రావి చెట్టు ఉపయోగాలు ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు

రావి చెట్టు ఉపయోగాలు ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు రావి చెట్టును భారతదేశంలో పవిత్రమైందిగా కూడా  భావిస్తారు. దీన్నే వృక్షశాస్త్రంలో ‘ఫెకస్ రిలిజియోసా’ అని అంటారు. ఇది భారతదేశ సంస్కృతిలో లోతుగా వేళ్లను పాతుకుని ఉంది, ఎందుకంటే ఈ చెట్టు కిందనే బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్లు నమ్మడం జరుగుతోంది. కాబట్టి, దీనిని తరచుగా 'బోధి చెట్టు' గా సూచిస్తారు. సంప్రదాయ భారతీయ సాహిత్యం రావి వృక్షాన్ని 'అశ్వత్త' వృక్షంగా  కూడా వర్ణిస్తుంది, అంటే దీనర్థం, రావి చెట్టు 'జీవితం యొక్క చెట్టు' కు చిహ్నం అని.

ఫికస్ రిలిజియోసాను సాధారణంగా పవిత్రమైన అశ్వత్థము (the sacred fig) అని  కూడా పిలుస్తారు. ఇది ఆసియా, ముఖ్యంగా భారతదేశం మరియు చైనా, యొక్క ఉష్ణమండల భాగాలకు చెందినది. ఇది విస్తృతమైన కాండంతో (ట్రీ -ట్రంక్) పెద్దది గా ఉండే చెట్టుగా   కూడా ఉంటుంది.  దీని యొక్క వ్యాసం 3 మీటర్లు వరకు ఉంటుంది. చెట్టు యొక్క ఆకులు హృదయం ఆకారంలో ఉంటాయి మరియు విలక్షణమైన ఆకుచివరను (tip) ను కల్గి ఉంటుంది. చెట్టు యొక్క పండ్లు సాధారణంగా చిన్న చిన్న అత్తి పండ్లను లేదా చిన్న మేడిపండ్లను పోలి లేతగా ఉన్నపుడు ఆకుపచ్చగా  మరియు మాగి పండైనపుడు ఊదా రంగులోకి  కూడా మారుతాయి.

రావిచెట్టు యొక్క జీవిత కాలం సాధారణంగా 900 నుండి 1500 సంవత్సరాల వరకు ఉంటుంది. శ్రీలంకలోని “జయ శ్రీ మహా బోధి” రావిచెట్టు, మత ప్రాముఖ్యత కలిగిన అతిపురాతనమైన చారిత్రక చెట్టు' అని కూడా  చెప్పబడింది. వాస్తవానికి దీని వయస్సు 2250 సంవత్సరాల కంటే ఎక్కువ అని, ఇది ప్రపంచంలోనే పురాతనమైన చెట్టు అని కూడా చెప్పబడుతోంది.

రావి చెట్టు ఉపయోగాలు ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు

రావి చెట్టు గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు


వృక్షశాస్త్రం (బొటానికల్) పేరు: ఫికస్ రిలిజియోసా (Ficus religiosa)
కుటుంబం: మోరసీయే (Moraceae)
సాధారణ పేరు: పవిత్రమైన అత్తి, బోధి చెట్టు, రావిచెట్టు, పీపల్ చెట్టు
సంస్కృత పేరు: అశ్వత్త , పిప్పల
రావి చెట్టు యొక్క ఉపయోగించే భాగాలు: ఆకులు, శాఖలు, పువ్వులు, పండ్లు, బెరడు
స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: ఉష్ణమండల ఆసియాకు చెందినది ప్రత్యేకించి, భారతదేశం మరియు చైనాల్లో ఎక్కువగా కనబడుతుంది.

 • రావి చెట్టు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు 
 • రావి చెట్టు దుష్ప్రభావాలు 


రావి చెట్టు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు 

రావిచెట్టును పురాతన కాలం నుండి ప్రబలంగా సేవిస్తుండడంవల్ల దీని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు అనేకం మరియు అవన్నీ సుస్పష్టంగా తెలుస్తున్నాయి. ఆ ప్రయోజనాల్లో అతి ముఖ్యమైనవి.

తెగిన గాయాలకు: వివిధ పరిశోధనల ప్రకారం రావిచెట్టు ఆకుల సారాలు తెగిన గాయాలను త్వరగా నయం చెయ్యడంలో  కూడా సహాయపడతాయని తెలుస్తుంది. ఈ చెట్టు ఆకుల రసంలో గాయాలనను నయం చేసే లక్షణాలు  చాలా ఉంటాయి.

చెక్కెర వ్యాధికి రావిచెట్టు: రావి చెట్టు బెరడు మరియు వేరులలో ఉండే β- సిటోస్టెరోల్-డి-గ్లైకోసైడ్ అనే సమ్మేళనం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో  కూడా సహాయపడుతుందని పరిశోధనలలో తేలింది.

రావిచెట్టు యాంటీబాక్టీరియల్ గుణాలు: రావి చెట్టు వివిధ భాగాలలో ఉండే ఇథనాలిక్ సారాలు స్టాపైలాకోకస్ , సాల్మోనెల్లా పరాటిఫి, సాల్మోనెల్లా ఔరియుస్ , సాల్మోనెల్లా టైఫి వంటి అనేక బాక్టీరియాలకు వ్యతిరేకంగా కూడా  పనిచేస్తాయి.

యాంటీఆక్సిడెంట్ లక్షణాలు: రావి చెట్టు బెరడు మరియు పండ్లలో అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు  కూడా ఉంటాయి.  అవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను న్యూట్రలైజ్ చెయ్యడంలో కూడా సహాయపడతాయి.

రోగనిరోధక శక్తికి: పరిశోధనల ప్రకారం రావిచెట్టు బెరడు సారాలు యాంటీబాడీ ప్రతిచర్యలు/ప్రతి స్పందనలు వేగంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయని  కూడా తేలింది. ఇది రోగనిరోధక వ్యవస్థ సామర్ధ్యాన్ని బాగా  మెరుగుపరుస్తుంది.

అల్జీమర్స్ కోసం: రావి చెట్టు బెరడు యొక్క మేథనోలిక్ సారాలలో  శక్తివంతమైన ఎసిటైల్కోలినెస్టెరేస్ (acetylcholinesterase) అనే ఎంజైమ్ ఉన్నట్లు గుర్తించబడింది. ఇది అసిటైల్ కోలిన్ యొక్క బ్రేక్ డౌన్ (పతనానికి) కి అవసరం అవుతుంది. రావి చెట్టు సారాలకు ఉన్న ఈ లక్షణం అల్జీమర్స్ వంటి వ్యాధుల చికిత్సలో  బాగా ఉపయోగపడుతుంది.

క్యాన్సర్కు: రావి చెట్టు యొక్క అన్ని భాగాలకు క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు ఉన్నట్లు గుర్తించబడింది. ఒక పరిశోధన ప్రకారం రావి చెట్టులో ఉండే సమ్మేళనాలు క్యాన్సర్ కణాలను చంపుతాయని కూడా  తెలిసింది. అంతేకాక అవి ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని తగ్గించి క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా నివారిస్తాయి.

 • తెగిన గాయాలకు రావి చెట్టు 
 • చక్కెరవ్యాధికి రావి చెట్టు 
 • పుండ్లకు రావి చెట్టు 
 • వాపు మరియు నొప్పి నివారణకు పవిత్రమైన రావిచెట్టు 
 • యాంటీబాక్టరియల్గా రావి చెట్టు 
 • పరాన్నభక్కుక్రిమినాశినిగా రావి చెట్టు 
 • మంచి రోగనిరోధకతకు రావి వృక్షం 
 • కొలెస్ట్రాల్ తగ్గించేందుకు రావి చెట్టు
 • మూర్ఛకు రావి చెట్టు
 • మతిమరుపు వ్యాధి అల్జీమర్స్ కు రావి చెట్టు
 • పార్కిన్సన్స్ వ్యాధికి రావి చెట్టు 
 • క్యాన్సర్ కు బోధి వృక్షం 


తెగిన గాయాలకు రావి చెట్టు 

తెగిన గాయాలు (cuts) లేదా కాలిన గాయాలు కారణంగా అయిన గాయాలను నయం చేయడానికి రావి చెట్టు యొక్క ఆకుల సారం బాగా ఉపయోగపడుతుంది.  దీని ఆకులసారంలో అలాంటి గాయాన్ని మాన్పగల గుణాల్ని కలిగి వుంది .  ఒక అధ్యయనం ప్రకారం, ఈ గాయాలకు రావిఆకుల సారాన్నిపూసినపుడు తెగి గాయపడిన భాగాన్నిగణనీయంగా సంకోచింపచేసి త్వరగా మానేట్లుచేసింది.  అంటే మామూలుగా మానే సమయాన్ని కూడా  తగ్గించింది. రావి ఆకు రసంలోని గాయాన్ని మానిపే ఔషధ గుణం యొక్క ప్రభావం రావి ఆకు యొక్క మోతాదు పై ఆధారపడి పనిచేస్తుంది.  గాయానికి ఎంత తొందరగా రావి ఆకు రసాన్ని పూస్తే అంత త్వరగా గాయం కూడా  మానుతుంది.


చక్కెరవ్యాధికి రావి చెట్టు 

రావి చెట్టు (ఫికస్ రిలిజియోసా) వేరు యొక్క బెరడు సారం రక్త చక్కర స్థాయిల్ని (బ్లడ్ షుగర్ని) తగ్గిస్తుందని  కూడా గుర్తించారు. ఈ అధ్యయనాల్లో తేలిందేమంటే రావిచెట్టు వేరు బెరడు సారాన్ని తగిన మోతాదుల్లో చక్కెరవ్యాధి రోగులకు సేవింపజేసినపుడు అది గణనీయమైన (యాంటీ-డయాబెటిక్) చక్కెరవ్యాధిని మానుపే గుణాన్ని కలిగి ఉందని.  అంటే రక్తంలో చక్కెరను తగ్గించే గుణం ఉందని, తెలిసింది. రావిచెట్టు యొక్క వేరు సారం యొక్క హైపోగ్లైసిమిక్ లేదా బ్లడ్లో చక్కెరను తగ్గించే చర్య “సమ్మేళనం β- సిటోస్టెరోల్-డి-గ్లైకోసైడ్” ఉనికి కారణంగానే జరుగుతుందని  కూడా తెలుస్తోంది. .

పుండ్లకు రావి చెట్టు

రావి చెట్టు ఆకులు నుండి తయారు చేసిన సారానికి పుండును మానిపే గుణం కూడా ఉంది.  ఇటీవల జరిపిన అధ్యయనం ప్రకారం, ఒత్తిడి పరిస్థితి వల్ల ఏర్పడే పుండ్లని అవి ఏర్పడకుండా నిరోధించే ఔషధ గుణం రావిచెట్టు ఆకు రసానికి లేదా సారానికి ఉందని  కూడా తెలిసింది.  

పుండు నివారణ చర్య  (లేదా యొక్క యంత్రాంగాన్ని) ను ఫ్లేవానాయిడ్స్ వంటి జీవక్రియాశీల సమ్మేళనాల కారణంగా  జరుగుతుంది. ఏమైనప్పటికీ, రావి చెట్టు యొక్క ఆకు సారం ద్వారా ప్రదర్శించబడిన పండ్లను మానిపే గుణం యొక్క ఖచ్చితమైన యంత్రాంగం ఏర్పాటు గురించిన వివరాల్ని అధ్యయనాలు ఇంకా  తేల్చాల్సి కూడా  ఉంది.


వాపు మరియు నొప్పి నివారణకు పవిత్రమైన రావిచెట్టు

రావి చెట్టు (ఫికస్ రిలిజియోసా-Ficus religiosa) యొక్క ఆకు మరియు బెరడు సారం వాపు నిరోధకంగా మరియు నొప్పి నివారణి (అనాల్జేసిక్ ) గా పని చేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో పంటి నొప్పి (toothaches) నివారిణిగా రావి చెట్టు బెరడు సారాన్ని ఉపయోగించవచ్చని  కూడా సూచించింది.

రావి చెట్టు యొక్క బెరడును సంప్రదాయకంగా వాపు తగ్గించడానికి భారతీయ జానపద ఔషధం (folk medicine) లో కూడా ఉపయోగించబడుతోంది. రావిచెట్టు ఆకు మరియు బెరడు సారాంశాల్లోని తానినాలు (tannins) మరియు ప్రేరకద్రవ్యాలు (steroids) వంటి జీవక్రియాశీల పదార్థాల ఉనికివల్ల శరీరంలో వాపు మరియు నొప్పి నివారణ అవుతుందని అధ్యయనాలు  కూడా కనుగొన్నాయి. 


యాంటీబాక్టరియల్గా రావి చెట్టు 

రావిచెట్టు చెట్టు యొక్క వివిధ భాగాలోని ఈథనాల్ (ethanolic) సంబంధమైన మరియు  సజల పదార్దాలు (aqueous) స్టాపైలాకోకస్ , సాల్మోనెల్లా పరాటిఫి, సాల్మోనెల్లా ఔరియుస్ , సాల్మోనెల్లా టిఫి, షిగెల్లా డైసేంటి రియే, సూడోమొనాస్ ఎరుగినోస , బాసిల్లస్ సబ్టిల్లీస్ మరియు ఎస్చేరిచియా కోలి  వంటి వివిధ సూక్ష్మజీవుల విరుద్దంగా పనిచేస్తాయని కూడా కనుక్కోబడింది.

పత్రహరితభరితమైన (chlorophyll) రావి చెట్టు యొక్క పండ్ల సారం అజోబాక్టర్ క్రూకోకమ్ , బాసిల్లస్ మెగటేరియం , బాసిల్లస్ సెరెయస్ , స్ట్రెప్టోమైసిన్ లాక్టిస్ , స్ట్రెప్టోకోకస్ ఫెకాలిస్ మరియు క్లబ్సియెల్లా న్యుమోనియాలకు వ్యతిరేకంగా గణనీయమైన చర్యలను కూడా  చూపించిందని మరొక అధ్యయనం కనుగొంది . అంతేకాకుండా, రావి చెట్టు యొక్క సారాంశాలు ఆస్పెర్గిల్లస్ నైగర్ మరియు పెన్సిలియం నోటాటముల విరుద్ధంగా కూడా పని చేశాయని అధ్యయనంలో కూడా  తెలిసింది.


పరాన్నభక్కుక్రిమినాశినిగా రావి చెట్టు 

రావిచెట్టు బెరడు సారం హేమాంచస్ కాంటోర్దస్ (Haemonchus contortus) పురుగుల. విరుద్ధంగా కూడా పని చేస్తుందని  కూడా కనుక్కోబడింది. వివిధ రకాలైన పరాన్నజీవి క్రిములు మనుషులకు వివిధ రకాల వ్యాధులకు  కూడా కారణమవుతాయి. పేగులలో ఏలిక పాముల వలన కలిగే జబ్బు “ఆస్కారియాసిస్,” ఈ జబ్బుకు కారణమయ్యే ‘అస్కారిస్’ అనే పరాన్నజీవికి  రావిచెట్టు సారం ప్రాణాంతకంగా కూడా  పని చేస్తుంది. రావిచెట్టులోని లేటెక్స్ రబ్బరులోని ఫిసిన్ (ficin) అనే పదార్ధం పరాన్నజీవి క్రిముల విరుధ్ధంగా యాంట్ హెల్మింటిక్ (anthelmintic) చర్య  కూడా తీసుకుంటుంది.


మంచి రోగనిరోధకతకు రావి వృక్షం

రావిచెట్టునే ‘అశ్వత్థ’ వృక్షమంటారు. రావిచెట్టు బెరడు నుండి తీసిన సారంలో రోగనిరోధకతను పెంచే  తత్వాలున్నాయని కూడా  కనుక్కోబడింది. అధ్యయనాల ప్రకారం, రావిచెట్టు బెరడు పదార్దాల్ని తగిన మోతాదుల్లో సేవిస్తే కణసంబంధమైన మరియు ప్రతిరక్షక స్పందనను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని మన శరీరానికి  కూడా కలిగిస్తాయి. రావిచెట్టు బెరడులోని సారం యొక్క రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచే ఖచ్చితమైన యంత్రాంగ సామర్థ్యాన్ని ధృవీకరించే పరిశోధనలు మరింత అవసరం.   


కొలెస్ట్రాల్ తగ్గించేందుకు రావి చెట్టు 

రావి చెట్టు యొక్క వివిధ భాగాల నుంచి తీసిన సారం సేవించడంవల్ల తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ల (చెడు కొవ్వుల్ని) ను తగ్గించడానికి  కూడా వీలవుతుందని అధ్యయనాల ద్వారా ప్రదర్శించబడింది.  మలవిసర్జనలో మలంద్వారా రక్తంలోని కొవ్వు (కొలెస్ట్రాల్) విసర్జింపబడిపోవడంవల్ల “హైపోకొలెస్టెరోమిక్” అనబడే రక్తంలో కొవ్వు తగ్గిన (కొలెస్ట్రాల్-తగ్గిన రుగ్మత) వ్యాధి సంభవిస్తుంది. అయినప్పటికీ, ఈ పరిశోధనలు రావిచెట్టు యొక్క ‘చెడు కొవ్వును తగ్గించే తత్వా’న్ని స్థాపించడానికి మరిన్ని అధ్యయనాలు  చాల అవసరం.మూర్ఛకు రావి చెట్టు 

కేంద్ర నాడీ వ్యవస్థకు సంబంధించిన అనేక వ్యాధులకు చికిత్స చేసేందుకు రావి చెట్టు (ఫికస్ రెలిజియోసా) నుండి తయారు చేసిన మందును జానపద వైద్యంలో విస్తృతంగా కూడా ఉపయోగించబడింది. మూర్ఛ చికిత్సకు జానపద వైద్యాల్లో రావిచెట్టు ఉపయోగం గురించిన నివేదికలు కూడా ఉన్నాయి. రావి చెట్టు యొక్క సారం మూర్ఛను తగ్గించడంలో ప్రభావాన్ని చూపుతుంది.  ఇది మూర్ఛను తగ్గిస్తుంది, అందుకే మూర్ఛవ్యాధి చికిత్సకు రావిచెట్టు మందు ఉపయోగించబడుతుంది. కండరాలపై సడలించే ప్రభావాన్ని ఉత్పత్తి చేసే ‘సిప్రోహెఫ్తాడైన్’ (cyproheptadine) అని పిలువబడే ఒక జీవ క్రియాత్మక సమ్మేళనం కారణంగా రావి సారంలో మూర్ఛ-వ్యతిరేక ప్రభావం ఉందని అధ్యయనాలు కూడా  కనుగొన్నాయి.


మతిమరుపు వ్యాధి అల్జీమర్స్ కు రావి చెట్టు 

భారతదేశంలో, అనేకమంది సంప్రదాయ ఔషధ అభ్యాసకులు (traditional medical practitioners)రావి చెట్టు (ఫిక్కస్ రిషిలియాయో) యొక్క కాండం బెరడు నుండి తయారు చేసిన నిర్దిష్ట మూలికా మందుల్ని జ్ఞాపకశక్తి నష్టం మరియు వివిధ నర సంబంధమైన  న్యూరోడెజెనరేటివ్ ( పతనమైపోయే నాడీ కణాలు) రుగ్మతల చికిత్సకు సిఫార్సు  కూడా చేస్తారు .

రావి చెట్టు  యొక్క కాండం బెరడు నుండి తీసిన మిథనాలిక్ సారానికి శక్తివంతమైన ఎసిటైల్కోలినెస్టెరాస్ (acetylcholinesterase-అసిటైల్ కోలిన్ యొక్క పతనానికి కారణమయ్యే ఎంజైమ్) నిరోధక తత్వాన్ని కలిగి ఉంటుంది, ఇది అల్జీమర్స్ వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగకరంగా  కూడా ఉంటుంది .

అల్జీమర్స్ వ్యాధికి కారణం అసిటైల్కోలిన్ వేగవంతంగా పతనమవడమే, అంటే జ్ఞాపకశక్తి కోల్పోవడానికి కారణం. 2014 లో నిర్వహించిన ఒక అధ్యయనంలో కనుగొన్న ఫలితాల ప్రకారం, రావిచెట్టు సారంలో ఉన్న అనేక జీవక్రియాశీల పదార్థాలకు నాడీ కణజాల పెరుగుదలను ప్రోత్సహించడంతో పాటు అసిటైల్కోలిన్ ఎస్టేరేజ్ యొక్క చర్యను నిరోధించే సామర్థ్యం ఉందని నిరూపించబడింది. రావిచెట్టు యొక్క కాండం బెరడు నుండి తీసిన సారం మెదడుకు సంబంధించిన రుగ్మతల చికిత్సకు కూడా ఒక సంభావ్య మందు.


పార్కిన్సన్స్ వ్యాధికి రావి చెట్టు 

మన నాడీ వ్యవస్థలో అన్ని నాడి కణాలకు సంకేతాలను అందించే “డోపమైన్” అనబడే న్యూరోట్రాన్స్మిటర్ ను కోల్పోవటంవల్ల ‘పార్కిన్సన్స్’ వ్యాధి కూడా సంభవిస్తుంది. ఈ వ్యాధి వలన చిత్తవైకల్యం, కండరాల కాఠిన్యత ఇతర రుగ్మత లక్షణాలు కల్గుతాయి. న్యూరోట్రాన్స్మిటర్ అయిన డోపామైన్ యొక్క జీవక్రియను దెబ్బ తీసే కారకాల్లో ఆక్సీకరణ ఒత్తిడి ఒకటి.  ఈ ఆక్సీకరణ ఒత్తిడి వల్లనే పార్కిన్సన్స్ వ్యాధి  కూడా సంభవిస్తోంది.

రావిచెట్టు ప్రభావాలపై జరిపిన పరిశోధనలో లభించిన సాక్ష్యం ప్రకారం రావి చెట్టు ఆకు రసం యొక్క యాంటీ-ఆక్సిడైజింగ్ తత్త్వం పార్కిన్సన్స్ వ్యాధికి వ్యతిరేకంగా కూడా పని చేస్తుంది.  పార్కిన్సన్స్ వ్యాధిపై అనామ్లజనకాల యొక్క యాంత్రిక విధానం అంచనా మరియు వ్యాధిపై దాని ప్రభావంపై మరిన్ని అధ్యయనాలు కూడా  జరగాల్సి ఉంది.


క్యాన్సర్ కు బోధి వృక్షం 

రావిచెట్టుని ‘బోధి వృక్షం’ అని కూడా పిలుస్తారు. రావి చెట్టు యొక్క అన్ని భాగాలూ, అంటే, ఆకులు, బెరడు, వేర్లు, మరియు పండ్లు, క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలను కలిగి ఉన్నట్లు గుర్తించబడ్డాయి. 2012 లో జరిపిన ఒక అధ్యయనంలో, రావి చెట్టు నుంచి సేకరించిన పదార్ధాలు కణిత కణాలపై పనిచేసి కణ పెరుగుదలను కూడా   నిరోధిస్తాయి (యాంటిప్రోలిఫెరేటివ్ గా) అని మరియు కణాల్ని చంపేస్తాయనీ (అపోప్టోసిస్ గా పని చేస్తుంది) నిరూపించబడింది.

రావి చెట్టు  సారం యొక్క గడ్డల పెరుగుదలను నిరోదించే (యాంటీ-ప్రోలిఫెరిటేటివ్ గా పని  చేస్తుంది) ప్రభావానికి కారణాలేవంటే దాని యొక్క జీవరసాయానిక యంత్రంగాన్ని మార్చగల సామర్థ్యం, కణవిస్తార (సెల్ ప్రోలిఫెరేషన్) నిరోధక సామర్థ్యం, కణ చక్రం యొక్క నిరోధం మరియు కణాల్ని చంపేసే సామర్థ్యం. .

రావి చెట్టు యొక్క జీవక్రియాశీల (బయో ఏక్టివ్) భాగాలకు, ప్రత్యేకించి ఆకు సారానికి, కణాల లోపలే ప్రతిచర్య కల్గిన (రియాక్టివ్) ఆక్సిజన్ జాతుల ద్వారా, కణ మరణాన్ని (అపోప్టోసిస్ను) ప్రేరేపించగల సామర్థ్యం  కూడా ఉంటుంది. ఈ ప్రతిచర్య ఆక్సిజెన్ జాతులు (స్వేచ్ఛా రాశులకు సంబంధించినవివి) పెరుగుతున్న కణాల వేగవంతమైన మరణానికి మధ్యవర్తిత్వం  కూడా చేస్తాయి.  తద్వారా రావి చెట్టు  సారం యొక్క క్యాన్సర్ వ్యతిరేక తత్వానికి దోహదం  కూడా చేస్తుంది.రావి చెట్టు దుష్ప్రభావాలు 

తగిన మోతాదులో ఉపయోగించినప్పుడు రావి సాధారణంగా సురక్షితంగా  కూడా పరిగణించబడుతుంది. అయినప్పటికీ, కొందరు వ్యక్తులు రావి ని సేవించినప్పుడు  కొన్ని దుష్ప్రభావాలను అనుభవిస్తారు. రావి సేవనం వల్ల కలిగే దుష్ప్రభావాలు క్రింద వివరించబడ్డాయి.

రావి చెట్టు  ఆకు సారాన్ని (రసం), ఒక నెల వరకు ఔషధ మోతాదుల్లో సేవించినపుడు సాధారణంగా సురక్షితం. అయినప్పటికీ, అధిక మోతాదులో వినియోగిస్తే, రావిచెట్టు యొక్క రబ్బరు పాలు (latex) కొందరు వ్యక్తులలో జీర్ణవ్యవస్థలో రక్తస్రావాణ్ని  కూడా కలిగిస్తుంది. రావి చెట్టు సారాన్ని తీసుకోవటానికి ముందు వైద్యుడి సలహాను తీసుకోవడం చాల  మంచిది.
రావిచెట్టు యొక్క సారాన్ని సేవించడంవల్ల కొంతమందిలో సూర్యుని పట్ల (ఎండకు) సున్నితత్వాన్ని కూడా  కలిగిస్తుంది. అందువల్ల చర్మానికి రావిచెట్టు సారాన్ని పూసుకున్న వెంటనే ఎండలో బయటకు రావడం మంచిది కాదు.
రావిచెట్టు పండ్లు చర్మానికి అంటడంవల్ల కొంతమంది వ్యక్తులలో చర్మంపై దద్దుర్లు లేదా అలెర్జీలు కూడా సంభవించేందుకు కారణం కావచ్చును . అదనంగా, సహజమైన రబ్బరు పాలకు సున్నితంగా ఉండే వ్యక్తులు అత్తి చెట్లకు లేదా అత్తి పండ్లకు అలెర్జీ ప్రతిచర్యలు కలిగి ఉండవచ్చును .
గర్భిణీలు మరియు చంటి పిల్లలకు పాలిచ్చే తల్లులు రావిచెట్టు సారాంశాల సేవనంవల్ల కలిగే ప్రభావం గురించి తెలిపే అధ్యయనాలు ఏవీ లేవు. కనుక, అటువంటి మహిళలలు రావిచెట్టు సారాంశాలు కల్గిన మందుల్ని ఉపయోగించేందుకు ముందుగా వైద్యుడిని సంప్రదించడం చాల మంచిది.
రావి చెట్టు చక్కెరవ్యాధి (డయాబెటిక్)కి వ్యతిరేక ప్రభావాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. రావిచెట్టు పదార్ధాల నుండి తయారైన మందుల్ని సేవించేవారు తమ రక్తంలో చక్కెర స్థాయిలను సమయానుసారంగా పర్యవేక్షించవలసి ఉంటుంది. శస్త్రచికిత్సా సమయంలో లేదా తర్వాత ఇటువంటి రావిచెట్టు సారాలతో కూడిన మందుల వాడకం రక్తంలో చక్కెర స్థాయిలను దెబ్బ తీస్తుంది. అందువల్ల, శస్త్రచికిత్సకు ముందు కనీసం రెండు వారాల పాటు రావిచెట్టు సారాంశాల్ని ఉపయోగించకుండా ఉండాలని మీకు సలహా ఇవ్వడమైంది.

