పనసపండు ప్రయోజనాలు, పోషణ మరియు దుష్ప్రభావాలు

పనసపండు ప్రయోజనాలు, పోషణ మరియు దుష్ప్రభావాలు 

పనసపండును, ఆంగ్లంలో జాక్ఫ్రూట్ (Jackfruit) అని పిలుస్తారు, ఇది మొరాసి కుటుంబానికి చెందిన చెట్టు. ఈ చెట్టు యొక్క పండు ఉష్ణమండల వాతావరణంలో విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. ఇది పండినప్పుడు తీపి రుచిని కలిగి ఉంటుంది మరియు లోపలి భాగం కండ కలిగి ఉంటుంది. కండకలిగిన భాగాన్ని బల్బ్ అని కూడా పిలుస్తారు, దీనిని అలాగే తినవచ్చు లేదా వివిధ వంటకాల్లో ఉపయోగించవచ్చు. పనసకాయ ఇంకా ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడు, అంటే ఇంకా ముగ్గనప్పుడు కోడి మాంసపు ఆకృతిని పోలి ఉంటుంది, ఇది పనసకాయను శాఖాహారులకు మాంసం ప్రత్యామ్నాయంగా చేస్తుంది. పనసను ఉప్పునీరు ద్రావణంలో కలిపి కేండ్ (canned) ఆహరంగా కూడా తయారు చేస్తారు, దీనిని కొన్నిసార్లు కూరగాయ మాంసం అని కూడా పిలుస్తారు.


ఈ పండు సాంప్రదాయ చైనీస్ ఔషధ విధానంలో వివిధ ప్రయోజనాల కోసం ప్రసిద్ది చెందింది.

పనస చెట్టు 50 నుండి 60 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది మరియు దీర్ఘ ఆయుష్షును కలిగి ఉంటుంది, సాధారణంగా 100 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటుంది. ఇది మే మరియు ఆగస్టు నెలల మధ్య వర్షాకాలంలో ఫలాలను ఇస్తుంది. బాగా పెరిగిన ఒక పనస చెట్టు సీజన్‌లో 100 నుండి 200 పండ్లను ఉత్పత్తి చేస్తుంది. పనస చెట్టు పండ్లు చెట్లలో కాసే అతి పెద్ద పండ్లు మరియు ఇవి 55 కిలోల వరకు బరువు పెరుగుతాయి.


పనస చెట్టు పెరగడానికి అనువైన ప్రదేశాలు ఉష్ణమండల లోతట్టు ప్రాంతాలు. ఈ చెట్టు ప్రపంచంలోని అన్ని ఉష్ణమండల ప్రాంతాలలో విస్తృతంగా సాగు చేయబడుతున్న మరియు ప్రసిద్ధ చెందిన ఆహార పదార్థం. పనస దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియా వంటకాల్లో సాధారణంగా ఉపయోగించే ఒక పదార్థం. ఇది శ్రీలంక మరియు బంగ్లాదేశ్ దేశాల యొక్క జాతీయ పండు.


భారతదేశంలోని కేరళ రాష్ట్రం ప్రపంచంలోనే అత్యధికంగా పనసపండ్లను ఉత్పత్తి చేస్తుంది.

పనసపండు ప్రయోజనాలు, పోషణ మరియు దుష్ప్రభావాలు


పనసపండు (జాక్‌ఫ్రూట్) గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు

 • శాస్త్రీయ నామం: ఆర్టోకార్పస్ హెటిరోఫిల్లస్ (Artocarpus heterophyllus)
 • కుటుంబం: మొరాసి (Moraceae)
 • సాధారణ పేర్లు: పనసకాయ/పండు జాక్ ట్రీ, ఫెన్నే, జాక్ ఫ్రూట్, 
 • సంస్కృత నామం: కథల్
 • ఉపయోగించే భాగాలు: పండ్లు, విత్తనాలు, కండకలిగిన పూల రేకులు
 • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తిర్ణం: ఉష్ణమండల ప్రాంతాలకు, ముఖ్యంగా దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియాకు చెందినవి

 1. పనసపండు పోషణ 
 2. పనసపండు ప్రయోజనాలు
 3. పనసపండు యొక్క దుష్ప్రభావాలు 


పనసపండు పోషణ 

పనసపండు యొక్క పోషక విలువ ఈ క్రింది విధంగా ఉంటుంది:

పోషకాలు  100 గ్రాములకు 

శక్తి  :- 95 కిలో కేలరీలు 

నీరు :- 73.46

కార్భోహైడ్రేట్ :- 23.25 mg

ప్రోటీన్ :- 1.72 mg

ఫ్యాట్స్ (మొత్తం లిపిడ్లు):- 0.64 mg

ఫైబర్ :- 1.5 mg

చక్కెర:- 19.08 mg


విటమిన్లు  :-

విటమిన్ ఏ :- 5 mg

విటమిన్ బి1 :- 0.105 mg

విటమిన్ బి2:- 0.055 mg

విటమిన్ బి3:- 0.920 mg

విటమిన్ బి6 :-0.329 mg

విటమిన్ బి9 :- 0.024 mg

విటమిన్ సి:- 13.7 mg

విటమిన్ ఇ :-0.34 mg


మినరల్స్

పొటాషియం :-448 mg

కాల్షియం :-24 mg

మెగ్నీషియం :-29 mg

ఫాస్ఫరస్ :-21 mg

సోడియం :-2 mg

ఐరన్ :-0.23 mg

జింక్ :-0.13 mg

ఫ్యాట్స్ 

మొత్తం:- 0.195 mg

మోనో అన్సాచురేటడ్:-0.155 mg

పోలీ అన్సాచురేటడ్:-0.094 mg

ట్రాన్స్ :-0 mg


పనసపండు ప్రయోజనాలు 

పనసపండు, రుచిలో గొప్పగా ఉండటమే కాకుండా, అనేక పోషకాలను కలిగి ఉంటుంది.ఈ  పండ్లలో లభించే అనేక రకాల బయోయాక్టివ్ సమ్మేళనాలు వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి, అవి ఈ క్రింద వివరించబడ్డాయి.


కంటి కోసం: పనసపండులో విటమిన్ ఏ మరియు కొన్ని రకాల కెరోటినాయిడ్లు ఉంటాయి ఇవి కంటి ఆరోగ్యానికి సహాయపడతాయి. దీనిలో ఉండే విటమిన్ ఏ  కంటి చుట్టూ ఉండే మ్యూకస్ పొరను కాపాడుతుంది. 

చర్మానికి: పనసపండులో ఉండే యాంటీఆక్సిడెంట్లు వృద్దాప్య లక్షణాలను ఆలస్యం చేస్తాయి, అలాగే పనసపండులోని అధిక నీటి పరిమాణం చర్మాన్ని హైడ్రేట్ చేసి చర్మం ప్రకాశవంతంగా అయ్యేలా చేస్తుంది.

ఎముకల కోసం: పనసపండులో అధిక శాతంలో కాల్షియం ఉంటుంది, ఇది రికెట్స్ మరియు ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల నివారణకు సహాయం చేస్తుంది.

రోగనిరోధక శక్తికి: పనసపండు సహజ యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి కు అద్భుతమైన మూలం. ఈ యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మరియు కొన్ని సాధారణ వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడడానికి సహాయం చేస్తాయి.

శక్తి కోసం: ఈ పండులో సుక్రోస్ మరియు ఫ్రక్టోజ్లు ఉంటాయి ఇవి త్వరగా జీర్ణం అవుతాయి మరియు తక్షణ శక్తిని అందిస్తాయి. దీనికి గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది అందువలన మధుమేహ రోగులు కూడా నియంత్రిత పరిమాణాలలో వీటిని తీసుకోవచ్చు.

జీర్ణక్రియకు: పనసపండులో అధికమొత్తంలో ఫైబర్ ఉంటుంది, తద్వారా జీర్ణ క్రియకు సహాయం చేస్తుంది. ఇది మలబద్దకాన్ని తగ్గించడంలో మరియు హేమరాయిడ్లను నివారించడంలో సహాయం చేస్తుంది. 

గుండెకు: పనసపండులో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శరీరంలో రక్తపోటును నిర్వహించడం కోసం కూడా పొటాషియం అవసరం.

 • శక్తి కోసం పనసపండు 
 • జీర్ణక్రియకు పనసపండు 
 • రక్తహీనతకు పనసపండు 
 • గుండెకు పనసపండు 
 • ఉబ్బసం కోసం పనసపండు 
 • చర్మానికి పనసపండు 
 • ఎముకలకు పనసపండు 
 • యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనసపండు 
 • రోగనిరోధక వ్యవస్థకు పనసపండు 
 • క్యాన్సర్ కోసం పనసపండు 


శక్తి కోసం పనసపండు

పనసపండులో గణనీయమైన మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ఇది కొవ్వు శాతం లేకుండా శక్తిని త్వరగా పెంచడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ పండులో సుక్రోజ్ మరియు ఫ్రక్టోజ్లు ఉంటాయి, వీటిని శరీరం సులభంగా జీర్ణం చేసుకుంటుంది. ఈ పండ్లలోని చక్కెర పరిమాణం ఎస్ఏజి [SAG] (నెమ్మదిగా లభించే గ్లూకోజ్) [SAG, Slowly Available Glucose]అనే వర్గంలో జాబితా చేయబడింది, ఇది నెమ్మదిగా పల్సటైల్ పద్ధతిలో గ్లూకోజ్‌ను విడుదల చేసే లక్షణాన్ని కలిగి ఉంటుంది; అందువల్ల, ఈ పండు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను సూచిస్తుంది. మధుమేహం ఉన్నవారికి కూడా పండు శక్తిని పెంచేదిగా పనిచేస్తుంది.  నియంత్రిత పరిమాణంలో ఈ పండును తీసుకోవడం వల్ల హైపర్ గ్లైసీమియా ప్రమాదం ఉండదు.


జీర్ణక్రియకు పనసపండు

పనసపండులో ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఫైబర్లు జీర్ణక్రియను మెరుగుపరచడంలో మరియు మలబద్దకాన్ని నివారించడంలో సహాయపడతాయి. మలబద్దకాన్ని నివారించే దాని సామర్థ్యం హేమోరాయిడ్ల నివారణకు సహాయపడుతుంది. అదనంగా, పనసపండు ప్రభావవంతమైన భేదిమందుగా పనిచేస్తుంది, ఇది గణనీయమైన మొత్తాన్ని జోడించడం ద్వారా మలాన్ని మృదువుగా చేస్తుంది, తద్వారా మల వ్యర్థాలను సమర్థవంతంగా తొలగించడానికి సహాయపడుతుంది. పనసపండు తీసుకోవడం వల్ల ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ వంటి పరిస్థితులను దూరంగా ఉంచవచ్చని అధ్యయనాలు కనుగొన్నాయి.


రక్తహీనతకు పనసపండు

పనసపండులో ఇనుము అధికంగా ఉంటుంది. ఎర్ర రక్త కణాల యొక్క హిమోగ్లోబిన్ భాగానికి ఐరన్ అవసరం, అది రక్తహీనతను నివారిస్తుంది. పనసపండు యొక్క విటమిన్ సి భాగం శరీరంలో ఐరన్ శోషణకు సహాయపడుతుంది ఎందుకంటే ఈ విటమిన్ సమక్షంలో ఐరన్ ను పీల్చుకునేందుకు/శోషించేందుకు శరీరం యొక్క సామర్థ్యం పెరుగుతుంది. అదనంగా, పనసపండులోమెగ్నీషియం మరియు కాపర్ కూడా పుష్కలంగా ఉంటాయి, రక్త నిర్మాణ ప్రక్రియలో ఇవి రెండు ముఖ్యమైన ఖనిజాలు.


గుండెకు పనసపండు 

పనసలో తగినంత మొత్తంలో లభించే మరోక ముఖ్యమైన పోషకం పొటాషియం. ఈ పోషకం శరీరంలో అనేక ఇతర విధులను నిర్వర్తించడంతో పాటు మొత్తం హృదయ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. పొటాషియం లోపం గుండె యొక్క సహజ సంకోచం మరియు రక్త నాళాల ఫ్లెక్సిబిలిటీకి.ఇబ్బంది కలిగిస్తుంది. పొటాషియం సరైన కండరాల సమన్వయం మరియు గుండె పనితీరును కూడా నిర్వహిస్తుంది. సాధారణ రక్తపోటును నిర్వహించడానికి శరీరానికి పొటాషియం కూడా అవసరం. అదనంగా, సోడియం మరియు ఎలక్ట్రోలైట్ సమతుల్యత నియంత్రణను పొటాషియం కూడా నిర్వహిస్తుంది. ఇవన్నీ మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దోహదం చేస్తాయి.

ఉబ్బసం కోసం పనసపండు 

ఉబ్బసం (ఆస్త్మా) అనేది శ్వాసకోశ సమస్య, ఇది పిల్లల నుండి పెద్దల వరకు అధిక సంఖ్యలో జనాభాను  ప్రభావితం చేస్తుంది. వ్యాధికి తెలిసిన చికిత్స లేదు కానీ దాని లక్షణాలను నిర్వహించవచ్చు. ఉబ్బసం ముఖ్యంగా రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నప్పుడు వాయు కాలుష్యం మరియు ధూళి/దుమ్ము ద్వారా ప్రేరేపించబడుతుంది. ఉడికించిన పనస యొక్క ఆవిరిని పీల్చడం వల్ల ఉబ్బసం యొక్క లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు కనుగొన్నాయి, ఈ పండ్లలో ఉండే వేడి అస్థిర (హీట్ లబైల్) బయోఫ్లవనోయిడ్స్‌ను విడుదల చేయడం ద్వారా ఇది జరుగవచ్చు.


