ఉత్తరేణి వలన కలిగే ఉపయోగాలు
ఉత్తరేణి లేదా అపామార్గం (Prickly Chaff Flower) ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయ నామం అఖిరాంథస్ ఆస్పరా (Achyranthes aspera). ఇది అమరాంథేసి కుటుంబానికి చెందినది. వినాయక చవితి నాడు చేసే పత్ర పూజలో దీనిని కూడా ఉపయోగిస్తారు.ఈ మధ్యే జరిగిన వినియక చవితి పూజల్లో అధినాయుకుడికి ఇష్టమైన 21 ప్రతులలో ఒకటిగా చెప్పే ఉత్తరేణీ పత్రితో కూడా పూజ చేసారుగా....సకల రోగ నివారణిగా పేర్కొంటూ ఈ మొక్కలకు అత్యంత ప్రాధాన్యత ఆయుర్వేదంలో ఉంది. ఈ మొక్క అమరాంథేసీ కుటుంబానికి చెందినది కాబట్టి దీని శాస్త్రీయ నామం అఖిరాంథస్ ఆస్పరా.
ఉత్తరేణీకి పురాణ కధల్లో ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. వృత్తాసురుడు అనే రాక్షసుడ్ని చంపిన ఇంద్రుడు, ఆపై సముచి అనే మరో రాక్షసుడ్ని చంపేందుకు ఆతనితో స్నేహాన్ని నటిస్తూ... అదను చూసి సమూచి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అతని తలని నరికేస్తాడు. దీంతో తెగి పడిన తల మిత్ర ద్రోహి అంటూ ఇంద్రుడ్ని తరమటం ప్రారంభించడంతో దాని నుండి తప్పించు కునేందుకు బృహస్పతిని కల్సి తరుణోపాయం చెప్పమంటారు. రాజసూయ యాగంలో ఉత్తరణీ భాగంగా చేసే ధాన్యం యాగాన్ని చేయమంటాడు. దీంతో యాగమాచరించిన ఇంద్రుడుని ఉత్తరేణి సముచికి కనబడకుండా ఇది చేస్తుంది.ఈ ప్రక్రియని అపామార్గం కూడా అంటారు. దీని వల్లే ఉత్తరేణిని అపామార్గ మొక్కలని కూడా పిలుస్తారు.
ఉత్తరేణి వలన కలిగే ఉపయోగాలు
భారత దేశంలో ఎక్కువగా కనిపించే ఈ ఉత్తరేణీని గుండ్రని కాండాన్ని, అభి ముఖ ప్రత విన్యాసంతో దీర్ఘ వృత్తాకారంలో, లేదా వృత్తాకార ఆకులని కలిగి ఎరుపు మరియు తెలుపు రంగులున్న పొడువాటి కంకులని కలిగి ఉంటుంది. ఈ మొక్కని ఆయుర్వేద మందుల తయారీకి కూడా వాడుతారు.
- ఉత్తరేణి ఆకుల రసాన్ని గాయాలు తగిలినప్పుడు పూస్తే రక్త స్రావం ఎక్కువ కాకుండా చూస్తుంది.
- అలాగే దురదలు, పొక్కులు, శరీరం పై పొట్టు రాలటం జరుగుతుంటే ఈ రసం శరీరానికి పట్టిస్తే ఆ వ్యాధులు కూడా తగ్గుతాయి.
- అలాగే కందిరీగ లు, తేనెటీగలు, తేళ్లు తదితరాలు కుట్టినప్పుడు ఆయా ప్రాంతాలలో ఈ ఆకులను ముద్దగా నూరి పెడితే నొప్పి, దురద కూడా తగుతాయి.
- ఉత్తరేణి గింజల్ని పొడిచేసి, ఉప్పు, పటిక పొడి, వంట కర్పూరం కల్పిన మిశ్రమం వాడితే పంటి నొప్పులు, చిగుళ్ల నుండి రక్తం కారటం తదితర సమస్యలు తగ్గి దంతాలు చాలా మెరుస్తుంటాయి.
- ఈ మొక్క లని కాల్చిన తరువాత వచ్చే బూడిదకు కాస్త ఆముదం కల్పి గజ్జి, తామర, తదితరాలపై లేపనంగా పూస్తే తొందరగా తగ్గుతాయి.
- అలాగే ఈ బూడిదని తేనెలో కల్పి తీసుకుంటే ఉబ్బసం, దగ్గు తదితరాలతో పాటు గుండెకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులలోని శ్లేష్మం కూడా తగ్గుతాయి.
- మజ్జిగలో కల్పి తీసుకుంటే రక్త విరేచనాలు తగ్గుతాయి. పురుషుల్లో వచ్చే పౌరుష గ్రంధి వాపు సమస్యకు ఉత్తరేణీ చూర్ణానికి ఆవునెయ్యి కల్పి తీసుకుంటే ఫలితం మంచిగా ఉంటుంది.
- ఉత్తరేణీ వేళ్లను కాల్చి చూర్ణంగా చేసి, అందులో మిరియాల పొడి కల్పి రెండు పూటలా చిన్న చిన్న మాత్రలుగా చేసి తీసుకుంటే చర్మ రుగ్మతలు చాల వరకు సమసి పోతాయి.
- ఉత్తరేణీ రసాన్ని నువ్వుల నూనెలో పోసి బాగా మరిగించాక ఆ నూనెని ప్రతి రోజూ పొట్టపై మర్ధన చేసుకుంటే కొవ్వుకరిగి సాధారణ స్ధితికి వస్తారు.
అనేక రకాల రోగాలను నివారిస్తే మానవాళికి సహాయకారణిగా ఉండే ఉత్తరేణీయం గొప్పతనం.
Post a Comment