుతం దీన్ని ప్రపంచవ్యాప్తంగా సాగు చేస్తున్నారు.

దోసకాయ యొక్క మొట్టమొదటి సాగు సుమారు 3000 సంవత్సరాల క్రితం నాటిది. దీన్ని భారతదేశంలో మొట్టమొదటగా పండించారు, తర్వాత గ్రీస్ మరియు ఇటలీ ద్వారా యూరప్‌కు వ్యాపించింది. నిజానికి, సంప్రదాయ భారతీయ ఔషధం పురాతన కాలం నుంచి కీరదోసకాయను ఉపయోగిస్తోంది. కీరదోసకాయ వినియోగ0 గురి0చి బైబిలులో కూడా ప్రస్తావించబడింది. ప్రస్తుతం, దీన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పండిస్తున్నారు. చైనా దోసకాయలు మరియు కీరదోసకాయలకు (గెర్కిన్లకు) ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది. కీరదోసకాయల మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో ఒక్క చైనానే 77% పండిస్తోంది.

రసంతో కూడిన దోసకాయ తినడానికి కరకరలాడుతుంటుంది కాబట్టి దీన్ని  ప్రపంచవ్యాప్తంగా అందరూ తిని ఆనందిస్తున్నారు. మొత్తం కీరదోసకాయను మొత్తం తినొచ్చు, అంటే కీరదోసకాయపై ఉండే తొక్క మరియు విత్తనాలతో పాటు తినడమే  మరింత ఆరోగ్యకరం. అధిక నీటిశాతాన్ని కల్గి ఉండేదిగా కీరదోసకాయను ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. కానీ కీరదోసకాయలు తినడంవల్ల కలిగే ఉత్తమ ప్రయోజనం అదొక్కటి మాత్రమే కాదు. కీరదోసల్లో ఫైటోన్యూట్రిఎంట్లనబడే పోషకాలున్నాయి, ఇవి మొక్క రసాయనాలు. ఈ మొక్క రసాయనాలు మనల్ని వ్యాధుల్నుండి రక్షిస్తాయి. అంతేకాక, పొటాషియం వంటి ఖనిజాల్ని, కాల్షియం, మరియు వివిధ విటమిన్లను కీరదోసకాయ కల్గి ఉంది.

భారతదేశంలో “కీర”, “ఖీరా” అని పిలువబడే ఈ కీరాదోసకాయ, వేడి వాతావరణాల్లో బాగా పండుతుంది. కీరదోసకాయ తీగకు కాస్తుంది. ఈ తీగ మొక్కకు క్రమంగా నీటిని పోస్తుంటేచాలు, దీనికి అంతకు మించి పెద్దగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు. కీరదోసకాయను పచ్చికాయగానే, అంటే ముడిగానే, తింటారు లేదా సలాడ్లుగా మరియు మధ్యధరా వంటలలో ఉపయోగిస్తారు. కొన్ని ఆసియా వంటకాల్ని దోసకాయతో తయారు చేస్తారు. సాదా నీటికి ప్రత్యామ్నాయంగా దోసకాయ ముక్కలను నానబెట్టిన నీటిని తాగడంవల్ల అది మన శరీరంలో నిర్విషీకరణం (detoxifying) గా పని చేస్తుంది. కాబట్టి సాదా నీరు కంటే ఇలా కీరదోస ముక్కలు నానబెట్టిన నీటిని తాగడం ఆరోగ్యకకరం.

