తమలపాకు కషాయం ఉపయోగాలు

తమలపాకు కషాయం ఉపయోగాలు 


స్త్రీలకు సంబంధించిన గర్భకోశం, అండాను కోశం రోగాలకు అతి ముఖ్యమైన కషాయం ఈ తమలపాకు కషాయం. వీర్యకణాల వృద్ధికి ఈ కషాయం ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే హార్మోన్ అసమతుల్య నాన్ని సరి చేయడంలో తమలపాకు ముఖ్యమైనది. ఈ కషాయం యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఆహారం జీర్ణం కాకపోవడం వంటి సమస్య ఉన్నప్పుడు ఈ ఆకు కషాయం ను, ఆహారం తీసుకోక ముందు అయినా తీసుకున్న తర్వాత అయినా తాగవచ్చు. జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఈ ఆకు కషాయం చాలా బాగా పనిచేస్తుంది. మనోస్థైర్యం పెంపుదలకు, జీర్ణక్రియకు, సంభోగ క్రియ కు, మంచి సంభాషణకు ఈ ఆకు కషాయం చాలా బాగా ఉపయోగపడుతుంది.

తమలపాకు కషాయం


వీర్య కణాల అభివృద్ధికి, సెక్స్ సమస్యలు ఉన్నవారికి ఈ ఆకు కషాయం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఆకు కషాయం తయారు చేసేటప్పుడు కాడను తీసి మిగతా ఆకును కషాయంగా ఉపయోగించాలి. తమలపాకు అలాగే తినడం కన్నా కషాయం చేసుకుని తాగడం వలన చాలా ప్రయోజనాలు ఉంటాయి.


తమలపాకు కషాయం తయారు చేసే విధానం

5 లేదా 10 తమలపాకులను తీసుకొని మంచి నీటితో కడగాలి. తమలపాకు కాడలను తీసివేయాలి. రాగి లేదా స్టీల్ పాత్రలో ఒక గ్లాసు మంచి నీళ్ళు పోయాలి. తమలపాకులను ఆ నీళ్లలో వేసి నాలుగు నిమిషాలు వేడి చేయాలి. తరువాత ఆ నీటిని వడ పోసి గోరువెచ్చగా కానీ చల్లగా కాని తీసుకోవాలి.

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd