త్రిఫల యొక్క ప్రయోజనాలు దుష్ప్రభావాలు

త్రిఫల యొక్క ప్రయోజనాలు దుష్ప్రభావాలు


త్రిఫల చూర్ణం అంటే ఏంటి? 


త్రిఫలచూర్ణం ఒక పేరుపొందిన ఆర్వేద సూత్రీకరణ. ఇది ఉసిరి (Emblica officinalis) , బీబీటకి లేదా బహెదా (terminalia bellirica) మరియు కాకరకాయ (Terminalia chebula) అనే మూడు పళ్లతో తయారు చెయ్యబడినది. నిజానికి త్రిఫల అనగా మూడుపళ్ళు అని కూడా అర్ధము. ఆయుర్వేదంలో త్రిఫల ముఖ్యముగా దానియొక్క "రసాయన" లక్షణాల గురించి కోరింది .  ఈ సూత్రీకరణ ఆరోగ్యాన్ని, శరీరము యొక్క తేజాన్ని మరియు వ్యాధుల నివారాణాన్ని నిర్వహించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.


త్రిఫల చూర్ణం ఈ మూలికల యొక్క సమాహారం:


ఉసిరి (Emblica officinalis):

మన దేశమంతా దొరికే ఒక సాధారణ పండు, దీనిని భారత గూసెబేరి అని కూడా పిలుస్తారు. ఉసిరి పండులో పీచు మరియు  యాంటీఆక్సిడెంట్స్, ఖనిజాలు అధికముగా ఉంటాయి. అలాగే ఇది విటమిన్ సి కి ప్రపంచములోనే అతి పెద్ద మూలకం. సాధారణంగా ఇది ఆంత్రము (gut) యొక్క ఆరోగ్యాన్ని, మలబద్దకాన్ని నివారించడంలోనూ, రోగములతో పోరాడడంలోనూ, వయసును తగ్గించడంలోనూ కూడా ఉపయోగపడుతుంది.

బహెదా (Terminalia bellirica):

ఈ మొక్క భారతీయ ఉపఖండం అంతటా కనుగొనబడింది. ఔషధ వ్యవస్థ మరియు ఆయుర్వేదం, యాంటీఆక్సిడెంట్, హెపాటోప్రొటెక్టివ్ (కాలేయం కోసం మంచి) శ్వాసకోశ సమస్యల చికిత్సలో మరియు డయాబెటిస్ వంటి చికిత్సలో రూపంలో దాని ఉపయోగాన్ని కనుగొంది. ఆయుర్వేదం ప్రకారం, గ్లేకోసైడ్, టానిన్లు, గల్లిక్ యాసిడ్, ఇథిల్ గెలేట్ వంటి జీవసంబంధమైన మిశ్రమాలలో బహెదా పండు చాలా బాగుంది. ఈ సమ్మేళనాలు బహెదా యొక్క ఆరోగ్య ప్రయోజనాలకు చాలా బాధ్యత వహిస్తాయి.

కాకరకాయ (Terminalia chebula):

కాకరకాయ ఆయుర్వేదం కు తెలిసిన అతి ముఖ్యమైన మూలిక. దాని ఆరోగ్య ప్రయోజనాలు ఒక యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు వృద్ధాప్యం వ్యతిరేక నుండి ఒక అద్భుతమైన పుండును తగ్గించే ఏజెంట్ వరకు ఉంటుంది. కాలేయం, కడుపు, హృదయం మరియు మూత్రాశయం యొక్క సాధారణ పనితీరును పునరుద్ధరించడం మరియు నిర్వహించడం లాంటి ప్రయోజనాలు ఆయుర్వేదలో బాగా తెలుసు. వాస్తవానికి దీనిని "ఔషధం రాజు" అని కూడా పిలుస్తారు.

మీకు తెలుసా?


ఆయుర్వేదంలో, శరీరంలోని మూడు దోషాలను (వాతా, పిట్టా మరియు కఫా) సమతుల్యం చేసేదానిలా త్రీఫల ను పిలుస్తారు. ఆయుర్వేద ఔషధం చేత వివరించబడిన రాజాస్ లేదా రుచిలలో ఐదు రుచులను కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. ఇది తీపి, పుల్లని, వగరు, చేదు మరియు గాఢమైనది. అది కలిగి ఉండని రుచి ఉప్పు మాత్రమే.


 • త్రిఫల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు 
 • త్రిఫలను ఎలా వాడాలి
 • త్రిఫల మోతాదు 
 • త్రిఫల యొక్క దుష్ప్రభావాలు 


త్రిఫల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు 

ఆయుర్వేదంలో త్రిఫల మొదటి చైతన్యం నింపే మూలిక .  ఇది చాలా వ్యాధుల నివారణలో వాడతారు. నిజానికి త్రిఫల మన శరీరం పై చూపే శ్రద్ధ మన తల్లి మన పై చూపే శ్రద్ధ లాంటిదని ఆయుర్వేదంలో నమ్ముతారు. అసలు ఏంటి ఈ సూత్రీకరణలో గొప్పదనం? అని ఎవరైనా అడగవచ్చు. కాబట్టి మనం త్రిఫల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు .

క్రమముగా త్రిఫల ను తినదనడం వల్ల బరువు తగ్గుతుంది అని పరిశోధనలు తెలుపుతున్నాయి, ఇది ముఖ్యముగా ఉబకాయులలో గమనించవచ్చు అని వివిధ  పరిశోధనలలో తేలింది

ఆయుర్వేద వైద్యులు, బలహీనమైన కంటి చూపును మెరుగుపరచేందుకు, త్రిఫలను ఒక ముఖ్యమైన వస్తువుగా సూచిస్తారు. కళ్ళ సమస్యలకు త్రిఫల ఒక మంచి మందు.  

త్రిఫలలో  యాంటియోక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి అవి జుట్టు ఎదుగుదలకు ఎంతో ముఖ్యమైనవి.

క్రమముగా త్రిఫల ను తినడం వల్ల మలబద్దకం, క్రమరహిత ప్రేగులు, మూత్రనాళం మరియు కడుపు నొప్పి తగ్గించడంలో ప్రభావం చూపిస్తుందని పరిశోధనలు తెలుపుతున్నాయి .

త్రిఫలకు ఉన్న  యాంటియోక్సిడెంట్, యాంటీఇన్ఫ్లమ్మెటోరీ మరియు యాంటీమైక్రోబియల్ అనే లక్షణాలు, పంటి సమస్యలను నివారించడంలోను అలాగే పంటి ఆరోగ్యానికీ ఎంతో ముఖ్యం.

ఆయుర్వేదంలో త్రిఫలను ఒక యాంటీమైక్రోబియల్ కర్తగా ఉపయోగిస్తారు. అధ్యయనాలు కూడా త్రిఫల యొక్క యాంటీమైక్రోబియల్, యాంటీబ్యాక్టీరియాల్ సామర్ధతను తెలిపాయి.

త్రిఫల  విటమిన్ సి, పోలీఫెనోల్స్ మరియు ఇతర యాంటియోక్సిడెంట్స్ కు గొప్ప మూలకం. కాబట్టి అది శరీరంలో ఫ్రీ రెడిడల్స్ చేసే నష్టాన్ని బాగా తగ్గిస్తుంది.

త్రిఫల శరీరంలో ఒక శక్తివంతమైన హైపోగలైసెమిక్ (hypoglycemic) (చెక్కెరను తగ్గించేది) గా పనిచేస్తుంది. అధ్యయనాలు, త్రిఫల ఒక వాణిజ్య పరంగా లభించే యాంటిడియాబెటిక్ మందుల వలె పనిచేస్తుందని తెలుపుతున్నాయి.

త్రిఫల ఒక అద్భుతమైన యాంటీఇన్ఫ్లమేటరీ మరియు యాంటియోక్సిడెంట్ చర్యలను కలిగి ఉంది. ఈ రెండు లక్షణాలు దానిని ఒక శుద్ధమైన, ఆర్థరైటిస్ను తగ్గించే ఓషధంగా చేసాయి.

త్రిఫల యొక్క యాంటీక్యాన్సర్ చర్యలు తెలుసుకోవడానికి అనేక అధ్యయనాలు జరపడం జరిగింది, అవన్నీ కూడా త్రిఫల ఒక గోప్ప యాంటీక్యాన్సర్ ఓషధం అని తెలిపాయి.

 • బరువు తగ్గడం కోసం త్రిఫల 
 • కళ్ళ కోసం త్రిఫల చూర్ణం 
 • జుట్టు కోసం త్రిఫల 
 • మలబద్దకం కోసం త్రిఫల 
 • పంటి కోసం త్రిఫల 
 • త్రిఫల ఒక యాంటీమైక్రోబియల్ 
 • త్రిఫల ఒక యాంటియోక్సిడెంట్
 • మధుమేహం కోసం త్రిఫల 
 • త్రిఫల ఒక యాంటిఆర్థ్రటిక్ 
 • త్రిఫల యొక్క యాంటీక్యాన్సర్ లక్షణాలు 


బరువు తగ్గడం కోసం త్రిఫల 

క్రమముగా త్రిఫల ను తినదనడం వల్ల బరువు తగ్గుతుంది అని పరిశోధనలు తెలుపుతున్నాయి;. ముఖ్యముగా ఊబకాయులలో. మనుషుల మీద చేసిన తాజా పరిశోధనలో, 16 నుంచి 60 మధ్య వయసుగల ఊబకాయులని రెండు బృందాలు గా విభజించి, బరువు తగ్గించడంలో త్రిఫల యొక్క ప్రయోజనాన్ని పరీక్షించారు. ఒక బృందానికి మాత్రం 5 గ్రాముల త్రిఫల ను తినడానికి రోజుకి రెండుసార్లు ఇచ్చి, వేరే బృందానికి త్రిఫల బదులుగా ప్లాసిబో ను ఒక 12 వారల పాటు ఇచ్చారు. త్రిఫలను తిన్న బృందంలో నడుము మరియు తుంటి చుట్టు కొలత ముఖ్యముగా తగ్గినట్లు గమనించారు. ఇంకా మనం ప్రేగు కదలికలో త్రిఫల యొక్క నియంత్రణ ప్రభావాలను చుస్తే, త్రిఫల బరువు మరింత సులభం గా తగ్గించేందుకు సహాయం చేస్తుందని కచ్చితమైనది. కాబట్టి, త్రిఫల సులువుగా బరువు తగ్గించడంలో దాని ప్రభావం చూపిస్తుందని చెప్పవచ్చును .కళ్ళ కోసం త్రిఫల చూర్ణం 

కంటి ఆరోగ్యం తో పాటుగా కంటి సంభందిత వ్యాధులు, కంటి శుక్లాలు మరియు గ్లూకోమా వంటి వాటిని తగ్గించడం అనేవి త్రిఫల సాధ్యమైయేలా చేస్తుంది. ఆయుర్వేద వైద్యులు, బలహీనమైన కంటి చూపును  బాగా మెరుగుపరచేందుకు, త్రిఫల ను ఒక ముఖ్యమైన వస్తువుగా సూచిస్తారు. ఆయుర్వేదంలో త్రిఫల ఘృత అనేది కంటి మందులలో మంచిది. ఎలాగైనా కళ్ళు అనేవి శరీరంలో సున్నితమైన భాగాలూ కాబట్టి, త్రిఫల ను కంటి కోసం ఎలా వాడాలో ఆయుర్వేద వైద్యున్ని అడగడం మంచిది.


జుట్టు కోసం త్రిఫల 

త్రిఫల యాంటియోక్సిడెంట్స్ కి మంచి మూలము, అది కాలుష్యం వల్ల జుట్టు కి కలుగు నష్టాన్ని తగ్గిస్తుంది. త్రిఫలలో ఉన్న ఉసిరి శాతం అకాలంగా జుట్టు తెల్లబడం తగ్గించడానికి, అలాగే బహెదా జుట్టు రాలడాన్ని తగ్గించడం మరియు జుట్టు కుదుళ్ళు గట్టి పడడానికి ఉపయోగపడతాయి. త్రిఫల నెత్తిలో రక్త ప్రసరణను పెంచి తద్వారా పోషకాలు మరియు ఖనిజాలు ఎక్కువగా పీల్చుకోవడాన్ని ప్రభావితం చేస్తుంది. త్రిఫల నూనెను లేక చూర్ణాన్ని కానీ ప్రత్యక్షంగా తలపై రాసుకొని దాని యొక్క పోషక మరియు రక్షక ప్రయోజనాలు పొందవచ్చును .


మలబద్దకం కోసం త్రిఫల 

ఆరోగ్యమైన మరియు శుభ్రమైన పేరు శరీర క్షేమం కోసం ఎంతో ముఖ్యం. జీర్ణ వ్యర్దాలు పేరుకుపోవడం అనేది ప్రేగు మార్గాలకు అడ్డు కలిగించడమే కాకుండా స్థిరమైన మరియు దీర్ఘకాలిక మలబద్దకం, శరీరంలో విషతుల్య పదార్దాలను పోగుచేస్తుంది. శరీరంలో విషతుల్య పదార్దాలు ఎక్కువ స్థాయిలలో ఉండడం ఆందోళన మరియు ఒత్తిడిని కలిగిస్తుంది. ఆయుర్వేద వైద్యుల ప్రకారం, శరీరంలో ప్రేగు కదలికలను క్రమము చెయ్యడంలోనూ, ప్రేగు కండరాలను బలోపేతం చెయ్యడంలోనూ త్రిఫల ఒక్క మంచి భేది మందు. ఇది కడుపు కి భారం గా ఉండదు మరియు ఎక్కువ కాలం తింటే దుష్ప్రభావాలు కూడా ఉండవు. భారతదేశంలో జరిపిన క్లినికల్ పరిశోధన ప్రకారం, క్రమముగా త్రిఫల ను తినడం వల్ల మలబద్దకం తగ్గించడం, క్రమరహిత ప్రేగులు, మూత్రనాళం మరియు కడుపు నొప్పి తగ్గించడంలో ప్రభావం చూపిస్తుందని తేలింది.


పంటి కోసం త్రిఫల 

యాంటియోక్సిడెంట్, యాంటీఇన్ఫ్లమ్మెటోరీ మరియు  యాంటీమైక్రోబియల్ అనే ప్రభావాలు, సాధారణ పంటి సమస్యల లక్షణాలు నివారించడంలోను మరియు మంచి పంటి ఆరోగ్యానికీ త్రిఫల ను ఒక గొప్ప కర్తను చేసాయి. త్రిఫల మరియు క్లోర్హేక్సిడిన్ మౌత్ వాష్ లు పళ్లలో ఫలకల నిర్మాణాన్ని, గమ్ ఇన్ఫలమేషన్ ను, నోటి క్యావిటీలలో మైక్రోబియల్లోడ్ ను చాలా సమర్థవంతంగా తగ్గించాయి అని భారతదేశంలో జరిపిన ఒక అధ్యయనం తెలుపుతుంది. మరింత అధ్యయనం ద్వారా, త్రిఫల మరియు 0.2%క్లోర్హేక్సిడిన్ తో చేసిన మౌత్ వాష్, ఆసుపత్రిలో చేరిన చిగుళ్లవ్యాధి సోకిన రోగులుల్లో గమ్ ఇన్ఫలమేషన్ మరియు ఫలక నిర్మాణాన్ని నివారించడంలో చాల ప్రభావం చూపిందని తేలింది.


త్రిఫల ఒక యాంటీమైక్రోబియల్ 

ఆయుర్వేదంలో త్రిఫలను ఒక సంప్రదాయమైన యాంటీమైక్రోబియల్ గా వాడుతారు.ఇటీవల ల్యాబ్ అధ్యయనాలు కూడా త్రిఫల యొక్క యాంటీమైక్రోబియల్, యాంటీబ్యాక్టీరియాల్ సామర్ధత ను తెలిపాయి. త్రిఫల యొక్క ఇథనాలిక్ సారాలు, హెచ్ఐవి రోగులలో సెంకడరీ వ్యాధులను కలిగించే సాధారణమైన బాక్టీరియా పై చాల విజయవంతంగా పనిచేసిందని, భారతదేశంలో జరిపిన ఒక పరిశోధన తెలిపింది. ఈ అధ్యయనం,ఎచ్చరిషియా కోలి (Escherichia coli),సాల్మొనెల్లా టైఫి (Salmonella typhi), సుడోమనస్ ఏరోజినొస (Pseudomonas aeruginosa), స్టెఫాయిలోకోకస్ ఆరెస్ (Stapylococcus aureus), విబ్రియో కలరా (Vibrio cholera) వంటి బాక్టీరియా పై త్రిఫల ప్రభావం చూపిందని కనుగొన్నారు, అయితే ఇప్పటి వరకు వీటిలో ఏ ఒక్క ప్రవభావాన్ని మానవుల పై పరీక్షించలేదు.


త్రిఫల ఒక యాంటియోక్సిడెంట్ 

త్రిఫలలో విటమిన్ సి, పోలీఫెనోల్స్ మరియు ఇతర యాంటియోక్సిడెంట్స్ కు గొప్ప మూలకాలు అవి శరీరంలో ఫ్రీ రెడిడల్స్ చేసే నష్టాన్ని ఒక శుద్ధమైన కర్తగా పోరాడుతాయి. ఫ్రీ రాడికల్స్ అనేవి ఒక రెయాక్టీవ్ ఆక్సిజన్ జాతులు అవి శరీరంలో అసాధారణ చర్యలు జరిగినప్పుడూ అలాగే వయసుతో పాటు ఏర్పాడుతాయి. కానీ కొన్ని జీవన శైలుల వాల్ల, ఆహారపు అలవాట్లవల్ల అంటే జంక్ ఫుడ్లు అతిథిగా తినడం, పొగత్రాగడం, కాలుషయం వంటి వాటి వలన ఈ ఫ్రీ రాడికల్స్ త్వరగా శరీరంలో చేరుతున్నాయి. శాస్తవేత్తలు ప్రకారం, అధిక మొత్తంలో ఫ్రీ రాడికల్స్ శరీరంలో ఉండడం అనేది చలా రకములైన ఆరోగ్య సమస్యలకు మరియు వ్యాధులకు ప్రధాన కారణం. ఎక్కువ ఫ్రీ రాడికల్ శాతం శరీరంలో ప్రధాన భాగాలైన గుండె, కాలేయం,మరియు మూత్రాశయం సరిగ్గా పనిచేయకపోవడం మరియు వాటి ఆరోగ్యన్ని ప్రభావితం చేస్తాయనీ, త్వరగా వయసు మళ్ళిన లక్షణాలు కలగడానికి ప్రధాన కారణం. కాబట్టి యాంటియోక్సిడెంట్స్ బాగా పెరిగిన ఫ్రీ రాడికల్స్ పై ఎలా పోరాటం చేస్తాయి? ఒక మంచి యాంటియోక్సిడెంట్ అనుభందకం ఫ్రీ రాడికల్స్ ను శుభ్రపరిచి మరియు న్యూట్రలైజ్ (వాటి హానిని శరీరం పై ఆపుతాయి) చేసి శరీరాన్ని త్వరిత నష్టంనుంచి కాపాడుతాయి.


మధుమేహం కోసం త్రిఫల 

శరీరంలో త్రిఫల ఒక శక్తివంతమైన హైపోగలైసెమిక్ (hypoglycemic) (చెక్కెరను తగ్గించేది). అధ్యయనాలు, త్రిఫల ఒక వాణిజ్య పరంగా లభించే యాంటిడియాబెటిక్ మందుల వలె పనిచేస్తుందని, ఇన్సులిన్ నుంచి స్రవించే ముఖ్యమైన ఎంజయ్ ములైన ఆల్ఫా - అమైలేజ్ మరియు ఆల్ఫా - గ్లూకోసైడేస్ ఆపడం ద్వారా పనిచేస్తుందని తెలుపుతున్నాయి. ఈ ఎంజయ్ ములను నిరోధించడం వల్ల, గ్లూకోస్ ఏర్పడడాన్ని మరియు దాని యొక్క తదుపరి వచ్చే వాటినిని రక్తంలోకి విడుదల కాకుండా చేస్తుంది. అందు వలన రక్తంలో చెక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. భారతదేశంలో, 45 మంది ఇన్సులిన్ అనాధారిత మధుమేహ రోగుల పై జరిపిన అధ్యయనం ప్రకారం, త్రిఫల క్రమంగా తినడం అనేది రక్తంలో చెక్కెర స్థాయిలు తగ్గించడంలో, ప్రముఖమైన ప్రభావం చూపిందని తేలింది.


త్రిఫల ఒక యాంటిఆర్థ్రటిక్ 

త్రిఫల ఒక అద్భుతమైన యాంటీఇన్ఫ్లమేటరీ మరియు యాంటియోక్సిడెంట్. ఈ రెండు లక్షణాలు దానిని ఒక శుద్ధమైన, ఆర్థరైటిస్ ను మరియు ఆర్థరైటిస్ సంబంధిత లక్షణాలను తగ్గించే అనుబంధకాలుగా చేసాయి. జంతువుల పై చేసిన అధ్యయనం ప్రకారం త్రిఫల, రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో భాధపడేవారి కార్టిలేజ్ ను, ఎముక నష్టాన్ని బాగు చేస్తుందని తేలింది.త్రిఫల యొక్క యాంటీక్యాన్సర్ లక్షణాలు 

త్రిఫల యొక్క యాంటీక్యాన్సర్ చర్యలు తెలుసుకోవడానికి చాల అధ్యయనాలు జరపడం జరిగింది, అవన్నీ కూడా త్రిఫల యొక్క యాంటీక్యాన్సర్ ఓషధ సంభవతను, ప్రభావాన్ని తెలిపాయి. ఇటీవల భారతదేశంలో చేసిన అధ్యయనంలో త్రిఫల కు ఒక గొప్ప ఆంటిప్రొలిఫరేటివ్(anti proliferative) (వృద్ధిని ఆపుచేసే) మరియు అపోప్టోటిక్(apoptatic) (కాన్సర్ కణాలను చంపే) లక్షణాలు ఉన్నాయి అని, శరీరంలో పెద్దప్రేగు కాన్సర్ కణాలలో చేసిన అధ్యయనంలో తేలింది. ప్రోస్టేట్ కాన్సర్ పై చేసిన మరింత అధ్యయనం త్రిఫలలో ఉన్న గేలిక్ యాసిడ్ (ఒక రకమైన కెమికల్ అనుభందకం) యాంటీక్యాన్సర్ చర్యలకు భాద్యత వహిస్తుందని తేలింది. అంతే కాకుండా త్రిఫల యొక్క అపోప్టోటిక్ (కణాలను చంపు) చర్య కు సాధారణ కణాల నుంచి క్యాన్సర్ కణాలను వేరుచెయ్యగల సామర్థ్యం ఉందని తేలింది. అది శరీరంలో సాధారణ కణాలపై ప్రభావం చూపకుండా కాన్సర్ కణాలను చంపగలదు. మానవులలో త్రిఫల యొక్క యాంటీక్యాన్సర్ ప్రభావాలను మరింతగా అధ్యయనం చెయ్యలేదు. కాబట్టి త్రిఫల యొక్క యాంటీక్యాన్సర్ లక్షణాలను తెలుసుకోవాలంటే ఆయుర్వేద వైద్యున్ని సంప్రదించాలి.


త్రిఫలను ఎలా వాడాలి 

త్రిఫలను సాధారణంగా పొడిలా లేక త్రిఫల “చూర్ణం" తీసుకుంటారు కానీ అది వాణిజ్యపరంగా మాత్రలు, గుళికల మరియు త్రిఫల రసంరూపంలో లభిస్తుంది. సమయోచిత ఉపయోగం కోసం త్రిఫల నూనె కూడా లభిస్తుంది.


త్రిఫల చూర్ణం తయారీలో 3మూలికల నిష్పత్తి, సాధారణంగా వ్యక్తిగత శరీర స్వభావంపై ఆధార పడి ఉంటుంది, కానీ మాములుగా 3 మూలికలు 1 (కాకరకాయ) 2 (బహెదా) 4 (ఉసిరి) నిష్పత్తిలో ఉంటాయి. 1\2 చెంచా పొడిని నీటిలో కలిపి (టీ రూపంలో) ఉదయం కానీ రాత్రి భోజనం తర్వాత కానీ తీసుకోవచ్చు. ఆయుర్వేద వైద్యులు త్రిఫల ను 3 చూర్ణాలుగా విభజించి వాటి 1:2:4 నిష్పత్తిలో తీసుకోవచ్చు అని సూచిస్తారు. బహెడా చూర్ణం భోజనం చేసే ముందు, ఉసిరి చూర్ణం భోజనం తర్వాత, కాకర చూర్ణం భోజనం తర్వాత 2-3 గంటలకి తీసుకోవాలి, ఆయుర్వేదం ప్రకారం మంచి ఫలితాల కోసం వీటిని, నెయ్యితో కానీ తేనేతో కానీ తీసుకోవాలి. క్రమంగా త్రిఫల తీసుకోవడం, జీర్ణక్రియ పెరగడానికి, శరీరానికి అవసరమైన ఖనిజాలు పోషకాలు అందించడానికి బాగా ప్రభావం చూపుతుంది. ఒకవేళ మీరు ఈ ఆరోగ్యాన్ని పెంచే ఆయుర్వేద సూత్రీకరణను ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే, త్రిఫల చూర్ణం మోతాదు కోసం తయారు చేసే విధానాల కోసం ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించాలి.