కీరదోస ప్రయోజనాలు, ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు

కీర దోసకాయల గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు


శాస్త్రీయ నామం: కుకుమిస్ సాటైవస్ (Cucumis sativus)
కుటుంబం: కుకుర్బిటసే
సాధారణ పేరు: కీరదోసకాయ, ఖీరా
సంస్కృతం పేరు: ఉర్వరుకం
ఉపయోగించే భాగాలు: కీరదోసకాయ యొక్క కండ (ఫ్లెష్), విత్తనాలు మరియు తొక్క అన్నింటినీ అట్లే (ముడిగానే) పచ్చిగానే తినొచ్చు. ఊరగాయగా పెట్టుకుని కూడా కీరదోసల్ని తినొచ్చు.
స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: కీరదోసలు పురాతన భారతదేశం నుండి ప్రపంచానికి పరిచయమయ్యాయి. మొదట ఇవి అడవుల్లోనే పండేవి. గ్రీకులు మరియు ఇటలీవారు ఐరోపాకు పరిచయం చేశారు, అయితే దీనిని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పరిచయం చేసింది ఆ దేశానికెళ్ళే వలసదారులే.
ఆసక్తికరమైన విషయాలు: జపాన్‌లోని బౌద్ధ దేవాలయపు పూజారులు సురక్షితమైన వేసవి కొరకు ప్రార్థన చేస్తూ, కీరదోసకాయతో దీవెనలందించే సంప్రదాయాన్ని పాటిస్తారు. రోమన్ చక్రవర్తి టిబెరియస్ ఏడాది పొడవునా తన టేబుల్‌పై ఒక కీరదోసకాయను ఉంచాలని పట్టుబట్టేవారట. ఏడాది పొడవునా కీరదోసకాయను పండించడానికి గ్రీన్హౌస్-వంటి పద్ధతులను కూడా ఆ చక్రవర్తి ఉపయోగించేవాడట.

 • దోసకాయ పోషక విలువలు 
 • దోసకాయ ఆరోగ్య ప్రయోజనాలు 
 • మధుమేహం కోసం దోసకాయ 
 • రక్తపోటు కోసం కీరదోసకాయ 
 • ఆరోగ్యకరమైన చర్మం కోసం కీరదోసకాయ 
 • జుట్టు కోసం కీరదోసకాయ ప్రయోజనాలు 
 • వాపు కోసం కీరదోసకాయ 
 • ఆరోగ్యకరమైన ఎముకలు కోసం కీరదోసకాయ
 • జీర్ణక్రియ కోసం కీరదోసకాయ 
 • మెదడుకు దోసకాయ ప్రయోజనాలు 
 • కీరదోసకాయ అథెరోస్క్లెరోసిస్ ను నిరోధిస్తుంది 
 • కీరదోసకాయ దుష్ప్రభావాలు 
 • ఉపసంహారం
 • మూత్రవిసర్జనకారిగా దోసకాయ 


దోసకాయ పోషక విలువలు 

కీర దోసకాయలు 90-95 శాతం నీటిని మరియు పరిమితంగా కేలరీల్ని, కొవ్వులు, కొలెస్ట్రాల్స్, మరియు సోడియం లను ను కల్గి ఉంటాయి. కీరదోసల్లో విటమిన్ A మరియు విటమిన్ B6 రెండూ చేరి 6% మరియు విటమిన్ సి 14% కలిగి ఉంటుంది  దోసకాయలు సిలికా (silica)కు ఓ మంచి వనరు. అందువల్ల మన శరీరంలోని బంధన కణజాలాలను బలోపేతం చేయడానికి మరియు ఆరోగ్యకరమైన కీళ్ళను ప్రోత్సహించేందుకు కీరదోస బాగా పనిచేస్తుంది.

దోసకాయలు మూడు లిగ్నన్లను కలిగి ఉంటాయి, అవే లారిసెరిసినోల్, పినోరేసినోల్ మరియు సెకోయిసోరిసినోల్. ఈ లిగ్నన్లు రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వివిధ రకాలైన క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించే లక్షణాలను కలిగి ఉన్నాయి.

USDA న్యూట్రియెంట్ డేటాబేస్ ఆధారంగా, ప్రతి 100 గ్రా.ల కీరదోసకాయలో కింది పోషకాలుంటాయి

 పోషకం :100 g లకు విలువ

నీటి పరిమాణం:95.23 గ్రా
శక్తి:16 కిలో కేలరీలు
ప్రోటీన్:0.65 గ్రా
కొవ్వు (ఫ్యాట్):0.11 గ్రా
కార్బోహైడ్రేట్:11.05 గ్రా
ఫైబర్:3.63 గ్రా

మినరల్స్

ఐరన్:0.28 mg
మెగ్నీషియం 
భాస్వరం:24 mg
పొటాషియం;147 mg
సోడియం:2 mg
జింక్:0.2 mg


విటమిన్లు:13 mg
విటమిన్ బి1:0.027 mg
విటమిన్ బి2:0.033 mg
విటమిన్ బి3:0.098 mg
విటమిన్ బి5:0.259 mg
విటమిన్ బి6:0.04 mg
విటమిన్ బి9:7 μg
విటమిన్ సి:2.8 mg
విటమిన్ కె :16.4 μg


