తెలంగాణలో ఎల్‌ఆర్‌ఎస్‌ను ఎలా దరఖాస్తు చేయాలి How to apply LRS in Telangana LRS Status LRS Application Status -

తెలంగాణలో ఎల్‌ఆర్‌ఎస్‌ను ఎలా దరఖాస్తు చేయాలి

తెలంగాణ  రాష్ట్రంలో  అక్రమ లే అవుట్లు,మరియు ఇంటి  ప్లాట్లు,  ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఆఖరి అవకాశం కల్పించింది. ఇందు కోసం ఎల్ఆర్ఎస్-2020 [లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్-2020[ పేరుతో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అసలు ఎల్ఆర్ఎస్ అనగా  ఏంటి, దాని కోసం  ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఒకసారి చూద్దాం. తెలంగాణ ప్రభుత్వ విధివిధానాలు పాటించకుంటా నిర్మించిన అక్రమ లే అవుట్లు, అక్రమ స్థలాల్లో నిర్మించిన లే అవుట్లను [అన్ అప్రూవుడ్ ]లే అవుట్లు అంటారు. ఇట్టి  స్థలాలను తప్పకుండా క్రమబద్ధీకరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఇందుకోసం ఒక కొత్త  జీవో కూడా విడుదల చేసింది.


రెగ్యులరైజేషన్‌కు ఈ  అక్టోబరు 31 వరకు అవకాశం కల్పించింది. ఆన్లైన్ మరియు  మీ సేవల్లో దరఖాస్తు, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ఐదు లేదా  పది నిమిషాల్లోనే దీన్ని పూర్తి చేసుకోవచ్చు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ లో , అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లో , మున్సిపల్ కార్పొరేషన్ లో , మున్సిపాలిటీల లో , గ్రామ పంచాయతీ ల్లోని స్థలాలను ఆన్లైన్లో ఫీజు చెల్లించి క్రమబద్ధీకరించు కోవచ్చు. వ్యక్తిగత స్థలాలకు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ ఫీజు వెయ్యి రూపాయలు చెల్లించాలి . డెవలపర్లు అభివృద్ధి చేసిన లే అవుట్లకు అప్లికేషన్ ఫీజును పదివేల రూపాయలుగా ధర  నిర్ణయించింది. వంద గజాల లోపు ఉన్న ప్లాట్లకు గజానికి రెండు వందల రూపాల  చొప్పున రెగ్యులరైజేషన్ రుసుము చెల్లించాలి. వంద నుంచి మూడు వందల గజాలు  ఉన్న స్థలాలకు, ఒక్కో గజానికి నాలుగు వందల రూపాల చొప్పున రెగ్యులరైజేషన్ ఫీజు చెల్లించవచ్చు .How to apply LRS in Telangana LRS Status LRS Application Status - Know your LRS 2020 Application Status Online in Telangana State

తెలంగాణలో ఎల్‌ఆర్‌ఎస్‌ను ఎలా దరఖాస్తు చేయాలి


ఎల్ఆర్ఎస్‌ ను  ఎలా దరఖాస్తు చేసుకోవాలి?


ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ దరఖాస్తు పూర్తి చేయడం చాలా సులభం ఉన్నది . ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ సదుపాయం ఉంటే పది నిమిషాల్లోనే పని పూర్తి ఆన్లైన్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలను చూద్దాం.


1.ముందు ఇంటర్నెట్ సదుపాయం ఉండే స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్టాప్ తీసుకోవాలిగూగుల్.  క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో ఎల్ఆర్ఎస్.తెలంగాణ.జీవోవీ.ఇన్ (www.lrs.telangana.gov.in)అని టైప్ చేస్తే నేరుగా వెబ్సైట్లోకి వెళ్లొచ్చు.


2. అప్పుడు స్కీన్ మీద లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని కనిపిస్తుంది. అక్కడ అడిగే వివరాలను ఒకదాని తరువాత ఒకటి వరసగా  పొందుపరచాలి. మీ ఫోన్ నంబరు ఎంటర్ చేయాలి. మనం ఇచ్చిన మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని బాక్స్లో ఎంటర్ చేయాలి.


