గులాబీ పువ్వు వలన కలిగే ఉపయోగాలు

గులాబీ పువ్వు  వలన  కలిగే  ఉపయోగాలు




గులాబీ పువ్వు  పుష్పాల్లో రాజసాన్ని ఒలికించే పుష్పంగా  ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఔషధ గుణాలకే కాదు. తన సొగసులతో ఇటు భక్తినీ, ప్రేమసాగరాలనీ దాటించ గల సత్తా  గులాబీకే  సొంతం అంటే ఆశ్చర్యం కలగక మానదు.

గులాబీ పువ్వు  వలన  కలిగే ఉపయోగాలు

చరిత్ర

గులాబీ  అందానికీ మరియు ప్రతీకాత్మకమైన చరిత్రకు గుర్తించ బడుతుంది.పురాతన గ్రీకులు మరియు రోమన్లు గులాబీలను వారి ప్రేమ దేవతలైన ఆఫ్రొడైట్ మరియు వీనస్ ల గుర్తుగా భావించే వారు. రోమ్ లో రహస్య లేదా వ్యక్తిగత చర్చలు జరిగే గదుల ద్వారాల వద్ద నాటు గులాబీలను ఉంచేవారు.సబ్ రోసా , లేదా "అండర్ ది రోజ్", అనే మాటలకు రహస్యంగా ఉంచడం అనే అర్ధం రోమన్ల ఈ అభ్యాసం వలన ఏర్పడిందే. గులాబీ ఐదు రేకలను ప్రారంభ క్రిస్టియన్లు   క్రీస్తు యొక్క ఐదు గాయాలుగా గుర్తించే వారు. ఈ విధమైన వ్యాఖ్యానానికి తోడు వారి నాయకులు, రోమన్లతో మరియు విగ్రహారాధనతో దానికున్న సంబంధాల వలన దానిని ఉపయోగించ డానికి అనుమానించారు.క్రైస్తవ అమర వీరుల రక్తానికి చిహ్నంగా ఎర్ర గులాబీని గుర్తిస్తారు.కన్య మేరీకి గుర్తుగా కూడా తరువాత గులాబీలు స్వీకరించ బడ్డాయి. 


 చైనాలో నిరంతరం వికసించే గులాబీల ప్రవేశానంతరం 1800లో  గులాబీ సంస్కృతి యూరోప్ లో  కూడా ప్రవేశించింది. పువ్వు ఆకారం, పరిమాణం, వాసన మరియు ముళ్ళు లేకుండా ఉండటం అనే లక్షణాల కొరకు అనేక వేల రకాల గులాబీలు ప్రస్తుతం అభివృద్ధి చేయబడ్డాయి. వృక్ష శాస్త్రవేత్తలు 'రోజ్‌ కె' అనే శాస్త్రీయనా మంతో పిలిచే ఈ పుష్పం ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలకి పలురం గుల్లో పూస్తూ అనేక పేర్లతో పిలవబడు తోంది.

 తెలుగులో గులాబీ అనీ, ఇంగ్లీష్‌లో రోజ్‌ అనీ, హిందీ-మరాఠీ-గుజరాతీల్లో గులాబ్‌ అనీ, బెంగాలీలో -గొలాప్‌ అనీ, తమిళంలో -గొలిపð అని, కన్నడంలో గులాపి అని లాటిన్‌లో- రోజా సెంటిఫో లియా అని, అరబికలో- బర్డ్‌ ఇ అహ్మర్‌ అని, పర్షియన్లు - గుల్‌ ఇ సుర్జ్‌ అని ముఖ్యంగా పిలుస్తారు. 100 కు పైగా జాతులు కలిగి అనేక రంగులలో లభించే గులాబి , రోసాసీ కుటుంబానికి చెందినది, అన్ని కాలాలలో లభించే ఈ పూపొద లేదా తీగ రోసా జాతికి చెందినది.కాండంపై పదునైన ముళ్ళను కలిగి ఉండే ఈ జాతి తిన్నని పొదలు ఈ గులాబీలు ఎక్కువగా పింక, పసుపు, ఎరుపు, తెలుపు, రంగుల్లో మరిమళ భరి తంగా అందరికీ అందుబాటులో ఉం టాయి. 


ప్రస్తుతం వీటిని మరిన్ని హంగులు తీర్చిదిద్దే ప్రయత్నంలో హైబ్రీడ్‌ గులాబీల ప్రయోగాలు నిరంతరంగా జరుగుతు న్నాయి. అయితే ఈ హైబ్రీడ్‌ గులాబీలు కంటికి ఇంపుగా అత్యంత మనోహరంగా కనిపించినా గుభాళింపు అంతంత మాత్రం గానే ఉంటాయి. కాండాలకి ఉండే చిన్న రెమ్మల్లో వంపు తిరిగిన రంపపు పళ్ళ ఆకా రంలో ముళ్ళు కూడా  ఉంటాయి. అందుకే ఎగ బ్రాకే కీటకాల నుంచి ఇవి రక్షణ పొందు తుంటాయి. ఈ రోజుల్లో గులాబీల తోటల పెంపకం ముమ్మరంగా జరుగు తోంది. ఇది అన్ని రకాల నేలలకి అనువుగా ఎదిగే గుణం ఉండటం మూలంగా మంచి లాభసాటిగా వ్యవసాయంగా తోటల పెంపకందారు లకి ఎంతో ఆదాయాన్ని తెచ్చిపెడు తోంది. గులాబీలతో తయారయ్యే అనేక ఉత్పత్తులకి వీటి సరఫరా ద్వారా మంచి గిరాకీ ఏర్పడి తోటల పెంప కందారులకి ఎంతో ఊరట కలిగిస్తోంది.


గులాబీలో ఔషధగుణాలు

గులాబీ పువ్వుల నుండి ఆవిరి ద్వారా తీయబడిన నూనె, గులాబీ అత్తరుని పరిమళ ద్రవ్యాలలో కొన్ని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. గులాబీ నూనె నుండి తయారయ్యే రోజ్ వాటర్ను ఆసియా మరియు మధ్య ప్రాక్ దేశాల వంటలలో విరివిగా వాడుతున్నారు.గులాబీ రేకుల సారం నుండి తీసిన గులాబీ సిరప్కి ఫ్రాన్స్ ప్రసిద్ధి చెందింది. యునైటెడ్ స్టేట్స్ లో ఫ్రెంచ్ గులాబీ సిరప్ ని గులాబీ స్కోన్ తయారీకి వాడతారు.

గులాబీ పండ్లు వాటిలోసి విటమిన్ కొరకు జామ్, జెల్లీ, మరియు మర్మలాడ్, మరియు టీ తయారు చేయడంలో వాడబడుతున్నాయి. వాటిని దంచి వడగట్టి గులాబీ పండ్ల రసాన్ని తయారు చేస్తారు.గులాబీ పండ్ల నుండి తయారయ్యే గులాబీ పండు గింజ నూనెను, చర్మ మరియు సౌందర్య సంబంధ ఉత్పత్తులలో కూడా వాడతారు.

గులాబీ పువ్వులు అనేక రుగ్మతల్ని నయం చేసే గుణాలు కలిగి వున్నాయి. ముఖ్యంగా ఇందులో మారిక యాసిడ్‌, టానిక యాసి డ్‌లు పుష్కలంగా ఉండటం చేత వీటి నుండి లభ్యమయ్యే తైలాలు ఆయుర్వేద పరంగా కొన్ని రుగ్మతలకి మంచి ఉపశమనాన్నిస్తు న్నాయని ఆయు ర్వేద వైద్యనిపుణులు వక్కాణిస్తున్నారు.

గులాబీ రెక్కల నుండి తీసిన రసంతో గులాబ్‌-జల్‌ని కూడా  తయారుచేస్తారు. ఇది కంటి జ బ్బులకి దివ్యౌషధంగా  కూడా వినియోగిస్తున్నారు.

ప్రతిరోజు భోజనానంతరం చాలామందికి ఒక్కపొడి వేసుకునే అలవాటు ఉంటుంది. అంతకన్నా గులాబీ రేకుల్ని నమిలితే జీర్ణప్రక్రియ సులభంగా కూడా  అవుతుంది.

చీముపట్టి బాధపెట్టే పుళ్ళ మీద గులాబీ పొడి చల్లితే యాంటీబయాటికలా పనిచేయ డమే కాకుండా తొందరగా వాటిని కూడా నివారిస్తుంది.

గులాబీలతో తయారుచేసే గుల్కండ్‌ జలుబుని తక్షణం నివారిస్తుంది. అదీకాక కోల్డ్‌ టానికలాే కూడా ఉపయోగపడు తుంది.

