విటమిన్ E ప్రయోజనాలు వనరులు దుష్ప్రభావాలు

విటమిన్ E ప్రయోజనాలు వనరులు దుష్ప్రభావాలు విటమిన్ ఇ అంటే ఏమిటి?

విటమిన్ E కొవ్వును కరిగించే విటమిన్ మరియు శక్తివంతమైన అనామ్లజని. అనామ్లజని గనుక ఇది మీ చర్మాన్ని హాని నుండి రక్షిస్తుంది. ఇది అనేక ఆహార ఉత్పత్తులలో సహజంగా  కూడా లభిస్తుంది. మన శరీరం విటమిన్ ‘ఇ’ ని అవసరం  వచ్చేవరకూ నిల్వ చేసుకుని ఉంటుంది. విటమిన్ ‘ఇ’ ఎనిమిది వేర్వేరు సమ్మేళనాలను కలిగి ఉంటుంది.  వీటిలో అత్యంత చురుకైన సమ్మేళనం ఆల్ఫా-టోకోఫెరోల్. మనిషి చర్మం యొక్క సాధారణ స్థితిస్థాపకతను విటమిన్ ‘ఇ’ నిర్వహిస్తూనే అరుగుదలను నివారించడంలో బాగా సహాయపడుతుంది. స్వేచ్ఛా రాసుల కారణంగా సంభవించే అకాల వృద్ధాప్యం లేదా చర్మం ముడుతలను కూడా ఇది నివారిస్తుంది. చర్మం మరియు జుట్టు కోసం విటమిన్ E ప్రయోజనాలు బోల్డన్ని ఉన్నాయి. వాటిని గురించి ఇదే వ్యాసంలో వేర్వేరు విభాగాలలో చర్చించడం జరిగింది. 

విటమిన్ E ప్రయోజనాలు వనరులు దుష్ప్రభావాలు


స్వేచ్ఛా రాశులు అంటే ఏమిటి?

స్వేఛ్చారాశి (ఫ్రీ రాడికల్) జతలేని ఏక కణం. ఈ ఏక కణాలు జంటను రూపొందించుకోవడానికి అత్యంత చురుకుగా (తహతహ పడుతూ)  ఉంటాయి. ఈ ఏక కణాలు తమ ప్రతిచర్యలతో (మీ) చర్మం మరియు శరీరంలోని కణాలతో కలబడుతూ, ఎపుడూ వాటిని (చర్మం, కణాలను) దెబ్బతియ్యడానికి సంభావ్యతను కలిగి ఉంటాయి. ఈ ఏక కణాల ప్రతిచర్య మీ కణాలకు కలిగే నష్టానికి కూడా కారణమవుతున్న ఆక్సీకరణ ఒత్తిడిని ప్రారంభిస్తుంది. స్వేచ్ఛారాశులు ప్రధానంగా చర్మాన్ని దెబ్బతీసేటప్పుడు, అవి కేంద్ర నాడీ వ్యవస్థ, హృదయనాళ వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ మొదలైన ఇతర శరీర కణజాలాలను మరియు అవయవ వ్యవస్థలను కూడా బాధించవచ్చును . నియంత్రణ లేని ఈ ఏక కణాల చర్య ఈ కింది రుగ్మతలను కలిగిస్తుంది:

 • అల్జీమర్స్ వ్యాధి లేదా చిత్తవైకల్యం వంటి కేంద్ర నాడీ వ్యవస్థ లోపాలు.
 • అకాల (అంటే వయసుకు మించి) ముడుతలతో, చర్మం స్థితిస్థాపకత లేదా సున్నితత్వాన్ని కోల్పోవడం, చర్మం ఆకృతిలో మార్పు వంటివి.
 • జుట్టు సమస్యలైన వెంట్రుకలు రాలిపోవడం, మరియు వయసు మీరకనే జుట్టు (నెరవడం) తెల్లబడిపోవడం తదితర సమస్యలు.
 • కీళ్ళవాతం (రుమటోయిడ్ ఆర్థరైటిస్) వంటి స్వయంచాలిత రోగనిరోధక రుగ్మతలు (ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్).
 • కొన్ని రకాల క్యాన్సర్లు.
 • శరీర కణాల క్షీణతకు సంబంధించిన రుగ్మతలు ( డిజెనరేటివ్ డిజార్డర్స్).
 • ధమనుల్లో రక్తప్రసరణకు అడ్డంకులేర్పడి వచ్చే రక్తనాళాలు గట్టిపడటం లేదా ఎథెరోస్క్లెరోసిస్ రుగ్మత .
 • దృష్టి క్షీణత, అస్పష్ట దృష్టి లేదా కంటిశుక్లం వంటి కంటి లోపాలు.
 • చక్కెరవ్యాధి (డయాబెటిస్).

శరీరంలో స్వేచ్ఛా రాశులు ఏర్పడడానికి ఏమి కారణమవుతుంది? 

స్వేఛ్చారాశులు (ఫ్రీ రాడికల్స్) సహజంగా ఏర్పడతాయి. అయితే ధూమపానం, అధిక మద్యపానం లేదా చాలా ప్రమాణంలో మసాలాలతో కూడిన వేపుడు ఆహార పదార్థాల (జంక్ ఫుడ్) సేవనం వంటి కొన్ని జీవనశైలీ ఆహారపుటలవాట్ల కారకాలు.  పర్యావరణ కాలుష్యాలు, రసాయనాలు, పురుగుమందులు లేదా శరీర యంత్రాంగాలను మార్చగల ఇతర ఏజెంట్ల వంటివి శరీరంలో స్వేచ్ఛా రాషుల్ని వేగవంతంగా ఉత్పత్తి  చేయడానికి కూడా కారణమవుతాయి.

స్వేఛ్చారాశులతో పోరాడటానికి విటమిన్ E ఎలా సహాయపడుతుంది? 

విటమిన్ E అనామ్లజనకాల్ని అధికంగా కల్గి ఉంటుంది.  గనుక స్వేచ్ఛా రాశుల యొక్క ప్రతిచర్యను తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉంతుంది.   అనామ్లజనకాలు (యాంటీఆక్సిడెంట్లు) ఇతర అణువుల ఆక్సీకరణను నివారించడంలో బాగా  సహాయపడతాయి. స్వేచ్ఛా రాశులుగా ఒక అదనపు ఎలక్ట్రాన్ ఏర్పాటు ద్వారా ఇది ప్రారంభించబడుతుంది.  తద్వారా వాటి కార్యకలాపాలు మరియు రసాయన అస్థిరతను తగ్గిస్తుంది.

 •  విటమిన్ E యొక్క ఆహార వనరులు
 • విటమిన్ ‘ఇ’ ప్రయోజనాలు 
 • విటమిన్ E ని ఎలా తీసుకోవాలి? 
 • రోజుకు ఎంత విటమిన్ E?
 • విటమిన్ E యొక్క దుష్ప్రభావాలు 


విటమిన్ E యొక్క ఆహార వనరులు 

విటమిన్ E కింద పేర్కొన్నటువంటి ఆహారాలలో సహజంగా ఉంటుంది

 • పాలకూర, క్యాబేజీ, బ్రోకలీ, శలజమ గడ్డ (టర్నిప్ గ్రీన్స్) వంటి ఆకు కూరలు  , కొన్నిరకాల మిరియాలు, బీన్స్, పప్పుధాన్యాల (లెగ్యూములు) దినుసులు.
 • అవెకాడో పండు.
 • సాల్మోన్ చేప.
 • సముద్రం నుండి లభించే ఆహారపదార్థాలు (సీఫుడ్).
 • కొవ్వు తక్కువుండే మాంసం (lean meat).
 • గుడ్లు.
 • బాదం గింజలు, వేరుశెనగలు, హాజెల్ నట్స్, ఫిల్బెర్ట్లు, పైన్ గింజలు వంటి ఎండిన పదార్థాలు, డ్రై ఫ్రూట్స్ .
 • పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు వంటి విత్తనాలు.
 • పొద్దుతిరుగుడు నూనె, కుసుమ నూనె (కుసుంభ నూనె), మొక్కజొన్న, సోయాబీన్ నూనె, గోధుమ బీజ చమురు వంటి కొన్ని కూరగాయల నూనెలు.
 • చేపనూనె (ఫిష్ ఆయిల్).
 • ప్యాక్ చేయబడిన ఆహారపదార్థాలైన పండ్ల రసాలు లేదా అల్పాహారానికుపయోగించే  తృణధాన్యాల వంటివి.

ఈ ఆహార వనరులు కాకుండా, విటమిన్ E అనేది మాత్రలు, సప్లిమెంట్స్ మరియు క్యాప్సూల్స్ రూపంలో కూడా లభిస్తుంది.  ఇవి తరచుగా రోగనిరోధక శక్తిని పెంచడానికి లేదా ఒక సాధారణ చర్మపు సప్లిమెంట్ గా కూడా   ఉపయోగిస్తారు. 


విటమిన్ ‘ఇ’ ప్రయోజనాలు 

విటమిన్ E శక్తివంతమైన అనామ్లజని (యాంటీఆక్సిడెంట్) అవటం వల్ల స్వేచ్ఛా రాశులు కల్గించే హాని నుండి చర్మం మరియు జుట్టును కాపాడటం జరుగుతుంది. దీని యంత్రాంగం గురించి పైన చర్చించడం జరిగింది. చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా విటమిన్ E కి మరిన్ని గంభీరమైన ప్రయోజనాలు ఉన్నాయి . ఇంకా, సూక్ష్మజీవులైన వైరస్లు, బ్యాక్టీరియా మరియు ఇతర రోగకారక సూక్ష్మవిష జీవులకు వ్యతిరేకంగా పోరాడటం ద్వారా రోగనిరోధక యంత్రాంగాన్ని పెంచడంలో కూడా విటమిన్ E ప్రభావవంతమైనది. ఇది శరీరం లో ఎర్రరక్త కణాలు (RBCs) ఏర్పడడానికి మరియు విటమిన్ K వినియోగానికి బాగా సహాయపడుతుంది. ఇంతేకాక, విటమిన్ E కున్న అనామ్లజన కారణంగా వివిధ అవయవాలు మరియు శరీర వ్యవస్థల రక్షణా విధుల్ని మరియు శరీరం యొక్క మొత్తం యంత్రాంగాన్ని మెరుగుపర్చడంలో కూడా సహాయపడుతుంది.  

చర్మానికి: విటమిన్ ఇ హానికారక కాలుష్య కారకాలు మరియు  ఎండ వలన ఏర్పడే చర్మ నష్టం పై పోరాడి చర్మానికి పోషణని  కూడా అందిస్తుంది. పొడిబారిన చర్మానికి కూడా తేమని చేకూరుస్తుంది.

జుట్టుకోసం: ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి జుట్టు రాలడాన్ని విటమిన్ ఇ నివారిస్తుంది. అలాగే జుట్టుకి కావసిన పోషణని అందించి జుట్టు  పొడవుగా పెరిగేలా కూడా  చేస్తుంది. అంతేకాక జుట్టులో ఉండే సహజ నూనెలను కాపాడి జుట్టుకి సహజమైన మెరుపుని ఇవ్వడంలో  బాగా సహాయం చేస్తుంది.

కళ్ళకి: విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారాలు కాళ్ళ పనితీరుని మెరుగుపరచి, కంటికి రక్షణని బాగా చేకూరుస్తాయి. వివిధ అధ్యయనాలలో విటమిన్ ఇ లో ఒక భాగమైనా ఆల్ఫా - టోకోఫెరోల్ (alpha - tocopherol) కంటి శుక్లాలు వంటి కళ్ళవ్యాధులను నివారిస్తుందని  కూడా తెలిసింది.

రోగనిరోధక శక్తి కోసం: విటమిన్ ఇ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ అది రోగనిరోధకశక్తిని కూడా పెంచుతుంది. ఎయిడ్స్ మరియు క్యాన్సర్ రోగులకి విటమిన్ ఇ ను ఇవ్వడం వలన వారి రోగనిరోధకశక్తిలో మెరుగుదలను గమనించడం జరిగింది.

చిత్తవైకల్యం మరియు విటమిన్ ఇ: వయసు పెరిగేకొద్దీ మెదడు కణాలలో ఆక్సిడేటివ్ ఒత్తిడి పెరుగుతుంది.  విటమిన్ ఇ కి ఉన్న యాంటీఆక్సిడెంట్ లక్షణాలు  మెదడులోని ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించడం ద్వారా అల్జిమర్స్ మరియు చిత్తవైకల్యం వంటి మెదడు సంబంధ వ్యాధుల లక్షణాలను తగ్గిస్తుంది.

గుండె కోసం:   విటమిన్ ఇ కి కార్డియో ప్రొటెక్టీవ్ (గుండెను రక్షించే) లక్షణాలు ఉన్నాయి, అధికంగా రక్త గడ్డలు (blood clots) ఏర్పడం వలన రక్త నాళాలు మూసుకుపోయి స్ట్రోక్ మరియు ఇతర గుండె వ్యాధులను కలిగిస్తాయి. విటమిన్ ఇ దానిని నివారించడం ద్వారా గుండె ఆరోగ్యానికి సహాయం చేస్తుంది.

 • చర్మానికి విటమిన్-E ప్రయోజనాలు 
 • జుట్టుకు విటమిన్-E నూనె
 • కళ్ళకు విటమిన్ E
 • రోగనిరోధకతకు విటమిన్ E
 • విటమిన్ E మరియు క్యాన్సర్ 
 • విటమిన్ E మరియు చిత్తవైకల్యం 
 • గుండెకు విటమిన్-E ప్రయోజనాలు


చర్మానికి విటమిన్-E ప్రయోజనాలు 

విటమిన్ E ఒక అవశ్యక పోషకాంశంగా మరియు ఒక సహజమైన ముదిమి-హరణ (యాంటీ-ఏజింగ్) ఏజెంట్ గా  కూడా పనిజేస్తుంది. తద్వారా ఇది వయసుతో బాటు చర్మం పై ఏర్పడే గీతలు మరియు ముడుతల్ని నిరోధించడానికి సహాయపడుతుంది.  ఇటీవలి ఓ అధ్యయనం, ముడతలు పడిన చర్మంపై విటమిన్ E యొక్క ప్రయోజనాలను నిరూపించింది. ఆ అధ్యయనంలో విటమిన్ E ఉండే పదార్థాలను సేవింపజేసిన వ్యక్తులకు మెరుగైన చర్మ స్థితిస్థాపకత మరియు ఆరోగ్యకరమైన చర్మకాంతి కూడా ఏర్పడింది. ఇది వారిలోని ముఖంలో వచ్చిన ముడుతల్ని కూడా కొంతవరకూ సరి చేసింది. ఎండ వేడిమి, కాలుష్యాలు మరియు ఇతర హానికరమైన ఏజెంట్లు చర్మంపై కల్గించే నష్టాన్ని పోగొట్టి విటమిన్ E చర్మం యొక్క ఆరోగ్యాన్ని కాపాడ్డం జరుగుతుంది.

చర్మ నష్టంపైన పోరాటంతో పాటు, విటమిన్ E ప్రత్యామ్నాయాల్ని పొడిచర్మ నిర్వహణకు  కూడా ఉపయోగిస్తారు. మొటిమల నివారణకు ప్రయోగించే చికిత్సలో కూడా విటమిని E ని ఉపయోగిస్తున్నారు. విటమిన్ E సమకూర్చిపెట్టే ప్రయోజనాలు బోల్డన్ని. 1950 నాటి నుండి కూడా చర్మవ్యాధుల చికిత్సా రంగంలో విటమిన్ E ఉపయోగించబడుతోంది. పొడి చర్మంపై ఉత్తమ ఫలితాల కోసం, విటమిన్ E నూనెను రెగ్యులర్ నైట్ క్రీమ్ లేదా లోషన్ ఔషదంతో కలిపి వాడతారు. విటమిన్ E సహజ తేమను కల్గించే ఏజెంట్ అవటంవల్ల ఇది పొడి చర్మంపై  సహజ తేమను పునరుద్ధరించడానికి సహాయం చేస్తుంది. అందువల్ల, పగిలిన చర్మం లేదా పగిలిన పెదాల చికిత్సలో దీనిని ఉపయోగిస్తారు. విటమిన్ E నూనెను పొడిబారిన ఆయా చర్మభాగాల్లో మెత్తగా మర్దన చేయడం ద్వారా చర్మంపైన పొడిబారడమనే సమస్యను నయం చేయడానికి బాగా సహాయపడుతుంది.


విటమిన్ E యొక్క ఈ ప్రయోజనాలు వివిధ అధ్యయనాల ద్వారా నిర్ధారించబడ్డాయి.  'జర్నల్ ఆఫ్ ప్లాస్టిక్, రికన్స్ట్రుక్టీవ్ & ఈస్తటిక్ సర్జరీ' 2010 సంవత్సర సంచిక లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, ఇటీవల శస్త్రచికిత్స తరువాత విటమిన్ E చికిత్స పొందిన చిన్నారులైన రోగుల్లో వారి చర్మంపైన ఎటువంటి మచ్చలు ఏర్పడలేదు. ఈ అధ్యయనంలో, వైద్య ప్రయోగంలో భాగంగా రోగుల్ని రెండు గ్రూపులుగా గుడ్డిగా విభజించారు. విభజించిన వాటిలో ఒక గ్రూపుకు విటమిన్ E సేవనాన్ని మూడుసార్లు రోజువారీగా  శస్త్రచికిత్సకు ముందు 15 రోజులు, మరియు శస్త్రచికిత్స తర్వాత రోజుకు రెండు సార్ల చొప్పున 30 రోజులపాటు ఇవ్వబడింది. ఆ రెండో (నియంత్రణ) గ్రూపురోగుల కు ఆయింటుమెంట్ (పెట్రోలేట్-ఆధారిత లేపనం) రూపంలోని విటమిన్ E ని శస్త్రచికిత్స చేసిన ప్రాంతంలో లేపనంగా మాత్రమే అదే సమయావధిలో ఇవ్వబడింది. ఆరునెలల వ్యవధి తర్వాత, విటమిన్ E ని సేవించిన రోగుల గ్రూపులో 0% మచ్చలు ఏర్పడితే, నియంత్రణ గూఫులో 6.5% రోగుల్లో మచ్చలు ఏర్పడడాన్ని గమనించడం జరిగింది.  

పైన పేర్కొన్న అధ్యయన ప్రయోగం మీ చర్మంపై విటమిన్ E యొక్క అద్భుత ప్రభావాలను తేటతెల్లం చేస్తుంది. ఆరోగ్యకరమైన మరియు మెరిసే చర్మం కోసం మీ రోజువారీ చర్మ సంరక్షణ చర్యల్లో అద్భుతమైన ఈ విటమిన్ను ఓ భాగంగా  చేసుకొని ప్రయోజనాల్ని పొందండి.


జుట్టుకు విటమిన్-E నూనె 

విటమిన్ E ని చాలా సౌందర్యపోషక మరియు కేశవర్ధక ఉత్పత్తుల తయారీలో ఓ ముఖ్యమైన వస్తువుగా ఉపయోగిస్తున్నారని? మన శరీరంలోని కణాలపై విటమిన్ E నమ్మశక్యంకాని ప్రభావాల్ని కల్గించడం వల్లనే సౌందర్యపోషక ఉత్పత్తుల తయారీదారులు ఈ విటమిన్ ని తమ ఉత్పత్తుల తయారీలో ఉపయోగించడానికి కారణమని చెప్పవచ్చును . శరీర కణాలను రక్షించేటప్పుడు, విటమిన్ E అనేది కొత్త పెరుగుదలను ప్రోత్సహించడంలో మరియు కణాలకు కలిగే నష్టాన్ని మరమత్తు చేయడానికి కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. 

స్వేఛ్చా రాశుల వలన కలిగే నష్టాన్ని తగ్గించడం ద్వారా, విటమిన్ E మీ జుట్టును అవాంఛనీయమైన పొడిదనం నుండి రక్షిస్తుంది .  జుట్టు రింగులు రింగులుగా ఉండలు చుట్టుకుపోవడం నుండి రక్షిస్తుంది. తద్వారా, తల వెంట్రుకల్ని మనం (దువ్వడం వంటివి చేసుకుని) సులభంగా నిర్వహించుకోవచ్చు. విటమిన్ E యొక్క పునరుజ్జీవన లక్షణాలు జుట్టు ఆరోగ్యాన్ని  కూడా ప్రోత్సహిస్తాయి మరియు జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తాయి. మీ జుట్టుకు విటమిన్ E యొక్క ప్రయోజనాల గురించి మరింతగా మీకు మార్గనిర్దేశనం చేస్తాం మరియు ఈ ప్రయోజనాలను ఉత్తమంగా సాధించడానికి ఈ విటమిన్ ను ఎంత బాగా ఉపయోగించుకోవచ్చో మీకు మేం వివరిస్తాం.

జుట్టు నష్టం కోసం విటమిన్ E

జుట్టు విపరీతంగా ఊడిపోవడం లేదా మరెలాంటి వెంట్రుకల నష్టాన్నైనా నివారించడానికి విటమిన్ E ప్రసిద్ది చెందింది.  ఇంకా, జుట్టు నష్టం కారణంగా బాధపడుతున్న వ్యక్తుల్లో జుట్టు తిరిగి బాగా పెరగడం కోసం ఈ విటమిన్ E ని ఉపయోగిస్తారు. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా విటమిన్ E జుట్టు పునః పెరుగుదలకు  బాగా తోడ్పడుతుంది. 

పొడవాటి జుట్టు కోసం విటమిన్ E

విటమిన్ E ని చేర్చుకోవడం ద్వారా మీరు కలలుగంటున్న నల్లగా నిగనిగలాడే ఆరోగ్యకర జుట్టును మీ స్వంతం చేసుకోవచ్చును . విటమిన్ E మీ తల మీది చర్మం యొక్క ఆరోగ్యాన్ని పెంచుతుంది, తలమీద జుట్టు కుదుళ్ళ సంఖ్యను మరియు ఆ కుదుళ్ళ పరిమాణాన్ని కూడా పెంచుతుంది. తద్వారా, సమర్థవంతమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. నెత్తిమీది చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపర్చి, మీరు నిగనిగలాడే, మెరిసే, ఆరోగ్యకరమైన మరియు రింగులు కట్టని పొడవాటి జుట్టును స్వంతం చేసుకునేట్టు విటమిన్ E మీకు సహాయపడుతుంది.

ఆరోగ్యకరమైన జుట్టు మరియు నెత్తిచర్మానికి విటమిన్ E

మీ జుట్టుకుండే సహజమైన తేమను మరియు నూనె పదార్థాల్ని  కోల్పోయినప్పుడు, అది పొడిబారిపోయి రింగులు చుట్టుకుపోతుంది. విటమిన్ మీ తల చర్మానికి ఓ రక్షణా కవచాన్ని కప్పి ఉంచడం ద్వారా  మీ జుట్టు సహజమైన నూనెలను కోల్పోకుండా ఉండేట్టు సహాయపడుతుంది. బాహ్య పర్యావరణంలోని కాలుష్యాలు తలకు అంటకుండా చేసి, తలమీది చర్మం లోని తేమ ఎప్పుడూ నిల్వ ఉండేట్టు చేయడంలో విటమిన్ E సహాయపడుతుంది. విటమిన్ E మీ సహజమైన జుట్టు నూనెలను పునరుద్ధరించడంలో బాగా సహాయపడుతుంది. తల మీది చర్మంలో అదనపు చమురు ఉత్పత్తిని కూడా విటమిన్ E నిరోధిస్తుంది. విటమిన్ E యొక్క ఈ ప్రభావాలన్నీ మీకు ఆరోగ్యకరమైన నెత్తి చర్మం మరియు మెరిసే జుట్టును ఇవ్వడంలో  ఖచ్చితంగా సహాయపడుతుంది.

అందమైన ఆరోగ్యకరమైన జుట్టును స్వంతం చేసుకునేటందుకు పైన పేర్కొన్న విటమిన్ E పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలను మీ దిననిత్య ఆహారంలో ఉండేట్టు చూసుకోవచ్చు. అంతేకాకుండా, జుట్టు, చర్మం మరియు తలమీది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి విటమిన్ E క్యాప్సూల్స్ మరియు సప్లిమెంట్లను తీసుకోవచ్చును . విటమిన్ E ను కలిగి ఉండే చర్మ సంరక్షణ లేదా జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. విటమిన్ E అనేది కొన్ని నూనెలు, చర్మపు లోషన్లు, క్రీమ్లు, హెయిర్ జెల్లులు, షాంపూలు మరియు కండీషనర్లు లో ఉంటుంది. వాటిపై ఉండే లేబుళ్లలో ఈ వివరాల్ని మీరు చూడవచ్చు. ఈ ఉత్పత్తుల పై పూత వాడకం కూడా సమర్థవంతంగా ఉంటుంది. అయితే, మీ వైద్యుడు లేదా చర్మవ్యాధి నిపుణుడు సిఫారసు చేయకపోతే మీరు అదనపు మందులను (suppliments)  మరియు మాత్రలను ఉపయోగించకూడదు.


కళ్ళకు విటమిన్ E 

గింజలు మరియు ఎండు ఫలాల సేవనం కంటికి మంచి ప్రయోజనకరమైన ఫలితాన్నిస్తాయని మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, . ఇలాంటి గింజలు, ఎండు ఫలాలసేవనం కంటి చూపును మెరుగు పరుస్తాయని భావించడం జరుగుతోంది.  ఈ గింజలు, ఎండు ఫలాలలో విటమిన్ E సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ E కంటి రక్షణ మరియు కంటి యొక్క క్రియాత్మక చర్యలకు బాధ్యత వహిస్తుంది.

కంటి సమస్యల నివారణ మరియు కంటి సంరక్షణ కోసం నేత్రవైద్యనిపుణులు తమ రోగులకు రోజువారీ ఆహారంలో ముల్టీవిటమిన్లతో బాటు విటమిన్ ‘ఇ’ సమృద్ధిగా ఉండే ఆహార పదార్ధాలను సూచిస్తుంటారు. విటమిన్ E తో కూడిన ఆహారాన్ని రోజువారీగా సేవించడంవల్ల వయస్సు-సంబంధిత కండరాల బలహీనత (AMD) వ్యాధి దాపురించకుండా 25% తరువాతి దశకు వాయిదా వేయవచ్చని, తద్వారా పొంచి ఉన్న ప్రమాదం నుండి తప్పించుకోవచ్చని పలు అధ్యయనాలు ధృవీకరిస్తున్నాయి. ఈ ప్రభావాల కోసం విటమిన్ E  యొక్క సిఫార్సు మోతాదు 400 IU. అయితే, సిఫార్సు చేయబడిన విటమిన్ E యొక్క రోజువారీ మోతాదు 22.5 IU (1 IU, 0.9 mg టోకోఫెరోల్ కు సమానం).

లూటీన్ మరియు జియాక్సాంటిన్ లతో బాటు ఆల్ఫా-టోకోఫెరోల్ (విటమిన్ E యొక్క ఒక భాగం) సేవనం కంటిశుక్లాల (cateracts)  ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఇతర అధ్యయనాల ద్వారా కూడా రుజువైంది. అయినప్పటికీ, వీటిని (విటమిన్ E ని) వైద్యుడి సూచన (ప్రిస్క్రిప్షన్) లేకుండా మరియు దాని దుష్ప్రభావాలపై పరిపూర్ణ జ్ఞానం లేకుండా తీసుకోకూడదు.


రోగనిరోధకతకు విటమిన్ E 

విటమిన్ E శక్తివంతమైన అనామ్లజని (ప్రతిక్షకారిని) అవటం చేత ఇది రక్షణాత్మక చర్యల్ని కలిగి ఉంది. ఇంకా, ఇది శరీరంలోని రోగనిరోధక పనితీరును సరిచేయడంలో ప్రభావవంతంగా ఉంటుంది. వివిధ పరిశోధకుల అధ్యయనాల ప్రకారం, విటమిన్ E శరీర (host) రోగనిరోధక వ్యవస్థపై లాభదాయక ప్రభావాలను కలిగి ఉందని మరియు ఈ విటమిన్ యొక్క లోపం తరచుగా సంక్రమణ వ్యాధుల ప్రాబల్యంతో ముడిపడి ఉంటుందని,.  కణితులతో కూడిన జబ్బులకు దారి తీసే అవకాశం  అధికంగా కలిగి ఉంటుంది.

వృద్ధాప్యం పరిణామంగా గాని లేదా, ఎయిడ్స్, క్యాన్సర్, మొదలైన వాటి వల్ల  తగ్గిన రోగనిరోధక శక్తి కలిగిన సమయాల్లో విటమిన్ E సేవనం తో చాలా ప్రభావవంతంగా ఉన్నట్లు గుర్తించారు. విటమిన్ E సేవనం రోగి కోలుకోవడమన్నదాన్ని మరింతగా మెరుగుపర్చడానికి మరియు కెమో (chemo) లేదా రేడియేషన్ వంటి చికిత్సల ద్వారా రాజీ కణజాలంలో ప్రారంభ రికవరీని కూడా ప్రోత్సహిస్తుంది. ఈ ఫలితాల కారణంగా, విటమిన్ E  అనేది ఒక ముఖ్యమైన పోషకమని మరియు దాని అనుబంధం అత్యంత ప్రభావవంతమైన మరియు అవసరమైనది, ముఖ్యంగా వృద్ధాప్యంలో.


విటమిన్ E మరియు క్యాన్సర్ 

విటమిన్ E యొక్క రక్షిత మరియు రోగనిరోధకశక్తిని పెంచే కార్యకలాపాలు గురించి  ఇప్పటికే చర్చించబడ్డాయి. కానీ క్యాన్సర్ కణాలపై విటమిన్ E యొక్క ప్రభావాల ఫలితాలు నేరుగా ఎలా ఉంటాయన్నది ఇంకా చర్చనీయంగా ఉన్నాయి. అయినప్పటికీ, సహజ వనరుల రూపంలో దినానిత్య ఆహారంలో విటమిన్ E ని తీసుకోవడమనేది అత్యంత క్యాన్సర్-రక్షితమైనది. కానీ విటమిన్ E ని మాత్రలు లేదా అదనపు పదార్ధాల రూపంలో సేవించడం అనేదాన్ని సిఫారస్ చేయడం లేదు. ఎందుకంటే, అలాంటి సేవనం వలన కలిగే ప్రభావాలను ఇంకా బాగా అధ్యయనం చేయబడలేదు. మాత్రలు తదితరాది రూపంలో విటమిన్ E సేవనం ప్రతికూలమైనదిగా నిరూపించబడవచ్చు.


విటమిన్ E మరియు చిత్తవైకల్యం 

విటమిన్ E కి ఉన్న శరీర కణాలకు కల్గిన నష్టాన్ని పూడ్చే సామర్థ్యం మరియు దాని రక్షిత చర్యలు దీన్ని (విటమిన్ E) అల్జీమర్స్ వ్యాధి మరియు చిత్తవైకల్యం (డిమెంటియా) వ్యాధుల పురోగమన నివారణకు ఉపయోగించాలని సూచించడం జరుగుతోంది. ఈ రెండు వ్యాధులూ కూడా రోగియొక్క  జ్ఞాపకశక్తిని తగ్గిస్తాయి మరియు దిననిత్యం తమ స్వంత విధులను నిర్వహించుకోవడంలో వారి సామర్థ్యాలని తగ్గిస్తాయ. వయస్సుతో పాటుగా పురోగతి చెందే ఆక్సీకరణ ఒత్తిడి వ్యక్తులలో ఈ వయసు-సంబంధిత మార్పులకు కారణమవుతుంది; విటమిన్ E ఆక్సీకరణ ఒత్తిడికి విరుగుడుగా పనిచేస్తుందని ప్రసిద్ధి చెందింది గనుక చిత్తవైకల్యం మరియు అల్జీమర్స్ వ్యాధి రోగులకు బాగా పనిచేస్తుంది.

ఈ వ్యాధితో బాధపడుతున్న రోగులలో సెరెబ్రోస్పానియల్ ఫ్లూయిడ్ (CSF-మేదోమేరు ద్రవం) మరియు ప్లాస్మాలలో విటమిన్ ఇ తక్కువ గాఢత కలిగివున్నట్లు గుర్తించబడింది. ఇది శరీరంలో పలు మార్పులను కలుగజేస్తుంది.  ఈ పరిశోధనలను పరిశీలించిన పరిశోధనకారులు విటమిన్ E ని అల్జీమర్స్ మరియు చిత్తవైకల్యం వ్యాధులకు, ముఖ్యంగా వాటి ప్రారంభ దశల్లోనే వ్యాధి లక్షణాల పురోగతిని నివారించడానికి అవకాశం ఉందని నిరూపించారు.

ఈ రెండు వ్యాధులూ ముదిరిపోయిన దశల్లో విటమిన్ E సేవనం వల్ల మరీ అంత ప్రయోజనం ఉండదు అంటే ముదిరిన వ్యాధి లక్షణాలను పూర్తిగా తగ్గించలేదు  మరియు మెదడుకు కల్గిన హానిని నయం చేయలేదు. అయినప్పటికీ, వ్యాధి ముదిరిన మతిమరుపు రోగులకు విటమిన్ E సప్లిమెంట్ మందులు, ఆహారాలనివ్వడం మూలంగా వారి వ్యక్తిగత విధులైనటువంటి తినడం, శుభ్రపర్చుకోవడం, స్నానం చేయడం వంటి రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడంలో వారు మెరుగైన సామర్ధ్యం కనబర్చడాన్ని గమనించడం జరిగింది.

ఈ విటమిన్ E సప్లిమెంట్ మందుల సేవనం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు గాని లేదా విషపూరితం అవటం గాని పరిశోధనలో గమనించబడలేదు. అయితే, విటమిన్ E  సప్లిమెంట్ మందులిచ్చాక రోగులను జాగ్రత్తగా పర్యవేక్షించడం చాలా అవసరం.


గుండెకు విటమిన్-E ప్రయోజనాలు

విటమిన్ E కి ఉన్న ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే సామర్థ్యం కారణంగా ఇది  గుండె-సంరక్షణా విధుల్ని (కార్డియోప్రొటెక్టివ్ ఫంక్షన్లను) బాగా నిర్వహించగలదు. విటమిన్ E కి రక్తనాళాల్లో రక్తపుగడ్డలు ఏర్పడకుండా నిరోధించగల లక్షణం ఉంది గనుక అది హృదయ-సంబంధ వ్యాధుల్ని మరియు హృదయాఘాత (స్ట్రోక్) ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్త నాళాల్లో/సిరల్లో రక్తం ఎక్కువగా గడ్డ కట్టడమనేది హృదయాఘాతం (స్ట్రోక్) మరియు హృదయ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. విటమిన్ E సేవనం వల్ల ఈ గుండె-సంబంధ వ్యాధుల్ని అదుపులో ఉంచవచ్చు. అయినప్పటికీ, విటమిన్ E ని అధిక మోతాదుల్లో తీసుకోకూడదు. అధిక మోతాదు మందుసేవనం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాల్ని చూపిస్తుంది గనుక జాగ్రత్త తీసుకోవాలి. 


విటమిన్ E ని ఎలా తీసుకోవాలి? 

విటమిన్ E ని సహజమైన ఆహారంగా దినానిత్య ఆహారంతో బాటు తీసుకోవచ్చు లేదా మాత్రలు, క్యాప్సూల్స్ రూపంలో “సప్లిమెంట్లు” గానూ సేవించవచ్చు. విటమిన్ E చర్మ ఔషధాలు, లోషన్లు మరియు జుట్టు నూనెల రూపంలో కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. విటమిన్ E ని ఉపయోగించి మీరు జుట్టు మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి లభించే కొన్ని వైనాలను మీకోసం కింద వివరిస్తున్నాం.

 • విటమిన్ E హెయిర్ మాస్క్ 
 • చర్మం కోసం విటమిన్ E క్యాప్సూల్స్
 • ముఖానికి విటమిన్ 


విటమిన్ E హెయిర్ మాస్క్ 

కేశాల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో హెయిర్ మాస్క్లు (కేశ ముసుగులు) ప్రభావవంతంగా పని చేస్తాయి.  అంతేగాకుండా అవి నెత్తిమీద చర్మానికి ఉపశాంతి మరియు పోషణనిస్తాయి. విటమిన్ E, ఈ అన్ని అవసరాలను తీరుస్తుంది. ఇంట్లోనే మీ సొంత హెయిర్ మాస్క్ (కేశ ముసుగు) ని  ఎలా తయారు చేసుకోవచ్చో, దాన్నెలా ఉపయోగించుకోవచ్చో ఇక్కడ ఉంది.

ఒక అరటి పండు, ఒక అవోకాడో పండును తీసుకుని వాటి గుజ్జును తీయండి. తీసిన ఆ రెండు పండ్ల గుజ్జుకు 1 టేబుల్ స్పూన్  అవోకాడో నూనె మరియు 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను చేర్చి బాగా రంగరించి కలపండి. ఇప్పుడు, ఒక టేబుల్ స్పూన్ తేనెను రంగరించిన ఆ పేస్టు కు చేర్చి మళ్ళీ రంగరించి ఓ మంచి పేస్టు గా తయారు చేసి సిద్ధం చేసుకోండి.  

సిద్ధమైన ఆ పేస్టును మీ చేతివేళ్ల సహాయంతో, మీ జుట్టు మరియు తలపై అంటిస్తూ నెమ్మదిగా మసాజ్ చేయండి. అలా మసాజ్ పూర్తయ్యాక దాన్ని కనీసం 15 నుండి 20 నిముషాలు ఉండనిచ్చి ఆ తర్వాత తేలికపాటి షాంపూను ఉపయోగించి వెచ్చని నీటితో తలను శుభ్రం చేసుకోవాలి.

చర్మం కోసం విటమిన్ E క్యాప్సూల్స్ 

మీ ముఖంపైన జిడ్డుగల చర్మం మరియు మోటిమలతో బాధపడుతుంటే, మేము మీకోసం ఓ సులభమైన తరుణోపాయాన్ని సూచిస్తాం. ఇది కేవలం రెండు వస్తువులతో ఇంట్లోనే తయారు చేసుకోగల సులభమైన పేస్టు. ఈ పేస్టును ముఖానికి మాస్కులాగా పూసుకోవచ్చు. ఈ తేలికపాటి పేస్ట్ ను రూపొందించుకోవడానికి ఒక విటమిన్ E గుళికకు తేనెను 1 స్పూన్ ను కలిపి పేస్టు తయారు చేసుకోండి, దాన్ని ముఖంపై మాస్క్ లాగా పూసుకోండి. 15 నిముషాల పాటు మీ ముఖం మీదనే  పేస్టు మాస్క్ ని ఉండనిచ్చి తర్వాత బాగా శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కా వల్ల మోటిమలు మాయమై కాంతివంతమైన ముఖ వర్చస్సు మీ సొంతమవుతుంది.


ముఖానికి విటమిన్ 

మీరు జిడ్డుగల చర్మం మరియు మోటిమలతో బాధపడుతుంటే, మేము మీకు కేవలం 2-వస్తువులతో ఇంట్లోనే తయారుచేసుకోగల ఓ పరిపూర్ణమైన చిట్కా పరిష్కారాన్ని సూచిస్తాం.ఇదొక తేలికపాటి పేస్ట్. దీన్ని తయారు చేసేందుకు 2 విటమిన్ E క్యాప్సూల్స్ కు 2-టీస్పూన్లు తేనె కలిపి పేస్టుగా రంగరించాలి. తర్వాత ముఖంపై మాస్క్ లాగా వేసుకోవాలి. 15 నిముషాల పాటు మీ ముఖం మీద పేస్ట్ ను అలాగే ఉండనిచ్చి తర్వాత బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే  మోటిమలు లేని నిగనిగలాడే ముఖసౌందర్యం మీ స్వాంతమౌతుంది.


రోజుకు ఎంత విటమిన్ E?

14 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులకు విటమిన్ E యొక్క రోజువారీ మోతాదు 15 mg / d ప్రమాణంలో ఆల్ఫా-టోకోఫెరోల్ ను సేవించవచ్చు. 15 mg / d ప్రమాణం 22 IU సహజ వనరులకు లేదా 33IU కృత్రిమ వనరుల (synthetic sources) కు సమానం. అయితే, (విటమిన్ E) లోపం విషయంలో, రోజుకు 60-75 IU మోతాదును సిఫారస్ చేయడమైనది. (1 IU, 0.9 mg టోకోఫెరోల్కు సమానం). సహజమైన విటమిన్ E, పైన ఉదహరించిన ఆహార వనరుల నుండి తీసుకోబడింది మరియు పూర్తిగా సురక్షితం కూడా. సంభావ్య దుష్ప్రభావాలను నివారించడానికి వైద్యుల యొక్క సంప్రదింపుల మేరకే మాత్రలు మరియు మందుల రూపంలో ఉండే సింథటిక్ మందు ఉత్పత్తుల్ని సేవించాలి.

మీరు ఇతర ఆరోగ్య ప్రయోజనాల కోసం విటమిన్ E ని సేవించాలనుకుంటే, ఈ విటమిన్ ను సేవించేందుకు ముందు, సేవిస్తున్నంత కాలమూ మీ వైద్యుడి సలహాను అనుసరించాలని మీకు సిఫార్సు చేయడమైనది, ఎందుకంటే, ఈ ప్రత్యామ్నాయాల (substitudes) ను తీసుకుంటూనే, విటమిన్ E మోతాదు వయస్సు, బరువు, ఎత్తు, లింగం మరియు ఇతర కారకాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ విటమిన్ E ని సేవించేందుకు మార్గదర్శక పట్టిక ఉంది.

వయసు          పురుషులు        స్త్రీలు

6 నెలల వరకు    4 mg            4 mg

7 నెలల నుండి 1 సంవత్సరము  5 mg  5 mg

1 నుండి 3 సంవత్సరాలు   6 mg  6 mg

4 నుండి 8 సంవత్సరాలు  7 mg  7 mg

9 నుండి 13 సంవత్సరాలు  11 mg  11 mg

14 సంవత్సరాలు, అంతకు మించి 15 mg  15 mg

మహిళలకు పైన పేర్కొన్న పరిమాణాలు కాకుండా, చిన్నపిల్లలకు పాలిచ్చే తల్లులు విటమిన్ E ని అదనంగా తీసుకోవాలి. పాలిచ్చే మహిళలకు సిఫార్సు చేయబడిన విటమిన్ E యొక్క రోజువారీ మోతాదు 19mg.


విటమిన్ E యొక్క దుష్ప్రభావాలు 

రోజువారీగా సిఫారసు చేయబడిన మోతాదుల ప్రకారం విటమిన్ E ని  సేవించడం సాధారణంగా సురక్షితమే, కానీ అధిక మోతాదులో విటమిన్ E ని సేవించినట్లైతే క్రింది దుష్ప్రభావాలను కలిగిస్తుంది:  

వికారం
అలసట
అతిసారం
తలనొప్పి
మసక దృష్టి
రక్తస్రావం/బ్లీడింగ్
బొబ్బలు/పొక్కులు (రాష్)
బలహీన ఎముకలు
కడుపు తిమ్మెర్లు  
విటమిన్ E ని సేవించే ముందు గుర్తించుకోవాల్సిన అంశాలు

