చిక్కుడుకాయ ఆరోగ్య ప్రయోజనాలు

చిక్కుడుకాయ ఆరోగ్య ప్రయోజనాలు

 

చిక్కుడు కాయ కూర ఎంత రుచిగా ఉంటుందో మనకు బాగా తెలుసు. ఓరకంగా చెప్పాలంటే ఇది వెజ్ ఐటమ్స్ లో నాన్ వెజ్ ఐటం లాంటిది. ఎందుకంటే చిక్కుడు రుచి అలాంటిది. చిక్కుడుకాయ రుచిలోనే కాదు మన శరీరానికి పోషకాలను అందించడంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. చిక్కుడు కాయలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

చిక్కుడుకాయ ఆరోగ్య ప్రయోజనాలు

చిక్కుడు కాయలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ లాంటి మినరల్స్ బాగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్స్, కార్బో హైడ్రేట్, పెద్ద మొత్తంలో కాలరీలు ఉంటాయి. వీటితో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది.


చిక్కుడు కాయల్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, డయేరియా వంటివి తగ్గడంతో పాటు మధుమేహం, కొలస్ట్రాల్ వంటివి తగ్గుముఖం పడతాయి.


చిక్కుడులో యాంటిఆక్సిడెంట్స్, విటమిన్ సి ఎక్కువే. కాబట్టి రోగనిరోధకశక్తిని పెంచే శక్తి చిక్కుడుకి ఉంది. ఫ్రీ రాడికల్స్ ని తొలగించి అందాన్ని కూడా మెరుగుపరుస్తాయి చిక్కుడు గింజలు.


చిక్కుడుకాయలో సోలుబుల్ ఫైబర్ దండిగా ఉంటుంది.కాబట్టి ఇది ఇటు బ్లడ్ షుగర్ లెవల్స్ ని, అటు కొలెస్టరాల్ లెవల్స్ ని కంట్రోల్ లో పెట్టగలదు. ఇది గుండె ఆరోగ్యాగానికి చాలా మంచిది.


చిక్కుడు కాయలు తినడం వల్ల ఆకలి బాగా తగ్గుతుందట. అద్భుతమైన ఫైబర్ లెవల్స్ ఉండటంతో ఇది బరువు తగ్గాలి అనుకునేవారికి ఒక అద్భుతమైన ఆహారం అని చెప్పవచ్చు. ఫలితంగా బరువు తగ్గాలనుకునేవారికి చిక్కుడుకాయలు మంచి ఔషదంలా పని చేస్తాయి.


చిక్కుడు కాయల్లోని విటమిన్ బి1 మెదడు పనితీరులో అత్యంత కీలకమైన ఎసిటైల్ కోలీన్ అనే న్యూరో ట్రాన్స్ మిటర్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా విటమిన్ బి1 గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.


వీటిలోని కాపర్ మెదడు ఆరోగ్యానికి అవసరమైన డోపమైన్, గ్యాలాక్టోజ్ వంటి రసాయనాల విడుదలకు తోడ్పడుతుంది. అంతేకాకుండా ఇవి శరీరంలోని కొన్ని రకాల యాంటీఆక్సిడెంట్ల ఉత్పత్తికి కారణమవుతుంది. ఫలితంగా చిక్కుడు కాయలు వృద్దాప్యం వల్ల వచ్చే అనేక వ్యాధుల్నీ నివారిస్తాయని తేలింది.


నిద్రలేమితో బాధపడేవాళ్లకీ చిక్కుడుకాయల్లో లభించే మాంగనీస్ ఆ సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా చిక్కుడు కాయల్లోని అమైనో ఆమ్లాలు హార్మోన్ల సమతౌల్యానికి ఎంతగానో దోహదపడతాయి. ముఖ్యంగా మానసిక ఆందోళనను తగ్గిస్తాయి.

నెలసరి సమయంలో స్త్రీలు రక్తాన్ని కోల్పోతుంటారు. అలాగే వారి ఎముకలు కూడా బలహీనంగా మారతాయి. ముఖ్యంగా గర్భిణి స్త్రీలకు రక్తం, ఎముకలలో బలం చాలా అవసరం. ఈ అవసరాన్ని కాల్షియం, ఐరన్ ఉన్న చిక్కుడు తీరుస్తుంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd