గోధుమ వలన ఉపయోగాలు దుష్ప్రభావాలు
ప్రపంచ వ్యాప్తంగా సాధారణంగా వినియోగించే ఆహార పదార్ధాలలో గోధుమ ఒకటి. గోధుమను పండించే ప్రపంచ దేశాలలో భారతదేశానిది రెండవ స్థానం కాగా వరి తరువాత అత్యంత సాగుకు నోచుకునే పంట కూడా గోధుమే. భారతదేశంలో రబి పంటగా చెప్పుకునే గోధుమలో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. ఎటువంటి వాతావరణంలోనైనా తట్టుకుని నిలబడే గుణం కూడా ఉంటుంది కనుకనే ఎక్కువ మంది రైతులు గోధుమను పండించడానికి ఆసక్తిని బాగా చూపుతుంటారు.
గోధుమ వలన లాభాలు
- గోధుమలను పిండిగా చేసుకుని వాడుకోవడం ఆనవాయితీ కాగా ఎక్కువ శాతం చపాతీ ఆటా, బిస్కెట్లు, కేకులు వంటి పదార్ధాల కోసం బాగా వినియోగిస్తారు. అంతేకాకుండా బీరు, వోడ్కా వంటి మత్తు పానీయాలలో కూడా గోధుమ చాలా ముఖ్యమైన పదార్ధంగా కూడా వాడతారు.
- మనకి అత్యంత పోషకాలను అందించే ఆహార పదార్ధాలలో గోధుమ ముందు వరుసలో కూడా ఉంటుంది. తక్కువ కొవ్వు కలిగిన ఆహార పదార్ధం కావడం మూలంగా అరుగుదలకు అనుకూలంగా ఉండి తిన్న తరువాత మంచి భోజనం చేసిన భావన కూడా కలుగుతుంది.
- కొవ్వును కరిగించుకునేందుకు తమ వద్దకు వచ్చే రోగులకు గోధుమ పదార్ధాలను సిఫారసు చేస్తుంటారు వైద్య నిపుణులు. అందుకే మధుమేహం మరియు రక్తపోటు బాధితులు తరచూ చపాతి, పుల్కా వంటి ఆహారపదార్ధాలను ఎక్కువగా తీసుకోవడం మనం చూస్తూనే ఉంటాం.
- గోధుమలో సహజసిద్ధంగా ఉండే ప్రోటీన్లు మరియు న్యూట్రీన్లు జీర్ణ వ్యవస్థను సమతూకంలో ఉండేలా చూస్తాయి. మనిషికి సగటున 20 నుండి 30 గ్రాముల ప్రొటీన్లతో కూడిన పిండి పదార్ధం అవసరం కాగా గోధుమలు అందుకు మంచి ఉపయోగకరంగా కూడా ఉంటాయి.
- కొంతమంది దంత వైద్యులు చేసిన పరిశోధనల ఆధారంగా గోధుమలోని గుణాలు దంతాలు, మరియు చిగుళ్ల సమస్యలను తొలగించడంలో ఉపయుక్తంగా కూడా ఉంటాయి.
గోధుమ వలన అనర్ధాలు
- గోధుమలో గ్లూటెన్ అనే పదార్ధం అధికంగా ఉంటుంది . దాని వలన తక్కువ రోగ నిరోధక శక్తి కల్గిన వారు సిలియాక్ అనే రోగం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటువంటి వారు గ్లూటెన్ లేని పదార్ధాలని తీసుకోవడమే మంచి పరిష్కారం.
- కొంతమందిలో గోధుమ పదార్ధాలను ఎక్కువగా తీసుకోవడం వలన ఫుడ్ అలర్జీ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అంతేకాకుండా గోధుమలోని కొన్ని గుణాలు మధుమేహ పరిమితులను పెంచే అవకాశం కూడా ఉందని కొంతమంది ఆరోగ్య నిపుణుల వాదన.
ఎక్కడ పండుతుంది
గోధుమలను పండించే ప్రపంచ దేశాలలో చైనాది మొదటి స్థానం . భారతదేశానిది రెండవ స్థానం. ఇక మన దేశంలో ఉత్తరప్రదేశ్ అత్యధికంగా గోధుమలను పండిస్తుండగా పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ మరియు బీహార్, గుజరాత్ వంటి దేశాలు అధిక రాబడిని కూడా సాధిస్తున్నాయి.
Post a Comment