కంటి ఆరోగ్యానికి పనసపండు

పనసపండు వినియోగం కళ్ళకు మేలు చేస్తుంది. పనసపండులో విటమిన్ ఎ మరియు కొన్ని ఇతర కెరోటినాయిడ్లు ఉంటాయి, ఇవి కళ్ళకు అవసరం. పనసపండులో ఉండే కెరోటినాయిడ్లలో ఒకటైన ల్యూటిన్, కళ్ళలోకి ప్రవేశించే కాంతి పరిమాణాన్ని నియంత్రించడంలో పాత్ర పోషిస్తుంది, తద్వారా రెటీనా మరియు ఆప్టిక్ నరాల యొక్క సమగ్రతను కాపాడటానికి సహాయపడుతుంది.


విటమిన్ ఎ మరియు దాని సంబంధిత సమ్మేళనాలు కార్నియా యొక్క శ్లేష్మ (మ్యూకస్) పొరను పదిలంగా ఉంచడానికి సహాయపడతాయి. ఈ శ్లేష్మ పొర సాధారణంగా పరిసరాలలో ఉండే బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా సహజ అవరోధంగా పనిచేస్తుంది. అదనంగా, పనసపండు వినియోగం వయస్సు-సంబంధిత మాక్యులార్ డీజెనరేషన్ వంటి కంటి వ్యాధులను తగ్గిస్తుందని మరియు కంటి దృష్టిని రక్షించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు కనుగొన్నాయి.


చర్మానికి పనసపండు 

పనసపండు యాంటీ-ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది, ఎందుకంటే దానిలో యాంటీఆక్సిడెంట్ పరిమాణం అధికంగా ఉంటుంది, ఇది చర్మంపై అద్భుతాలు చేస్తుంది. కాలుష్యం, హానికరమైన యువి (UV) కిరణాలకు గురికావడం మరియు అనారోగ్యకరమైన జీవనశైలి వంటి కారకాలు వృద్ధాప్య ప్రక్రియకు దోహదం చేస్తాయి. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేసి న్యూట్రలైజ్ చేస్తాయి అందువల్ల పనసపండులో ఉండే యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్యప్రభావాలను ఆలస్యం చేస్తాయి. పనసపండులోని అధిక నీటి శాతం చర్మాన్ని హైడ్రేట్ చేసి మరియు తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడం వల్ల చర్మము మరింత మృదువుగా మరియు ప్రకాశవంతంగా మారుతుంది.


పనసపండులో ఉండే ఫ్లేవనాయిడ్లు చర్మం యొక్క హైపర్‌పిగ్మెంటేషన్‌ను తగ్గించడానికి సహాయపడతాయి, ఈ ఫ్లేవనాయిడ్లు టైరోసినేస్‌ (tyrosinase) ను నిరోధించే సామర్థ్యం కలిగి ఉంటాయి, ఇది ​​చర్మాన్ని నల్లబరిచే పిగ్మెంట్ ఐన, మెలనిన్‌ను సంశ్లేషణ చేసే ముఖ్య ఎంజైమ్.


ఎముకలకు పనసపండు 

పనస పండును ఆహారంలో తీసుకోవడం వల్ల ఎముకలను బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది, ఎందుకంటే దీనిలో కాల్షియం అధికంగా ఉంటుంది. లాక్టోస్ అసహనం ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. కాల్షియం ఎముక సాంద్రతను పెంచుతుంది, తద్వారా ఫ్రాక్చర్ల అవకాశాన్ని తగ్గిస్తుంది మరియు రికెట్స్ మరియు బోలు ఎముకల వ్యాధి వంటి వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తుంది. పనసలోని పొటాషియం శాతం  మూత్రపిండాల ద్వారా కాల్షియం అధికంగా కోల్పోవడాన్ని కూడా నివారిస్తుంది.


యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనసపండు 

పనసపండులో వాపు నిరోధక లక్షణాలు ఉన్నట్లు కనుగొనబడింది. యాంటీ-ఆక్సిడెంట్లు ఉండటంతో పాటు, ఫ్లేవనాయిడ్లు, ముఖ్యంగా ఫ్లేవోన్లు, క్సన్తోన్లు (xanthones), ఐసోఫ్లేవోన్లు, చాల్‌కోన్లు మరియు ప్రినిలేటెడ్ స్టిల్‌బెన్‌లు (prenylated stilbenes) వంటి ఇతర బయోయాక్టివ్ సమ్మేళనాలు పనసపండ్లలో సమృద్ధిగా ఉండడమనేది వాటి వాపు నిరోధక లక్షణాలకు దోహదం చేస్తాయి.


రోగనిరోధక వ్యవస్థకు పనసపండు 

పనస పండు అనేక రకాల యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మరియు ముక్కు కారడం మరియు జలుబు వంటి సాధారణ సమస్యలతో పోరాడటానికి శరీరానికి యాంటీఆక్సిడెంట్లు అవసరం, అలాగే యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేస్తాయి.


పనసపండు సహజ యాంటీఆక్సిడెంట్, విటమిన్ సి యొక్క అద్భుతమైన మూలం. ఈ విటమిన్ నీటిలో కరిగేది మరియు శరీరంలో సహజంగా ఉత్పత్తి చేయబడదు. అందువల్ల, పనస వంటి పండ్ల ద్వారా విటమిన్ సి ను ఆహారంలో తీసుకోవడం అవసరం.


కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ను న్యూట్రలైజ్ చేయడానికి యాంటీఆక్సిడెంట్లు అవసరం. శరీరం నుండి ఫ్రీ రాడికల్స్ ను తొలగించడం వలన శరీర అవయవాలు సరిగ్గా పనిచేయడంలో సహాయం చేస్తాయి మరియు అకాల మరియు వేగవంతమైన కణాల నష్టం యొక్క ప్రభావాలకు తగ్గిస్తాయి.


క్యాన్సర్ కోసం పనసపండు 

దాని యొక్క యాంటీ-ఆక్సిడేటివ్ మరియు ఫైటోన్యూట్రియెంట్ లక్షణాల వల్ల పనసపండు ఆరోగ్యకరమైన ఆహారపదార్థం. అదనంగా, పనసపండులో ఉండే ఒక రకమైన బయోయాక్టివ్ సమ్మేళనం అయిన లెక్టిన్లు (lectins) ఫ్రీ రాడికల్స్‌ను న్యూట్రలైజ్ చేయడంతో పాటు శరీరం నుండి  టాక్సిన్లను వదిలించుకోవడానికి సహాయపడతాయి. పనసపండులోని ఈ సమ్మేళనాలు క్యాన్సర్‌ను నివారించడంలో దోహదపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే, ఈ వాస్తవాన్ని ధృవీకరించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరం.


పనసపండు యొక్క దుష్ప్రభావాలు 

పనసపండు వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు క్రింద పేర్కొనబడ్డాయి.


 • పుప్పొడి లేదా రబ్బరు పాలు (లేటెక్స్)కు అలెర్జీ ఉన్నవారు పనసపండును తీసుకుంటే కూడా వారిలో అలెర్జీ వచ్చే అవకాశాలు ఉంటాయి. పనసపండు, సహజ లేటెక్స్ మరియు పుప్పొడిలో ఉండే అలెర్జీ కారకాల సారూప్యత/పోలిక దీనికి కారణం.
 • పనస విత్తనాలలో ఉండే లెక్టిన్లు (Lectins) రోగనిరోధక శక్తిని ఉత్తేజపరుస్తాయి. అయినప్పటికీ, ఇది కణజాల (టిష్యూ) మార్పిడి లేదా రోగనిరోధక శక్తి చికిత్సలో ఉన్న రోగులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
 • పనస రక్తం గడ్డకట్టడంపై ప్రభావం చూపవచ్చు మరియు రక్త రుగ్మతలు ఉన్నవారు దీన్ని తీసుకునే ముందు జాగ్రత్త పాటించించాలి.
 • పనసపండు వినియోగం పురుషులలో లిబిడో (లైంగిక కోరిక), లైంగిక ప్రేరేపణ, లైంగిక శక్తి మరియు లైంగిక పనితీరుపై కొన్ని ప్రతికూల ప్రభావాలను కలిగి ఉండవచ్చు.
 • గర్భధారణ సమయంలో మరియు చనుబాల ఉత్పత్తి పై పనసపండు ప్రభావంపై తగినంత అధ్యయనాలు లేవు, కాబట్టి, ఈ దశలలో దాని వినియోగాన్ని నివారించడం మంచిది.
 • శస్త్రచికిత్స సమయంలో మరియు తరువాత మందులతో కలిపి పనసపండును తీసుకుంటే మగతకు కారణం కావచ్చు. షెడ్యూల్ చేసిన శస్త్రచికిత్సకు కనీసం 2 వారాల ముందు నుండి పనస వినియోగాన్ని ఆపడం మంచిది.

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd