సైలియం ఊక ప్రయోజనాలు ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు
సైలియం ఊక అన్నది ఒక రకమైన ఫైబర్, ఇది ప్లాంటాగో ఓవాటా మొక్క నుండి తయారుచేయబడుతుంది. పేరు సూచించినట్లుగా, సైలియం ఊక అన్నది మొక్క యొక్క విత్తనం ఊక నుండి వస్తుంది. ప్రపంచంలో సైలియం ఊక యొక్క ఉత్పత్తిలో భారతదేశం అతి పెద్దది. భారతదేశంలో, ఇది ప్రధానంగా గుజరాత్, రాజస్థాన్ మరియు మధ్య ప్రదేశ్లలో సాగుచేయబడుతుంది. సైలియం ఊక యొక్క మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో గుజరాత్ దాదాపుగా 35% వాటా కలిగిఉంది.
పెచ్చు మరియు విత్తనంతో పాటుగా, “సైలియం” అనే పేరు మొత్తం మొక్క కోసం ఉపయోగించబడుతుంది. సైలియం ఊక సాధారణంగా ఇసాబ్గోల్ అని కూడా పిలువబడుతుంది. అనేక సంవత్సరాలుగా సంప్రదాయ ఇరానియన్ ఔషధం సైలియంను ఉపయోగిస్తుంది.
మానవులు మరియు జంతువులు ఇద్దరికీ సైలియం ఊక పలు ఆరోగ్యమైన ప్రయోజనాలు కలిగి ఉంది. అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా, సైలియం ఊక మలబద్ధకం నిరోధించడంలో సహాయపడుతుంది. ఇది గుండెకు ఉపయోగకరంగా ఉంటుందని కూడా తెలుస్తుంది మరియు డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచేందుకు కూడా సహాయపడుతుంది.
సైలియం ఊకను ఎన్నో విధాలుగా వినియోగించవచ్చు. కొంతమంది ప్రజలు స్వచ్ఛమైన సైలియం ఊక యొక్క రుచి అసహ్యకరమైనదిగా ఉన్నదని కనుగొన్నారు, ఇది కుకీలు, బిస్కెట్లు మరియు ఇతర మిఠాయిల్లో కూడా కాల్చబడుతుంది. సైలియం ఊక ఏ విధమైన చక్కెర లేదా రుచిని కలిగిఉండదు. కాబట్టి దీనిని నీరు లేదా జ్యూస్‌తో వినియోగించాలని సాధారణంగా సిఫార్సు చేస్తారు.
సైలియం ఊక గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు
వృక్ష శాస్త్రీయ నామం: ప్లాంటాగో ఓవాటా హస్క్
జాతి: ప్లాంటాగినాసియే
వ్యవహారిక నామం: సైలియం ఊక / ఇసాబ్గోల్
సంస్కృత నామం: సాట్ ఇసాబ్గోల్.
ఉపయోగించే భాగాలు: సైలియం అన్నది ఒక రకమైన ఫైబర్, ఇది సైలియం మొక్క యొక్క విత్తనాల నుండి తయారుచేయబడింది. మొక్క భాగాన్ని ఊకగా ఉపయోగిస్తారు.
జన్మించే ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: ఇది ఆసియా, మధ్యధరా ప్రాంతం, మరియు ఉత్తర ఆఫ్రికా ప్రాంతాలకు చెందినది మరియు వాణిజ్యపరంగా భారతదేశంలో పెరుగుతుంది. భారతదేశంలో, ఈ పంట ప్రధానంగా గుజరాత్, మధ్యప్రదేశ్, మరియు రాజస్థాన్‌లలో సాగుచేయబడుతుంది.
సైలియం ఊక పోషక విలువలుసైలియం ఊక ఆరోగ్య ప్రయోజనాలుసైలియం ఊక దుష్ప్రభావాలుఉపసంహారం
సైలియం ఊక పోషక విలువలు
సైలియం ఊకలో పైబర్ ప్రధానంగా అధికంగా ఉంటుంది. అయితే, శరీరానికి లాభదాయకమైన ఇతర ముఖ్యమైన పోషకాలను కూడా ఇది కలిగి ఉంటుంది. సైలియం ఊక పొటాషియం, కాల్షియం మరియు ఇనుము వంటి ఖనిజాలను అధికంగా కలిగిఉంది.
యుఎస్డిఎ పోషక విలువల డేటాబేస్ ప్రకారం, క్రింద ఇవ్వబడిన పట్టిక 100 గ్రా.లకు సైలియం ఊక యొక్క పోషక విలువలను చూపిస్తుంది.
పోషకాలు విలువ, 100 గ్రా.లకు
శక్తి 375 కి.కేలరీలు
ప్రొటీన్ 5 గ్రా.
కొవ్వు 6.25 గ్రా.
కార్బోహైడ్రేట్ 75 గ్రా.
ఫైబర్ 10 గ్రా.
చక్కెరలు 30 గ్రా.
ఖనిజాలు
ఇనుము 50 మి.గ్రా.
కాల్షియం 1.8 మి.గ్రా.
పొటాషియం 262 మి.గ్రా.
సోడియం 288 మి.గ్రా.
కొవ్వులు/కొవ్వు ఆమ్లాలు
సంతృప్త కొవ్వు ఆమ్లాలు 2.5 గ్రా.
సైలియం ఊక ఆరోగ్య ప్రయోజనాలు
మలబద్దకం కోసం: సైలియం ఊక, ఫైబర్ల యొక్క అధిక వనరుల్లో ఒకటి మరియు అందువల్ల ఇది మలబద్ధకం యొక్క నిర్వహణలో సహాయపడుతుంది. భేదిమందు లక్షణాలను కలిగి ఉండటమే కాకుండా, మలం సులభంగా తొలగించే సదుపాయం కోసం మలములో నీటి గాఢతను అది పెంచుతుంది.
ఇతర జీర్ణ సమస్యల కోసం: ప్రేగు ఫంక్షన్‌ను నియంత్రించడం ద్వారా, అతిసారం, అమోబిక్ విరేచనాలు మరియు అల్సరేటివ్ కొలిటిస్ యొక్క నిర్వహణలో కూడా సైలియం ఊక సహాయపడుతుంది.
ఆకలి నియంత్రణ కోసం: ఫైబర్ సమృద్ధిగా ఉండడం వల్ల, కడుపునిండి ఉండడాన్ని మెరుగుపర్చడం మరియు భోజనం తర్వాత కడుపును ఖాళీ చేయటానికి తీసుకునే సమయాన్ని పెంచడం ద్వారా సైలియం ఊక ఆకలి మరియు క్షుద్భాధను నియంత్రించడానికి సహాయపడుతుంది.
డయాబెటిస్ కోసం: ఫైబర్లను సమృద్ధిగా కలిగి ఉన్న ఆహారం డయాబెటిక్ నియంత్రణకు మంచిది మరియు టైప్ 2 మధుమేహంతో ప్రభావితం చేయబడ్డ వారిని సైలియం ఊకతో సప్లిమెంటేషన్ చేస్తే, అది వారిలో రక్త గ్లూకోజ్ స్థాయిలు తగ్గడానికి సహాయపడుతుంది.
అధిక కొలెస్ట్రాల్ కోసం: సైలియం ఊకను తీసుకోవడం, ఒక మంచి కొలెస్ట్రాల్ రకమైన, అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ స్థాయిలను పెంచుతూనే, మొత్తం కొలెస్ట్రాల్, తక్కువ-సాంద్రత లిపోప్రొటీన్లను తగ్గించడానికి సహాయం చేస్తుంది. శరీరం ద్వారా కొలెస్ట్రాల్ శోషణను కూడా ఇది తగ్గించింది.
రక్తపోటు కోసం: ఒక గొప్ప ఆహార ఫైబర్ యొక్క వనరుగా, సైలియం ఊక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది, 55 మిమి Hg రక్తపోటును తగ్గిస్తుందని క్లినికల్ అధ్యయనాల రిపోర్టింగ్ ద్వారా తెలియజేయబడింది.
మలబద్ధకం కోసం సైలియం ఊకడయాబెటిస్ కోసం సైలియం ఊకఆకలి నియంత్రణ కోసం సైలియం ఊకసైలియం ఊక కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందిఅతిసారం కోసం సైలియం ఊకజిగట విరేచనాల కోసం సైలియం ఊకఅల్సరేటివ్ కొలిటిస్ చికిత్సకు సైలియం ఊకఅధిక రక్తపోటు కోసం సైలియం ఊక
మలబద్ధకం కోసం సైలియం ఊక
మలబద్ధకం అన్నది ప్రేగు కదలికలు సక్రమంగా లేకపోవడం లేదా విరేచనాలు కావడం కష్టతరంగా ఉండేటటువంటి ఒక పరిస్థితి. ఈ పరిస్థితి తరచుగా కడుపు నొప్పి, ఉబ్బరం మరియు ఆకలి కోల్పోవడంతో సంబంధం కలిగి ఉంటుంది. సైలియం ఊకను మలబద్ధకం చికిత్స కోసం ఉపయోగించవచ్చని అనేక అధ్యయనాలు సూచించాయి. సైలియం ఊక యొక్క వినియోగం మలంలో నీటి కంటెంట్‌ను పెంచింది మరియు ప్రేగు కదలికల్ని సులభతరం చేసిందని దీర్ఘకాల మలబద్ధకంతో ఉన్న170 అంశాలపై చేసిన ఒక క్లినికల్ అధ్యయనం వెల్లడించింది. సైలియం ఊక యొక్క లాక్సేటివ్ పొటెన్షియల్‌ను మెరుగుపరిచేందుకు పెక్టిన్ మరియు సెల్యులోజ్ వంటి పీచు పదార్థాలతో సైలియం ఊకను ఉపయోగించవచ్చని ఒక పాత అధ్యయనం చూపించింది. ఈ రెండు ఫైబర్లు సాధారణంగా బెర్రీలు మరియు ఆపిల్ వంటి పండ్లలో కనిపిస్తాయి. పెక్టిన్ లేదా సెల్యులోజ్‌లను సైలియం ఊకతో జోడించడం అన్నది సైలియం ఊక యొక్క చప్పిడి రుచిని వదిలించుకోవడంలో కూడా సహాయపడుతుంది. సైలియం ఊకలో ఉన్న పాలీశాచరైడ్లు మరియు దానియొక్క జెల్-ఫార్మింగ్ సామర్థ్యాలు మలబధ్ధకం నివారించడానికి సహాయపడతాయని మరొక అధ్యయనం సూచించింది.
డయాబెటిస్ కోసం సైలియం ఊక
డయాబెటిస్ అన్నది ఒక ఎండోక్రైన్ రుగ్మత, ఈ రుగ్మతలో మన శరీరంలో గ్లూకోజ్ జీవక్రియలకు ఉపయోగపడదు, రక్తంలో ఈ చక్కెరలు ఒకే చోట చేరడానికి కారణమవుతుంది. డయాబెటిస్ పూర్తిగా నయం చేయడం సాధ్యం కానప్పటికీ, ఆహారంలో సాధారణ మార్పులు చేయడం ద్వారా ఇది నిర్వహించబడుతుంది. ది అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం, ఫైబర్ సమృద్దిగా కలిగిన ఆహారం, డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచడానికి ఉపయోగకరంగా ఉంటుంది.
2 వారాల వ్యవధికి ఇవ్వబడిన సైలియం ఊక యొక్క సప్లిమెంటేషన్ అన్నది రక్త గ్లూకోజ్ స్థాయిల్లో గణనీయమైన తగ్గింపు చూపించిందని, టైప్ 2 డయాబెటిస్ మరియు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు కలిగిన 34 మంది పురుషులపై జరిగిన ఒక క్లినికల్ అధ్యయనం తెలియజేసింది. టైప్ 2 డయాబెటిస్ గల వ్యక్తులలో సైలియం ఊక యొక్క వినియోగం సురక్షితమని ఇది సూచిస్తుంది.
ఆకలి నియంత్రణ కోసం సైలియం ఊక
తరచుగా మనం భోజనానికి, భోజనానికి మధ్య ఆకలి అనుభూతిని పొందుతుంటాము. అటువంటి సమయంలో, మనం ఆరోగ్యకరం కాని అల్పాహారం పైన కోరిక కలిగియుంటాము. కడుపు ఖాళీ మరియు ఆకలి మధ్య సహసంబంధాన్ని విశ్లేషించడానికి జరిగిన ఒక పరిశోధనలో, భోజనం తర్వాత కడుపు ఖాళీ అవడం కోసం తీసుకునే సమయాన్ని సైలియం ఊక గణనీయంగా పెంచడం కనిపించింది. ఫైబర్ సమృద్ధిగా కలిగి ఉండడం వల్ల, సైలియం ఊక కూడా కడుపునిండిన అనుభూతిని పెంచుతుంది, తద్వారా భోజనానికి, భోజనానికి మధ్య ఆకలి బాధను తగ్గిస్తుంది.
సైలియం ఊక కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది
రక్తంలో అధిక కొలెస్ట్రాల్ అనగా గుండె వ్యాధులను పొందడానికి అధిక ప్రమాదము ఉన్నదని అర్థము. అధిక స్థాయిలో కొలెస్ట్రాల్ కలిగిన వ్యక్తులు గుండె పోటు మరియు గుండె స్థంభనకు ఎక్కువ లోనయ్యే అవకాశం ఉంది. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గేందుకు సైలియం ఊక సహాయం చేస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఒక రోజుకు మూడు సార్లుగా ఆరువారాల పాటు సైలియం ఊకను వినియోగిస్తామని అడిగిన 125 మంది డయాబెటిక్ రోగులపైన ఒక అధ్యయనం జరిగింది. మొత్తం కొలెస్ట్రాల్ స్థాయి (టిసి), ట్రైగ్లిసరైడ్ స్థాయి మరియు చెడు కొలెస్ట్రాల్ స్థాయి (ఎల్డిఎల్) లో గణనీయమైన తగ్గుదల ఉన్నదని అధ్యయనం యొక్క ఫలితాలు సూచించాయి. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డిఎల్) యొక్క స్థాయిలో పెరుగుదల కూడా ఇక్కడ ఉంది.
ఫైబర్ సమృద్ధిగా కలిగిన సైలియం ఊక యొక్క వినియోగం చెడు కొలెస్ట్రాల్ యొక్క స్థాయి (ఎల్డిఎల్) లో 8% క్షీణతకు దారితీసిందని 15 - 16 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న 47 మంది ఊబకాయ పురుషుల పైన నిర్వహించిన ఒక అధ్యయనం చూపించింది.
సైలియం ఊక చెడు కొలెస్ట్రాల్ స్థాయి (ఎల్డిఎల్)ని తగ్గించడంలో సహాయం చేస్తుంది మరియు బైల్ ఆసిడ్ సంశ్లేషణను ఉత్తేజపరచడం ద్వారా రక్తంలోనికి కొలెస్ట్రాల్ యొక్క శోషణను తగ్గించడంలో సహాయం చేస్తుందని అధిక స్థాయిలో కొలెస్ట్రాల్ ఉన్న 20 అంశాలపైన జరిగిన మరొక క్లినికల్ అధ్యయనం సూచించింది.
అతిసారం కోసం సైలియం ఊక
అతిసారం అన్నది, అసాధారణంగా తరచూ నీటి విరేచనాల లక్షణాలు కలిగి ఉండే ఒక విధమైన స్థితి. సైలియం ఊక అతిసారం నివారించడానికి సహాయపడుతుందని పరిశోధన వెల్లడిస్తుంది. సైలియం ఊక, భోజనం యొక్క స్థిరత్వం పెంచడం ద్వారా కడుపు ఖాళీ కావడాన్ని ఆలస్యం చేస్తుంది మరియు తీసుకున్న ఆహారం పెద్ద ప్రేగు చేరుకోవడానికి పట్టే సమయాన్ని తగ్గిస్తుందని 8 మంది వ్యక్తుల పైన జరిగిన ఒక క్లినికల్ అధ్యయనం సూచించింది. ప్రకోప ప్రేగు సిండ్రోమ్ మరియు అతిసారంతో బాధపడుతున్న ప్రజలకు ఇది ముఖ్యంగా ప్రయోజనకరమైనది.
అతిసారం అన్నది, క్యాన్సర్ రోగులలో రేడియో ధార్మిక చికిత్స యొక్క అతి సాధారణ దుష్ప్రభావాలలో ఒకటి. క్యాన్సర్ రోగులలో రేడియో ధార్మికత తర్వాత, అతిసారం యొక్క తరచుదనం మరియు తీవ్రతను నిరోధించడానికి సైలియం ఊక సహాయపడుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
జిగట విరేచనాల కోసం సైలియం ఊక
అతిసార వ్యాధి లేదా జిగట విరేచనాలు అన్నది, ప్రేగు పరాన్నజీవి వలన కలుగుతుంది, ఎంటమీబా హిస్టోలిటికా. ఈ పరిస్థితి యొక్క సాధారణ లక్షణాలుగా, కడుపు తిమ్మిరి మరియు అతిసారంను కలిగిఉన్నాయి. సంప్రదాయకంగా, సైలియం ఊకను జిగట విరేచనాల కోసం నివారణగా ఉపయోగిస్తారు. సైలియం ఊకలో ఉండే కొన్ని క్రియాశీలక సమ్మేళనాలు, ఎంటామీబా హిస్టోలిటికా మరియు ఇ. డయాపర్ కు వ్యతిరేకంగా నిరోధక ప్రభావాలు కలిగి ఉంటాయని ఒక పరిశోధన సూచించింది. సైలియం యొక్క ముడి పదార్థాలు, ఒక మి.లీ.కు 1 నుండి 10 మి.గ్రా. గాఢత వరకు సమర్థవంతమైన అమీబిసిడల్స్గా ఉంటాయని, అందువల్ల వాటిని జిగట విరేచనాల చికిత్సలో ఉపయోగించవచ్చని పరిశోధన తర్వాత వెల్లడించింది.
అల్సరేటివ్ కొలిటిస్ చికిత్సకు సైలియం ఊక
అల్సరేటివ్ కొలిటిస్ అన్నది కొలొన్ లేదా పెద్ద ప్రేగును ప్రభావితం చేసే ఒక స్థితి మరియు ఇది సాధారణంగా మంట మరియు చికాకు ద్వారా వర్గీకరించబడుతుంది. ఒకవేళ దీనిని చికిత్స చేయకుండా వదిలేస్తే, ఇది ప్రేగు క్యాన్సర్‌కు దారితీయవచ్చు. మెసలమెయిన్ అన్నది అల్సరేటివ్ కొలిటిస్ చికిత్సకు ఉపయోగించే మందులలో ఒకటి.
వ్రణోత్పత్తి పెద్ద ప్రేగుతో ఉన్న150 మంది రోగులకు చేసిన ఒక క్లినికల్ ట్రయల్‌లో, వ్రణోత్పత్తి పెద్ద ప్రేగు చికిత్సలో సైలియం ఊకను నోటి ద్వారా ఇవ్వడం అన్నది, మెసలమెయిన్ కంటే సైలియం ఊక చాలా ప్రభావవంతమైనదని కనుగొనబడింది.
అధిక రక్తపోటు కోసం సైలియం ఊక
రక్తపోటు అన్నది శరీరం గుండా రక్తాన్ని పంపించడానికి గుండె ఉపయోగించే ఒక బలం. అధిక రక్తపోటు సాధారణంగా ఏ విధమైన తక్షణ లక్షణాలు కలిగిఉండదు. అయితే, ఒకవేళ ఈ పరిస్థితికి చికిత్స చేయకపోతే, అది గుండె వ్యాధులు మరియు గుండె స్తంభనకు దారితీస్తుంది. ప్రొటీన్ మరియు ఫైబర్ తక్కువగా ఉండే ఆహారం అధిక రక్తపోటుతో సంబంధం కలిగి ఉంటుందని పరిశోధన సూచిస్తుంది. సైలియం ఊక అన్నది ఆహార ఫైబర్ యొక్క ఒక గొప్ప వనరు.
సైలియం ఊక యొక్క వినియోగం అధిక రక్తపోటు ను నియంత్రిస్తుందా అన్నది తెలుసుకోవడానికి 36 మంది హైపర్టెన్సివ్ (అధిక రక్తపోటు) రోగుల పైన క్లినికల్ అధ్యయనం చేయడం జరిగింది. 5.9 మిమి Hg రక్తపీడనం తగ్గిందని అధ్యయన ఫలితాలు వెల్లడించాయి (5.9 మిల్లిమీటర్ల పాదరసం). సైలియం ఊక యొక్క హైపోటెన్సివ్ (రక్తపోటు తగ్గించడం) ప్రభావాలు లింగం, వయస్సు లేదా బరువు ద్వారా ప్రభావితం చెందవని ఈ అధ్యయన ఫలితాలు తర్వాత తెలియజేసాయి.
సైలియం ఊక దుష్ప్రభావాలు
మొత్తం మీద, సైలియం ఊక చాలా తక్కువ దుష్ప్రభావాలతో సంబంధం కలిగిఉంటుంది.
సైలియం ఊక అలెర్జీ మరియు శ్వాస రుగ్మతలకు కారణమవుతుంది
అసాధారణం అయినప్పటికీ, కొన్ని అలెర్జీ ప్రతిచర్యలు అనగా దద్దుర్లు, దురద మరియు శ్వాస తీసుకోవడంలో కష్టంవంటివి సైలియం ఊక వినియోగం మరియు పీల్చడం పైన సంభవించవచ్చు. సైలియం ధూళి పొరలు కొంతమందిలో శ్వాసనాళ బాధను కలిగించవచ్చని అధ్యయనాలు చూపించాయి.
సైలియం ఊక ఉబ్బరానికి కారణమవుతుంది
సైలియం ఊక ఫైబర్‌ను సమృద్ధిగా కలిగిఉంటుంది, అందువల్ల ఇది మలబద్ధకం మరియు ఇతర జీర్ణశయాంతర రుర్మతల కోసం సూచించబడింది. అయితే, జీర్ణశయాంతర ప్రేగు మార్గం నుండి పురీషనాళం వరకు గ్యాస్ ప్రయాణాన్ని ఫైబర్ యొక్క అధిక వినియోగం ప్రభావితం చేయవచ్చు, గ్యాస్ నిలుపుదల మరియు ఉబ్బరానికి ఇది దారితీస్తుంది.
సైలియం ఊక ఊపిరి ఆడకపోవడానికి కారణం కావచ్చు
ఒక గ్లాసు పూర్తిగా నింపబడిన నీటితో సైలియం తీసుకోవాలని అధికంగా సిఫార్సు చేయబడింది మరియు మలబద్ధకం నివారించడానికి పూర్తిగా నీటితో నింపబడిన 6 నుండి 8 గ్లాసుల నీటిని రోజంతా త్రాగాలి. సైలియం పొడి లేదా ఊకను నీరు తీసుకోకుండా మ్రింగడం ఫలితంగా ఊపిరాడకపోవడానికి కారణం కావచ్చు. దీనిని నివారించడానికి ఈ రోజుల్లో, సైలియం ఊకలు కుకీలు, క్రాకర్లలో మరియు అదే సారూప్యం కలిగిన ఉత్పత్తులలో చేర్చబడుతున్నాయి.
ఉపసంహారం
సైలియం ఊక అన్నది ఒక రకమైన ఫైబర్, ఇది ప్లాంటాగో ఓవాటా మొక్క విత్తనాల నుండి పొందబడుతుంది. దాని అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా, మలబద్ధకం నిరోధించడానికి సాధారణంగా ఉపయోగిస్తారు. అయితే, ఇది కాల్షియం, ఇనుము మరియు పొటాషియం వంటి ఇతర ఖనిజాలను కూడా సమృద్ధిగా కలిగిఉంటుంది. సైలియం ఊక యొక్క కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు - ఇది అతిసారం నిరోధిస్తుంది, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిస్తుంది మరియు అలాగే డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతుంది. ఊపిరి ఆడకపోవడాన్ని నివారించడానికి, నీటిని సమృద్ధిగా తీసుకొని సైలియం ఊకను తినాలని సూచించబడింది. సైలియం ఊక ఏ విధమైన ఫ్లేవర్ లేదా రుచిని కలిగిఉండదు కాబట్టి, ఈ ఆహార ఫైబర్ కలిగిన బిస్కెట్లు లేదా కుకీలను ప్రజలు సాధారణంగా వినియోగిస్తారు.
Post a Comment