త్రిఫల గుగ్గుళ్ళు అనేవి తరచుగా త్రిఫలలా ఉండి గందరగోళాన్ని కలుగచేస్తాయి, అది ఒక ప్రత్యేకమైన సూత్రీకరణ, దానిలో త్రిఫల పళ్లతో పాటు పొడవైన పిప్పళ్లు మరియు గుగ్గిళ్ళు కలుపుతారు దానిని యాంటీఇన్ఫ్లమేటరీ తయరికి వాడుతారు.


త్రిఫల మోతాదు 

వైద్యుని సలహా ప్రకారం త్రిఫలను పరకడుపున కానీ భోజనం తర్వాత గాని తేసుకోవచ్చు. సాధారణంగా 1\2చెంచా త్రిఫల చూర్ణాన్ని టీ రూపంలో రోజుకి ఒక్కసారి తీసుకోవచ్చు. త్రిఫల చూర్ణాన్ని రోజుకి రెండు సార్లు నెయ్యితో కానీ తేనేతో కానీ తీసుకోవచ్చు, కానీ మోతాదు మాత్రం నీటితో తీసుకునే దానికంటే ప్రత్యేకంగా ఉంటుంది. త్రిఫల మోతాదు శరీర స్వభావం, వయసు, లింగము వంటి వాటి వల్ల మారుతూ ఉంటుంది, కానీ వైద్యులు రోజు 2చెంచాల కంటే మించకూడదు అంటారు.


త్రిఫల మాత్రల, గుళికల,సిరప్ యొక్క మోతాదు త్రిఫల ఉత్పత్తి సామర్థ్యం మీద, శరీరస్వభావం, శరీరశాస్త్రంతో మారుతూ ఉంటుంది. కాబట్టి మీరు దీని యొక్క ఆరోగ్యప్రయోజనాలను ఆనందిచాలి అనుకుంటే ఆయుర్వేద వైద్యున్ని సంప్రదించి మీకు తగిన మోతాదు తెలుసుకోవడం మంచిది.


త్రిఫల యొక్క దుష్ప్రభావాలు 

సాధారణంగా త్రిఫలను దీర్ఘకాలం తినడం అనేది సురక్షితమని భావిస్తారు. మీరు ఒక ఆరోగ్య కరమైన వ్యక్తి అయినా త్రిఫలను దాని యొక్క పోషక ప్రయోజనాల కోసం తీసుకోవచ్చు.కానీ దానికి కూడా కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి, మనం త్రిఫల ను ఆహరంలో తీసుకొనేఅప్పుడు వాటిని పరిగణలోకి తీసుకోవాలి.


 • త్రిఫల ఒక్క సహజ భేదిమందు. అయితే తక్కువ గ తీసుకున్నపుడు అది చాల ఉపయోగం,ఎక్కువ మోతాదులో తీసుకుంటే, అతిసారం మరియు విరేచనాలు కలుగవచ్చు.
 • ఇప్పటికే మీరు సూచించిన మందులు వాడుతుంటే, త్రిఫల ను ఆహరంలో తీసుకునే ముందు ఆయుర్వేద వైద్యున్ని అడగడం అవసరం. ఎందుకంటే అది వేరే మందుల చర్యల్లో జోక్యం చేసుకుంటుంది.
 • గర్భణి స్త్రీల మరియు పాలు ఇచ్చు తల్లులలో, త్రిఫల యొక్క పరిరక్షణకు శాస్త్రీయమైన ఆధారాలు లేవు కాబట్టి త్రిఫలను తీసుకోరాదు లేకపోతే వైదుడిని ఒకసారి కలవాలి.
 • త్రిఫల ను పిల్లలకు ఇవ్వరాదు
 • కొంత మంది త్రిఫల తీసుకుంటే నిద్రాభంగం అవుతుందా చెప్తారు కానీ అది వారు తీసుకున్న మోతాదు పై ఆధారపడుతుంది.

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇక్కడ చూడండి

రావి ఆకు కషాయం ఉపయోగాలు
ఊదలు యొక్క ఉపయోగాలు
అండు కొర్రలు యొక్క ఉపయోగాలు
శతావరి ప్రయోజనాలు, ఉపయోగాలు- దుష్ప్రభావాలు
చేప నూనె వలన కలిగే ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
సామలు యొక్క ఉపయోగాలు
అరికెలు యొక్క ఉపయోగాలు
కొబ్బరి బొండం ఒక అమృత కలశం
కరక్కాయ యొక్క పూర్తి వివరాలు
ఎండిన పండ్లు యొక్క పూర్తి వివరాలు
ద్రాక్షపళ్ళ ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
అంజీరము యొక్క ఆరోగ్య ఉపయోగములు దుష్ప్రభావాలు
మెంతులు వలన కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు
మజ్జిగ వలన కలిగే ఉపయోగాలు
రోగనిరోధక శక్తిని పెంచేదెలా ఆహారాలు -చిట్కాలు
రక్తాన్ని శుద్ధపరచుకోవడనికి గృహ చిట్కాలు
స్టార్ ఫ్రూట్ ఉపయోగాలు ప్రమాదాలు - దుష్ప్రభావాలు
చిలగడదుంప వలన కలిగే ఉపయోగాలు
సబ్జా గింజలు వల్ల కలిగే ఆరోగ్యం
పప్పులతో జబ్బులు దూరం 
గులాబీ పువ్వు వలన కలిగే ఉపయోగాలు
గురివింద గింజ వలన కలిగే ఉపయోగాలు
తాటి బెల్లం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
ఉల‌వ‌లు వలన కలిగే ఉపయోగాలు
వేగంగా బరువు తగ్గించే పానీయాలు
వెల్లుల్లి ప్రయోజనాలు ఉపయోగాలు -దుష్ప్రభావాలు
ఆరోగ్యానిచ్చే పండ్లు
పొగాకు వలన ఉపయోగాలు దుష్ప్రభావాలు
సీతాఫలం వలన కలిగే ఉపయోగాలు దుష్ప్రభావాలు
సోంపు (ఫెన్నెల్ విత్తనాలు) ప్రయోజనాలు దుష్ప్రభావాలు
టమాటా ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
శంఖపుష్పి ప్రయోజనాలు మోతాదు - దుష్ప్రభావాలు
అర్జున చెట్టు బెరడు ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
ఉత్తరేణి వలన కలిగే ఉపయోగాలు
కానుగ చెట్టు వలన కలిగే ఉపయోగములు
జీర్ణశక్తిని పెంచుకునేదెలా ఆహారాలు -చిట్కాలు
లావణ్యానికి సుగంధ తైలం
సంతులిత ఆహారం యొక్క చార్ట్, ప్రాముఖ్యత ప్రయోజనాలు
అనులోమ విలోమ ప్రాణాయామ యొక్క ప్రక్రియ దశలు 
పసుపు యొక్క ప్రయోజనాలు ఉపయోగాలు  దుష్ప్రభావాలు
 నల్ల జిలకర ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
ముఖానికి, జుట్టుకి మరియు చర్మానికి ముల్తానీ మట్టి  ప్రయోజనాలు
మొక్కజొన్న వలన కలిగే ఉపయోగాలు
లీచీ పండు ఎంతవరకు ఆరోగ్యకరం
అరటి పండు ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
ఆముదంను జుట్టు పెరగడానికి ఎలా ఉపయోగించాలి
కాల్షియం ఆహారాలు వనరులు ప్రయోజనాలు దుష్ప్రభావాలు
కార్బోహైడ్రేట్లు ఆహారాలు వనరులు ప్రయోజనాలు దుష్ప్రభావాలు
ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
అల్ఫాల్ఫా ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
ప్రోటీన్ ఆహారాలు ప్రయోజనాలు ఉపయోగాలు దుష్ప్రభావాలు
ఆపిల్ ప్రయోజనాలు, కేలరీలు పోషక విలువలు, దుష్ప్రభావాలు  
పిస్తా పప్పు ప్రయోజనాలు, ఉపయోగాలు దుష్ప్రభావాలు
సగ్గుబియ్యం వలన కలిగే ప్రయోజనాలు  దుష్ప్రభావాలు
గోధుమ గడ్డి వలన కలిగే ఉపయోగాలు
సోయాబీన్ వలన కలిగే ప్రయోజనాలు  దుష్ప్రభావాలు
జిలకర జీలకర్ర విత్తనాల ప్రయోజనాలు   దుష్ప్రయోజనాలు

0/Post a Comment/Comments

Previous Post Next Post