చామంతి టీ వలన కలిగే ఉపయోగాలు

చామంతి టీ వలన  కలిగే ఉపయోగాలు 

 

టీ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఉదయం నిద్రలేవగానే ఓ కప్పు టీ తాగనిదే రోజు మొదలు కాదు. ఇక.. గ్రీన్ టీ అందించే విశేష ప్రయోజనాల సంగతి మనందరికీ తెలిసిందే. అలసటగా అనిపించినప్పుడు చాలా మంది టీ తాగాలనుకుంటారు. అయితే సాధారణ టీకి బదులు హెర్బల్ టీ తాగితే రిలాక్సేషన్ తో పాటు, హెల్త్ కి కూడా చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మ‌నిషికి ప్ర‌శాంతంగా ఉండ‌టంతో పాటు ఆరోగ్యం కాపాడుకోవ‌డానికి హెర్బ‌ల్ టి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మూసుకుపోయిన రక్తనాళాలను వ్యాకోచం చెందేలా చేయడానికి హెర్బల్ టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇపుడు చామంతి టీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ చామంతి పూల టీ సేవించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని పలువురు పరిశోధకులు చెపుతున్నారు. 

చామంతి టీ వలన  కలిగే ఉపయోగాలు


 చామంతి టీ వలన  కలిగే ఉపయోగాలు 

నిద్రలేమి, పని ఒత్తిడి వల్ల కళ్లకింద వాపు, నల్లని వలయాలు ఏర్పడితే చామంతి టీ బ్యాగులని ఫ్రిజ్‌లో ఉంచి మూసిన కనురెప్పలపై ఉంచితే సమస్య దూరమవుతుంది. కంటిమీది ఒత్తిడీ దూరమవుతుంది.

చామంతి టీలోమజిల్ రిలాక్స్ చేసే లక్షణాలు అధికంగా ఉన్నాయి. మహిళల్లో మెనుష్ట్రువల్ క్రాంప్స్ యూట్రస్ కండరాల నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి చామంతి టీని పెయిన్ రిలీఫ్ గా ఉపయోగిస్తుంటారు.

చామంతి టీని రెగ్యులర్ గా తాగడం వల్ల పెద్దవారిలో దీర్ఘకాలంగా వేధిస్తున్న మైగ్రేన్ తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

చామంతి టీలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీర రోగ నిరోధక శక్తిని పెంచి రోగాల ముప్పును తగ్గిస్తాయి.

చామంతి టీ లోని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లూ, చర్మగ్రంథుల లోలోపలికి చొచ్చుకునిపోయి లోపలి నుంచి శుభ్రం చేస్తాయి. దీనివల్ల చర్మం తాజాగా మారటమే గాక కాలిన గాయాలు, దోమకాటు దద్దుర్లు కూడా తగ్గుతాయి.

చామంతి టీ వ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. జలుబు, దగ్గుకు సంబంధించిన లక్షణాలను నివారించే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఇందులో అధికంగా ఉన్నాయి.

చామంతి టీ బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. దాంతో డయాబెటిస్ క్రమబద్దం అవుతుంది. హెల్తీ డైట్ లో చామంతి టీ తాగడం వల్ల బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటుంది.

అంతేకాదు నిద్రలేమి సమస్యతో భాధపడేవారు రోజు ఒక కప్పు చామంతి టీ తాగితే నిద్రలేమి సమస్య నుండి మిమ్మల్ని బయపడేస్తుంది. మంచి నిద్ర కలిగేలా చేస్తుంది.

చామంతి టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో గొప్పగా సహాయపడుతుంది. కణాల పునరుత్పత్తికి సహాయపడుతుంది.

చామంతి టీని రెగ్యులర్ గా తాగుతుంటే, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వివిధ రకాల సమస్యలను దూరం చేస్తుంది. గ్యాస్ , కడుప్పబ్బరం, కోలిక్, డయోరియా, ఐబియస్ వంటి సమస్యల నుండి విముక్తి కలిగిస్తుంది.

చామంతి టీ క్యాన్సర్ సెల్స్ ను నాశనం చేస్తుంది. క్యాన్సర్ సంబంధిత లక్షణాలు, వ్యాధులతో పోరాడే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. చామంతి టీని రెగ్యులర్ గా తాగడం వల్ల క్రోనిక్ డిసీజ్ ను తగ్గించుకోవచ్చు.

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd