కరివేపాకు కషాయం ఉపయోగాలు
కరివేపాకు ఎక్కడ ఉంటే అక్కడ దోమలు మరియు క్రిమికీటకాలు ఉండవు. కరివేపాకులో అతి ఎక్కువ ఐరన్ శాతం ఉంది. రక్తం ఉత్పాదనలో అతి ముఖ్యమైనది ఐరన్. కరివేపాకు లో ఉన్నంత ఐరన్, వేరే ఏ పదార్థంలో కూడా దొరకదు.
రక్తాన్ని వృద్ధి చేయడానికి కావాల్సిన ఎన్నో యాంటీఆక్సిడెంట్స్ దీనిలో ఉన్నాయి. కూర వండేటప్పుడు పోపు వేసేటప్పుడు కొన్ని కెమికల్స్ కూడా రిలీజ్ అవుతాయి. కరివేపాకును పోపులో వేయడం వలన అలా రిలీజ్ అయిన కెమికల్స్ ని శుద్ధి చేస్తుంది. ఈ కషాయం తాగడం వలన క్యాన్సర్ రాకుండా చేయవచ్చును . మరియు రక్తహీనతకు ఇది మంచి ఔషధం.
ప్రస్తుత పరిస్థితిలో ఆడ, మగ వారిలో రక్తహీనత అధికంగా ఉంటుంది. రక్తం సరిగా లేకపోతే అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఒక వారం పాటు కరివేపాకు కషాయం తాగడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది.
బాలింతలకు పాలు సరిగా రావాలంటే కరివేపాకు పొడి చేసుకొని బాగా తీసుకోవాలి. హార్మోన్ సమస్య (hormone imbalance) ను సరి చేయగలిగేది కరివేపాకు. కావున ఇన్ని ప్రయోజనాలు ఉన్న కరివేపాకు కషాయం ఒక వారం పాటు ఉదయం పరిగడుపున తీసుకోవాలి.
Post a Comment