జామ ఆకు కషాయం ఉపయోగాలు
జామపండును అమృత ఫలం అని కూడా అంటారు. ఎందుకంటే రోగ నిరోధకశక్తిని పెంచే గుణాలు ఆకులలో మరియు పండులో కూడా ఉంటాయి. చంద్రుని యొక్క కిరణాలతో ఈ చెట్టులో రోగ నిరోధక శక్తి ని పెంచే గుణాలు కూడా వస్తాయి. ముఖ్యంగా జామపండు తినడం వలన అరుగుదల గుణాలు పెరిగి ఎలాంటి మలబద్ధకం అయినా వెంటనే తగ్గుతుంది. ఆకుల కషాయం తీసుకోవడం వలన కూడా పైన చెప్పిన ఉపయోగాలు చాల కలుగుతాయి. ఈ రోజులలో అతి భయంకరమైన రోగం క్యాన్సర్. క్యాన్సర్ ను తగ్గించడంలో రావి, జామ, పారిజాతం ఆకు కషాయాలు చాల ఉపయోగపడతాయి. రోగాలతో వచ్చే ఎటువంటి నొప్పుల నైనా తగ్గించే గుణం ఈ ఆకుల లో బాగా ఉంది. ఎలాంటి నొప్పులు (body pains) అయినా త్వరగా తగ్గించాలంటే జామ ఆకు కషాయం తీసుకోవాలి. అండ నాలం, పొట్ట, పేగుల క్యాన్సర్లను నివారించడంలో ఈ కషాయం చాలా బాగా పనిచేస్తుంది.
జామాకు కషాయం తయారుచేయు విధానం
జామ ఆకులను ఐదు లేదా ఆరు మంచినీళ్లతో బాగా కడిగి రాగి లేదా స్టీల్ పాత్రలో వేసి ఒక గ్లాసు మంచినీళ్ళు పోయాలి. ఈ మిశ్రమాన్ని నాలుగు లేదా అయిదు నిమిషాలు బాగా మరగబెట్టాలి. తరువాత వడపోసుకొని గోరువెచ్చగా కానీ, చల్లగా కానీ తీసుకోవాలి.
Post a Comment