కరక్కాయ యొక్క పూర్తి వివరాలు

కరక్కాయ  యొక్క  పూర్తి వివరాలు


కరక్కాయ శాస్త్రీయ నామం టెర్మినాలియా చెబుల్లా. చెబ్యులిక్ మైరోబాలన్, హరిటాకి, హారార్డ్ అనేవి ఇతర పేర్లు. ఇది 6-20 మీటర్ల ఎత్తువరకు పెరిగే ఒక  వృక్షం. పత్రాలు కణుపు ఒకటి లేదా రెండు చొప్పున పొడవుగా, దాదాపు కోలగా కూడా  ఉంటాయి.  కరక్కాయ చెట్టు పుష్పాలు తెలుపు లేదా లేతాకుపచ్చ రంగులో సన్నని కంకులపై నక్షత్రాల వలె వస్తాయి.   ఫలాలు కోలగా ఉండి, ఎండితే నిడుపాటి నొక్కులను కలిగి ఆగస్టు నుంచి అక్టోబరు వరకు  కూడా లభిస్తాయి. ఇది విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కరక్కాయ లేదా కరక ఔషధ జాతికి చెందిన మొక్క. కరక్కాయ త్రిఫలాలలో ఇది  ఒకటి. ఇది జీర్ణశక్తిని  బాగా వృద్ధి చేస్తుంది.

కరక్కాయ  యొక్క  పూర్తి వివరాలు


లక్షణాలు

  • నలుపు గోధుమ రంగు బెరడుతో పెరిగే  ఒక పెద్ద వృక్షం.
  • అండాకారం నుండి విపరీత అండాకారం గల సరళ పత్రాలు.
  • శాఖాయుతమైన కంకులలో అమరిన ఆకుపచ్చతో కూడిన పసుపు రంగు పుష్పాలు ఉంటాయి .
  • నొక్కులున్న ఆకుపచ్చతో కూడిన పసుపురంగు ఫలాలు.


దగ్గును తగ్గించే కరక్కాయ

దగ్గుతో బాధపడుతున్న పిల్లలకు పెద్దలకు కరక్కాయ రసం తాగిస్తుంటారు. కరక్కాయలోని ఔషధ గుణాలు దగ్గుతో పాటు పలురకాల జబ్బులను  కూడా నయం చేస్తాయి. గొంతులోని శ్లేష్మాన్ని హరించి కంఠ సమస్యలను బాగా  నివారిస్తుంది. అందుకే ప్రతి తెలుగింట్లో కచ్చితంగా కరక్కాయ ఉంటుంది.


ఔషధ గుణాలు

కరక్కాయలు విలువైన జౌషధ గుణాలను కలిగి వుంటాయి. వీటిలో యంత్రాక్వినోన్లు, టానిన్లు, ఛెబ్యులిక్ ఆమ్లం, రెసిన్, స్థిర తైలం మొదలనవి ఉంటాయి. అన్ని రకాల జీర్ణకోశ వ్యాధులు, అస్తమా, దగ్గు, వాంతులు మరియు  కంటి వ్యాధులు,  గుండె జబ్బుల నివారణకు  కూడా ఉపయోగపడుతుంది. దగ్గు నివారణకు కరక్కాయ వాడటం ప్రముఖ గృహ వైద్యం. ఆయుర్వేద వైద్యంలో దీన్ని బాగా  విరివిగా వాడతారు.


కరక్కాయ  ఉపయోగాలు


కరక్కాయ చూర్ణాన్ని రోజువారీగా మోతాదుకు టీ స్పూన్ చొప్పున రెండు పూటలా సమాన భాగం బెల్లంతోగాని, అర టీస్పూన్ శొంఠి పొడితో గాని, పావు టీ స్పూన్ సైంధవ లవణంతో గాని కలిపి తీసుకుంటే ఆకలి  బాగా పెరుగుతుంది.

కరక్కాయలు, పిప్పళ్లు, సౌవర్చలవణం వీటిని సమానంగా తీసుకొని విడివిడిగా పొడిచేసి, అన్నీ కలిపి నిల్వచేసుకొని మోతాదుగా అర టీ స్పూన్ చొప్పున అర కప్పు నీళ్లతో కలిపి తీసుకుంటే ఆకలి  బాగా పెరుగుతుంది.

 పేగుల్లోనూ, ఛాతి భాగంలోనూ, గొంతు భాగంలోనూ మంటగా అనిపిస్తుంటే కరక్కాయ చూర్ణాన్ని ఎండుద్రాక్షతో కలిపి నూరి తేనె, చక్కెర చేర్చి తీసుకుంటే ఉపశమనం  కూడా లభిస్తుంది. (వృంద మాధవ)

అజీర్ణంతో ఇబ్బంది పడుతున్నప్పుడు, పరిపూర్ణమైన బలంతో ఉన్నవారు ఆహారానికి గంట ముందు కరక్కాయ చూర్ణాన్ని, శొంఠి చూర్ణాన్ని సమభాగాలుగా కలిపి టీ స్పూన్ మోతాదుగా, అర కప్పు నీళ్లతో తీసుకోవాలి.


  త్రిసమ:


కరక్కాయలు, పిప్పళ్లు, శొంఠి వీటిని త్రిసమ అంటారు. వీటిని సమాన భాగాలుగా చూర్ణంగాచేసి తీసుకుంటే ఆకలి పెరగటమే కాకుండా అతి దప్పిక నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

కరక్కాయ చూర్ణాన్ని, వేపమాను బెరడు చూర్ణాన్ని సమాన భాగాలుగా కలిపి మోతాదుగా అర టీ స్పూన్ చొప్పున అర కప్పు నీళ్లతో కలిపి రెండుపూటలా తీసుకుంటే ఆకలి పెరగుతుంది.  చర్మంమీద తరచూ తయారయ్యే చీముగడ్డలు, చర్మ సంబంధమైన ఫంగల్ ఇనె్ఫక్షన్లు మరియు  తామర చర్మ రోగాలూ వీటన్నిటి నుంచీ ఉపశమనం కూడా  లభిస్తుంది.

అజీర్ణం, ఆమ దోషం, అర్శమొలలు, మలబద్ధకం సమస్యలతో రోజువారీగా కరక్కాయ చూర్ణాన్ని అర చెంచాడు చొప్పున సమాన భాగం బెల్లంతో కలిపి తీసుకుంటే హితకరంగా  కూడా  ఉంటుంది.

 అధిక లాలాజలస్రావంతో ఇబ్బంది పడేవారు కరక్కాయ చూర్ణాన్ని భోజనం తరువాత అర టీ స్పూన్ మోతాదుగా అర కప్పు నీళ్లతోగాని, చెంచాడు తేనెతోగాని కలిపి తీసుకోవాలి.

వికృతి చెందిన త్రి దోషాలను తిరిగి సమస్థితికి తెచ్చి పరిపూర్ణమైన ఆరోగ్యా న్ని పొందాలంటే కరక్కాయ, సైంధవ లవణం, పిప్పళ్లు, శొంఠి ఈ నాలుగింటి చూర్ణాలనూ సమాన భాగాలు కలిపి నిల్వచేసుకొవాలి.   మోతాదుకు అర టీ స్పూన్ చొప్పున నీళ్లతో జారుడుగా కలిపి రెండు పూటలా ఔషధగా  తీసుకోవాలి. ఈ ఔషధ యోగం ఆకలిని, అరుగుదలను ఏక కాలంలో  బాగా వృద్ధిపరుస్తుంది.

 కరక్కాయలను నేతిలో వేయించి దంచి పొడిచేయాలి. దీనిని సమాన భాగం బెల్లంతోనూ, సమాన భాగం పిప్పళ్ల చూర్ణంతోనూ కలిపి మోతాదుకు అర టీ స్పూన్ చొప్పున రెండు పూటలా తీసుకుంటే అరుగుదల పెరిగి అర్శమొలల వ్యాధినుంచి ఉపశమనం లభిస్తుంది, మూలవ్యాధి వల్ల మలబద్ధకం ప్రాప్తించినట్లైతే కరక్కాయల చూర్ణాన్ని తెల్లతెగడ వేరు చూర్ణం, శుద్ధిచేసిన నేపాళం గింజల చూర్ణంతో కలిపి పావు టీస్పూన్ మోతాదులో కూడా  తీసుకోవాలి. ఇది ఉగ్ర ఔషధం. జాగ్రత్తగా ఉండాలి. తీవ్ర స్థాయిలో విరేచనాలవుతాయి.

బాగా కాగే గోమూత్రంలో కరక్కాయలను వేసి ఉడికించి అరబెట్టి, దంచి పొడిచేసి నిల్వచేసుకోవాలి. దీనిని ప్రతిరోజూ ఉదయం అర టీ స్పూన్ మోతాదుగా లేదా ఎవరి బలాన్నిబట్టి వారు మోతాదును నిర్ణయించుకొని గాని, తేనెతో కలిపి తీసుకుంటే మొలల వ్యాధినుంచి ఉపశమనం లభిస్తుంది.

కరక్కాయల చూర్ణాన్ని, బెల్లాన్ని కలిపి భోజనానికి ముందు చెంచాడు మోతాదుగా రెండు పూటలా తీసుకుంటూ ఉంటే పైల్స్  కూడా తగ్గుతాయి.


పైల్స్‌వల్ల మలద్వారం వద్ద దురద తయారై ఇబ్బంది పెడుతుంటే కరక్కాయ చూర్ణాన్ని అర చెంచాడు మోతాదుగా సమాన భాగం బెల్లంతో కలిపి ఉండ చేసి తినాలి.

 అర్శమొలలు మొండిగా తయారై ఇబ్బంది పెడుతున్నప్పుడు కరక్కాయల చూర్ణం, బెల్లం సమంగా కలిపి అర చెంచాడు మోతాదులో వాడాలి. తరువాత ఒక గ్లాసు మజ్జిగ తాగాలి. ఇలా రెండు పూటలా చేయాలి.

 కరక్కాయలు, వెల్లుల్లి ఒక్కోటి ఒక్కో భాగం గ్రహించాలి. నల్లేరు తీగ చూర్ణం 2 భాగాలు గ్రహించాలి. వీటిని కలిపి నిల్వచేసుకొని మోతాదుకు అర టీ స్పూన్ చొప్పున రెండు పూటలా సైంధవ లవణం, నువ్వుల నూనె కలిపి తీసుకుంటూ ఉంటే అర్శమొలలు ఎండిపోయి పడిపోతాయి.

కరక్కాయలు, నల్ల ద్రాక్ష వీటిని పచ్చిగా ఉన్నప్పుడు ముద్దుచేసి గాని లేదా ఎండబెట్టి, పొడిచేసి గాని పూటకు టీ స్పూన్ చొప్పున రెండు పూటలా తీసుకుంటే శరీరాంతర్గతంగా జరిగే రక్తస్రావాలు, పెరుగుదలలు, దీర్ఘకాలపు జ్వరం వంటివి కూడా  తగ్గుతాయి.

 కరక్కాయ చూర్ణాన్ని అర టీ స్పూన్ చొప్పున సమాన భాగం తేనెతో కలిపి తీసుకుంటే శరీరాంతర్గతంగా జరిగే రక్తస్రావాలు ఆగటంతో పాటు కడుపునొప్పి, ఆమాతిసారం వంటివి తగ్గుతాయి.

 కరక్కాయ చూర్ణాన్ని ఒక  మాత్రలో తేనెతో కలిపి అవసరానుసారం మూడు లేదా నాలుగుసార్లు తీసుకుంటే వాంతులు, వికారం వంటివి సమసిపోతాయి.


మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇక్కడ చూడండి

శనగ పప్పు యొక్క ప్రయోజనాలు దుష్ప్రభావాలు
ఆర్గాన్ నూనె యొక్క ప్రయోజనాలు
కుసుమ నూనె వల్ల కలిగే ప్రయోజనాలు
విటమిన్ కె ప్రయోజనాలు వనరులు మరియు దుష్ప్రభావాలు
కాపెరిన్ యొక్క ప్రయోజనాలు
ఆలివ్ ఆకు యొక్క ప్రయోజనాలు 
బచ్చలికూర యొక్క ప్రయోజనాలు
ఉల్లిపాయ రసం వల్ల కలిగే ప్రయోజనాలు
పామాయిల్ యొక్క ప్రయోజనాలు
బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు 
కరివేపాకు మసాలా వల్ల కలిగే ప్రయోజనాలు
మందార టీ వల్ల కలిగే ప్రయోజనాలు 
వెన్న యొక్క ప్రయోజనాలు
అవోకాడో ఆయిల్ యొక్క ప్రయోజనాలు
బఠానీల వల్ల కలిగే ప్రయోజనాలు 
చెరకు వల్ల కలిగే ప్రయోజనాలు
పర్స్లేన్ యొక్క ప్రయోజనాలు 
వేరుశెనగ యొక్క ప్రయోజనాలు
మార్జోరాం యొక్క ప్రయోజనాలు 
వనిల్లా యొక్క ప్రయోజనాలు
రంబుటాన్ ఫ్రూట్ యొక్క ప్రయోజనాలు
కాలీఫ్లవర్ యొక్క ప్రయోజనాలు
గార్డెనియా ప్లాంట్ యొక్క ప్రయోజనాలు
చందనం నూనె యొక్క ప్రయోజనాలు
అల్లం టీ వల్ల కలిగే ప్రయోజనాలు
పెపినో యొక్క ప్రయోజనాలు
కనోలా నూనె యొక్క ప్రయోజనాలు
జింక్ యొక్క ప్రయోజనాలు
వైన్ ఆకుల యొక్క  ప్రయోజనాలు
రోవాన్ పండు యొక్క ప్రయోజనాలు
లావెండర్ టీ యొక్క ప్రయోజనాలు
మొలకలు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు
చిక్కుడుకాయ ఆరోగ్య ప్రయోజనాలు
కర్బూజ వలన కలిగే ప్రయోజనాలు  ఉపయోగాలు
పొన్నగంటి కూర ఉపయోగాలు
వెలగపండు ఉపయోగాలు
బీరకాయల్లోని  ఆరోగ్య ప్రయోజనాలు
డార్క్‌ సర్కిల్స్‌ నివారణకు  చిట్కాలు
నిద్రలేమి అంటే ఏమిటి? సంకేతాలు, లక్షణాలు మరియు చికిత్స
చామంతి టీ వలన  కలిగే ఉపయోగాలు
చామదుంపలు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
విటమిన్ A యొక్క ప్రయోజనాలు దుష్ప్రభావాలు
నాజూకైన నడుమును పొందడమెలా
శిలాజిత్తు ప్రయోజనాలు ఉపయోగాలు దుష్ప్రభావాలు
జిన్సెంగ్ యొక్క ప్రయోజనాలు
గర్భంతో ఉన్నపుడు ఏమి తినాలి, ఏమి తినకూడదు
గోంగూర వలన కలిగే ఉపయోగాలు
డ్రాగన్ ఫ్రూట్  యొక్క ప్రయోజనాలు
దురియన్ పండు యొక్క ప్రయోజనాలు
పండ్లను పోలిన పండ్లు
ఆవాలు వలన కలిగే  ఆరోగ్య ప్రయోజనాలు
సెలెరీ వల్ల కలిగే ప్రయోజనాలు 
పాల‌కూర‌తో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు
వంకాయ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
కొర్రలు యొక్క ఉపయోగాలు 
Home Made హెర్బల్ షాంపూ
పనసపండు ప్రయోజనాలు, పోషణ - దుష్ప్రభావాలు
త్రిఫల యొక్క ప్రయోజనాలు దుష్ప్రభావాలు
నేరేడు పళ్ళు ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
ఏ సిరిధాన్యం ఏయే వ్యాధులను తగ్గిస్తుంది
కాల్షియం అధికంగా ఉండే భారతీయ ఆహారాలు
పుదీనా ఆకుల పేస్ట్‌ తో ఉపయోగాలు
ఉల్లికాడలు వలన కలిగే ఉపయోగాలు
పుదీనా ఆకులతో ముఖ సౌందర్యం
క్యారెట్ వలన ఉపయోగాలు దుష్ప్రభావాలు
శరీర దుర్వాసన పోవాలంటే ఏం చేయాలి?
జాస్మిన్ ఆయిల్ ఉపయోగాలు / ప్రయోజనాలు
ఉదయాన్నే చేయవల్సిన పనులు
బేకింగ్ సోడా వల్ల కలిగే ప్రయోజనాలు దుష్ప్రభావాలు
తులసి ఆరోగ్య రహస్యాలు
చలిని తగ్గించే ఆహారం
ఆల్‌బుకారాపండ్లు వలన కలిగే ఉపయోగాలు
కాకరకాయ వలన కలిగే ఉపయోగాలు
అలోవెరా (కలబంద) యొక్క ఉపయోగాలు -దుష్ప్రభావాలు
అసాధారణ ప్రయోజనాలనందించే తాటి బెల్లం
అవిసె గింజలు ప్రయోజనాలు, ఉపయోగాలు, -దుష్ప్రభావాలు
గోధుమ వలన ఉపయోగాలు దుష్ప్రభావాలు
పెసలు వలన కలిగే ప్రయోజనాలు
పుచ్చకాయ వలన కలిగే ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
అలసటను దూరము చేసే ఆహారము
మార్నింగ్ వాక్‌తో ప్రయోజనాలు
బియ్యం కడిగిన నీటితో ఉపయోగాలు
జలుబు,దగ్గును దూరం చేసే చిట్కాలు
ఆరోగ్యపరంగా తమలపాకు ఉపయోగాలు
కరివేపాకు కషాయం ఉపయోగాలు
మెంతి ఆకు కషాయం ఉపయోగాలు
జామ ఆకు కషాయం ఉపయోగాలు
సదాపాకు కషాయం ఉపయోగాలు
తమలపాకు కషాయం ఉపయోగాలు
రావి చెట్టు ఉపయోగాలు ప్రయోజనాలు - దుష్ప్రభావాలు

0/Post a Comment/Comments

Previous Post Next Post