పెసలు వలన కలిగే ప్రయోజనాలు
పెసలు భారతీయ ఆహారం. మన దేశంలో పూర్వీకుల కాలం నుంచి వీటి వాడకం ఎక్కువగా ఉంది. ఇపుడు ప్రపంచమంతా ‘మూంగ్దాల్' అని పిలిచే ఇష్టమైన స్నాక్ ఐటమ్ పెసలే.ప్రొటీన్లు, కాల్షియం మరియు ఫాస్ఫరస్, ఇంకా కొన్ని విటమిన్లు కలిగిన మంచి పోషక విలువలున్న ఆహర పదార్థ ఇది. చైనాలో దీన్ని లుడౌ అని కూడా పిలుస్తారు. మనకన్నా చైనా వాళ్ళు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆహారంలో విష దోషాలు ఏర్పడినప్పుడు ఇది విరుగుడుగా పని చేస్తుందని చైనీయులకు ఒక విశ్వాసం .పెసల్లో క్యాలరీలు చాలా తక్కువ, పీచు ఎక్కువగా వుండటంతో కొంచెం తిన్నా పొట్ట నిండినట్లనిపిస్తుంది. ఫలితంగా ఊబకాయం తగ్గుతుంది. పెసల్ని క్రమం తప్పకుండా తినేవాళ్లు వయసుకున్నా పదేళ్లు తక్కువగా కూడా కనిపిస్తారు.
ఇందులో అధిక కాపర్ వల్ల చర్మం ముడుతలు పడకుండా కూడా ఉంటుంది. అజీర్తి, జీవక్రియా లోపంతో బాధపడే వాళ్లకు పెసలు మందులా బాగా పనిచేస్తాయి. కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. వీటిల్లో కాల్షియం ఎముక నిర్మాణానికి బాగా దోహదపడుతుంది. సోడియం దంతాలు, చిగుళ్ల సమస్యల్నీ బాగా నివారిస్తుంది. బీపి రోగులకీ ఇవి మంచిదే. పెసల్లోని ఐరన్ వల్ల అన్ని అవయవాలకి ఆక్సిజన్ సమృద్ధిగా అందుతుంది.
పెసలు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి వంటి లోపాలతో బాధపడే వాళ్లకీ ఎంతోమేలు చేస్తాయి . రోగనిరోధకశక్తిని కూడా పెంచుతాయి. వీటిల్లోని విటమిన్లు హార్మోన్లను ప్రేరేపించడంతో పిల్లల పెరుగుదలకీ కూడా తోడ్పడుతాయి.పెరుగుతున్న వయస్సుని దాచాలాని చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఆహారంలో మార్పుల దగ్గర్నుంచీ జిమ్లో కసరత్తుల వరకు ప్రతిఒక్కటి క్రమం తప్పకుండా చేస్తుంటారు. అయితే.. వయసు దాచాలని కోరుకునేవారు పెసలు తినండని చెబుతున్నారు. పోషకాహార నిపుణులు.
పోషకాలు ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని రెగ్యులర్గా తీసుకుంటుంటే జీర్ణశక్తి బాగా మెరుగవుతుంది. ఒంటికి బలం చేకూరుతుంది.
పోషకాలు నిండుగా ఉండే పెసలు ఆరోగ్యానికి చాలా మంచివి.
వీటిని మొలకల్లా చేసి తింటే మరి మంచిది.లివర్, వెంట్రుకలు, గోళ్లు, కళ్లు, గుండె ఇలా శరీరభాగాలను సంరక్షించడంలో పెసలు చాల అద్భుతంగా పనిచేస్తాయి.పాయసంగా.. పొంగలిగా.. మొలకెత్తిన గింజలు.. సున్నండలు.. పెసరట్టు.. ఎలా తీసుకున్నా.. పెసల రుచి అమోఘంగా ఉంటుంది. కమ్మని రుచి.. సువాసనతో తింటుంటే చాలా తినాలిపిస్తాయి. పెసల వంటకాలు. రకరకాల వంటకాల్లో, చర్మ సౌందర్య సాధనాల్లో ఉపయోగించే పెసలు.. ఆరోగ్య ప్రయోజనాల గనిగా చెప్పవచ్చును .
- పెసలు పోషకాల సమ్మేళనం. వీటిలో విటమిన్ ఎ, బి, సి, ఈ, ఖనిజ లవణాలు, క్యాల్షియం, ఇనుము, పొటాషియంతోపాటు మాంసకృత్తులు, పీచు కలిగి ఉంటుంది.
- పెసలు తరచుగా తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ ను బాగా కంట్రోల్ చేస్తాయి.
- శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను బాగా తగ్గిస్తాయి.
- దీనివల్ల గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం చాలా తక్కువ.
- పెసలు తింటే ఆరోగ్యంతో పాటు యాక్టివ్ గా ఉండటానికీ కూడా సహకరిస్తాయి.
- పెసలలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
- రోజు వారీ ఆహారంలో పెసల్ని చేర్చుకుంటే.. అనీమియా సమస్యలు దగ్గరికి చేరకుండా ఉంటాయి.
- బరువు తగ్గాలనుకునే వారికి పెసలు ఒక మంచి పరిష్కారం.
- రైస్ మాత్రమే కాకుండా.. బియ్యంతో పాటు కాసిన్ని పెసలు జోడించి వండుకుని తినడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చని నిపుణులు కూడా చెబుతున్నారు.
- పెసల్లో రక్తంలోని షుగర్ లెవెల్స్ తగ్గించే గుణం ఉంది.
- కాబట్టి మీ డైట్ లో పెసలను చేర్చుకోవడం వల్ల.. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. క్యాన్సర్ బారిన పడకుండా చేస్తాయి.
- వీటిని తరచుగా తీసుకునే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కు బాగా అవకాశముండదు.
- పెసలు తీసుకోవడం వల్ల జీర్ణం సులువుగా అయ్యేట్లు సహాయపడతాయి. అంతేకాదు పెసలు ఇమ్యూనిటీ శక్తి బాగా పెంచుతాయి.
- కాబట్టి ఇన్ఫెక్షన్స్ దరి చేరకుండా ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తాయి.
- పెసలు తినటం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినదు.
- కండరాల నొప్పి, తలనొప్పి మరియు నీరసాన్ని తగ్గించి చురుకుగా ఉంచడానికి పెసలు తోడ్పడతాయి.
- ఐరన్ లోపంతో బాధపడేవాళ్లు పెసలు తప్పకుండా తీసుకోవాలి.
- వెజిటేరియన్స్ లో ఎక్కువగా ఐరన్ లోపం కనిపిస్తూ ఉంటుంది.
- కాబట్టి రోజు వారీ ఆహారంలో పెసలను చేర్చుకోవడం వల్ల అవసరమైన ఐరన్ ను ఈజీగా పొందవచ్చు.
- పెసలు శరీరంలో వేడిని బాగా తగ్గిస్తాయి.
- ఇవి వడదెబ్బ కొట్టినప్పుడు, చెమట కాయలు, దురదలు దద్దుర్లు వచ్చినప్పుడు వాడితే మంచి ఫలితం ఉంటుంది.
- కాలిన గాయాలు, ఎప్పటికీ మానని పుండ్లతో బాధపడే వాళ్లకు, ఆపరేషన్లు అయిన వారికీ పెసలు వంటలు పెట్టడం వల్ల ఉపశమనం కలుగుతుంది.
- సున్నిపిండిలో కూడా పెసలను వాడుతారు. దీనిని వాడినా.. చర్మం ముడతలు పడకుండా.. నిగారింపు సంతరించుకుంటుంది.
-
Post a Comment