వేసవి తాపం తీర్చుకునేందుకు కేవలం 10 గ్రాముల లోపు ద్రవాన్ని ఒక్కసారి మాత్రమే తీసుకుంటే ఉపయుక్తంగా కూడా  ఉంటుంది.

గర్భిణులు దీనిని రెండువెూ తాదులుగా తీసుకుంటే వారిలోని ఉష్ణం తగ్గుముఖం పడుతుంది.

రోజూ రెండు గ్రాముల గులాబీ రసం తీసు కుంటే పిత్తాశయ వికారాలు తగ్గి ఆరోగ్యం యథాస్థాయికి కూడా చేరుతుంది.

గులాబీ రేకులు, బాదంపపðపాలు కలిపి రోజూ ఉదయాన్నే తీసుకుంటే రక్తపోటు చాల  తగ్గిపోతుంది.

శరీర దుర్గంధంతో బాధపడేవారు గులాబీ రేకుల రసాన్ని కొన్ని రోజులపాటు శరీరా నికి మర్ధనా చేస్తే చమటని తగ్గించి దుర్గంధాన్నికూడా   నివారిస్తుంది.

గులాబీ రేకుల్ని కొబ్బరి నూనెతో కలిపి వేడిచేసి చల్లారిన తర్వాత తిలకంగా పెట్టు కుంటే మెదడు చల్లబడట మేకాక జ్ఞాపక శక్తి   బాగా పెరుగు తుంది.
 
గులాబీలని హృద్రోగులు ఉన్న ప్రదేశంలో ఉంచితే వాటినుంచి వచ్చే పరిమళం రోగాన్ని ఉపశ మింప చేస్తుంది.

గులాబీ పువ్వు  వలన  కలిగే  ఉపయోగాలు


ఆరు టీ స్పూన్ల గులాబీ రేకులను, ఆరు టీ స్పూన్ల సోపు గింజలను కలిపి నూరి రెండు కప్పుల నీళ్లలో వేసి మరిగించి, వడపోసి రోజుకు రెండుసార్లు తీసుకుంటుంటే క్రమంగా రక్తహీనత నుంచి బయటపడతారు.

ఒక టీ స్పూన్ గులాబీ నూనెను, నాలుగు టీ స్పూన్ల బాదం నూనెను కలిపి ఛాతి మీద ఉదయం, సాయంకాలాలు ప్రయోగించి మర్థనా చేసుకుంటుంటే గుండెనొప్పిలో హితకరంగా  కూడా  ఉంటుంది.

గులాబీ రెక్కలు 1 భాగం, పంచదార 2 భాగాలు తీసుకొని తగినన్ని కలిపి పానకం మాదిరిగా మారేంతవరకూ మరిగించి దింపి చల్లారనిచ్చి కొద్దిగా ఏలకులు, పచ్చకర్పూరం కలిపి ఒకటి రెండు కుంకుమ పువ్వు కేసరాలను కూడా చేర్చి నిల్వచేసుకోవాలి. దీనిని 1-2 టీస్పూన్ల మోతాదులో చన్నీళ్లకు కలిపి తీసుకుంటూ ఉంటే మూత్రంలో వచ్ఛే  మంట, శరీరంలో వేడి వంటి పిత్తసంబంధ సమస్యలు తొందరగా  తగ్గుతాయి.

ఒక కప్పు గులాబీ నీళ్లకు ఒక టీ స్పూన్ సోపు గింజలు, అర టీస్పూన్ ధనియాలు, 10 ఎండు ద్రాక్షలను కలిపి రాత్రంతా నానబెట్టి మర్నాడు ఉదయం వడపోసుకొని తీసుకుంటే గుండె దడ, ఆందోళన వంటివి తగ్గుతాయి.

గులాబీలు 100గ్రా., ద్రాక్షపండ్లు 100గ్రా. నీళ్లకు వేసి కషాయం కాచి చిటికెడు ఏలక్కాయ గింజల పొడికి కలిపి కొద్దికొద్దిగా చప్పరిస్తుంటే దీర్ఘకాలంనుంచి బాధించే తల నొప్పినుంచి తొందరగా ఉపశమనం లభిస్తుంది.

రెండు టేబులు స్పూన్ల గులాబీ పూల రేకులను ఒక గ్లాసు నీళ్లకు కలిపి కషాయం తయారుచేసి తీసుకుంటే ఆందోళన, నర్వస్‌నెస్ వంటివి తగ్గుతాయి.

 రోజ్‌వాటర్‌ని, ఉల్లిపాయల రసాన్ని ఒక్కోటి ఒక్కో టీ స్పూన్ చొప్పున కలిపి పరిశుభ్రమైన దూది ప్యాడ్‌ని తడిపి మూసిన కనురెప్పలమీద పరుచుకుంటే కంటి మంటలు, ఎరుపుదనం, దురద వంటివి  కూడా తగ్గుతాయి.

 ఒక టేబుల్ స్పూన్ గులాబీ రెక్కలను ఒక కప్పు నీళ్లకువేసి మరిగించి తీసుకుంటే తల తిరగటం, తలనొప్పి వంటివి  కూడా తగ్గుతాయి.

 రోజ్‌వాటర్‌ని, వెనిగార్‌ని సమాన నిష్పత్తిలో చల్లని నీళ్లకు కలిపి, నూలు గుడ్డను తడిపి మడతలుపెట్టి నుదుటి మీద పరిస్తే శరీరం చల్లబడి జ్వరం తొందరగా   తగ్గుతుంది.

 రోజ్‌వాటర్‌కి తోక మిరియాల పొడి, శొంఠి పొడిని ఒక్కో టీ స్పూన్ చొప్పున కలిపి పేస్టుమాదిరిగా చేసి తల నొప్పిమీద ప్రయోగిస్తే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఎండిన గులాబీ రెక్కలను పొడిచేసి తేనెకు కలిపి కొద్దికొద్దిగా చప్పరిస్తుంటే గొంతు నొప్పినుంచి  తొందరగా ఉపశమనం లభిస్తుంది.

 రోజ్‌వాటర్‌కి కుంకుమ పువ్వు, బాదం పలుకులను కలిపి మెత్తగా నూరి ముఖంమీద ఫేస్ ప్యాక్ మాదిరిగా ప్రయోగిస్తే ముఖ చర్మం కుసుమ కోమలంగా కూడా తయారవుతుంది. మంగు మచ్చలు, మొటిమలు వంటివి కూడా  తగ్గుతాయి.

 గులాబీలు వేసి నానబెట్టిన నీళ్లను సున్నపు తేటకు కలిపి, కమలాపండ్ల రసానికి చేర్చి తీసుకుంటే ఎసిడిటీవల్ల వచ్చే ఛాతినొప్పి, వికారం మరియు  అజీర్ణం, ఆమ్లపిత్తం వంటి సమస్యలు  కూడా తగ్గుతాయి.

 గులాబీ పూలరెక్కలు, అక్కలకర్ర పొడి వీటిని మూడేసి గ్రాముల చొప్పున కలిపి కొద్దికొద్దిగా నాలుక మీద వేసుకొని చప్పరిస్తుంటే నాలుక మీద ఉండే రుచి గ్రాహకాలు (టేస్ట్‌బడ్స్) చైతన్యవంతమవుతాయి. దీంతో ఆహార పదార్థాల రుచి కూడా బాగా  తెలుస్తుంది.


ఆధ్యాత్మిక రంగం

ప్రతి మంగళవారం 11 గులాబీలు ఆంజనేయ స్వామి చెంత ఉంచితే కోరిన కోరికలు నెర వేరతాయని, సమస్యలు  కూడా తొలగిపోతాయని ప్రతీతి. నిండు పున్నమినాడు బేలా పుష్పాలతో పాటు గులాబీలను కూడా చేర్చి సరస్సులో గానీ, చెఱువులో గాని వేసి ఇష్టదైవాన్ని ప్రార్ధించుకుంటే తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయని దైవజ్ఞులు చెప్తారు.

ఇక సౌందర్య సాధనా

గులాబీల హం గామా అంతా ఇంతా కాదు. అన్ని రకాల సౌందర్యపోషక ఉత్పత్తుల్లో గులాబీలు లేని ఉత్పత్తి లేదంటే అతిశయోక్తి అంతకన్నా కాదు. సెంట్ల తయారీలో కూడా గులాబీ అగ్రగామి అన్న విషయం అందరికీ విధి తమే. వాడిపోయినా, వాడిగా ఉన్నా గులాబీ తన రాజసాన్ని మాత్రం కోల్పోదు. దాని గుణాలు ఎన్నటికీ వాడిపోవు.