మీరు చక్కెరవ్యాధి (డయాబెటిక్) ని కల్గి ఉంటే, విటమిన్ E ని  తీసుకోకూడదు, ఎందుకంటే విటమిన్ E సేవనం వల్ల మీకు స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది కాబట్టి.  
గుండె పోటు, హృదయాఘాతాలూ లేదా స్ట్రోక్ వంటి తీవ్రతరమైన జబ్బుల చరిత్ర కలిగిన వ్యక్తులు విటమిన్ E ని తీసుకోనే కూడదు, ఎందుకంటే మారణాంతకమైన సమస్యలను నివారించడానికి.  
విటమిన్ E రక్తాన్ని పలుచబరిచే లక్షణాన్ని కల్గిన ఏజెంట్ అయినందున, రక్తస్రావం వ్యాధులతో వ్యధపడుతూ ఉన్న వ్యక్తులు విటమిన్ E ని తప్పనిసరిగా తీసుకోకూడదు. ఎందుకంటే, ఇది రక్తస్రావం అయ్యే అవకాశాలను మరింతగా పెంచుతుంది కాబట్టి. ఈ ప్రభావాల కారణంగా, కీలక అవయవాలలో రక్తస్రావం అభివృద్ధి చెందడానికి అవకాశాలు కూడా పెరుగుతాయని తెలుస్తోంది. ఇలాంటివే  కారణాల వలన, ఏదైనా శస్త్రచికిత్స లేదా ఆపరేషన్ వంటి వాటిని ఇటీవల చేయించుకున్న వారు కూడా విటమిన్ E ని సేవించకూడదు. దండయాత్ర విధానాలు అనుసరించకుండా ఉండకూడదు.
విటమిన్ ‘ఇ’ సేవనం ‘ప్రోస్టేట్ కాన్సర్’ వంటి కొన్ని రకాల క్యాన్సర్ లను తెచ్చి పెట్టే  ప్రమాదం ఉంది. గతంలో మీరు ఏదేని కాన్సర్ కు చికిత్స చేయించుకుని ఉన్నట్లయితే విటమిన్ E సేవనం ఆ క్యాన్సర్ల పునరావృత సంభావ్యత కూడా పెరుగుతుంది.
విటమిన్ ‘ఇ’ పదార్ధాల సేవనం వల్ల గుండె వైఫల్యాల ప్రమాదం, మరియు అటుపైన ఆసుపత్రులపాలయ్యే ప్రమాదాన్ని పెంచుతాయి.

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇక్కడ చూడండి

రావి ఆకు కషాయం ఉపయోగాలు
ఊదలు యొక్క ఉపయోగాలు
అండు కొర్రలు యొక్క ఉపయోగాలు
శతావరి ప్రయోజనాలు, ఉపయోగాలు- దుష్ప్రభావాలు
చేప నూనె వలన కలిగే ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
సామలు యొక్క ఉపయోగాలు
అరికెలు యొక్క ఉపయోగాలు
కొబ్బరి బొండం ఒక అమృత కలశం
కరక్కాయ యొక్క పూర్తి వివరాలు
ఎండిన పండ్లు యొక్క పూర్తి వివరాలు
ద్రాక్షపళ్ళ ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
అంజీరము యొక్క ఆరోగ్య ఉపయోగములు దుష్ప్రభావాలు
మెంతులు వలన కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు
మజ్జిగ వలన కలిగే ఉపయోగాలు
రోగనిరోధక శక్తిని పెంచేదెలా ఆహారాలు -చిట్కాలు
రక్తాన్ని శుద్ధపరచుకోవడనికి గృహ చిట్కాలు
స్టార్ ఫ్రూట్ ఉపయోగాలు ప్రమాదాలు - దుష్ప్రభావాలు
చిలగడదుంప వలన కలిగే ఉపయోగాలు
సబ్జా గింజలు వల్ల కలిగే ఆరోగ్యం
పప్పులతో జబ్బులు దూరం 
గులాబీ పువ్వు వలన కలిగే ఉపయోగాలు
గురివింద గింజ వలన కలిగే ఉపయోగాలు
తాటి బెల్లం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
ఉల‌వ‌లు వలన కలిగే ఉపయోగాలు
వేగంగా బరువు తగ్గించే పానీయాలు
వెల్లుల్లి ప్రయోజనాలు ఉపయోగాలు -దుష్ప్రభావాలు
ఆరోగ్యానిచ్చే పండ్లు
పొగాకు వలన ఉపయోగాలు దుష్ప్రభావాలు
సీతాఫలం వలన కలిగే ఉపయోగాలు దుష్ప్రభావాలు
సోంపు (ఫెన్నెల్ విత్తనాలు) ప్రయోజనాలు దుష్ప్రభావాలు
టమాటా ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
శంఖపుష్పి ప్రయోజనాలు మోతాదు - దుష్ప్రభావాలు
అర్జున చెట్టు బెరడు ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
ఉత్తరేణి వలన కలిగే ఉపయోగాలు
కానుగ చెట్టు వలన కలిగే ఉపయోగములు
జీర్ణశక్తిని పెంచుకునేదెలా ఆహారాలు -చిట్కాలు
లావణ్యానికి సుగంధ తైలం
సంతులిత ఆహారం యొక్క చార్ట్, ప్రాముఖ్యత ప్రయోజనాలు
అనులోమ విలోమ ప్రాణాయామ యొక్క ప్రక్రియ దశలు 
పసుపు యొక్క ప్రయోజనాలు ఉపయోగాలు  దుష్ప్రభావాలు
 నల్ల జిలకర ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
ముఖానికి, జుట్టుకి మరియు చర్మానికి ముల్తానీ మట్టి  ప్రయోజనాలు
మొక్కజొన్న వలన కలిగే ఉపయోగాలు
లీచీ పండు ఎంతవరకు ఆరోగ్యకరం
అరటి పండు ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
ఆముదంను జుట్టు పెరగడానికి ఎలా ఉపయోగించాలి
కాల్షియం ఆహారాలు వనరులు ప్రయోజనాలు దుష్ప్రభావాలు
కార్బోహైడ్రేట్లు ఆహారాలు వనరులు ప్రయోజనాలు దుష్ప్రభావాలు
ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
అల్ఫాల్ఫా ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
ప్రోటీన్ ఆహారాలు ప్రయోజనాలు ఉపయోగాలు దుష్ప్రభావాలు
ఆపిల్ ప్రయోజనాలు, కేలరీలు పోషక విలువలు, దుష్ప్రభావాలు  
పిస్తా పప్పు ప్రయోజనాలు, ఉపయోగాలు దుష్ప్రభావాలు
సగ్గుబియ్యం వలన కలిగే ప్రయోజనాలు  దుష్ప్రభావాలు
గోధుమ గడ్డి వలన కలిగే ఉపయోగాలు
సోయాబీన్ వలన కలిగే ప్రయోజనాలు  దుష్ప్రభావాలు
జిలకర జీలకర్ర విత్తనాల ప్రయోజనాలు   దుష్ప్రయోజనాలు

0/Post a Comment/Comments

Previous Post Next Post