3. ఆ తరువాత వ్యక్తిగత స్థలాలను రిజిష్టర్ చేసుకోవాలంటే ఇండివిడ్యువల్ లే అవుట్నును సెలక్ట్ చేసుకోవాలి , డెవలపర్లు అయితే మొత్తం లే అవుట్ ఆప్షన్ను సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ స్థలాలకు సంబంధించిన వివరాలన్నీ కనిపిస్తాయి.4. మీ ప్లాట్ హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నదా , మున్సిపాలిటీ, మన్సిపల్ కార్పొరేషన్ లేదా గ్రామ పంచాయతీ పరిధిలో ఉందా అనే వివరాలు వరుసగా  పొందుపరచాలి. ప్లాట్ ఉన్న జిల్లా పేరు అడుగుతుంది.


5. తరువాత  ఎంపిక చేసుకున్న  జిల్లాలో ఏ లోకాలిటీలో స్థలం ఉందో ఎంటర్ చేయాలి. ఇవన్నీ ఇన్ బిల్ట్గానే మనకు కనిపిస్తాయి. మనం నేరుగా వాటిని ఎంపిక చేసుకుని తరువాత ముందుకు  వెళ్లాలి.


6. ప్లాట్, లే అవుట్ పరిధి ఏ జిల్లా  లోకాలిటీ కిందకు వస్తుందో తెలిపిన తరువాత మీ ప్లాట్ నంబరును, సర్వే నంబరును ఎంటర్ చేసుకోవాలి . డాక్యుమెంట్లో ఉన్న సర్వే నంబర్లు, ఏరియా ఎంత, ఎన్ని స్కోయర్ యార్డులు ఉందో ఎంటర్ చేసుకోవాలి .


7. మన డాక్యుమెంట్ నంబరు, దాన్ని మనం ఏ సంవత్సరంలో రిజిస్ర్టేషన్ చేసుకున్నాం, ఏ ఏరియా సబ్ రిజిస్ర్టేషన్ ఆఫీసులో చేశామనే వివరాలను ఎంటర్ చేసుకోవాలి.


8.  మీ డాక్యుమెంటు మొదటి పేజీని, లే అవుట్ కాపీని ముందే స్క్యాన్ చేసి పెట్టుకోవాలి. అవి 1ఎంబీ సైజులోనే ఉండాలి. లే అవుట్ దగ్గర మన డాక్యుమెంట్లో ఉన్న ప్లాన్ను అప్లోడ్  చేసుకోవాలి. ఆ తరువాత ఆధార్ నంబరు ఎంటర్ చేసుకోవాలి.


How to apply LRS in Telangana LRS Status LRS Application Status - Know your LRS 2020 Application Status Online in Telangana State How to apply LRS in Telangana LRS Status LRS Application Status - Know your LRS 2020 Application Status Online in Telangana State

9. మన వ్యక్తిగత వివరాలను .. పేరు, తండ్రి పేరు, లింగం, డోర్ నంబరు, వీధి నంబరు, లోకాలిటీ, పిన్కోడ్.. వంటివన్నీ ఎంటర్ చేసుకోవాలి. ఈ మెయిల్ ఐడీ ఉంటే ఇవ్వాలి. ముందు ఇచ్చిన ఫోన్ నంబరుతో పాటు రెండో నంబరును కూడా తప్పనిసరిగా ఎంటర్ చేసుకోవాలి.


10. ఇండివిడ్యువల్ ప్లాట్ అయితే ఒక వెయ్యి రూపాయలు చెల్లించాలి. డెవలపర్ లేఅవుట్ అయితే పదివేల రూపాయలను  చెల్లించాలి. మీ స్థలం ఎన్ని గజాలు ఉంటే దాని ప్రకారం ఎల్ఆర్ఎస్ రిజిస్ర్టేషన్ ఫీజు చెల్లించాలి. అన్ని కార్డు ల ద్వారా  లేదా మొబైల్ వ్యాలట్ల నుంచి కూడా డబ్బు చెల్లించొచ్చు. మీరు డబ్బు చెల్లించిన తరువాత ఒక రిసిప్ట్ వస్తుంది. గుగూల్ ప్లే స్టోర్ నుంచి ఎల్ ఆర్ ఎస్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని, దాంట్లో కూడా సులభంగా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్  చేసుకోవచ్చు.


ఇక్కడ అధికారిక వెబ్‌సైట్ క్లిక్ చేయండి


0/Post a Comment/Comments

Previous Post Next Post