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇక్కడ చూడండి

రావి ఆకు కషాయం ఉపయోగాలు
ఊదలు యొక్క ఉపయోగాలు
అండు కొర్రలు యొక్క ఉపయోగాలు
శతావరి ప్రయోజనాలు, ఉపయోగాలు- దుష్ప్రభావాలు
చేప నూనె వలన కలిగే ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
సామలు యొక్క ఉపయోగాలు
అరికెలు యొక్క ఉపయోగాలు
కొబ్బరి బొండం ఒక అమృత కలశం
కరక్కాయ యొక్క పూర్తి వివరాలు
ఎండిన పండ్లు యొక్క పూర్తి వివరాలు
ద్రాక్షపళ్ళ ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
అంజీరము యొక్క ఆరోగ్య ఉపయోగములు దుష్ప్రభావాలు
మెంతులు వలన కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు
మజ్జిగ వలన కలిగే ఉపయోగాలు
రోగనిరోధక శక్తిని పెంచేదెలా ఆహారాలు -చిట్కాలు
రక్తాన్ని శుద్ధపరచుకోవడనికి గృహ చిట్కాలు
స్టార్ ఫ్రూట్ ఉపయోగాలు ప్రమాదాలు - దుష్ప్రభావాలు
చిలగడదుంప వలన కలిగే ఉపయోగాలు
సబ్జా గింజలు వల్ల కలిగే ఆరోగ్యం
పప్పులతో జబ్బులు దూరం 
గులాబీ పువ్వు వలన కలిగే ఉపయోగాలు
గురివింద గింజ వలన కలిగే ఉపయోగాలు
తాటి బెల్లం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
ఉల‌వ‌లు వలన కలిగే ఉపయోగాలు
వేగంగా బరువు తగ్గించే పానీయాలు
వెల్లుల్లి ప్రయోజనాలు ఉపయోగాలు -దుష్ప్రభావాలు
ఆరోగ్యానిచ్చే పండ్లు
పొగాకు వలన ఉపయోగాలు దుష్ప్రభావాలు
సీతాఫలం వలన కలిగే ఉపయోగాలు దుష్ప్రభావాలు
సోంపు (ఫెన్నెల్ విత్తనాలు) ప్రయోజనాలు దుష్ప్రభావాలు
టమాటా ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
శంఖపుష్పి ప్రయోజనాలు మోతాదు - దుష్ప్రభావాలు
అర్జున చెట్టు బెరడు ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
ఉత్తరేణి వలన కలిగే ఉపయోగాలు
కానుగ చెట్టు వలన కలిగే ఉపయోగములు
జీర్ణశక్తిని పెంచుకునేదెలా ఆహారాలు -చిట్కాలు
లావణ్యానికి సుగంధ తైలం
సంతులిత ఆహారం యొక్క చార్ట్, ప్రాముఖ్యత ప్రయోజనాలు
అనులోమ విలోమ ప్రాణాయామ యొక్క ప్రక్రియ దశలు 
పసుపు యొక్క ప్రయోజనాలు ఉపయోగాలు  దుష్ప్రభావాలు
 నల్ల జిలకర ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
ముఖానికి, జుట్టుకి మరియు చర్మానికి ముల్తానీ మట్టి  ప్రయోజనాలు
మొక్కజొన్న వలన కలిగే ఉపయోగాలు
లీచీ పండు ఎంతవరకు ఆరోగ్యకరం
అరటి పండు ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
ఆముదంను జుట్టు పెరగడానికి ఎలా ఉపయోగించాలి
కాల్షియం ఆహారాలు వనరులు ప్రయోజనాలు దుష్ప్రభావాలు
కార్బోహైడ్రేట్లు ఆహారాలు వనరులు ప్రయోజనాలు దుష్ప్రభావాలు
ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
అల్ఫాల్ఫా ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
ప్రోటీన్ ఆహారాలు ప్రయోజనాలు ఉపయోగాలు దుష్ప్రభావాలు
ఆపిల్ ప్రయోజనాలు, కేలరీలు పోషక విలువలు, దుష్ప్రభావాలు  
పిస్తా పప్పు ప్రయోజనాలు, ఉపయోగాలు దుష్ప్రభావాలు
సగ్గుబియ్యం వలన కలిగే ప్రయోజనాలు  దుష్ప్రభావాలు
గోధుమ గడ్డి వలన కలిగే ఉపయోగాలు
సోయాబీన్ వలన కలిగే ప్రయోజనాలు  దుష్ప్రభావాలు
జిలకర జీలకర్ర విత్తనాల ప్రయోజనాలు   దుష్ప్రయోజనాలు

0/Post a Comment/Comments

Previous Post Next Post