దోసకాయ ఆరోగ్య ప్రయోజనాలు 

పుచ్చక్కాయకు సంబంధించిన కీరదోసకాయ అధిక మొత్తంలో నీటిని కలిగి ఉంటుంది. ఈ కీరదోస 95% నీటిని మరియు విటమిన్లు, ఖనిజాలు, మరియు యాంటీఆక్సిడెంట్లను అధికంగా కల్గి ఉంటుంది. ఇది చాలా తక్కువ కొలెస్ట్రాల్, కార్బోహైడ్రేట్లు, కొవ్వు మరియు కేలరీలను  కలిగి ఉంటుంది. అందువల్ల, కీరదోసకాయ నీటికి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం, ఇది శరీర కణాలను జలీకరణం (హైడ్రేట్స్) చేయడం మాత్రమే కాదు మన శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. అంతేకాకుండా, ఇది చర్మానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది మరియు ఆక్సీడేటివ్ ఒత్తిడికి వ్యతిరేకంగా ఉపశమనం కల్గిస్తుంది. కీరదోసకాయ యొక్క తొక్క మరియు విత్తనాలు ‘బీటా కెరోటిన్’ ను కలిగి ఉంటాయి, ఇది కళ్ళు మరియు చర్మాలకు మంచిది. కీరదోసకాయ యొక్క కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను విశ్లేషిద్దాం:

చర్మం కోసం: దోసకాయ చర్మానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది, ఇది ఒక అద్భుతమైన హైడ్రేటింగ్ ఏజెంట్. ఇది దద్దుర్లు మరియు వాపును వదిలించుకోవటానికి ఉపయోగపడుతుంది. చర్మంపై వచ్చే కమిలిన మచ్చలు (టాన్స్), వేడి బొబ్బలు (సన్‌బర్న్) మరియు చర్మం యొక్క వాపులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.

జుట్టు కోసం: కీరదోసకాయ జుట్టుకు తేమను కల్పించి పోషణను కల్పించడంలో సహాయపడుతుంది,  జుట్టు ఊడడం మరియు పొడి జుట్టును తగ్గించడంలో కీరదోస సహాయపడుతుంది.

మెరుగైన జీర్ణక్రియ కోసం: దోసకాయ శరీరంలో శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది మరియు అదనపు యాసిడ్ ఉత్పత్తిని నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇది కరగని పీచుపదార్థాలతో కూడుకుని ఉంటుంది గనుక, ఇది మలానికి పెద్ద మొత్తంలో జోడించడం జరిగి మలబద్ధకం లక్షణాల నుండి  ఉపశమనాన్ని కలుగజేస్తుంది.

చక్కెరవ్యాధికి: చక్కెరవ్యాధి యొక్క నిర్వహణలో దోసకాయలు సహాయపడతాయి, రక్తం గ్లూకోస్ స్థాయిలను, ముఖ్యంగా పురుషుల్లో, తగ్గిస్తుంది. కీరదోసకాయ  ఫ్లేవనాయిడ్లను (flavonoids) మరియు ఇతర జీవశైధిల్య కాంపౌండ్ల ఉనికికి కారణమని చెప్పబడింది.

రక్తపోటుకు: వృద్ధాప్యంలో కీరదోసకాయరసం తీసుకోవడంవల్ల రక్తపోటు తక్కువవుతుందని కనుగొనబడింది, అందువలన, ఇది రక్తపోటు  ఉన్న రోగులకు (హైపర్ టెన్షన్ ఉన్నవాళ్లకు) సిఫార్సు చేయబడింది.

ఎథెరోస్క్లెరోసిస్ కోసం: కీరదోసకాయ రక్తం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది, ఇది హృదయ సంబంధ రుగ్మతల ప్రమాదం ముఖ్యంగా అథెరోస్క్లెరోసిస్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

మధుమేహం కోసం దోసకాయ 
ఆరోగ్యకరమైన వ్యక్తులపై నిర్వహించిన ఒక అధ్యయనంలో, దోసకాయ వినియోగం తర్వాత గ్లూకోజ్ స్థాయిలలో వ్యత్యాసం పర్యవేక్షించబడింది. ఇది పురుషులలో ప్రత్యేకంగా గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో దోసకాయ చాలా ప్రభావవంతమైనదని కనుగొనబడింది. పాలిఫేనోల్స్, విటమిన్ సి మరియు ఫ్లేవానోయిడ్ పోషకాల ఉనికి ఈ కూరగాయ యొక్క యాంటి డయాబెటిక్ మరియు యాంటిఆక్సిడెంట్ లక్షణాలకు కారణమయ్యాయి.


రక్తపోటు కోసం కీరదోసకాయ
ఇండోనేషియాలో జరిపిన ఒక అధ్యయనంలో, 60 ఏళ్ల వయస్సుపైబడ్డ వాఁరికి ఒక ఖచ్చితమైన కాలానికి దోసకాయ జ్యూస్ ను ఇస్తూ పర్యవేక్షించబడ్డారు. దోసకాయ వినియోగం ఈ వృద్ధుల రక్తపోటు స్థాయిలను గణనీయంగా తగ్గించిందని కనుగొన్నారు. ఓ భారతీయ పరిశోధనలో, దోసకాయ తక్కువ సోడియం పదార్థాన్ని కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. అందువల్ల, అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారికి  కీరదోసకాయ మంచిది.


ఆరోగ్యకరమైన చర్మం కోసం కీరదోసకాయ 
కీరదోసకాయ చర్మం కోసం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది:

కీరదోసకాయసేవనం చర్మానికి చాలా బాగా జలీకరణం (hydrating) కలుగజేస్తుంది.
ఇది చర్మంపై వాపు మరియు దద్దుర్లు వదిలించుకోవటంలో సహాయపడుతుంది ఇది ఒక అద్భుతమైన శోథ నిరోధక ఏజెంట్.
కీరదోసకాయ శరీరంలోని వృధా పదార్థాలను మరియు రసాయన విషాలను తొలగిస్తుంది మరియు కీరదోసకాయ రసం చర్మంపై మంచి పోషక ప్రభావాన్ని కలిగిస్తుంది.
కీరదోసకాయ ఎండవేడికి (వడదెబ్బ) కలిగే చర్మం కమిలిపోయి ఏర్పడే బొబ్బలకు ప్రభావవంతంగా పనిచేస్తుంది.
కీరదోసకాయలు రుటిన్ మరియు ఆస్కార్బిక్ ఆమ్లం ఆక్సిడేస్ను కలిగి ఉందని పరిశోధన  చెబుతోంది. ఈ సమ్మేళనాలు రెండూ స్వేచ్ఛా-రాడికల్ స్కావెంజర్స్ లాగా పని చేస్తాయి, ఇవి చర్మానికి కలిగే నష్టం నుండి రక్షణ కల్పించడంలో విపరీతంగా సహాయం చేస్తాయి. అంతేకాకుండా, కీరదోసకాయలు ఫోటోప్రొటెక్టెక్టివ్ కార్యకలాపాలను కలిగి ఉందని, మరియు 0.2 SPF విలువను స్వంతంగా అందిస్తుందని కొన్ని పరిశోధనలు సూచించాయి. ఇటీవలి పరిశోధనలు దోసకాయ సారంతో తయారైన పైపూతకు వాడే క్రీములు మెలనిన్ మరియు చర్మపు క్రొవ్వుద్రవాన్నిగణనీయంగా తగ్గించగలదని, ఫలితంగా చర్మం తెల్లబడటం మరియు మొటిమలు తగ్గిపోవడం (యాంటీ-యాక్నే ఎఫెక్ట్స్) జరుగుతోందని సూచిస్తున్నాయి.


కీరదోసకాయ, దాని రసం, మరియు నీరు సౌందర్య సాధనాలలో విస్తృతంగా ఉపయోగించబడతాయి. ఈ పదార్థాలు సౌందర్య సాధనాలపై చర్మపు కండీషనింగ్ ఏజెంట్ల వలె పని చేస్తాయి. దోసకాయ పండు సారం 534 సౌందర్య సమ్మేళనాలలో ఉపయోగించబడుతుంది, వీటిలో 50% కంటే ఎక్కువ రకాలు “లీవ్-ఆన్” టైపు రకాలైన  ఉత్పత్తులు. కీరదోసకాయ నీటి సాంద్రతలను అత్యధికంగా ఫౌండేషన్ క్రీముల్లో ఉపయోగించినట్లు నివేదించడమైంది. కీరదోసకాయ నుండి తీసిన పదార్దాలను కంటి లోషన్లలో, కంటి-కింద ఉంపయోగించే క్రీములు మరియు ముఖం మరియు మెడపై ఉపయోగించే సౌందర్యపోషణ ఉత్పత్తుల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. కీరదోసకాయలలోని ప్రధాన కొవ్వు ఆమ్లాలు పల్మిటిక్ ఆమ్లం, లినోలెయిక్ ఆమ్లం మరియు లినోలెనిక్ ఆమ్లం. ఈ రసాయనిక భాగాలు అనేకం సౌందర్య సాధనాల తయారీకోసం సురక్షితంగా వాడవచ్చని గతంలో నిర్ధారించారు  కూడా.


జుట్టు కోసం కీరదోసకాయ ప్రయోజనాలు

కీరదోసకాయలో ఉన్న సిలికాన్ మరియు సల్ఫర్ జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తాయి మరియు జుట్టు పోషణకు తోడ్పడతాయని నమ్మడం జరుగుతోంది . .

అదనంగా, దోసకాయ యొక్క అనామ్లజనకాలు మరియు హైడ్రేటింగ్ ప్రభావాలు జుట్టు రాలడం అనే లక్షణాన్ని తగ్గించి మీ వెంట్రుకలకు తేమనందివ్వడంలో  సహాయపడతాయి. కీరదోసకాయ గుజ్జు నుండి తీసిన రసాన్ని వెంట్రుకలకు పైపూతగా వాడి పొడి జుట్టును వదిలించుకోవచ్చు.

వాపు కోసం కీరదోసకాయ 

అధిక ఒత్తిడి కణ నష్టానికి కారణమవుతుంది, తత్ఫలితంగా క్రమంగా శరీరం లో రియాక్టివ్ ఆక్సిజన్ పెరుగుతుంది, ఇది పొర బలహీనపడటానికి మరియు వాపు ఏర్పడటానికి  దారితీస్తుంది. దోసకాయ వినియోగం తరువాత అధిక నీటి నష్టం మరియు వాపును తగ్గించి ఒత్తిడిని నియంత్రిస్తుంది .

ఆరోగ్యకరమైన ఎముకలు కోసం కీరదోసకాయ 

కీరదోసకాయ విటమిన్ K యొక్క గొప్ప మూలం. ఎముక ఆరోగ్యాన్ని కాపాడటానికి విటమిన్ K యొక్క ప్రయోజనాలను ఇటీవలి అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఎముకల ఖనిజ సాంద్రతను పెంచడంలో విటమిన్ K ప్రయోజనకరంగా ఉంటుంది మరియు అందువలన, ఎముకల ఫ్రాక్చర్లు మరియు ఇతర ఎముక నష్టాలను అరికడుతుంది.


జీర్ణక్రియ కోసం కీరదోసకాయ 

నీటిని అధికంగా కల్గి ఉండడంతో పాటు కీరదోసకాయలో కరగని పీచుపదార్థాలు కూడా ఉన్నాయి. కరగని ఈ పీచుపదార్థాలు (ఫైబర్స్) ఆహారానికి గాత్రాన్నందించి సాయపడుతాయి, తద్వారా మలబద్ధకాన్ని నిరోధించడం జరుగుతుంది. దోసకాయ విత్తనాలు కూడా శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటాయి మరియు కడుపులో అదనపు యాసిడ్ ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడతాయి.


మెదడుకు దోసకాయ ప్రయోజనాలు

దోసకాయలో ఫిస్టిన్ అనే ఫ్లవానోయిడ్ను కలిగి ఉంటుంది, ఇది మెదడు యొక్క పనితీరును పెంచుతుంది. ఇది వృద్ధాప్యం నుండి నరాలను రక్షిస్తుంది మరియు మంచి జ్ఞాపకశక్తిని నిలుపుకోవడంలో సహాయపడుతుంది. అల్జీమర్స్ వ్యాధికి చిత్తవైకల్యం (డైమెన్షియా)తో చాలా సంబంధం కలిగి ఉందని ప్రపంచవ్యాప్తంగా పలువైద్య కేసులవల్ల తెలియవచ్చింది .

అల్జీమర్స్ వ్యాధికి వ్యతిరేకంగా ఈ కీరదోసలోని సమ్మేళనం యొక్క సామర్థ్యాన్ని అధ్యయనం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా పరిశోధన నిర్వహించబడుతోంది.


కీరదోసకాయ అథెరోస్క్లెరోసిస్ ను నిరోధిస్తుంది 
ధమనులు గట్టిపడటాన్నే అథెరోస్క్లెరోసిస్గా పిలువబడుతుంది . ఇది సాధారణంగా ధమనులు లేదా హైపెర్లిపిడెమియాలో అత్యధిక స్థాయి లిపిడ్ల కారణంగా సంభవిస్తుంది. క్లినికల్ అధ్యయనంలో, అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న రోగులచేత కీరదోసకాయ విత్తనాలను నుండి తీసిన సారాంశాన్ని సేవింపజేశారు. కీర దోసకాయ యొక్క విత్తనాలు లిపిడ్ స్థాయిలను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పని చేశాయని గమనించబడింది.


కీరదోసకాయ దుష్ప్రభావాలు 

కీరదోసకాయ విషయంలో కూడా ‘ఏది కూడా చాలా మటుకు (తినడం) చాలా మంచిది కాదు,' (too much is never too good )అనే  ఆంగ్ల నానుడి వర్తిస్తుంది. కీరదోసకాయ యొక్క అధిక వినియోగం తీవ్రమైన దుష్ప్రభావాలు మరియు అలెర్జీలకు దారి తీయవచ్చు. మనం తరచూ చేదు కీరదోసకాయలను తినడం జరుగుతూ ఉంటుంది, కానీ అధిక పరిమాణంలో కీరదోసను తింటే అది మన శరీరంలో విషపూరిమై, అటుపైప్రాణాంతకామూ కావచ్చు. వాణిజ్యపరంగా లభించే కొన్ని కీరదోసకాయలకు చుట్టూ మైనపు పూత పూసి ఉంటుంది, ఇదెందుకంటే వాటిని క్రిమికీటకాలనుండి రక్షించేందుకే. అయినప్పటికీ, మైనపు పూత పూసిన ఆహారాలను సేవించడం సాధారణంగా ఆరోగ్యానికి మంచింది కాదు.

చేదుగా ఉండే కీరదోసకాయ ప్రాణాంతకం కావచ్చు 

కీరదోసలోని ‘కుకుర్బిటాసిన్స్’ అని పిలువబడే పదార్ధం కారణంగా అది చేదురుచిని కల్గి ఉంటుంది. ఈ పదార్ధం అత్యంత విషపూరితమైనది మరియు చేదురుచితో కూడిన పదార్థాల సేవనం మనకు ప్రాణాంతకం కాగలదు.

కీరదోసకాయ అధిక మూత్రవిసర్జనకు దారి తీయవచ్చు
అధికభాగం నీటితో కూడిన కీరదోసకాయ సేవనంవల్ల మన శరీరంలో ఉండే వ్యర్థాలు మూత్రం ద్వారా విసర్జింపబడతాయి. అయినప్పటికీ, అధిక పరిమాణంలో కీరదోసకాయను సేవించడం అతిమూత్రవ్యాధికి దారి తీస్తుంది, ఇది  ఆరోగ్యానికి మంచిది కాదు. మరీ ముఖ్యంగా, గర్భిణీ స్త్రీలలో, కీరదోసను ఎక్కువగా తినడం నిర్జలీకరణానికి దారి తీస్తుంది.

కీరాదోసకాయ కడుపుబ్బరానికి దారితీస్తుంది 
శీతలీకరణ ప్రభావాలతో కూడిన కూరగాయగా కీరదోసను వర్గీకరించవచ్చు. అయితే, దోసకాయ యొక్క ఈ చలువ కల్గించే తత్త్వం కడుపుబ్బరానికి దారి తీస్తుంది, పరిమితంగా తిన్నా కూడా కీరదోస కడుపుబ్బరానికి బాధ్యత వహిస్తుంది .

కీరదోసకాయ సరణి రుగ్మతను మరింత విషమింప చేస్తుంది 
దోసకాయ రసాన్ని సేవించడంవల్ల ముక్కులో తాపజనక ప్రతిచర్యను మరియు నాశికామార్గాల్లో అడ్డంకిని కలిగిస్తుంది. పడిసెంవంటి ‘సైనసిటిస్’ వ్యాధికి చికిత్స పొందుతున్న రోగులకు ఈ కీరదోస రసాన్నిచ్చినపుడు, అది వారి వ్యాధి పరిస్థితిని మరింతగా విషమింపజేసింది, అంతేగాక వాంతులు, మింగడానికి కష్టమవ్వడం (డిస్పేజియా) , ఆయాసం (డిస్ఆప్నియా), మొదలైనటువంటి లక్షణాలకు దారితీసిందని కనుగొనబడింది  

కీరదోసకాయ కళ్ళకు హానికరమని రుజువు చేయవచ్చు
ఒక అధ్యయనంలో, ఆరుగురు ఆరోగ్యకరమైన వ్యక్తుల కళ్ళను కీరదోసకాయ రసానికి బహిర్గతం చేయబడ్డాయి. ఈ రసం కళ్ళకు తీవ్రమైన మంటను కలుగజేశాయి మరియు కండ్లకలక వాపు, కార్నియల్ ఎడెమాకు దారితీసింది .

ఉపసంహారం
దోసకాయలు లేని వేసవిని మనం ఖచ్చితంగా ఊహించలేము. సలాడ్ గా గాని లేదా సాండ్విచ్ గా వినియోగించినా కీరదోస మనల్ని వేసవికాలం ఎండవేడిలో తాజాగా ఉంచుతుంది. ఇది శరీరానికి శీతలాన్ని మరియు జాలీకరణాన్ని (hydrating) సమకూరుస్తుంది. ముక్కలుగా చేసిన కీరదోసకాయను సాధారణంగా ప్రతి భారతీయ భోజనంలోనూ తింటారు.

ఖనిజాలు, విటమిన్లు, అనామ్లజనకాలు మరియు పీచు పదార్థాలు (ఫైబర్)తో పాటు అధిక నీటిని కల్గిన కీరదోస అసంఖ్యాకమైన ఆరోగ్యకర ప్రయోజనాలతో కూడిన భరోసానిస్తుంది.  దీన్ని ఊరగాయగా పెట్టుకోవచ్చు లేదా వేయించుకొని కూడా తినవచ్చు, అలా చేస్తే దాని రుచి మరింతగా పెరుగుతుంది కూడా. ఇది భారతీయ మరియు దక్షిణ ఆసియా వంటలలో వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. అయితే, కీరదోసకాయ యొక్క అధిక వినియోగం హానికరం కావచ్చు. అనేక రకాల దోసకాయలు ఉన్నాయి, వీటిలో కొన్ని తినడానికి పనికిరానివి కూడా ఉన్నాయి. తనలోని ప్రతి మంచి ఆరోగ్యగుణంతో పాటుగా దోసకాయ కొన్ని ప్రతికూల ప్రభావాలను కూడా కల్గిస్తుంది. అందువల్ల ఎక్కువ ప్రమాణంలో కీరదోసకాయను తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీనికి విరుద్ధంగా, విభిన్న రకాలు కలిసిన తగినంత మొక్కల ఆహారం సేవించి సరైన సమతుల్యాన్ని నిర్వహించడంవల్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని సాధించడానికి సహాయపడుతుంది.


మూత్రవిసర్జనకారిగా దోసకాయ 
కీరదోసకాయ నీరు మరియు పొటాషియం లను సమృద్ధిగా కల్గి ఉంటుంది మరియు తక్కువ సోడియం కలిగి ఉంటుంది. ఈ పదార్థాలు కీరదోసకాయను ఓ మంచి మూత్రవిసర్జనకారిగా చేసింది. కీరదోసకాయ యొక్క సేవనంవల్ల తరచుగా మూత్రవిసర్జన ప్రేరేపించబడి తద్వారా అదనపు శరీర వ్యర్ధాలను తొలగించడంలో సహాయపడుతుంది

0/Post a Comment/Comments

Previous Post Next Post