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇక్కడ చూడండి

శనగ పప్పు యొక్క ప్రయోజనాలు దుష్ప్రభావాలు
ఆర్గాన్ నూనె యొక్క ప్రయోజనాలు
కుసుమ నూనె వల్ల కలిగే ప్రయోజనాలు
విటమిన్ కె ప్రయోజనాలు వనరులు మరియు దుష్ప్రభావాలు
కాపెరిన్ యొక్క ప్రయోజనాలు
ఆలివ్ ఆకు యొక్క ప్రయోజనాలు 
బచ్చలికూర యొక్క ప్రయోజనాలు
ఉల్లిపాయ రసం వల్ల కలిగే ప్రయోజనాలు
పామాయిల్ యొక్క ప్రయోజనాలు
బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు 
కరివేపాకు మసాలా వల్ల కలిగే ప్రయోజనాలు
మందార టీ వల్ల కలిగే ప్రయోజనాలు 
వెన్న యొక్క ప్రయోజనాలు
అవోకాడో ఆయిల్ యొక్క ప్రయోజనాలు
బఠానీల వల్ల కలిగే ప్రయోజనాలు 
చెరకు వల్ల కలిగే ప్రయోజనాలు
పర్స్లేన్ యొక్క ప్రయోజనాలు 
వేరుశెనగ యొక్క ప్రయోజనాలు
మార్జోరాం యొక్క ప్రయోజనాలు 
వనిల్లా యొక్క ప్రయోజనాలు
రంబుటాన్ ఫ్రూట్ యొక్క ప్రయోజనాలు
కాలీఫ్లవర్ యొక్క ప్రయోజనాలు
గార్డెనియా ప్లాంట్ యొక్క ప్రయోజనాలు
చందనం నూనె యొక్క ప్రయోజనాలు
అల్లం టీ వల్ల కలిగే ప్రయోజనాలు
పెపినో యొక్క ప్రయోజనాలు
కనోలా నూనె యొక్క ప్రయోజనాలు
జింక్ యొక్క ప్రయోజనాలు
వైన్ ఆకుల యొక్క  ప్రయోజనాలు
రోవాన్ పండు యొక్క ప్రయోజనాలు
లావెండర్ టీ యొక్క ప్రయోజనాలు
మొలకలు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు
చిక్కుడుకాయ ఆరోగ్య ప్రయోజనాలు
కర్బూజ వలన కలిగే ప్రయోజనాలు  ఉపయోగాలు
పొన్నగంటి కూర ఉపయోగాలు
వెలగపండు ఉపయోగాలు
బీరకాయల్లోని  ఆరోగ్య ప్రయోజనాలు
డార్క్‌ సర్కిల్స్‌ నివారణకు  చిట్కాలు
నిద్రలేమి అంటే ఏమిటి? సంకేతాలు, లక్షణాలు మరియు చికిత్స
చామంతి టీ వలన  కలిగే ఉపయోగాలు
చామదుంపలు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
విటమిన్ A యొక్క ప్రయోజనాలు దుష్ప్రభావాలు
నాజూకైన నడుమును పొందడమెలా
శిలాజిత్తు ప్రయోజనాలు ఉపయోగాలు దుష్ప్రభావాలు
జిన్సెంగ్ యొక్క ప్రయోజనాలు
గర్భంతో ఉన్నపుడు ఏమి తినాలి, ఏమి తినకూడదు
గోంగూర వలన కలిగే ఉపయోగాలు
డ్రాగన్ ఫ్రూట్  యొక్క ప్రయోజనాలు
దురియన్ పండు యొక్క ప్రయోజనాలు
పండ్లను పోలిన పండ్లు
ఆవాలు వలన కలిగే  ఆరోగ్య ప్రయోజనాలు
సెలెరీ వల్ల కలిగే ప్రయోజనాలు 
పాల‌కూర‌తో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు
వంకాయ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
కొర్రలు యొక్క ఉపయోగాలు 
Home Made హెర్బల్ షాంపూ
పనసపండు ప్రయోజనాలు, పోషణ - దుష్ప్రభావాలు
త్రిఫల యొక్క ప్రయోజనాలు దుష్ప్రభావాలు
నేరేడు పళ్ళు ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
ఏ సిరిధాన్యం ఏయే వ్యాధులను తగ్గిస్తుంది
కాల్షియం అధికంగా ఉండే భారతీయ ఆహారాలు
పుదీనా ఆకుల పేస్ట్‌ తో ఉపయోగాలు
ఉల్లికాడలు వలన కలిగే ఉపయోగాలు
పుదీనా ఆకులతో ముఖ సౌందర్యం
క్యారెట్ వలన ఉపయోగాలు దుష్ప్రభావాలు
శరీర దుర్వాసన పోవాలంటే ఏం చేయాలి?
జాస్మిన్ ఆయిల్ ఉపయోగాలు / ప్రయోజనాలు
ఉదయాన్నే చేయవల్సిన పనులు
బేకింగ్ సోడా వల్ల కలిగే ప్రయోజనాలు దుష్ప్రభావాలు
తులసి ఆరోగ్య రహస్యాలు
చలిని తగ్గించే ఆహారం
ఆల్‌బుకారాపండ్లు వలన కలిగే ఉపయోగాలు
కాకరకాయ వలన కలిగే ఉపయోగాలు
అలోవెరా (కలబంద) యొక్క ఉపయోగాలు -దుష్ప్రభావాలు
అసాధారణ ప్రయోజనాలనందించే తాటి బెల్లం
అవిసె గింజలు ప్రయోజనాలు, ఉపయోగాలు, -దుష్ప్రభావాలు
గోధుమ వలన ఉపయోగాలు దుష్ప్రభావాలు
పెసలు వలన కలిగే ప్రయోజనాలు
పుచ్చకాయ వలన కలిగే ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
అలసటను దూరము చేసే ఆహారము
మార్నింగ్ వాక్‌తో ప్రయోజనాలు
బియ్యం కడిగిన నీటితో ఉపయోగాలు
జలుబు,దగ్గును దూరం చేసే చిట్కాలు
ఆరోగ్యపరంగా తమలపాకు ఉపయోగాలు
కరివేపాకు కషాయం ఉపయోగాలు
మెంతి ఆకు కషాయం ఉపయోగాలు
జామ ఆకు కషాయం ఉపయోగాలు
సదాపాకు కషాయం ఉపయోగాలు
తమలపాకు కషాయం ఉపయోగాలు
రావి చెట్టు ఉపయోగాలు ప్రయోజనాలు - దుష్ప్రభావాలు

0/Post a Comment/Comments

Previous Post Next Post